సిక్కి–సుమీత్‌ జోడీ శుభారంభం | Indian pairs off to a good start in the mixed doubles category | Sakshi
Sakshi News home page

సిక్కి–సుమీత్‌ జోడీ శుభారంభం

Nov 27 2024 4:25 AM | Updated on Nov 27 2024 4:25 AM

Indian pairs off to a good start in the mixed doubles category

లక్నో: సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత జోడీలు శుభారంభం చేశాయి. తెలంగాణకు చెందిన సిక్కి రెడ్డి–సుమీత్‌ రెడ్డి ద్వయం... గద్దె రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ జోడీ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత పొందాయి. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో టాప్‌ సీడ్‌ సిక్కి–సుమీత్‌ 21–10, 21–18తో సంజీత్‌ సుబ్రమణియన్‌–గౌరీ కృష్ణ (భారత్‌)లపై... రుత్విక–రోహన్‌ 21–14, 21–12తో నితిన్‌– అనఘా (భారత్‌)లపై విజయం సాధించారు. 

హైదరాబాద్‌కే చెందిన కె.మనీషా–షేక్‌ గౌస్‌ జోడీ కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్‌లో మనీషా–õÙక్‌ గౌస్‌ 21–16, 12–21, 21–19తో నితిన్‌ కుమార్‌–రిధి కౌర్‌ తూర్‌ (భారత్‌)లను ఓడించారు. మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్లు నవ్య కందేరి, తన్వీ శర్మ, మాన్సి సింగ్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందారు. క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో నవ్య 21–8, 21–8తో సాక్షి గహ్లావత్‌పై, తన్వీ శర్మ 21–12, 21–10తో ఆశి రావత్‌పై, మాన్సి సింగ్‌ 21–11, 14–21, 21–12తో బోనం ప్రశంసపై గెలిచారు. 

పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారులు రిత్విక్, సిద్ధార్థ్‌ ప్రతాప్‌ సింగ్, సనీత్‌ దయానంద్‌ మెయిన్‌ ‘డ్రా’కు చేరుకున్నారు. మరోవైపు పురుషుల డబుల్స్‌ విభాగం నుంచి టాప్‌ సీడ్‌ సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ చివరి నిమిషంలో వైదొలిగింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement