‘ఆసియా’ చాంప్స్ లిన్ డాన్, సుంగ్ జీ | ASIAN CHAMPS Finals – Sung snaps Korea’s title drought | Sakshi
Sakshi News home page

‘ఆసియా’ చాంప్స్ లిన్ డాన్, సుంగ్ జీ

Published Mon, Apr 28 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM

‘ఆసియా’ చాంప్స్ లిన్ డాన్, సుంగ్ జీ

‘ఆసియా’ చాంప్స్ లిన్ డాన్, సుంగ్ జీ

గిమ్‌చియోన్ (కొరియా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలలో లిన్ డాన్ (చైనా), సుంగ్ జీ యున్ (కొరియా) విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో లిన్ డాన్ 14-21, 21-9, 21-15తో ససాకి షో (జపాన్)పై విజయం సాధించాడు.
 
 గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించాక లిన్ డాన్ పాల్గొన్న టోర్నీ ఇదే కావడం విశేషం. మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో నాలుగోసీడ్ సుంగ్ జీ యున్ (కొరియా) 21-19, 21-15తో షిజియాన్ వాంగ్ (చైనా)ను ఓడించింది. పురుషుల డబుల్స్‌లో షిన్ బీక్ చోయెల్-యూ యోన్ సియోంగ్ (కొరియా); మహిళల డబుల్స్‌లో లూ యింగ్-లూ యు (చైనా); మిక్స్‌డ్ డబుల్స్‌లో లీ చున్ హె-చావు హో వా (హాంకాంగ్) జోడిలు టైటిల్స్ సాధించాయి. ఈ పోటీల్లో భారత్ నుంచి సింధు, జ్వాల-అశ్విని జోడికి కాంస్య పతకాలు లభించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement