రన్నరప్ సౌరభ్ వర్మ
సార్‌బ్రకెన్ (జర్మనీ): కెరీర్‌లో తొలి గ్రాండ్‌ప్రి గోల్డ్ స్థారుు టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ యువతార సౌరభ్ వర్మకు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన బిట్‌బర్గర్ ఓపెన్ టోర్నమెంట్‌లో సౌరభ్ వర్మ రన్నరప్‌గా నిలిచాడు. 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ వర్మ 19-21, 20-22తో షి యుకీ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. రన్నరప్‌గా నిలిచిన సౌరభ్‌కు 4,560 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షలు) తోపాటు 5,950 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు.
కేసు నుంచి బంగ్లా క్రికెటర్‌కు విముక్తి
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హొస్సేన్ క్రిమినల్ కేసు నుంచి విముక్తి పొందాడు. గతేడాది భార్య నిర్తోతో కలిసి షహదత్ తన ఇంట్లో పనిచేసే 11 ఏళ్ల బాలికను హింసించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తాజాగా కోర్టులో ఈ కేసు విచారణకు రాగా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టివేసింది.