Runner-up
-
రన్నరప్ నికీ పునాచా జోడీ
న్యూఢిల్లీ: ఏటీపీ చాలెంజర్ 75 టోర్నీ ఢిల్లీ ఓపెన్‌లో భారత టెన్నిస్ ఆటగాడు నికీ పునాచా రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన నికీ పునాచా–కోర్ట్నీ జాన్ లాక్ (జింబాబ్వే) జంట చేతిలో ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. శనివారం జరిగిన తుదిపోరులో అన్‌సీడెడ్ మసమిచి ఇమామురా–రియో నొగుచి (జపాన్) ద్వయం 6–4, 6–3తో నికీ–జాన్ లాక్ జోడీపై విజయం సాధించింది. తొలి సెట్ ఆరంభం నుంచే విజృంభించిన జపాన్ జోడీ... 4–1తో ముందంజ వేసింది. ఈ దశలో పుంజుకున్న పునాచా జంట 3–4తో ఆధిక్యాన్ని తగ్గించగలిగిందే తప్ప... చివరి వరకు అదే జోరు కొనసాగించలేక తొలి సెట్ కోల్పోయింది. రెండో సెట్లోనూ రాణించిన జపాన్ ద్వయం సునాయాసంగా సెట్‌తో పాటు టైటిల్ గెలుచుకుంది.మరో వైపు సింగిల్స్ విభాగంలో కైరియాన్ జాక్వెట్ (ఫ్రాన్స్), బిల్లీ హారిస్ (బ్రిటన్) ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి సెమీస్‌లో జాక్వెట్ 6–3, 6–1తో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)పై...రెండో సెమీస్‌లో హారిస్ 4–6, 7–6 (7/4), 6–2తో ట్రిస్టన్ స్కూల్‌కేట్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందారు. -
చెన్నై ఏటీపీ టోర్నీ రన్నరప్‌గా సాకేత్ జోడీ
చెన్నై: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్, భారత డేవిస్ కప్ జట్టు మాజీ సభ్యుడు సాకేత్ మైనేని ఈ సీజన్లో చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో డబుల్స్ టైటిల్ నిలబెట్టుకోలేకపోయాడు. భారత సహచరుడు రామ్‌కుమార్ రామనాథన్‌తో కలిసి బరిలోకి దిగిన సాకేత్ చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన తుదిపోరులో సాకేత్ – రామ్‌కుమార్ జోడి 4–6, 4–6తో షింటారో మొచిజుకి–కైటో వుసుగి (జపాన్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. జపాన్ జోడీ మ్యాచ్ ఆరంభం నుంచే భారత ఆటగాళ్లపై పైచేయి సాధించింది. దీంతో తొలి సెట్ గెలిచేందుకు ఎంతోసేపు పట్టలేదు. తర్వాత రెండో సెట్లోనూ భారత జంట పుంజుకోలేకపోయింది. ఇదే అదనుగా షింటారో–కైటోలు చక్కని సమన్వయంతో వరుసగా రెండో సెట్‌తో పాటు టైటిల్‌ను గెలుచుకుంది. గతేడాది ఇక్కడ భారత ద్వయం టైటిల్ సాధించింది. ఈ సారీ టైటిల్ వేటలో నిలిచినా... చివరి మెట్టుపై చతికిలబడింది. సాకేత్–రామ్ కుమార్ జోడీ తదుపరి ఈ నెల 17 నుంచి పుణేలో జరిగే ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్ బరిలోకి దిగుతుంది. -
రన్నరప్ ఆకుల శ్రీజ
సూరత్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి, మాజీ విజేత ఆకుల శ్రీజ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తరఫున బరిలోకి దిగిన శ్రీజ మహిళల సింగిల్స్ ఫైనల్లో 12 -10, 11 - 8, 11 - 13, 10-12, 8-11, 11-9, 9-11తో దియా చిటాలె (ఆర్బీఐ) చేతిలో ఓడిపోయింది. 26 ఏళ్ల శ్రీజ ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 28వ స్థానంలో ఉంది. భారత నంబర్‌వన్ ర్యాంకర్‌గా కొనసాగుతున్న శ్రీజ గత ఏడాది ఆసియా చాంపియన్‌షిప్ టీమ్ విభాగంలో భారత జట్టు కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. పారిస్ ఒలింపిక్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. -
రన్నరప్ రుత్విక–రోహన్ జోడీ
బెంగళూరు: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని రన్నరప్‌గా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో రుత్విక శివాని (పీఎస్‌పీబీ)–రోహన్ కపూర్ (ఢిల్లీ) ద్వయం 17–21, 18–21తో ఆయుశ్ అగర్వాల్–శ్రుతి మిశ్రా (ఉత్తరప్రదేశ్) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్ విభాగంలో తెలంగాణకే చెందిన శ్రియాంశి వలిశెట్టి కూడా రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో శ్రియాంశి 15–21, 16–21తో దేవిక సిహాగ్ (హరియాణా) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎం.రఘు (కర్ణాటక) 14–21, 21–14, 24–22తో మిథున్ మంజునాథ్ (రైల్వేస్)పై గెలిచి జాతీయ చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో రఘు ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకోవడం విశేషం. మహిళల డబుల్స్ ఫైనల్లో ఆరతి సారా సునీల్ (కేరళ)–వర్షిణి (తమిళనాడు) జోడీ 21–18, 20–22, 21–17తో ప్రియా దేవి (మణిపూర్)–శ్రుతి మిశ్రా (ఉత్తరప్రదేశ్) జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో అర్‡్ష మొహమ్మద్ (ఉత్తరప్రదేశ్)–సంస్కార్ సరస్వత్ (రాజస్తాన్) ద్వయం 12–21, 21–12, 21–19తో టాప్ సీడ్ నవీన్–లోకేశ్ (తమిళనాడు) జంటను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. -
రన్నరప్ ప్రజ్ఞానంద
కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 9 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రజ్ఞానంద, సో వెస్లీ (అమెరికా) 5.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... ప్రజ్ఞానందకు రెండో స్థానం, సో వెస్లీకి మూడో స్థానం లభించాయి. నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ 7.5 పాయింట్లతో ర్యాపిడ్ టోర్నీ చాంపియన్‌గా నిలిచాడు. భారత గ్రాండ్‌మాస్టర్లు నిహాల్ సరీన్ (4 పాయింట్లు) ఆరో ర్యాంక్‌లో, ఇరిగేశి అర్జున్ (3.5 పాయింట్లు) ఎనిమిదో ర్యాంక్‌లో, విదిత్ (3 పాయింట్లు) తొమ్మిదో ర్యాంక్‌లో, ఎస్ఎల్ నారాయణన్ (3 పాయింట్లు) చివరిదైన పదో ర్యాంక్‌లో నిలిచారు. వంతికకు మూడో స్థానం ఇదే టోర్నీ మహిళల ర్యాపిడ్ విభాగంలో భారత యువ క్రీడాకారిణి వంతిక అగర్వాల్ 5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. 7.5 పాయింట్లతో అలెక్సాండ్రా గొర్యాక్చినా (రష్యా) చాంపియన్‌గా అవతరించింది. 5.5 పాయింట్లతో నానా జాగ్‌నిద్జె (జార్జియా) రన్నరప్‌గా నిలిచింది. భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక (4.5 పాయింట్లు) ఐదో ర్యాంక్‌లో, దివ్య దేశ్‌ముఖ్ (3.5 పాయింట్లు) ఏడో ర్యాంక్‌లో, వైశాలి (3.5 పాయింట్లు) ఎనిమిదో ర్యాంక్‌లో, కోనేరు హంపి (3 పాయింట్లు) చివరిదైన పదో ర్యాంక్‌లో నిలిచారు. -
రన్నరప్ మాళవిక
సార్బ్రుస్కెన్ (జర్మనీ): హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 34వ ర్యాంకర్ మాళవిక 10–21, 15–21తో ప్రపంచ 36వ ర్యాంకర్ మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూసింది. మహారాష్ట్రకు చెందిన 23 ఏళ్ల మాళవికకు 7,980 డాలర్ల (రూ. 6 లక్షల 70 వేలు)ప్రైజ్‌మనీతోపాటు 5950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో రన్నరప్‌గా నిలువడం మాళవికకు ఇది రెండోసారి. 2022లో జరిగిన సయ్యద్ మోదీ సూపర్–300 టోర్నీ ఫైనల్లో పీవీ సింధు చేతిలో ఓడిపోయి మాళవిక రన్నరప్‌గా నిలిచింది. -
రన్నరప్ సహజ జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ35 టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. డొమినికన్ రిపబ్లిక్లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సహజ (భారత్)–జిబెక్ కులమ్బయేవా (కజకిస్తాన్) జోడీ 1–6, 7–5, 8–10తో అరియానా–కేలా క్రాస్ (కెనడా) జంట చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది ఐటీఎఫ్ టోర్నీ లో సహజ రన్నరప్‌గా నిలువడం ఇది రెండోసారి. జూలైలో ఇండియానాలో జరిగిన ఇవాన్స్విల్లె టోర్నీలో సహజ–హిరోకో (జపాన్) ద్వయం ఫైనల్లో ఓడిపోయింది. -
రన్నరప్ సహజ జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ75 మహిళల టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఇవాన్స్విల్లె పట్టణంలో ఈ టోర్నీ జరిగింది. డబుల్స్ ఫైనల్లో సహజ (భారత్)–హిరోకో కువాటా (జపాన్) జోడీ 2–6, 0–6తో అలీసియా లినానా (స్పెయిన్)–మెలానీ క్రివోజ్ (అర్జెంటీనా) ద్వయం చేతిలో ఓడిపోయింది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ 7–5, 2–6, 6–7 (6/8)తో ఇరీనా షమనోవిచ్ (రష్యా) చేతిలో పోరాడి ఓడిపోయింది. -
రన్నరప్ రష్మిక
ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్లో రెండో సింగిల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన హైదరాబాద్ యువతార భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన డబ్ల్యూ35 ఐటీఎఫ్ టోర్నీలో 22 ఏళ్ల రన్నరప్‌గా నిలిచింది. రెండో సీడ్ దలీలా జకుపోవిచ్ (స్లొవేనియా)తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రష్మిక 3–6, 2–6తో ఓడిపోయింది. 67 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో రష్మికకు ప్రత్యర్థి సర్విస్‌ను బ్రేక్ చేసేందుకు తొమ్మిదిసార్లు అవకాశం వచ్చినా ఆమె ఒకసారి మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మరోవైపు రష్మిక తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. ఫైనల్ చేరే క్రమంలో రష్మిక టాప్ సీడ్, ఐదో సీడ్, ఏడో సీడ్ క్రీడాకారిణులను ఓడించడం విశేషం. ఈ టోర్నీ ప్రదర్శనతో రష్మిక నేడు విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 428వ ర్యాంక్‌కు చేరుకుంటుంది. -
రన్నరప్ రాజా రిత్విక్
జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ రెండో పతకాన్ని సాధించాడు. ర్యాపిడ్ ఫార్మాట్లో కాంస్య పతకం నెగ్గిన రిత్విక్ గురువారం నాసిక్‌లో జరిగిన బ్లిట్జ్ ఫార్మాట్లో రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించాడు. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో రిత్విక్ 9 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. రిత్విక్ మొత్తం 11 గేముల్లో ఏడింటిలో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. 9.5 పాయింట్లతో దీప్తాయన్ ఘోష్ (రైల్వేస్) చాంపియన్‌గా నిలిచాడు. -
Malaysia Open 2024: రన్నరప్ సాత్విక్–చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాలని ఆశించిన భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్–చిరాగ్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జంటతో ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–9, 18–21, 17–21తో ఓడిపోయింది. 58 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో నిర్ణాయక మూడో గేమ్‌లో సాత్విక్–చిరాగ్ 10–3తో ఏకంగా 7 పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. కానీ ఒత్తిడికిలోనై, అనవసర తప్పిదాలు చేసి భారత జంట చైనా జోడీకి పుంజుకునే అవకాశం ఇచి్చంది. రన్నరప్‌గా నిలిచిన సాత్విక్–చిరాగ్‌లకు 45,500 డాలర్ల (రూ. 37 లక్షల 71 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 10,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
రన్నరప్‌గా బోపన్న జోడి
కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాలనుకున్న భారత వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశే ఎదురైంది. అడిలైడ్ ఇంటర్నేషనల్ ఏటీపీ –250 టోర్నీలో బోపన్న – మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడి రన్నరప్‌గా సరిపెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ రాజీవ్ రామ్ (అమెరికా) – జో సాలిస్బరీ ద్వయం 7–5, 5–7, 11–9తో రెండో సీడ్ బోపన్న – ఎబ్డెన్పై విజయం సాధించింది. బోపన్న జంట 12 ఏస్‌లు సంధించినా లాభం లేకపోయింది. తొలి సెట్లో ఒక దశలో 4–0తో ఆధిక్యంలో ఉండి కూడా బోపన్న టీమ్ దానిని చేజార్చుకుంది. రెండో సెట్లో స్కోరు 5–5తో సమంగా ఉన్న సమయంలో ప్రత్యర్థి గేమ్‌ను బ్రేక్ చేసి ముందంజ వేసిన రోహన్ – ఎబ్డెన్ ఆ తర్వాత సెట్‌ను గెలుచుకున్నారు. మూడో సెట్ టైబ్రేకర్‌తో చివరకు రాజీవ్ – సాలిస్‌బరీదే పైచేయి అయింది. ఒక గంటా 38 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో 5 డబుల్ ఫాల్ట్‌లు చేసి కూడా ఈ జంట గట్టెక్కింది. -
రన్నరప్ ఆదర్శ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–13 చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో తెలంగాణ కుర్రాడు ఉప్పల ఆదర్శ్ శ్రీరామ్ రన్నరప్‌గా నిలిచాడు. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత వీరేశ్ శరణార్థి (మహారాష్ట్ర), ఆదర్శ్ శ్రీరామ్ 9.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. వీరేశ్ విజేతగా అవతరించాడు. ఆదర్శ్ శ్రీరామ్ రన్నరప్‌గా నిలిచాడు. తమిళనాడుకు చెందిన రాఘవ్ తొమ్మిది పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. బాలికల విభాగంలో మహారాష్ట్రకు చెందిన శ్రేయ విజేతగా నిలిచింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత శ్రేయ 9.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నైనా గొర్లి ఏడో స్థానాన్ని పొందింది. తెలంగాణకు చెందిన కీర్తిక ఎనిమిదో స్థానంలో, దీక్షిత పదో స్థానంలో, శివాంశిక 12వ స్థానంలో నిలిచారు. -
రన్నరప్ రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళల టెన్నిస్ (ఐటీఎఫ్) సర్క్యూట్లో తొలి సింగిల్స్ టైటిల్ సాధించేందుకు హైదరాబాద్ యువతార భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ఇంకొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. బ్యాంకాక్‌లోని హువా హిన్‌లో ఆదివారం ముగిసిన ఐటీఎఫ్ డబ్ల్యూ15 టోర్నీలో రష్మిక రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆరో సీడ్ రష్మిక 2–6, 1–6తో రెండో సీడ్ అయూమి కోషిషి (జపాన్) చేతిలో ఓడిపోయింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏకంగా పది డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. తన సర్విస్‌ను ఆరుసార్లు కోల్పోయిన రష్మిక ప్రత్యర్థి సర్విస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. రన్నరప్‌గా నిలిచిన రష్మికకు ట్రోఫీతోపాటు 1,470 డాలర్ల (రూ. లక్షా 22 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
శ్రీమిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా–2023 'రన్నరప్' గా నిర్మల్ యువతి
సాక్షి, ఆదిలాబాద్: ఫ్యాషన్‌రంగంపై మక్కువతో అందులో ఎదుగుతున్న నిర్మల్ యువతి అరుదైన స్థానంలో నిలిచింది. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన శ్రీమిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా–2023శ్రీ పోటీల్లో జిల్లా కేంద్రానికి చెందిన నిషిత తిరునగరి ఒక్క మార్కు తేడాలో రన్నరప్‌గా నిలిచింది. స్థానిక ఈద్గాంకు చెందిన సరళ, మనోహర్‌స్వామి దంపతుల కూతురు నిషిత బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివింది. భవిష్యత్తుపై తనకున్న నమ్మకం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఫ్యాషన్‌రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె 18రాష్ట్రాల మహిళలు, యువతులకు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్‌డిఫెన్స్ కోర్సును నేర్పిస్తుండడం గమనార్హం. ఢిల్లీలో జరిగిన పోటీల్లో నిషిత రన్నరప్‌గా నిలువడంపై కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: అలనాడే పాన్ ఇండియా నటుడు అక్కినేని -
బోపన్న జోడీ రన్నరప్‌తో సరి
న్యూయార్క్: పురుషుల టెన్నిస్ చరిత్రలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాలని ఆశించిన భారత స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. శుక్రవారం రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగం ఫైనల్లో బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ పరాజయం చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్స్, మూడో సీడ్ రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) ద్వయం 2 గంటల్లో 2–6, 6–3, 6–4తో బోపన్న–ఎబ్డెన్ జంటను ఓడించి వరుసగా మూడో ఏడాది యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా 1930 తర్వాత ఈ టోర్నీలో వరుసగా మూడేళ్లు డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి జోడీగా రాజీవ్ రామ్–సాలిస్బరీ ద్వయం గుర్తింపు పొందింది. జాన్ డోగ్–జార్జి లాట్ (అమెరికా) జోడీ 1928, 1929, 1930లలో వరుసగా మూడేళ్లు ఈ టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచింది. విజేత రాజీవ్–సాలిస్బరీ జోడీకి 7 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 80 లక్షలు)... రన్నరప్ బోపన్న–ఎబ్డెన్ జంటకు 3 లక్షల 50 వేల డాలర్లు (రూ. 2 కోట్ల 90 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా ఫలితంతో 43 ఏళ్ల 6 నెలల వయసున్న బోపన్న తన కెరీర్లో రెండోసారి పురుషుల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. 2010 యూఎస్ ఓపెన్‌లో ఐజామ్ ఖురేషి (పాకిస్తాన్)తో కలిసి ఆడిన బోపన్న డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. అయితే మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం రోహన్ బోపన్న ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాడు. 2017లో దబ్రౌస్కీ (కెనడా)తో కలిసి బోపన్న ఫ్రెంచ్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచాడు. బ్రేక్ పాయింట్ అవకాశాలు వృథా... రాజీవ్, సాలిస్బరీలతో జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం తొలి సెట్లో గెలిచి ఆత్మవిశ్వాసంతో కనిపించింది. అయితే రాజీవ్–సాలిస్బరీ ఆందోళన చెందకుండా రెండో సెట్లో పుంజుకున్నారు. ఆరో గేమ్‌లో బోపన్న–ఎబ్డెన్ సర్విస్‌ను బ్రేక్ చేసి 5–2తో ఆధిక్యంలోకి వెళ్లారు. అదే జోరులో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో సెట్లో బోపన్న జోడీ కీలకదశలో తడబడింది. 2–1తో ఆధిక్యంలో ఉన్నదశలో మూడో గేమ్‌లో మూడుసార్లు ప్రత్యర్థి సర్విస్‌ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా దీనిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సర్విస్‌ను నిలబెట్టుకున్న రాజీవ్–సాలిస్బరీ ద్వయం స్కోరును 2–2తో సమం చేయడంతోపాటు ఐదో గేమ్‌లో బోపన్న జంట సర్విస్‌ను బ్రేక్ చేసి, ఆరో గేమ్‌లో తమ సర్విస్‌ను కాపాడుకొని 4–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరకు 6–4తో రాజీవ్–సాలిస్బరీ జోడీ సెట్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకుంది. -
ఐటీఎఫ్ టోర్నీలో రన్నరప్‌గా రష్మిక జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీ లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. గుర్‌గ్రామ్‌లో శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ రష్మిక–వైదేహి చౌదరీ (భారత్) జోడీ 2–6, 2–6తో రెండో సీడ్ జీల్ దేశాయ్ (భారత్)–పునిన్ కొవాపిటుక్‌టెడ్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో ఓడిపోయింది. సింగిల్స్ విభాగంలో రష్మిక పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. -
Tata Steel Chess: రన్నరప్ ఎరిగైసి అర్జున్
కోల్‌కతా: భారత యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్ టాటా స్టీల్ ఇండియా బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 18 రౌండ్లపాటు డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 18 ఏళ్ల అర్జున్... ప్రపంచ మాజీ బ్లిట్జ్ చాంపియన్ లెవాన్ అరోనియన్ (అర్మేనియా) 11.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే ఒంటరి విజేతను నిర్ణయించడానికి వీరిద్దరి మధ్య రెండు గేమ్‌ల టైబ్రేక్‌ను నిర్వహించారు. ఈ రెండు గేమ్‌లు కూడా ‘డ్రా’గా ముగిశాయి. దాంతో అర్మగెడాన్ గేమ్‌ను నిర్వహించారు. అర్మగెడాన్ గేమ్‌లో అరోనియన్ 38 ఎత్తుల్లో అర్జున్ను ఓడించి విజేతగా అవతరించాడు. అర్జున్ రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందాడు. ఇదే టోర్నీలో ర్యాపిడ్ విభాగంలో అర్జున్ విజేతగా నిలి చిన సంగతి తెలిసిందే. బ్లిట్జ్ టోర్నీ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక నాలుగు పాయింట్లు సాధించి చివరి స్థానంలో నిలిచింది. -
రన్నరప్ తరుణ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సైప్రస్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్లేయర్ కాటం తరుణ్ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. నికోసియాలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 20 ఏళ్ల తరుణ్ రెడ్డి 20–22, 21–9, 11–21తో నాలుగో సీడ్ దిమిత్రీ పనారిన్ (కజకిస్తాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. అంతకుముందు తొలి రౌండ్లో అన్‌సీడెడ్ తరుణ్ రెడ్డి 21–17, 21–10తో ఎనిమిదో సీడ్ ఒస్వాల్డ్ ఫంగ్ (ఇంగ్లండ్)పై, సెమీఫైనల్లో 21–14, 21–15తో రెండో సీడ్ జోయల్ కోనిగ్ (స్విట్జర్లాండ్)పై సంచలన విజయాలు సాధించాడు. -
రన్నరప్ సింధు
బాసెల్: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ సాధించాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 12–21, 5–21తో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. కేవలం 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో మారిన్‌కు కాస్త పోటీనిచ్చిన సింధు రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. రన్నరప్‌గా నిలిచిన సింధుకు 5,320 డాలర్ల (రూ. 3 లక్షల 89 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
మిస్ ఇండియా రన్నరప్‌గా ఆటో డ్రైవర్ కూతురు
లక్నో: అందాల పోటీలు..ఈ పేరు వినగానే అందరూ డబ్బున్న వారే పాల్గొంటారని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక రిక్షా డ్రైవర్ తన కూతురు ఈ అందాల కిరీటం గెలవాలని కలలు కన్నాడు. దానికోసం ఎంతో కష్టపడ్డాడు. చివరికి ఒక అడుగు దూరంలో తన కూతురికి ఆ అవకాశం చేజారిపోయింది. అయితే, వీఎల్సీసీ మిస్ ఇండియా పోటీలో రన్నరప్‌గా తన కూతురుని ప్రపంచం ముందు నిలబెట్టడంలో మాత్రం ఆయన విజయం సాధించాడు. ఈ పోటీల్లో మన హైదరాబాదీ అమ్మాయి మానసా వారణాసి విన్నర్‌గా నిలవగా.. ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన మాన్యా సింగ్ రన్నరప్‌గా నిలిచింది. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ అందరి మన్ననలను పొందుతున్న మాన్యా విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం. అందాల పోటీలలో నిలవాలంటే అందంగా ఉండాలి. చక్కని ముఖవర్చస్సు కలిగి, అందమైన శరీరాకృతి కోసం ఎన్నో చేయాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న విషయమని చాలా మందికి ఆసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించక పోవడం వలన తమ ఆశను మనస్సులోనే చంపుకొంటారు. అయితే, ఉత్తరప్రదేశ్ కు చెందిన మాన్యా సింగ్ అందరిలా ఆలోచించలేదు. ఈమె తండ్రి ఒక ఆటోవాలా. తల్లి ఇంటిలో పనులు చేసుకొంటూ తన ఇద్దరు పిల్లలను చూసుకొనేది. పేదరికం కారణంగా మాన్య కొద్దివరకే చదువుకొని ఉద్యోగంలో చేరాల్సిన పరిస్థితి ఎదురైంది. మాన్య డిగ్రి ఫీజు కోసం తల్లి దగ్గర ఉన్న కొద్దిపాటి బంగారాన్నికూడా కుదువపెట్టాల్సి వచ్చింది. తన ఖర్చుల కోసం ఇంట్లో వారు పడుతున్న కష్టాన్ని చూడలేని మాన్య పద్నాలుగు ఏళ్లప్పుడే ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. రాత్రిపూట కాల్సెంటర్లో ఉద్యోగం చేసుకుంటూ, ఉదయంపూట చదువుకునేదాన్ని అని చెప్పింది. మిస్ఇండియా పోటీల్లో గెలవాలని నిర్ణయించుకొని దీనికోసం ఎన్నో తిండి, నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపింది. ఉద్యోగం చేస్తున్నప్పుడు నడిచి వెళ్తు రిక్షా డబ్బులు కూడా దాచుకునే దాన్నని మాన్యా గుర్తు చేసుకుంది. ఈ రోజు మానాన్న, అమ్మా, అన్నయ్య నాకోసం పడ్డ కష్టం, వారు నాకు అందించిన సహకారం వలనే ఈ స్థానంలో నిలిచాను’ అని ఆమె వివరించింది. చదవండి: ‘మిస్ ఇండియా’ కిరీటం.. విన్నర్‌గా తెలుగమ్మాయి -
చేజేతులా...
మెల్బోర్న్: కీలకదశలో ఒత్తిడికి లోనైన భారత మహిళల క్రికెట్ జట్టు మూల్యం చెల్లించుకుంది. విజేతగా నిలవాల్సిన చోట పరాజయాన్ని పలకరించింది. ముక్కోణపు టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ 11 పరుగుల తేడాతో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒకదశలో 15 ఓవర్లలో 3 వికెట్లకు 115 పరుగులు చేసి విజయందిశగా సాగుతోంది. భారత్ విజయానికి 30 బంతుల్లో 41 పరుగులు అవసరమైన దశలో... ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ జెస్సికా జొనాస్సెన్ మాయాజాలం చేసింది. జెస్సికా స్పిన్ వలలో చిక్కుకున్న భారత మహిళల జట్టు చివరి 7 వికెట్లను 29 పరుగుల తేడాలో కోల్పోయి సరిగ్గా 20 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. జోరు మీదున్న స్మృతి మంధాన (37 బంతుల్లో 66; 12 ఫోర్లు)ను మేగన్ షుట్ అవుట్ చేయగా... ఆ తర్వాత జెస్సికా స్పిన్‌కు హర్మన్‌ప్రీత్ (14; 2 ఫోర్లు)... దీప్తి శర్మ (10), అరుంధతి రెడ్డి (0), రాధా యాదవ్ (2), తానియా భాటియా (11; 2 ఫోర్లు) పెవిలియన్ చేరుకున్నారు. శిఖా పాండే (4)ను ఎలీస్ పెర్రీ అవుట్ చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు సాధించింది. బెథానీ మూనీ (54 బంతుల్లో 71 నాటౌట్; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. యాష్లే గార్డెనర్ (26; 5 ఫోర్లు), మేగన్ లానింగ్ (26; 2 ఫోర్లు, సిక్స్) రాణించారు. భారత స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆస్ట్రేలియా ఏకంగా 19 పరుగులు సాధించి భారత్ ముందు క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది. -
రన్నరప్ హంపి
మోంటెకార్లో: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 7 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 5.5 పాయింట్లతో ఆరో స్థానాన్ని సంపాదించింది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి 7 పాయింట్లతో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా), అలెగ్జాండ్రా గొర్యాచికినా (రష్యా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే టోర్నీ టైబ్రేక్ నిబంధనల ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... కొస్టెనిక్ విజేతగా నిలిచింది. హంపి రన్నరప్‌గా నిలువగా... గొర్యాచికినా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌లో గొర్యాచికినాపై హంపి 68 ఎత్తుల్లో గెలిచింది. అంతకుముందు వాలెంటినా గునీనా (రష్యా), మరియా ముజిచుక్ (ఉక్రెయిన్), జావో జుయ్ (చైనా)లపై కూడా నెగ్గిన హంపి... హారిక (భారత్), నానా జాగ్‌నిద్జె (జార్జియా), అనా ముజిచుక్ (ఉక్రెయిన్), కాటరీనా లాగ్నో (రష్యా), కొస్టెనిక్ (రష్యా), పియా క్రామ్లింగ్ (స్వీడన్)లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... ఎలిజబెత్ పాట్జ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. ఓవరాల్‌గా హంపి నాలుగు గేముల్లో గెలిచి, ఆరింటిని ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడింది. హారిక 11 గేములు ఆడి మూడింటిలో (ఎలిజబెత్, గునీనా, మరియాలపై) విజయం సాధించింది. నానా జాగ్‌నిద్జె, పియా క్రామ్లింగ్, అనా ముజిచుక్, హంపి, లాగ్నోలతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హారిక... గొర్యాచికినా, కొస్టెనిక్, జావో జుయ్లతో జరిగిన మూడు గేముల్లో ఓడిపోయింది. నాలుగు గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నమెంట్లలో భాగంగా రెండు టోర్నీలు ముగిశాక హంపి మొత్తం 293 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. గత సెప్టెంబర్‌లో రష్యాలో జరిగిన తొలి గ్రాండ్‌ప్రి టోర్నీలో హంపి విజేతగా నిలిచింది. గ్రాండ్‌ప్రి సిరీస్‌లో మొత్తం 15 మంది క్రీడాకారిణులు గరిష్టంగా మూడు టోర్నీల్లో ఆడతారు. ఇప్పటికే రెండు టోర్నీలు ఆడిన హంపి వచ్చే ఏడాది మే నెలలో ఇటలీలో జరిగే చివరిదైన నాలుగో గ్రాండ్‌ప్రి టోర్నీలో పాల్గొంటుంది. హారిక మాత్రం వచ్చే ఏడాది మార్చిలో స్విట్జర్లాండ్‌లో జరిగే మూడో గ్రాండ్‌ప్రి టోర్నీలో ఆడుతుంది. ప్రస్తుతం హారిక 120 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో ఉంది. టాప్–2లో నిలిచిన వారు క్యాండిడేట్ చెస్ టోర్నీకి అర్హత సాధిస్తారు. క్యాండిడేట్ టోర్నీ విజేత ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం ప్రస్తుత మహిళల ప్రపంచ చాంపియన్‌తో 12 గేమ్‌లు ఆడుతుంది. -
నాదల్ విజయనాదం
అద్భుతం ఆ పోరు... అనూహ్యం ఆ పోరాటం... దాదాపు ఐదు గంటల సమరంలో అంతిమ విజేతగా నిలిచేందుకు సాగించిన అసమాన, అసాధారణ ఆట... అపార అనుభవం ఒకరిదైతే, అంతులేని ఆత్మవిశ్వాసం మరొకరిది... ‘బిగ్ 3’లలో ఏ ఇద్దరైనా పోటీ పడినప్పుడు మాత్రమే గ్రాండ్‌స్లామ్ ఫైనల్ రసవత్తరం, మిగతా మ్యాచ్‌లన్నీ ఏకపక్షం అంటూ తీర్మానించుకున్న అభిమానులు అయ్యో చూడలేకపోయామే అని ఆ తర్వాత వగచిన క్షణం ఇది! ఇలాంటి ఘనాఘన హోరాహోరీ సమరంలో చివరకు స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్‌దే పైచేయి అయింది. యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నాలుగోసారి గెలుచుకొని నాదల్ తన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్యను 19కి పెంచుకోగా... చివరి వరకు తలవంచని రష్యా కుర్రాడు మెద్వెదేవ్ రన్నరప్‌గానే ముగించాడు. తొలి రెండు సెట్లను స్పెయిన్ బుల్ సొంతం చేసుకున్న తర్వాత ఇక లాంఛనమే అనిపించిన మ్యాచ్‌లో తర్వాతి రెండు సెట్లు సాధించి మెద్వెదేవ్ ఒక్కసారిగా అలజడి రేపాడు. కానీ తనదైన పదునైన ఆటతో నాదల్ మళ్లీ లయ అందుకొని విజేతగా మారాడు. ఫెడరర్ ఆల్‌టైమ్ గ్రేట్ 20 గ్రాండ్‌స్లామ్‌ల రికార్డుకు మరో అడుగు దూరంలోనే నిలిచాడు. న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) వశమైంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన నాదల్ ఈ టోర్నీలోనూ తన సత్తా చాటాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక మొదలై సోమవారం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ముగిసిన ఫైనల్లో నాదల్ 7–5, 6–3, 5–7, 4–6, 6–4 స్కోరుతో ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)పై విజయం సాధించాడు. పోటాపోటీగా సాగిన ఐదు సెట్ల ఈ పోరాటం 4 గంటల 49 నిమిషాల పాటు ప్రేక్షకులను కట్టిపడేయడం విశేషం. తాజా విజయంతో నాదల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్య 19కి చేరింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన మెద్వెదేవ్ రన్నరప్‌గా సంతృప్తి పడాల్సి వచ్చింది. నాదల్ గతంలో 2010, 2013, 2017లలో యూఎస్ ఓపెన్ గెలిచాడు. నాదల్ (62)కంటే ఎక్కువ విన్నర్లు (75) కొట్టినా... 57 అనవసర తప్పిదాలు మెద్వెదేవ్ ఓటమికి కారణమయ్యాయి. విజేత నాదల్కు 38,50,000 డాలర్లు (రూ. 27 కోట్ల 59 లక్షలు)... రన్నరప్ మెద్వెదేవ్‌కు 19,00,000 డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నాదల్ జోరు... ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నాదల్కు సరైన ఆరంభం లభించలేదు. అతని ఫోర్హ్యాండ్లలో ధాటి లేకపోవడంతో మెద్వెదేవ్ వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. మూడో గేమ్‌ను బ్రేక్ చేసిన రష్యన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే కోలుకున్న నాదల్ ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయడంలో సఫలమయ్యాడు. తర్వాతి 10 పాయింట్లలో 8 గెలుచుకొని దూసుకుపోగా... స్కోరు 5–5కు చేరిన తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకున్న నాదల్ మళ్లీ బ్రేక్ చేసి సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో సెట్ నాదల్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. బేస్‌లైన్ వద్దనుంచే చక్కటి రిటర్న్‌లతో మెద్వెదేవ్పై ఒత్తిడి పెంచిన అతను 48 నిమిషాల్లోనే అలవోకగా సెట్‌ను సాధించాడు. అనూహ్య ప్రతిఘటన... పరిస్థితి చూస్తే మరో సెట్‌తో పాటు మ్యాచ్ కూడా ఇదే తరహాలో ముగుస్తుందని అనిపించింది. అయితే మెద్వెదేవ్ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. మరో మూడు గేమ్‌లు గెలిస్తే నాదల్ విజేతగా నిలుస్తాడనగా రష్యన్ ప్రతిఘటించాడు. 2–3తో వెనుకబడి ఉన్న దశ నుంచి తర్వాతి 7 గేమ్‌లలో 5 గెలుచుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరు సుదీర్ఘమైన ర్యాలీలు ఆడారు. నాలుగో సెట్లో మెద్వెదేవ్ మరింత దూకుడు ప్రదర్శించాడు. ఆరంభంలోనే బ్రేక్ సాధించిన అతను పదో గేమ్‌లో కూడా మరో రెండు బ్రేక్ పాయింట్లు అందుకొని ముందంజ వేశాడు. బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో సెట్ అతని ఖాతాలో చేరింది. హోరాహోరీ... 64 నిమిషాల పాటు సాగిన చివరి సెట్లో ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం శ్రమించారు. అయితే అనుభవాన్నంతా రంగరించిన నాదల్ ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఆడాడు. ఇద్దరు సర్వీస్‌లు నిలబెట్టుకొని స్కోరు 2–2కు చేరిన తర్వాత నాదల్ రెండు బ్రేక్‌లు సహా వరుసగా మూడు గేమ్‌లు గెలుచుకొని 5–2తో విజయానికి చేరువయ్యాడు. అయితే పోరాటం వదలని మెద్వెదేవ్ కూడా మళ్లీ రెండు గేమ్‌లు సాధించి స్కోరు 4–5కు తీసుకొచ్చాడు. ఉత్కంఠ తారాస్థాయికి పెరిగిపోయిన సమయంలో పదో గేమ్‌లో నాదల్ సర్వీస్ చేశాడు. ఒక దశలో 30–30, 40–40తో మెద్వెదేవ్ పోటీనిచ్చినా... చివరకు నాదల్‌నే విజయం వరించింది. మెద్వెదేవ్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ రిటర్న్ కోర్టు బయట పడటంతో నాదల్ భావోద్వేగంతో కూలిపోయాడు. నా టెన్నిస్ కెరీర్లో నేను ఎంతో భావోద్వేగానికి లోనైన రోజుల్లో ఇది ఒకటి. చివరి మూడు గంటలు హోరాహోరీగా పోరు సాగింది. ఫైనల్ జరిగిన తీరు, దాదాపు చేతుల్లోకి వచ్చిన మ్యాచ్ మళ్లీ కష్టంగా మారిపోవడం, మళ్లీ కోలుకోవడం చూస్తే నా దృష్టిలో ఈ విజయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే గెలవాలంటే ఈ మాత్రం శ్రమించాల్సిందే. స్క్రీన్‌పై నా గత టైటిల్స్‌ను చూడటం, ఆ విజయాలను గుర్తు చేసుకోవడం గర్వంగా, ప్రత్యేకంగా అనిపించింది. అందుకే నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. మెద్వెదేవ్ తన పోరాటంతో మ్యాచ్ దిశను మార్చేసిన తీరు అద్భుతం. మున్ముందు అతను ఎన్నో విజయాలు సాధించడం ఖాయం. భవిష్యత్తులో మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకోవాలని నేనూ కోరుకుంటున్నా. అయితే అత్యధిక స్లామ్‌లు నెగ్గిన ఆటగాడిగా నిలవకపోయినా నేను ప్రశాంతంగా నిద్రపోగలను. –నాదల్ విజయం ఖాయమైన క్షణాన... నాదల్ భావోద్వేగం -
వినేశ్‌కు రజతం
న్యూఢిల్లీ: ఈ సీజన్లో వరుసగా నాలుగో స్వర్ణ పతకం సాధించాలని ఆశించిన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు నిరాశ ఎదురైంది. బెలారస్లో ఆదివారం ముగిసిన మెద్వేద్ ఓపెన్ టోర్నమెంట్లో వినేశ్ రన్నరప్‌గా నిలిచింది. రష్యా రెజ్లర్ మలిషెవాతో జరిగిన ఫైనల్లో వినేశ్ 0–10తో ఓడింది. ఈ సీజన్లో వినేశ్ స్పెయిన్ గ్రాండ్‌ప్రి, యాసర్ డొగో టోర్నీ, పోలాండ్ ఓపెన్ టోర్నీల్లో పసిడి పతకాలు సాధించింది. మెద్వేద్ టోర్నీలోనే ఇతర భారత మహిళా రెజ్లర్లు కూడా ఆకట్టుకున్నారు. పింకీ (55 కేజీలు), సరిత (57 కేజీలు) కూడా రజతాలు గెలిచారు. సాక్షి మలిక్ (62 కేజీలు), నవ్‌జ్యోత్ కౌర్ (68 కేజీలు), రాణి (72 కేజీలు), కిరణ్ (76 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు. సుశీల్‌కు నిరాశ... రవికి కాంస్యం ఇదే టోర్నీలో భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో సుశీల్ 7–8తో కడిమగమెదోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో తొలి రౌండ్లో అబ్దురఖమనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో సుశీల్ 90 సెకన్లలో ఓటమి పాలయ్యాడు. అయితే అబ్దురఖమనోవ్ ఫైనల్‌కు చేరడంతో సుశీల్‌కు రెపిచేజ్ పద్ధతి ద్వారా కాంస్య పతక పోరులో ఆడే అవకాశం దక్కింది. పురుషుల 57 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన రవి దహియాకు కాంస్యం లభించింది. కాంస్య పతక బౌట్లో రవి 9–4తో అరాబిద్జె (రష్యా)పై గెలిచాడు. -
రన్నరప్ యువ భారత్
న్యూఢిల్లీ: తొలిసారి ఆసియా అండర్–23 పురుషుల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవాలని ఆశించిన భారత జట్టు తుది మెట్టుపై తడబడింది. మయన్మార్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 21–25, 20–25, 25–19, 23–25తో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. చైనా, న్యూజిలాండ్, కజకిస్తాన్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లపై గెలిచి జపాన్, థాయ్‌లాండ్, చైనీస్ తైపీ జట్ల చేతిలో ఓడింది. ఈ టోర్నీలో విజేత చైనీస్ తైపీ, రన్నరప్ భారత్ జట్లు అండర్–23 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించాయి. -
రన్నరప్ బోపన్న జంట
స్టుట్గార్ట్: మెర్సిడెస్ కప్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 5–7, 3–6తో టాప్ సీడ్ బ్రూనో సొరెస్ (బ్రెజిల్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న జోడీకి 19,680 యూరోల (రూ. 15 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
రన్నరప్ పేస్ జంట
న్యూఢిల్లీ: ఈ ఏడాది మూడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు నిరాశ ఎదురైంది. ఫ్రాన్స్‌లో ఆదివారం ముగిసిన ఓపెన్ బ్రెస్ట్ క్రెడిట్ అగ్రికోల్ టోర్నీలో పేస్–వరేలా (మెక్సికో) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో పేస్–వరేలా జోడీ 6–3, 4–6, 2–10తో శాండర్–వీజెన్ (బెల్జియం) జంట చేతిలో ఓడింది. రన్నరప్‌గా నిలిచిన పేస్ జోడీకి 3,820 యూరోలు (రూ. 3 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. యూపీ యోధ గెలుపు పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌లో రైడర్లు శ్రీకాంత్, ప్రశాంత్ కుమార్ చెలరేగడంతో యూపీ యోధ జట్టు మూడో విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో యూపీ యో«ధ 38–36తో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. విజేత జట్టు తరఫున శ్రీకాంత్ 12, ప్రశాంత్ 11 రైడ్ పాయింట్లు సాధించారు. ట్యాక్లింగ్‌లో నితీశ్ కుమార్ (4 పాయింట్లు) రాణించాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 43–32తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. నేడు విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యచ్‌ల్లో పుణేరీ పల్టన్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
సైనాకు మళ్లీ నిరాశ
ఓడెన్స్: ఈ ఏడాది తొలి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆశలు అడియాసలయ్యాయి. డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ సైనా 52 నిమిషాల్లో 13–21, 21–13, 6–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. విజేత తై జు యింగ్‌కు 54,250 డాలర్లు (రూ. 39 లక్షల 78 వేలు) 11,000 పాయింట్లు... రన్నరప్ సైనాకు 26,350 డాలర్లు (రూ. 19 లక్షల 32 వేలు) లభించాయి. ఈ చైనీస్ తైపీ క్రీడాకారిణి చేతిలో సైనాకిది వరుసగా 11వ పరాజయంకాగా, ఈ ఏడాదిలో ఐదో ఓటమి. ఈ సంవత్సరంలోనే ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ ఫైనల్లోనూ తై జు యింగ్ చేతిలోనే సైనా ఓడిపోయింది. ఈ ఏడాది తొమ్మిదో ఫైనల్ ఆడుతోన్న తై జు యింగ్ తొలి గేమ్ ఆరం భం నుంచే ఆధిపత్యం చలాయించింది. 6–1తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరును కొనసాగించి 15 నిమిషాల్లోనే తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో సైనా వ్యూహాలు మార్చి తన ప్రత్యర్థి దూకుడుకు పగ్గాలు వేసింది. విరామానికి 11–5తో ఆధిక్యంలోకి వెళ్లిన సైనా ఆ తర్వాత గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం తై జు యింగ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. చకచకా పాయింట్లు సాధించి 11–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన తై జు యింగ్ ఇక వెనుదిరిగి చూడకుండా ఈ ఏడాది ఎనిమిదో టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
రన్నరప్ భారత్
జొహర్ బారు (మలేసియా): ఆరంభంలోనే దక్కిన ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయిన భారత యువ హాకీ జట్టు... సుల్తాన్ జొహర్ కప్ అండర్–18 టోర్నీలో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 2–3 గోల్స్ తేడాతో బ్రిటన్ చేతిలో ఓడిపోయింది. నాలుగో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి విష్ణుకాంత్ సింగ్ టీమిండియాకు ఆధిక్యం అందించాడు. అయితే, డానియెల్ వెస్ట్ 7వ నిమిషంలో ఫీల్డ్ గోల్‌తో బ్రిటన్ స్కోరు సమం చేసింది. పోటాపోటీగా సాగిన రెండో భాగంలో మరో గోల్ నమోదు కాలేదు. మూడో భాగంలో జేమ్స్ ఓట్స్ (39వ ని., 42వ ని.) విజృంభణతో బ్రిటన్ 3–1తో ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. తర్వాత భారత్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 55వ నిమిషంలో అభిషేక్ గోల్ చేసినా అది స్కోరు అంతరం తగ్గించడానికే ఉపయోగపడింది. -
చాంపియన్ శ్రీజ రన్నరప్ స్నేహిత్
సాక్షి, హైదరాబాద్: నార్త్‌జోన్ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు ఆకుల శ్రీజ, సురావజ్జుల ఫిడేల్ రఫీక్ స్నేహిత్ మెరిశారు. హరియాణాలోని పంచ్కులాలో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో శ్రీజ యూత్ బాలికల సింగిల్స్ విభాగంలో విజేతగా... పురుషుల సింగిల్స్ విభాగంలో స్నేహిత్ రన్నరప్‌గా నిలిచారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తరఫున బరిలోకి దిగిన 19 ఏళ్ల శ్రీజ ఫైనల్లో 13–15, 11–5, 12–10, 11–9, 9–11, 12–10తో సెలీనా దీప్తి (తమిళనాడు)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో 18 ఏళ్ల స్నేహిత్ 9–11, 8–11, 11–4, 11–7, 6–11, 4–11తో ప్రపంచ జూనియర్ మూడో ర్యాంకర్ మానవ్ ఠక్కర్ (పీఎస్‌పీబీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఫైనల్ చేరే క్రమంలో స్నేహిత్ మూడో రౌండ్లో ‘ట్రిపుల్ ఒలింపియన్’... 2006 కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్ విజేత... ఎనిమిదిసార్లు జాతీయ చాంపియన్ అయిన 36 ఏళ్ల ఆచంట శరత్ కమల్‌పై 12–10, 9–11, 11–3, 11–9, 5–11, 12–14, 11–8తో సంచలన విజయం సాధించాడు. -
రన్నరప్ జయరామ్
గాట్చిన (రష్యా): భారత మేటి షట్లర్ అజయ్ జయరామ్ వైట్‌నైట్స్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. టైటిల్ పోరులో అతను స్పెయిన్‌కు చెందిన టాప్ సీడ్ పాబ్లో అబియన్ చేతిలో పోరాడి ఓడాడు. 30 ఏళ్ల జయరామ్ గాయం నుంచి కోలుకున్నాక గత నెలలో బరిలోకి దిగిన యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ ఈవెంట్లో సెమీస్ చేరుకున్నాడు. తాజాగా రష్యాలో జరిగిన ఈవెంట్ ఫైనల్లో 21–11, 16–21, 17–21తో పాబ్లో చేతిలో పరాజయం చవిచూశాడు. 55 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకున్న భారత ఆటగాడు తర్వాతి రెండు గేముల్లో ప్రత్యర్థితో పోరాడినప్పటికీ ఫలితం సాధించలేకపోయాడు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో తరుణ్ కోనా–సౌరభ్ శర్మ జంట 21–18, 13–21, 17–21తో జార్నే జెయిస్–జాన్ కొలిన్ ఓల్కర్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడింది. -
రన్నరప్ మానవ్ ఠక్కర్
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) వరల్డ్ జూనియర్ సర్క్యూట్ ఫైనల్స్ టోర్నమెంట్లో భారత యువతార మానవ్ ఠక్కర్ రన్నరప్‌గా నిలిచాడు. లక్సెంబర్గ్‌లో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో జూనియర్ ప్రపంచ నంబర్‌వన్ మానవ్ 11–9, 3–11, 11–9, 6–11, 3–11, 11–9, 6–11తో టాప్ సీడ్ కనక్ ఝా (అమెరికా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. సెమీఫైనల్స్‌లో మానవ్ 11–8, 11–8, 11–5, 11–8తో అబ్దుల్ అజీజ్ (ఈజిప్ట్)పై, కనక్ ఝా 11–3, 12–10, 11–9, 11–6తో ఇవోనిన్ డెనిస్ (రష్యా)పై గెలుపొందారు. -
సింధు రెండో‘సారీ’
కౌలూన్ (హాంకాంగ్): బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి సూపర్ సిరీస్ టోర్నీ హాంకాంగ్ ఓపెన్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. వరుసగా రెండో ఏడాది ఆమె రన్నరప్‌తో సంతృప్తి పడింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 18–21, 18–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. విజేతగా నిలిచిన తై జు యింగ్‌కు 30,000 డాలర్ల (రూ. 19 లక్షల 39 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 15,200 డాలర్ల (రూ. 9 లక్షల 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది ఓ టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం సింధుకిది రెండోసారి. ఈ సంవత్సరం సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన సింధు... ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయి రజతం సాధించింది. వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌తో సింధు ఈ సీజన్‌ను ముగిస్తుంది. చివరిసారి గతేడాది రియో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు చేతిలో ఓడిన తై జు యింగ్ ఆ తర్వాత ఈ హైదరాబాద్ ప్లేయర్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. 44 నిమిషాలపాటు జరిగిన హాంకాంగ్ ఓపెన్ ఫైనల్లోనూ తై జు యింగ్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తై జు యింగ్ వ్యూహాత్మక ఆటతీరు ముందు సింధు ప్రణాళికలు పనిచేయలేదు. తొలి గేమ్ ఆరంభంలోనే 3–0తో, ఆ తర్వాత 7–2తో ఆధిక్యంలోకి వెళ్లిన తై జు యింగ్ అదే దూకుడుతో గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో స్కోరు 12–12 వద్ద తై జు యింగ్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 18–12తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. -
రన్నరప్ సానియా జంట
సిడ్నీ: కొత్త ఏడాదిలో వరుసగా రెండో టైటిల్‌ను నిలబెట్టుకోవాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. శుక్రవారం ముగిసిన సిడ్నీ ఓపెన్ టోర్నమెంట్లో సానియా మీర్జా–బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట రన్నరప్‌గా నిలిచింది. 72 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా–స్ట్రికోవా ద్వయం 4–6, 4–6 తో తిమియా బాబోస్ (హంగేరి)–అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) జోడీ చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన సానియా–స్ట్రికోవా జోడీకి 22,180 డాలర్ల (రూ. 15 లక్షల 12 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 305 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతవారం బెథానీతో కలిసి బ్రిస్బేన్ ఓపెన్‌లో టైటిల్ నిలబెట్టుకున్న సానియా ఈనెల 16న మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. -
రన్నరప్ అమీ కమాని
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్ మాస్టర్స్ విభాగంలో విజేత ధర్మేందర్ దోహా: ఫైనల్‌కు చేరిన తొలిసారే ప్రపంచ స్నూకర్ చాంపియన్‌గా అవతరించాలని ఆశించిన భారత క్రీడాకారిణి అమీ కమానికి నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో 24 ఏళ్ల అమీ కమాని రన్నరప్‌గా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ వెండీ జాన్స (బెల్జియం) 5-0తో ఫ్రేమ్‌ల తేడాతో అమీ కమానిపై గెలిచి వరుసగా ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. మధ్యప్రదేశ్‌కు చెందిన అమీ కమాని ఫైనల్లో నిలకడగా పారుుంట్లు సాధించినా... తుదకు అనుభవజ్ఞురాలైన వెండీ జాన్సదే పైచేరుుగా నిలిచింది. మరోవైపు మాస్టర్స్ విభాగంలో భారత్‌కు చెందిన ధర్మేందర్ లిల్లీ 6-2 ఫ్రేమ్‌ల తేడాతో ఇవాన్‌స (వేల్స్)ను ఓడించి విజేతగా నిలిచాడు. పురుషుల విభాగంలో భారత స్టార్ పంకజ్ అద్వానీ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. సెమీఫైనల్లో పంకజ్ అద్వానీ 2-7 ఫ్రేమ్‌ల తేడాతో ఆండ్రూ పాజెట్ (వేల్స్) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో సోహైల్ వహీది (ఇరాన్) 8-1తో పాజెట్‌ను ఓడించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. -
రన్నరప్ సౌరభ్ వర్మ
సార్‌బ్రకెన్ (జర్మనీ): కెరీర్లో తొలి గ్రాండ్‌ప్రి గోల్డ్ స్థారుు టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ యువతార సౌరభ్ వర్మకు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన బిట్‌బర్గర్ ఓపెన్ టోర్నమెంట్లో సౌరభ్ వర్మ రన్నరప్‌గా నిలిచాడు. 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ వర్మ 19-21, 20-22తో షి యుకీ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. రన్నరప్‌గా నిలిచిన సౌరభ్‌కు 4,560 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షలు) తోపాటు 5,950 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. కేసు నుంచి బంగ్లా క్రికెటర్‌కు విముక్తి ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హొస్సేన్ క్రిమినల్ కేసు నుంచి విముక్తి పొందాడు. గతేడాది భార్య నిర్తోతో కలిసి షహదత్ తన ఇంట్లో పనిచేసే 11 ఏళ్ల బాలికను హింసించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తాజాగా కోర్టులో ఈ కేసు విచారణకు రాగా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టివేసింది. -
రన్నరప్ ఆనంద్
న్యూఢిల్లీ: కార్సికన్ సర్క్యూట్ నాకౌట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రన్నరప్‌గా నిలిచాడు. ఫ్రాన్‌సలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 14 మంది గ్రాండ్‌మాస్టర్లు, ఇద్దరు అంతర్జాతీయ మాస్టర్లు పాల్గొన్నారు. రెండు గేమ్‌ల ఫైనల్లో ఆనంద్ 0.5-1.5తో మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో ఆనంద్ 1.5-0.5తో తెమూర్ రద్జబోవ్ (అజర్బైజాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 1.5-0.5తో టిగ్రాన్ ఘరామియాన్ (ఫ్రాన్స)పై, తొలి రౌండ్లో 2-0తో కొయెన్ లీహుట్స్ (ఫ్రాన్స)పై గెలుపొందాడు. భారత్‌కు నాలుగు పతకాలు జార్జియాలో జరిగిన ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్ షిప్లో భారత్‌కు నాలుగు పతకాలు లభించారుు. అండర్-12 ఓపెన్ విభాగంలో ప్రజ్ఞానంద, అండర్-10 ఓపెన్ విభాగంలో వి.ప్రణవ్ కాంస్య పతకాలు... అండర్-12 బాలికల విభాగంలో దివ్య దేశ్‌ముఖ్ కాంస్యం, అండర్-10 బాలికల విభాగంలో మృదుల్ దేహాంకర్ రజత పతకం సాధించారు. -
రన్నరప్ సానియా జంట
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొమ్మిదో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. చైనాలో శనివారం జరిగిన వుహాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో సానియా మీర్జా-బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో సానియా-స్ట్రికోవా జోడీ 1-6, 4-6తో బెథానీ మాటెక్ సాండ్స (అమెరికా)-లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడిపోరుుంది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తమ సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోరుు, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. రన్నరప్‌గా నిలిచిన సానియా జోడీకి 68 వేల 200 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 45 లక్షల 39 వేలు)తోపాటు 585 ర్యాంకింగ్ పారుుంట్లు... విజేతగా నిలిచిన బెథానీ-సఫరోవా జంటకు లక్షా 35 వేల డాలర్ల (రూ. 89 లక్షల 85 వేలు)తోపాటు 900 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. -
మిస్ ఇండియా పోటీల్లో
బెంగళూరు: ప్రతి ఏడాది ఎంతోమంది ముద్దుగుమ్మలు పోటీపడే ‘ఫెమినా మిస్ ఇండియా-2016’ పోటీ ల్లో బెంగళూరుకు చెందిన తెలుగు భామ సంజన కూడా పోటీదారుగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బెంగళూరులోని యలహంక ఓల్డ్ టౌన్లో నివసిస్తున్న గెడ్డం పరంధామనాయుడు, ఇంద్రావతి దంపతుల గారాలప ట్టి సంజన. వీరి స్వస్థలం చిత్తూరు జిల్లా ఐరాల మండ లం బొమ్మసముద్రం. కొన్నేళ్ల క్రితం వీరి కుటుంబం బెంగళూరుకు వచ్చి స్థిరపడ్డారు. బీఈ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న సంజన అందాల పోటీల్లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫెమినా మిస్ఇండియాపోటీల్లో దేశ వ్యాప్తం గా మొత్తం 15 వేల మంది నుంచి ఎంట్రీలు రాగా వారిలో నుంచి కేవలం 21 మంది మాత్రమే తుది పోటీలకు ఎంపికయ్యారు. ఇక దక్షిణాది ఫెమినా మిస్ ఇండియా-2016లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన సంజన, మిస్ పర్ఫెక్ట్ బాడీ, మిస్ ర్యాంప్‌వాక్‌గా ఎంపికైంది. అందాల ప్రపంచంలో తారలా వెల గడంతో పాటు సమాజ సేవ చేయడంలోనూ ఎంతో ఆనందం లభిస్తుందని సంజన చెబుతున్నారు. ఇప్పటికే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని తెలిపారు. ఈ నెల 9న ముంబయిలో జరగనున్న ఫైనల్స్‌లో సంజన తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. -
రన్నరప్ సింధు
డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ ఒడెన్స్: ఫైనల్‌కు చేరిన మొదటి ప్రయత్నంలోనే కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి రన్నరప్‌తో సంతృప్తి పడింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 19-21, 12-21తో ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన సింధుకు 24,700 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 16 లక్షలు)తోపాటు 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
రన్నరప్ సుమీత్ జంట
ప్రేగ్ (చెక్ రిపబ్లిక్): ఈ ఏడాది నిలకడగా రాణిస్తోన్న భారత నంబర్‌వన్ పురుషుల బ్యాడ్మింటన్ జంట సుమీత్ రెడ్డి-మనూ అత్రి త్రుటిలో మరో టైటిల్‌ను కోల్పోయింది. ప్రేగ్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన తన భాగస్వామి మనూ అత్రితో కలిసి రన్నరప్‌గా నిలిచాడు. హోరాహోరీగా జరిగిన పురుషుల డబు ల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 21- 19, 20-22, 14-21తో ఆడమ్ క్వాలినా-ప్రెజ్మీస్లా వచా (పోలండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. రెండో గేమ్‌లో మ్యాచ్ పాయింట్‌ను వదులుకున్న సుమీత్-మనూ అత్రి, నిర్ణాయక మూడో గేమ్‌లో తడబడి మూల్యం చెల్లించుకున్నారు. ఇటీవల లాగోస్ ఓపెన్, బెల్జియం ఇంటర్నేషనల్ ఓపెన్‌లో టైటిల్స్ నెగ్గిన సుమీత్-మనూ యూఎస్ ఓపెన్‌లో, గ్వాటెమాలా చాలెంజ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచారు. -
ప్రత్యూషకు చేజారిన కాంస్యం
అల్ అయిన్ (యూఏఈ): ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. సోమవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో ప్రత్యూష 6.5 పాయింట్లతో విజయలక్ష్మి (భారత్), దినారా సాదుకసోవా (కజకిస్తాన్)లతో కలిసి సంయక్తంగా రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు మిత్రా హెజాజిపౌర్ (ఇరాన్), షెన్ యాంగ్ (చైనా) 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్స్‌ను వర్గీకరించగా మిత్రాకు టైటిల్ దక్కగా... షెన్ యాంగ్ రన్నరప్‌గా నిలిచింది. విజయలక్ష్మి మూడో స్థానాన్ని పొందగా... ప్రత్యూషకు నాలుగో స్థానం, దినారాకు ఐదో స్థానం లభించాయి. దినారాతో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను ప్రత్యూష 68 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ప్రత్యూష ఐదు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడింది. ఇదే టోర్నీ ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు లలిత్ బాబు (6 పాయింట్లు), కోనేరు హంపి (5.5 పాయింట్లు), ద్రోణవల్లి హారిక (5 పాయింట్లు) వరుసగా 7, 20వ, 35వ స్థానాల్లో నిలిచారు. సలీమ్ సలే (యూఏఈ), సూర్య శేఖర గంగూలీ (భారత్), సేతురామన్ (భారత్) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించారు. -
జైపూర్‌కు తెలుగు టైటాన్స్ షాక్
ప్రొ కబడ్డీ లీగ్-2 జైపూర్: గతేడాది రన్నరప్ యు ముంబా చేతిలో ఆదివారం రాత్రి ఒక పాయింట్ తేడాతో ఎదురైన ఓటమి నుంచి తెలుగు టైటాన్స్ జట్టు వెంటనే తేరుకుంది. డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌తో సోమవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ అద్వితీయ ఆటతీరును ప్రదర్శించి అద్భుత విజయాన్ని దక్కించుకుంది. రైడింగ్‌లోనూ, డిఫెన్స్‌లోనూ తిరుగులేని విధంగా రాణించిన తెలుగు టైటాన్స్ జట్టు 33-22 పాయింట్ల తేడాతో జైపూర్‌ను చిత్తుగా ఓడించి నాలుగో విజయాన్ని దక్కించుకుంది. ఈ ఫలితంతో జైపూర్ ఖాతాలో వరుసగా నాలుగో ఓటమి చేరింది. రైడింగ్‌లో రాహుల్ చౌదరీ, దీపక్ హుడా, సుకేశ్ హెగ్డే చాకచక్యంగా వ్యవహరించి జైపూర్ ఆటగాళ్లను బోల్తా కొట్టించి నిలకడగా పాయింట్లు చేశారు. రాహుల్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... సుకేశ్ ఏడు, దీపక్ ఆరు, ప్రసాద్ మూడు పాయింట్లు సంపాదించారు. విరామ సమయానికి 8-7తో ఒక పాయింట్ ఆధిక్యంలోనే ఉన్న తెలుగు టైటాన్స్ రెండో అర్ధభాగంలో చెలరేగిపోయింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 33-18తో ఢిల్లీ దబాంగ్ జట్టును ఓడించింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన బెంగళూరు విరామ సమయానికి 17-8తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. రెండో అర్ధభాగంలోనూ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని బెంగళూరు తమ ఖాతాలో మూడో విజయాన్ని జమచేసుకుంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడుతుంది. -
రన్నరప్ ఆనంద్
షామ్‌కిర్ (అజర్బైజాన్): వుగార్ గషిమోవ్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో ఆనంద్ ఆరు పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) ఏడు పాయిం ట్లతో విజేతగా అవతరించాడు. కరువానా (ఇటలీ)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 36 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. 10 మంది మేటి గ్రాం డ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ అజేయంగా నిలిచాడు. ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఈ ప్రపంచ రెండో ర్యాంకర్ మిగతా మూడు గేముల్లో గెలుపొందాడు. -
పోరాడి ఓడిన శ్రీకాంత్
కౌలూన్: అద్భుతం చేయకున్నా ఆకట్టుకున్నాడు. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ గౌరవప్రదంగా నిష్ర్కమించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ శ్రీకాంత్ 17-21, 21-19, 6-21తో టాప్ సీడ్, ప్రపంచ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ తొలి రెండు గేముల్లో తన ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చాడు. అయితే నిర్ణాయక మూడో గేమ్ మొదలయ్యే సమయానికి పూర్తిగా అలసిపోయిన ఈ హైదరాబాద్ కుర్రాడు మ్యాచ్‌పై ఆశలు వదులుకున్నాడు. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్‌ను వరుస గేముల్లో ఓడించిన చెన్ లాంగ్ కీలకమైన మూడో గేమ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని చలాయించాడు. పదునైన స్మాష్‌లు, డ్రాప్ షాట్లతో విజృంభించి... ఒకసారి వరుసగా ఐదు పాయింట్లు, మరోసారి ఏడు పాయింట్లు, ఇంకోసారి నాలుగు పాయింట్లు సంపాదించి శ్రీకాంత్‌కు తేరుకునే అవకాశం ఇవ్వలేదు. సెమీస్‌లో ఓడిన శ్రీకాంత్‌కు 5,075 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 13 వేలు)తోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
రన్నరప్ సానియా జోడి
బీఎన్పీ పారిబా ఓపెన్ టోర్నీ ఇండియన్ వెల్స్ (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి బీఎన్పీ పారిబా ఓపెన్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సానియా జోడి 6-7 (5/7), 2-6తో టాప్‌సీడ్ సై సువీ (తైవాన్)- పెంగ్ షువాయ్ (చైనా) జంట చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్లో 4-2తో ఆధిక్యంలోకి వెళ్లిన సానియా జంట ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకుంది. రెండో సెట్లో మాత్రం సై సువీ ద్వయం పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది.