world championship title
-
పంకజ్ అద్వానీ ఖాతాలో 26వ ప్రపంచ టైటిల్
దోహా: క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో భారత దిగ్గజ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ బిలియర్డ్స్ లాంగ్ ఫార్మాట్లో 38 ఏళ్ల పంకజ్ అద్వానీ విజేతగా నిలిచాడు. సోమవారం జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 1000–416 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారిపై గెలుపొందాడు. సెమీఫైనల్స్‌లో పంకజ్ 900–273తో రూపేశ్ షా (భారత్), సౌరవ్ కొఠారి 900–756తో ధ్రువ్ సిత్వాలా (భారత్)పై విజయం సాధించారు. గతంలో పంకజ్ పాయింట్ల ఫార్మాట్లో 8 సార్లు...లాంగ్‌ఫార్మాట్‌లో 8 సార్లు... స్నూకర్‌లో 8 సార్లు... టీమ్ ఫార్మాట్లో ఒకసారి ప్రపంచ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. -
World Chess Championship: కార్ల్సన్ ప్రత్యర్థి ఎవరంటే!
మాస్కో: ప్రపంచ పురుషుల చెస్ చాంపియన్‌షిప్ కిరీటం కోసం రష్యా గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నెపోమ్నిషి బరిలో నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో ఈ ఏడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 16 వరకు దుబాయ్‌లో జరిగే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో నెపోమ్నిషి తలపడనున్నాడు. కార్ల్సన్ ప్రత్యర్థి ఎవరో నిర్ణయించేందుకు మాస్కోలో నిర్వహించిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో 30 ఏళ్ల నెపోమ్నిషి విజేతగా నిలిచాడు. కాగా, ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో నిర్వహించిన క్యాండిడేట్స్ టోర్నీలో నెపోమ్నిషి 8.5 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచాడు. మరో రౌండ్ మిగిలి ఉండగానే 8.5 పాయింట్లతో సోమవారమే టైటిల్‌ను ఖాయం చేసుకున్న నెపోమ్నిషి మంగళవారం జరిగిన చివరిదైన 14వ రౌండ్ గేమ్‌లో లిరెన్ డింగ్ (చైనా) చేతిలో 35 ఎత్తుల్లో ఓడిపోయాడు. 8 పాయింట్లతో లాగ్రెవ్ (ఫ్రాన్స్) రెండో స్థానంలో, 7.5 పాయింట్లతో అనీశ్ గిరి (నెదర్లాండ్స్) మూడో స్థానంలో నిలిచారు. చదవండి: ఒలింపిక్స్‌లో నిరసన ప్రదర్శనలపై నిషేధం -
హామిల్టన్ సిక్సర్
ఆస్టిన్ (అమెరికా): మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ లాంఛనం పూర్తి చేశాడు. ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయం అవ్వాలంటే టాప్–8లో నిలవాల్సిన రేసులో... అతను రెండో స్థానాన్ని సాధించి ఆరోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) గ్రాండ్‌ప్రి రేసులో ఐదో స్థానం నుంచి డ్రైవ్ చేసిన హామిల్టన్ చివరకు రెండో స్థానంలో నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసులో ‘పోల్ పొజిషన్’ నుంచి రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ గంటా 33 నిమిషాల 55.653 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. 21 రేసుల ప్రస్తుత సీజన్లో 19 రేసులు ముగిశాక హామిల్టన్ 381 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. హామిల్టన్ సహచరుడు బొటాస్ 314 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్లో మరో రెండు రేసులు (బ్రెజిల్, అబుదాబి గ్రాండ్‌ప్రి) మిగిలి ఉన్నా హామిల్టన్‌కు, బొటాస్‌కు మధ్య 67 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఈ రెండు రేసుల్లో బొటాస్ గెలిచినా హామిల్టన్‌ను అందుకునే పరిస్థితి లేదు. తాజా ప్రదర్శనతో ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో అత్యధిక ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్స్ సాధించిన రెండో డ్రైవర్‌గా హామిల్టన్ గుర్తింపు పొందాడు. గతంలో హామిల్టన్ 2008, 2014, 2015, 2017, 2018లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. జర్మనీ దిగ్గజ డ్రైవర్ మైకేల్ షుమాకర్ అత్యధికంగా ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఇదే జోరు కొనసాగిస్తే 34 ఏళ్ల హామిల్టన్ వచ్చే ఏడాది షుమాకర్ రికార్డును సమం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
‘ఆసియా’ చాంప్స్ లిన్ డాన్, సుంగ్ జీ
గిమ్‌చియోన్ (కొరియా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలలో లిన్ డాన్ (చైనా), సుంగ్ జీ యున్ (కొరియా) విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో లిన్ డాన్ 14-21, 21-9, 21-15తో ససాకి షో (జపాన్)పై విజయం సాధించాడు. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించాక లిన్ డాన్ పాల్గొన్న టోర్నీ ఇదే కావడం విశేషం. మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో నాలుగోసీడ్ సుంగ్ జీ యున్ (కొరియా) 21-19, 21-15తో షిజియాన్ వాంగ్ (చైనా)ను ఓడించింది. పురుషుల డబుల్స్‌లో షిన్ బీక్ చోయెల్-యూ యోన్ సియోంగ్ (కొరియా); మహిళల డబుల్స్‌లో లూ యింగ్-లూ యు (చైనా); మిక్స్డ్ డబుల్స్‌లో లీ చున్ హె-చావు హో వా (హాంకాంగ్) జోడిలు టైటిల్స్ సాధించాయి. ఈ పోటీల్లో భారత్ నుంచి సింధు, జ్వాల-అశ్విని జోడికి కాంస్య పతకాలు లభించాయి. -
ఆనంద్‌కు మరో పరీక్ష
జ్యూరిచ్: ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను చేజార్చుకున్నాక భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రెండో టోర్నమెంట్లో బరిలోకి దిగుతున్నాడు. గురువారం ఆరంభమయ్యే జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో ఆనంద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆనంద్‌తోపాటు ఈ టోర్నీలో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), లెవాన్ అరోనియన్ (అర్మేనియా), ఫాబియానో కరుఆనా (ఇటలీ), హికారు నకముర (అమెరికా), బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్) పోటీపడుతున్నారు. ఈ ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో ఐదు రౌండ్లపాటు టోర్నీ జరుగుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానానికి పడిపోయిన ఆనంద్ ఈ టోర్నీ ద్వారా మళ్లీ సత్తా చాటుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో విశ్వవిజేత కార్ల్సన్తో పోటీపడే ప్రత్యర్థిని నిర్ణయించేందుకు మార్చి 13 నుంచి 31 వరకు క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ప్రాక్టీస్‌గా జ్యూరిచ్ టోర్నమెంట్లో ఆడుతున్న ఆనంద్ ఏమేరకు రాణిస్తాడో వేచి చూడాలి. చెన్నైలో గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కార్ల్సన్ చేతిలో ఓడిన ఆనంద్ ఆ తర్వాత కొన్నిరోజులు విశ్రాంతి తీసుకొని లండన్ క్లాసిక్ టోర్నీలో పాల్గొన్నాడు. ర్యాపిడ్ విభాగంలో జరిగిన ఆ టోర్నీలో ఆనంద్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. -
ఆనంద్‌కు మళ్లీ అవకాశం
ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను చేజార్చుకున్న భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు వచ్చే ఏడాది మళ్లీ ఈ కిరీటాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ నవంబరు 5 నుంచి 25 వరకు (వేదిక ఎంపిక చేయలేదు) జరుగుతుంది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హోదాలో మాగ్నస్ కార్ల్సెన్ ఉంటాడు. ‘క్యాండిడేట్స్ టోర్నమెంట్’ ద్వారా కార్ల్సెన్ ప్రత్యర్థి ఎవరో తేలుతుంది. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది మార్చి 12 నుంచి 30 వరకు ఖాంటీ మాన్సిస్క్ (రష్యా)లో జరుగుతుంది. మొత్తం 8 మంది బరిలోకి దిగుతారు. విజేతగా నిలిచిన వారు కార్ల్‌సెన్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ ఆడతారు. ఎవరు ఎలా అర్హత పొందారంటే... 2013 ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ హోదాలో విశ్వనాథన్ ఆనంద్ క్యాండిడేట్స్ టోర్నీలో ఆడతాడు. 2013 ప్రపంచ కప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా), దిమిత్రీ ఆంద్రికిన్ (రష్యా) కూడా ఈ టోర్నీకి అర్హత పొందారు. ‘ఫిడే’ 2012-2013 గ్రాండ్‌ప్రి సిరీస్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా), షకిర్యార్ మమెద్యారోవ్ (అజర్బైజాన్) కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నారు. 2013 ప్రపంచ కప్‌లో, గ్రాండ్‌ప్రి సిరీస్‌లో అత్యధిక రేటింగ్ కలిగిన ఇద్దరు క్రీడాకారులు లెవాన్ అరోనియన్ (అర్మేనియా), సెర్గీ కర్జాకిన్ (రష్యా) కూడా ఈ టోర్నీకి అర్హత పొందారు. ఆర్గనైజింగ్ కమిటీ ద్వారా ‘వైల్డ్ కార్డు’ పొందిన స్విద్లెర్ (రష్యా) కూడా టోర్నమెంట్లో పోటీపడతాడు. - సాక్షి క్రీడావిభాగం