రన్నరప్‌ యువ భారత్‌ | Indian spikers settle for silver in U-23 Asian Championship | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ యువ భారత్‌

Published Mon, Aug 12 2019 5:20 AM | Last Updated on Mon, Aug 12 2019 5:20 AM

Indian spikers settle for silver in U-23 Asian Championship - Sakshi

న్యూఢిల్లీ: తొలిసారి ఆసియా అండర్‌–23 పురుషుల వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవాలని ఆశించిన భారత జట్టు తుది మెట్టుపై తడబడింది. మయన్మార్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌ 21–25, 20–25, 25–19, 23–25తో చైనీస్‌ తైపీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీలో భారత్‌ మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. చైనా, న్యూజిలాండ్, కజకిస్తాన్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ జట్లపై గెలిచి జపాన్, థాయ్‌లాండ్, చైనీస్‌ తైపీ జట్ల చేతిలో ఓడింది.  ఈ టోర్నీలో విజేత చైనీస్‌ తైపీ, రన్నరప్‌ భారత్‌ జట్లు అండర్‌–23 ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement