విజయ ‘సౌరభం’... | Saurabh Verma, who won the title | Sakshi
Sakshi News home page

విజయ ‘సౌరభం’...

Published Mon, Oct 17 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

విజయ ‘సౌరభం’...

విజయ ‘సౌరభం’...

చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గిన సౌరభ్ వర్మ


తైపీ సిటీ: వరుసగా రెండు అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో (బెల్జియం, పోలాండ్ ఓపెన్) రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సౌరభ్ వర్మకు మూడో టోర్నమెంట్ కలిసొచ్చింది. చైనీస్ తైపీ మాస్టర్స్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ వర్మ 12-10, 12-10, 3-3తో డారెన్ లూ (మలేసియా)పై గెలిచాడు. తొలి రెండు గేమ్‌లు ముగిసిన తర్వాత మూడో గేమ్‌లో స్కోరు 3-3 వద్ద ఉన్నపుడు డారెన్ లూ భుజం గాయం కారణంగా వైదొలిగాడు. 28 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో తొలి రెండు గేముల్లోనూ సౌరభ్ ఒకదశలో వెనుకబడ్డాడు. కానీ వరుస పారుుంట్లతో చెలరేగి వాటిని సొంతం చేసుకున్నాడు. తొలి గేమ్‌లో 7-10తో వెనుకంజలో ఉన్న సౌరభ్ వరుసగా ఐదు పారుుంట్లు... రెండో గేమ్‌లో 6-10తో వెనుకబడ్డపుడు వరుసగా ఆరు పారుుంట్లు గెలిచాడు.

గతేడాది మోకాలి, మోచేతి గాయాలతో బాధపడిన 23 ఏళ్ల సౌరభ్ వర్మ ఈ సీజన్‌లో పునరాగమనం చేసి నిలకడగా రాణిస్తున్నాడు. ‘నాకిది గొప్ప విజయం. అవసరమైన సమయంలో ఈ టైటిల్ లభించింది. గత రెండు టోర్నీల ఫైనల్స్‌లో ఓడిపోయాను. ఈసారి గత ఫైనల్స్‌లో చేసిన తప్పిదాలను పునరావృతం చేయకుండా ఆడాను. విజయం సాధించాను’ అని సౌరభ్ వ్యాఖ్యానించాడు. విజేతగా నిలిచిన సౌరభ్ వర్మకు 4,125 డాలర్ల (రూ. 2 లక్షల 75 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement