
ఆసియా చాంపియన్‌షిప్‌లో 14వ టైటిల్ సొంతం
దోహా: భారత క్యూస్పోర్ట్స్ దిగ్గజం cమరో అంతర్జాతీయ టైటిల్ సాధించాడు. గురు వారం ముగిసిన ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్ లో అతను విజేతగా నిలిచాడు. ఫైనల్లో పంకజ్ 4–1 (42–72, 93–17, 93–1, 89–21, 70–41) ఫ్రేమ్‌ల తేడాతో ఇరాన్‌కు చెందిన మాజీ ఆసియా, ప్రపంచ స్నూకర్ చాంపియన్ అమిర్ సర్ఖోష్ పై గెలుపొందాడు. అతని ఖాతాలో ఇది 14వ ఆసియా టైటిల్ కావడం విశేషం.
ఇదివరకే అతను స్నూకర్‌లో నాలుగు, cతొమ్మిది టైటిల్స్ గెలిచాడు. వీటితో పాటు 2006, 2020లలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ స్వర్ణ పతకాలు గెలిచాడు. తాజా ఆసియా టైటిల్‌తో ఓ క్యాలెండర్ ఇయర్‌లో జాతీయ, ఆసియా, ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లు గెలిచిన ఆటగాడిగా ఘనత వహించనున్నాడు. బిలియర్డ్స్‌లో ఇదివరకే ఈ రికార్డు లిఖించిన పంకజ్ స్నూకర్‌లో లిఖించాల్సి ఉంది.
ఇదే జరిగితే క్యూస్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లోనే ఈ ఘనత వహించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కుతాడు. ‘ఆసియా పతకం నాకు ప్రత్యేక ఆనందాన్నిచ్చింది. ఈ టోర్నీ చాలా కఠినంగా సాగింది. చివరకు మరో బంగారు పతకాన్ని నా ఖాతాలో వేసుకున్నాను. ఇదే నిలకడైన ప్రదర్శనతో భారత్ గర్వించే విజయాలు మరెన్నో సాధించాలని ఆశిస్తున్నాను’ అని మ్యాచ్ విజయానంతరం పంకజ్ అద్వానీ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment