పంకజ్‌ అద్వానీ ఖాతాలో 26వ ప్రపంచ టైటిల్‌  | Pankaj Advani Wins World Billiards Long Format Championship 2023 Title | Sakshi
Sakshi News home page

పంకజ్‌ అద్వానీ ఖాతాలో 26వ ప్రపంచ టైటిల్‌ 

Published Tue, Nov 21 2023 7:33 AM | Last Updated on Tue, Nov 21 2023 8:58 AM

Pankaj Advani Wins World Billiards Long Format Championship 2023 Title - Sakshi

దోహా: క్యూ స్పోర్ట్స్‌ (బిలియర్డ్స్, స్నూకర్‌)లో భారత దిగ్గజ క్రీడాకారుడు పంకజ్‌ అద్వానీ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్‌ స్నూకర్‌ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ బిలియర్డ్స్‌ లాంగ్‌ ఫార్మాట్‌లో 38 ఏళ్ల పంకజ్‌ అద్వానీ విజేతగా నిలిచాడు. సోమవారం జరిగిన ఫైనల్లో పంకజ్‌ అద్వానీ 1000–416 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన సౌరవ్‌ కొఠారిపై గెలుపొందాడు.

సెమీఫైనల్స్‌లో పంకజ్‌ 900–273తో రూపేశ్‌ షా (భారత్‌), సౌరవ్‌ కొఠారి 900–756తో ధ్రువ్‌ సిత్వాలా (భారత్‌)పై విజయం సాధించారు. గతంలో పంకజ్‌ పాయింట్ల ఫార్మాట్‌లో 8 సార్లు...లాంగ్‌ఫార్మాట్‌లో 8 సార్లు... స్నూకర్‌లో 8 సార్లు... టీమ్‌ ఫార్మాట్‌లో ఒకసారి ప్రపంచ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement