asian badminton championship
-
ముగిసిన భారత్ పోరు
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్... మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. ఆరో సీడ్ హాన్ యువె (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 18–21, 21–13, 17–21తో ఓటమి చవిచూసింది. ఏడో సీడ్ ప్రణయ్ 18–21, 11–21తో లిన్ చున్ యి (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. అశ్విని –తనీషా జోడీ 17– 21, 12–21తో మూడో సీడ్ నామి మత్సుయామ–చిహారు షిదా (జపాన్) జంట చేతిలో ఓడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని–తనీషా ఓటమి పాలైనా పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈనెల 30న విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో టాప్– 16లో ఉన్న డబుల్స్ జోడీలకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారవుతాయి. అశ్విని–తనీషా ద్వయం 20వ ర్యాంక్‌లో ఉన్నప్పటికీ... ఒక దేశం నుంచి గరిష్టంగా రెండు జోడీలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ర్యాంకింగ్స్‌లో అశ్విని ద్వయం 12వ స్థానంలో ఉండటం... ఇదే చివరి అర్హత టోర్నీ కానుండటంతో భారత జోడీ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు ఉండదు. -
వైదొలిగిన సాత్విక్-చిరాగ్ జోడీ
భుజం గాయం నుంచి సాత్విక్ పూర్తిగా కోలుకోకపోవడంతో... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ వైదొలిగింది. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన ఈ మెగా టోర్నీలో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం పురుషుల డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. థామస్ కప్‌లో మాత్రం సాత్విక్–చిరాగ్ ద్వయం బరిలోకి దిగుతుందని భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. ఆసియా చాంపియన్‌షిప్ ఈనెల 9 నుంచి 14 వరకు చైనాలో జరుగుతుంది. -
చరిత్ర సృష్టించిన సింధు బృందం
ఆలమ్ (మలేసియా): అంచనాలకు మించి రాణించిన భారత మహిళల జట్టు ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. హాంకాంగ్‌తో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు బృందం 3–0తో గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. హాంకాంగ్‌తో జరిగిన పోరులో తొలి మ్యాచ్‌లో పీవీ సింధు 21–7, 16–21, 21–12తో లో సిన్ యాన్పై నెగ్గి భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం 21–10, 21–14తో యెంగ్ టింగ్–యెంగ్ పుయ్ లామ్ జోడీని ఓడించింది. మూడో మ్యాచ్‌లో అషి్మత 21–12, 21–13తో యెంగ్ సమ్ యీపై గెలిచి భారత్‌కు చిరస్మరణీయం విజయాన్ని అందించింది. గెలుపు వాకిట శ్రీకాంత్ బోల్తా భారత పురుషుల జట్టు మాత్రం క్వార్టర్ ఫైనల్లో 2–3తో జపాన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. స్కోరు 2–2తో సమమయ్యాక నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–17, 9–21, 20–22తో ప్రపంచ మాజీ చాంపియన్ కెంటో మొమోటా చేతిలో ఓడిపోయాడు. మూడో గేమ్‌లో శ్రీకాంత్ 19–12తో ఆధిక్యంలో నిలిచి విజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచాడు. అయితే ఇప్పటి వరకు శ్రీకాంత్‌ను 15 సార్లు ఓడించిన మొమోటా ఏమాత్రం ఆందోళన చెందకుండా ఆడి వరుసగా 8 పాయింట్లు గెలిచి 20–19తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత శ్రీకాంత్ 20–20తో స్కోరును సమం చేశాడు. అయితే వెంటనే మొమోటా వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను 22– 20తోపాటు మ్యాచ్‌ను 3–2తో జపాన్‌కు అందించి భారత శిబిరాన్ని నిరాశలో ముంచాడు. అంతకకుముందు తొలి మ్యాచ్‌లో ప్రణయ్ ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ గెలిచింది. మూడో మ్యాచ్‌లో లక్ష సేన్ నెగ్గగా... నాలుగో మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–అర్జున్ జంట ఓటమి పాలైంది. -
ఆసియా క్రీడలకు సైనా దూరం! కారణమిదే
న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో చైనాలో జరిగే ఆసియా క్రీడలకు దూరం కానుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక కోసం ఈనెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న సెలెక్షన్ట్రయల్స్ టోర్నీలో సైనా నెహ్వాల్ పాల్గొనడంలేదు. ‘ఫిట్నెస్ సంబంధిత సమస్యల కారణంగా సైనా ట్రయల్స్‌లో బరిలోకి దిగడంలేదు. సైనాతోపాటు పురుషుల డబుల్స్ జోడీ కుశాల్ రాజ్, ప్రకాశ్ రాజ్ కూడా ట్రయల్స్ టోర్నీ నుంచి వైదొలిగారు’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా తెలిపారు. చదవండి: ‘బ్రిజ్‌భూషణ్‌ను రక్షించే ప్రయత్నమిది’ న్యూఢిల్లీ: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లకు అన్ని వైపుల నుంచి సంఘీభావం లభిస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేత, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా వేదిక వద్దకు వచ్చి తన మద్దతు ప్రకటించాడు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అతనిపై చర్యకు వెనుకాడుతోందని సిద్ధూ విమర్శించాడు. ‘ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యం చేశారు. అందులో వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు. దానిని బలహీనంగా తయారు చేశారని అర్థమవుతోంది. అన్నీ దాచేసి బ్రిజ్‌భూషణ్‌ను రక్షించే ప్రయత్నమే ఇదంతా. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తే ఇప్పటి వరకు అరెస్ట్ ఎందుకు చేయలేదు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలి’ అంటూ సిద్ధూ వ్యాఖ్యానించాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా కూడా రెజ్లర్లకు సంఘీభావం పలకగా... రేడియోలో ‘మన్‌కీ బాత్’ కాదు, రెజ్లర్ల వద్దకు వచ్చి వారి మన్‌కీ బాత్ వినాలని ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ సూచించారు. మరోవైపు తనను ఉరి తీసినా పర్వాలేదని, రెజ్లింగ్ పోటీలు మాత్రం ఆగరాదని బ్రిజ్‌భూషణ్ అన్నాడు. ‘గత నాలుగు నెలలుగా రెజ్లింగ్ కార్యకలాపాలు ఆగిపోయాయి. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకండి. తక్షణం ఎవరి ఆధ్వర్యంలోనైనా క్యాడెట్ నేషనల్స్ నిర్వహించండి. లేదంటే వయసు పెరిగి కుర్రాళ్లు అవకాశం కోల్పోతారు. నన్ను ఉరి తీయండి కానీ ఆట మాత్రం ఆగవద్దు’ అని బ్రిజ్‌భూషణ్ చెప్పాడు. -
సింధు... కాంస్యంతో సరి
మనీలా (ఫిలిప్పీన్స్): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఘనత సాధించాలని ఆశించిన భారత స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో సింధు రెండోసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. 2014లో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకం నెగ్గిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఈసారీ సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–13, 19–21, 16–21తో పోరాడి ఓడింది. 66 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను 13 నిమిషాల్లో సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో స్కోరు 19–19తో సమంగా ఉన్న కీలకదశలో సింధు వరుసగా రెండు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో అకానె యామగుచి ఆరంభంలోనే 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న అకానె గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో ఓడిన సింధుకు 5,800 డాలర్ల (రూ. 4 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీ, 8,400 పాయింట్లు లభించాయి. ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత్‌కు లభించిన పతకాలు. ఈ ఆరూ కాంస్యాలే కావడం గమనార్హం. మీనా షా (1956) ఒకసారి... సైనా నెహ్వాల్ (2010, 2016, 2018) మూడుసార్లు... సింధు (2014, 2022) రెండుసార్లు కాంస్యాలు నెగ్గారు. -
PV Sindhu: సూపర్ సింధు...
మనీలా (ఫిలిప్పీన్స్): ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ... భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రెండో పతకాన్ని ఖాయం చేసుకుంది. గతంలో 2014లో కాంస్య పతకాన్ని సాధించిన సింధు ఈసారి కూడా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–9, 13–21, 21–19తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్ జియావో (చైనా)పై గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. 76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఒకదశలో ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వరుసగా ఏడు పాయింట్లు గెలిచింది. అయితే రెండో గేమ్‌లో హి బింగ్ జియావో పుంజుకుంది. స్కోరు 9–10 వద్ద వరుసగా ఐదు పాయింట్లు నెగ్గిన హి బింగ్ జియావో 14–10తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో సింధు 7–3తో ఆధిక్యంలోకి వెళ్లి దానిని కాపాడుకుంది. చివర్లో సింధు 20–16తో ఆధిక్యంలో ఉన్న దశలో వరుసగా మూడు పాయింట్లు కోల్పోయిన సింధు ఆ వెంటనే మరో పాయింట్ గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 13–8తో యామగుచిపై ఆధిక్యంలో ఉంది. పోరాడి ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట పతకం సాధించలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం 53 నిమిషాల్లో 21–12, 14–21, 16–21తో ఐదో సీడ్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ జంట గెలిచిఉంటే సెమీస్ చేరినందుకు కనీసం కాంస్య పతకం లభించేది. నేటి సెమీఫైనల్స్ ఉదయం గం. 10:30 నుంచి సోనీ టెన్–2లో ప్రత్యక్ష ప్రసారం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4281444471.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Badminton Asia Championships: పతకానికి విజయం దూరంలో సింధు
మనీలా (ఫిలిప్పీన్స్): ఎనిమిదేళ్ల తర్వాత ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రెండో పతకం ఖరారు చేసుకోవడానికి భారత స్టార్ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ 100వ ర్యాంకర్ యు యాన్ జస్లిన్ హుయ్ (సింగపూర్)తో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–16, 21–16తో విజయం సాధించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్ జియావో (చైనా)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 7–9తో వెనుకబడి ఉంది. సైనా, శ్రీకాంత్ పరాజయం భారత మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. వాంగ్ జి యి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సైనా 21–12, 7–21, 13–21తో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ 16–21, 21–17, 17–21తో ప్రపంచ 81వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–17, 21–15తో అకీరా కోగా –తైచి సైటో (జపాన్) ద్వయంపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో (భారత్) జోడీ 18–21, 18–21తో తాన్ కియాన్ మెంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4281444471.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రిక్వార్టర్స్‌లో సింధు
మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎ దురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్ ప్లే యర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తీవ్రంగా శ్రమించి ముందంజ వేయగా, కిడాంబి శ్రీకాంత్ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. ‘డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్’ పీవీ సింధు తొలి రౌండ్లో 18–21, 27–25, 21–9 స్కోరుతో పై యు పొ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. ఈ పోరు ఏకంగా 77 నిమిషాల పాటు సాగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న పై యు పొ భారత టాప్ ప్లేయర్‌కు గట్టి పోటీనిస్తూ తొలి గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్ కూడా హోరాహోరీగా 52 పాయింట్ల పాటు సాగింది. చివరకు తన అనుభవాన్నంతా ఉపయోగించి గేమ్‌ను గెలుచుకున్న సింధు, మూడో గేమ్‌లో చెలరేగి ప్రత్యర్థిపై విరుచుకుపడింది. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21–15, 17–21, 21–13 తేడాతో సిమ్ యుజిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 22–20, 21–15తో జె యంగ్ (మలేసియా)పై గెలుపొందాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఐదో సీడ్ సేన్ 21–12, 10–21, 19–21 స్కోరుతో లి షి ఫెంగ్ (చైనా) చేతి లో పరాజయంపాలు కాగా...సాయిప్రణీత్ 17–21, 13–21తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. ఇతర భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్, సిమన్ర్ సింఘి–రితిక థాకర్ జోడి తొలి రౌండ్ దాటలేకపోయారు. -
అందరి దృష్టి సింధు, లక్ష్యసేన్ పైనే
మనీలా (ఫిలిప్పీన్స్): భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. వైరస్ వల్ల రెండేళ్ల విరామం తర్వాత ఈ టోర్నీ మంగళవారం నుంచి జరగనుంది. ఒలింపిక్స్ క్రీడల్లో రజతం, కాంస్యం... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన సింధుక ఆసియా టైటిల్ బాకీ ఉంది. గతంలో 2014లో సెమీస్ చేరడం ద్వారా సింధుకు కాంస్యమైతే వచ్చింది. అయితే ఈసారి పతకం రంగు మార్చేందుకు గట్టిపట్టుదలతో బరిలోకి దిగుతోంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పై యు పొ (చైనీస్ తైపీ)తో సింధు తలపడనుంది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్... సిమ్ యుజిన్ (కొరియా)తో పోటీపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ ఐదో సీడ్‌గా, కిడాంబి శ్రీకాంత్ ఏడో సీడ్‌గా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ రన్నరప్ లక్ష్యసేన్ చైనాకు చెందిన లి షి ఫెంగ్‌ను ఎదుర్కోనుండగా, శ్రీకాంత్... మలేసియా ప్రత్యర్థి ఎన్జీ తే యంగ్‌తో తలపడతాడు. ఇంకా సాయి ప్రణీత్, పురుషుల డబుల్స్‌లో స్టార్ జోడీ సాత్విక్–చిరాగ్ షెట్టి, కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ బరిలో ఉన్నారు. గాయాలతో సింగిల్స్‌లో ప్రణయ్, మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ వైదొలిగాయి. -
ఓటమి అంచుల నుంచి...
మనీలా (ఫిలిప్పీన్స్): ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు అద్భుతం చేసింది. ఓటమి అంచుల నుంచి తేరుకొని విజయబావుటా ఎగురువేసింది. సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–2తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. తొలి సింగిల్స్‌లో సాయిప్రణీత్ 14–21, 21–14, 12–21తో కాంతాపోన్ వాంగ్‌చరోయిన్ చేతిలో... రెండో సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 20–22, 14–21తో కున్లావుత్ వితిద్సర్న్ చేతిలో ఓడిపోయారు. దాంతో భారత్ 0–2తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే మూడో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్ జంట 21–18, 22–20తో కెద్రిన్–విరియంగ్‌కురా (థాయ్‌లాండ్) జోడీని ఓడించింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన సింగిల్స్‌లో లక్ష్య సేన్ 21–19, 21–18తో సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో చిరాగ్ శెట్టి–కిడాంబి శ్రీకాంత్ జంట 21–15, 16–21, 21–15తో జోంగ్జిత్–నిపిత్పోన్ (థాయ్‌లాండ్) జోడీని ఓడించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇండోనేసియాతో భారత్ ఆడుతుంది. 2016 చాంపియన్‌షిప్‌లోనూ భారత్ సెమీస్‌లో ఇండోనేసియా చేతిలో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. -
సైనా, సింధు ముందుకు...
వుహాన్ (చైనా): గత ఏడాది ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి భారత్‌కు సింగిల్స్ విభాగాల్లో ఒకేసారి రెండు కాంస్య పతకాలు లభించాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఈసారి ఏకంగా మూడు పతకాలు మన ఖాతాలో జమయ్యే అవకాశముంది. తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్ విభాగంలో సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్ చేరుకొని పతకానికి విజయం దూరంలో నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటివరకు సైనా మూడు కాంస్య పతకాలను (2010, 2016, 2018లలో)... సింధు (2014లో) ఒక కాంస్య పతకాన్ని సాధించారు. గత ఏడాది పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ సైనా 21–13, 21–13తో కిమ్ గా యున్ (కొరియా)పై గెలుపొందగా... నాలుగో సీడ్ సింధు 21–15, 21–19తో చురిన్నిసా (ఇండోనేసియా)ను ఓడించింది. కిమ్‌తో జరిగిన మ్యాచ్‌లో సైనా ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. కేవలం 38 నిమిషాల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. చురిన్నిసాతో జరిగిన మ్యాచ్‌లో రెండో గేమ్‌లో సింధు 17–19తో వెనుకబడిన దశలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి విజయతీరాలకు చేరింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 21–12, 21–19తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉత్కర్‡్ష–కరిష్మా (భారత్) ద్వయం 10–21, 15–21తో ఫైజల్–గ్లోరియా (ఇండోనేసియా) జోడీ చేతిలో... వెంకట్–జూహీ దేవాంగన్ (భారత్) జంట 10–21, 9–21తో వాంగ్ యిలు–హువాంగ్ డాంగ్పింగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
క్వార్టర్స్‌లో సైనా, సింధు
వుహాన్(చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధులు క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్ ప్రిక్వార్టర్ పోరులో సైనా, సింధులు వరుస సెట్లలో తమ తమ ప్రత్యర్థులపై విజయం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు. పీవీ సింధు 21-15, 21-19 తేడాతో చోరన్నిసా(ఇండోనేసియా)పై విజయం సాధించగా, సైనా నెహ్వాల్ 21-13, 21-13 తేడాతో కిమ్ గా ఎన్(దక్షిణకొరియా)పై గెలుపొందారు. మరొకవైపు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 21-12, 21-19 తేడాతో కా లాంగ్ ఆంగస్(హాంకాంగ్)పై విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. -
శ్రీకాంత్‌కు చుక్కెదురు
తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేస్తూ భారత స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ ఈ ఏడాది తొలిసారి ఓ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. తనకంటే తక్కువ ర్యాంక్ క్రీడాకారుడి చేతిలో వరుస గేముల్లో ఓడిపోయాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు టోర్నీల్లో ఆడిన శ్రీకాంత్ ఇండియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి, మిగతా ఆరు టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని కూడా దాటలేకపోయాడు. వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో రెండో రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే చేతులెత్తేయగా... సమీర్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మహిళల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రపంచ 51వ ర్యాంకర్ షెసర్ హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 16–21, 20–22తో ఓడిపోయాడు. 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ ఒకదశలో ఆధిక్యంలో ఉండి ఆ తర్వాత వెనుకబడి కోలుకోలేకపోయాడు. రుస్తావిటో చేతిలో శ్రీకాంత్‌కిది రెండో పరాజయం కావడం విశేషం. వీరిద్దరూ ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తలపడగా అప్పుడు కూడా రుస్తావిటో పైచేయి సాధించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–13, 17–21, 21–18తో కజుమసా సకాయ్ (జపాన్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సింధు 21–14, 21–7తో సయాక తకహాషి (జపాన్)పై కేవలం 28 నిమిషాల్లో నెగ్గగా... ఏడో సీడ్ సైనా 12–21, 21–11, 21–17తో హాన్ యువె (చైనా)పై శ్రమించి విజయం సాధించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) 13–21, 16–21తో జాంగ్ కొల్ఫాన్–రవింద (థాయ్‌లాండ్) చేతిలో; దండు పూజ–సంజన సంతోష్ (భారత్) 13–21, 21–12, 12–21తో ప్రమోదిక–కవిది (శ్రీలంక) చేతిలో; అపర్ణ బాలన్–శ్రుతి (భారత్) 12–21, 10–21తో యుజియా జిన్–మింగ్ హుయ్ లిమ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ (భారత్) 18–21, 15–21తో హి జిటింగ్–తాన్ కియాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
భారత్‌కు చుక్కెదురు
హాంకాంగ్: అగ్రశ్రేణి క్రీడాకారుల గైర్హాజరీలో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆసియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం లభించలేదు. సింగపూర్‌తో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–3 తేడాతో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్... డబుల్స్‌లో ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జోడీ గెలిచినా... మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఓటమితో భారత్‌కు నిరాశ తప్పలేదు. తొలి మ్యాచ్‌లో అర్జున్–రుతుపర్ణా పండా ద్వయం 16–21, 13–21తో డానీ బవా–తాన్ వె హాన్ జోడీ చేతిలో ఓడింది. రెండో మ్యాచ్‌లో ప్రణయ్ 21–8, 12–21, 21–17తో కీన్ యెవ్ లోపై గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. మూడో మ్యాచ్‌లో అర్జున్–శ్లోక్ జోడీ 21–16, 21–18తో లో కీన్ హెన్–డానీ బవా ద్వయంపై నెగ్గడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నాలుగో మ్యాచ్‌లో అష్మిత చాలిహ 21–17, 12–21, 16–21తో యో జియా మిన్ చేతిలో ఓడటంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఆరతి సారా సునీల్–రుతుపర్ణా జోడీ 24–22, 15–21, 16–21తో పుత్రి సరి దేవిసిత్ర–లిమ్ మింగ్ హుయ్ జంట చేతిలో ఓడటంతో భారత పరాజయం ఖాయమైంది. నేడు చైనీస్ తైపీతో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే నాకౌట్ దశకు చేరుకునే అవకాశముంది. -
మేఘన–తస్నీమ్ జంటకు ‘ఆసియా’ డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. మయన్మార్‌లో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో అండర్–15 బాలికల డబుల్స్ విభాగంలో మారెడ్డి మేఘన రెడ్డి–తస్నీమ్ మీర్ జోడీ విజేతగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన మేఘన, గుజరాత్ అమ్మాయి తస్నీమ్ ఫైనల్లో 23–21, 21–18తో గాంగ్ యో జిన్–జియోంగ్ డా యోన్ (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. 40 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ పోరులో రెండు జోడీలు ప్రతీ పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. అయితే కీలకదశలో మేఘన–తస్నీమ్ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ టోర్నమెంట్లో భారత్‌కు స్వర్ణం సహా నాలుగు కాంస్య పతకాలు లభించాయి. అండర్–15 బాలుర సింగిల్స్‌లో శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... అండర్–17 బాలికల సింగిల్స్‌లో అదితి భట్... అండర్–17 బాలుర సింగిల్స్‌లో మెరబా లువాంగ్... అండర్–15 బాలుర డబుల్స్‌లో పుల్లెల సాయివిష్ణు–గంధం ప్రణవ్ రావు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు దక్కించుకున్నారు. -
సైనా, ప్రణయ్... కాంస్యాలతో సరి
వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో తొలిసారి భారత్‌కు ఒకేసారి రెండు కాంస్య పతకాలు లభించాయి. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్ విభాగంలో హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లో ఓటమి చవిచూసి కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు. సైనా, ప్రణయ్‌లకు 5,075 డాలర్ల చొప్పున ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 37 వేలు)తోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. శనివారం జరిగిన సెమీఫైనల్లో సైనా 25–27, 19–21తో టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. డిఫెండింగ్ చాంపియన్ తై జు యింగ్ చేతిలో సైనాకిది వరుసగా తొమ్మిదో ఓటమి కావడం గమనార్హం. 2013 స్విస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో చివరిసారి తై జు యింగ్‌పై నెగ్గిన సైనా ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్‌పై మరో విజయం నమోదు చేయలేదు. 55 ఏళ్ల చరిత్ర ఉన్న ఆసియా చాంపియన్‌షిప్‌లో సైనాకిది మూడో కాంస్య పతకం. గతంలో ఆమె 2010, 2016లలో కూడా సెమీస్‌లో ఓడి కాంస్య పతకాలు గెల్చుకుంది. తై జు యింగ్‌తో 45 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సైనాకు తొలి గేమ్‌లో నాలుగు గేమ్ పాయింట్లు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. రెండో గేమ్‌లో సైనా ఒక దశలో 19–17తో ఆధిక్యంలోకి వెళ్లినా మరోసారి ఒత్తిడికి తడబడి వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రణయ్ 16–21, 18–21తో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో ప్రణయ్‌కిది తొలి కాంస్య పతకం. ఓవరాల్‌గా టోర్నీ చరిత్రలో పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు నాలుగో పతకం. 1965లో దినేశ్ ఖన్నా స్వర్ణం సాధించగా... 2000లో పుల్లెల గోపీచంద్, 2007లో అనూప్ శ్రీధర్ కాంస్య పతకాలు గెలిచారు. -
సెమీస్‌లో సైనా, ప్రణయ్
వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. మరోవైపు టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్, మూడో సీడ్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సైనా 21–15, 21–13తో లీ జాంగ్ మి (కొరియా)పై గెలుపొందగా... సింధు 19–21, 10–21తో సుంగ్ జీ హున్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో సైనా సెమీస్‌కు చేరుకోవడం ఇది మూడోసారి. 2010, 2016లలో ఆమె సెమీఫైనల్లో నిష్క్రమించి కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 18–21, 23–21, 21–12తో ప్రపంచ రెండో ర్యాంకర్ సన్ వాన్ హో (కొరియా)పై సంచలన విజయం సాధించాడు. తద్వారా 2007లో అనూప్ శ్రీధర్ తర్వాత ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా ప్రణయ్ గుర్తింపు పొందాడు. మరో క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 12–21, 15–21తో లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సైనా; ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)తో ప్రణయ్ తలపడతారు. ఈ మ్యాచ్‌లు ఉదయం 11.30 నుంచి డి స్పోర్ట్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. -
సైనా, సింధు శుభారంభం
వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లోనూ భారత క్రీడాకారులు సైనా, సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–14, 21–19తో పాయ్ యు పో (చైనీస్ తైపీ)పై, సైనా 21–12, 21–9తో యో జియా మిన్ (సింగపూర్)పై అలవోకగా గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 13–21, 21–16, 21–16తో కెంటా నిషిమోటో (జపాన్)పై, సాయిప్రణీత్ 21–13, 11–21, 21–19తో అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)పై, ప్రణయ్ 21–15, 19–21, 21–19తో కాంతాఫోన్ (థాయ్‌లాండ్)పై కష్టపడి నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 21–23, 17–21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 14–21, 16–21తో బొదిన్ ఇసారా–నిపిట్‌ఫోన్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మేఘన–పూర్వీషా రామ్ (భారత్) జోడీ 14–21, 22–20, 21–17తో ఓంగ్ రెన్నె–వోంగ్ యింగ్ క్రిస్టల్ (సింగపూర్) ద్వయంపై గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో గావో ఫాంగ్‌జి (చైనా)తో సైనా; చెన్ జియోజిన్ (చైనా)తో సింధు; వోంగ్ వింగ్ కి విన్సెంట్ (వియత్నాం)తో శ్రీకాంత్; చెన్ లాంగ్ (చైనా)తో సాయిప్రణీత్; వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో ప్రణయ్ ఆడతారు. -
రెండో రౌండ్లో సింధు
వుహాన్:ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో భారత స్టార్ షట్లర్ పివి సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ పోరులో సింధు 21-8, 21-18 తేడాతో ఆయుస్టినీ (ఇండోనేషియా)పై విజయం సాధించి రెండో రౌండ్ లో కి ప్రవేశించింది. కేవలం 31 నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు ఏకపక్ష విజయం సాధించింది. తొలి గేమ్‌ను అవలీలగా దక్కించుకున్న సింధు.. రెండో గేమ్‌లో కాస్త శ్రమించి గెలుపును సొంతం చేసుకుంది. మరొకవైపు సైనా నెహ్వాల్ పోరాటం తొలి రౌండ్ లోనే ముగిసింది. సైనా నెహ్వాల్ 21-19, 16-21, 18-21 తేడాతో సయకా సాటో(జపాన్) చేతిలో ఓటమి పాలైంది. తొలి గేమ్ ను గెలిచినప్పటికీ, మిగతా గేమ్‌ల్లో అనవసర తప్పిదాలు చేయడంతో సైనా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సైనా... కాంస్యంతో సరి
సెమీస్‌లో పరాజయం వుహాన్ (చైనా): తన చిరకాల ప్రత్యర్థి యిహాన్ వాంగ్ చేతిలో 11వ సారి ఓడిపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో సంతృప్తి పడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా 16-2, 14-21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడింది. క్వార్టర్స్‌లో షిజియాన్ వాంగ్ (చైనా)ను వరుస గేముల్లో ఓడించిన ఈ హైదరాబాద్ అమ్మాయి సెమీస్‌లో మాత్రం ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. గతంలో యిహాన్పై నాలుగుసార్లు నెగ్గిన సైనా తొలి గేమ్‌లో ఒకదశలో 9-6తో ముందంజలో ఉంది. అయితే యిహాన్ పుంజుకొని రెండుసార్లు వరుసగా నాలుగు పాయింట్ల చొప్పున సాధించి ఆధిక్యంలోకి వెళ్లింది. అటునుంచి సైనా తేరుకోలేకపోయింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో సైనా కాంస్య పతకం నెగ్గడం ఇది రెండోసారి. 2010లో తొలిసారి సైనాకు కాంస్య పతకం దక్కింది. ఈ ఈవెంట్ చరిత్రలో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా సైనా గుర్తింపు పొందింది. -
కాంస్యంతో సరి
వుహాన్ (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత స్టార్ క్రీడాకారిణి, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్ కాంస్యంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో సైనా నెహ్వాల్ 16-21, 14-21 తేడాతో యిహాన్ వాంగ్(చైనా) చేతిలో ఓటమి పాలైంది. తొలి గేమ్ ఆరంభంలో 3-3,4-4, 6-5 తేడాతో ముందంజలో పయనించిన సైనా ఆ తరువాత అనూహ్యాంగా వెనుకబడి ఆ గేమ్ ను కోల్పోయింది. ఆపై రెండో గేమ్ ఆదిలో తీవ్ర ఒత్తిడికి లోనై 5-13 తేడాతో వెనుకబడింది. ఏ దదశలోనూ ప్రత్యర్థి ఎత్తులకు అడ్డుకట్టవేయలేకపోయిన సైనా రెండో గేమ్ ను కూడా కోల్పోయి టోర్నీ నుంచి భారంగా నిష్ర్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఐదో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా)ను బోల్తా కొట్టించి పతకం ఖాయం చేసుకున్న సైనా ..ఈ మెగా ఈవెంట్లో సెమీస్ కు చేరడం ద్వారా రెండుసార్లు పతకం సాధించిన క్రీడాకారిణి గుర్తింపుపొందిన సంగతి తెలిసిందే. కాగా, సెమీస్ లో అంచనాలను అందుకోలేకపోయిన సైనా పేలవ ప్రదర్శనతో ఓటమి పాలైంది. -
సైనా ముందుకు... సింధు ఇంటికి
► భారత స్టార్స్‌కు మిశ్రమ ఫలితాలు ► ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వుహాన్ (చైనా): మరోసారి నిలకడగా రాణించిన భారత స్టార్ సైనా నెహ్వాల్ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి క్రీడాకారిణి పీవీ సింధు తీవ్రంగా పోరాడినా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 21-14, 21-18తో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. నిచావోన్‌పై సైనాకిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. మరోవైపు ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ సింధు చేజేతులా ఓడిపోయింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు 21-13, 20-22, 8-21తో పరాజయం పాలైంది. తొలి గేమ్‌ను నెగ్గిన ఈ హైదరాబాద్ అమ్మాయి రెండో గేమ్‌లో 12-6తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 20-19తో విజయం అంచుల్లో నిలిచింది. అయితే కీలకదశలో తప్పిదాలు చేసి రెండో గేమ్‌ను కోల్పోయిన సింధు... మూడో గేమ్‌లో మాత్రం పట్టు కోల్పోయింది. ఆరంభంలోనే 0-8తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో షిజియాన్ వాంగ్ (చైనా)తో సైనా తలపడుతుంది. -
సైనా, సింధు శుభారంభం
► శ్రీకాంత్‌కు మళ్లీ నిరాశ ► డబుల్స్‌లో ఖేల్‌ఖతం ► ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు శుభారంభం చేశారు. అయితే పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి; ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ జోడీలకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. దాంతో ఈ మెగా ఈవెంట్లో భారత ఆశలన్నీ సైనా, సింధులపైనే ఉన్నాయి. సింగపూర్ ఓపెన్‌లో సెమీఫైనల్లో నిష్ర్కమించిన తర్వాత రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకున్న సైనా ఈ టోర్నీలో బరిలోకి దిగింది. ప్రపంచ 49వ ర్యాంకర్ ఫిత్రియాని (ఇండోనేసియా)తో జరిగిన తొలి రౌండ్లో సైనా 21-16, 21-17తో గెలిచింది. కేవలం 21 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనాకు ఆరంభంలో కాస్త పోటీ ఎదురైనా కీలకదశలో వరుస పాయింట్లు సాధించి పైచేయి సాధించింది. మరో మ్యాచ్‌లో సింధు 21-10, 21-13తో మరియా ఫెబె కుసుమస్తుతి (ఇండోనేసియా)ను ఓడించింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)తో సైనా... తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడతారు. పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ఏకైక భారత ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ నిరాశ పరిచాడు. వరుసగా ఐదో టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ ఆటగాడు తొలి రౌండ్‌ను అధిగమించడంలో విఫలమయ్యాడు. ప్రపంచ 19వ ర్యాంకర్ లీ డాంగ్ కెయున్ (దక్షిణ కొరియా)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-13, 12-21, 19-21తో పోరాడి ఓడిపోయాడు. ఈ టోర్నీకి ముందు శ్రీకాంత్ ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్, చైనా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలలోనూ తొలి రౌండ్లోనే నిష్ర్కమించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి 15-21, 13-21తో హిరోయుకి ఎండో-కెనిచి హయకావ (జపాన్)ల చేతిలో... ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ 19-21, 17-21తో ఆర్ చిన్ చుంగ్-తాంగ్ చున్ మాన్ (హాంకాంగ్)ల చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో జ్వాల-అశ్విని ద్వయం 15-21, 11-21తో చాంగ్ యె నా-లీ సో హీ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
‘రియో’లో పతకమే లక్ష్యం: శ్రీకాంత్
సాక్షి, హైదరాబాద్: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ఆటతీరును కనబరిచిన భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని తెలిపాడు. సొంతగడ్డపై జరిగిన ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ పోటీల్లో శ్రీకాంత్ తాను ఆడిన నాలుగు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలిచాడు. భారత్‌కు కాంస్యం దక్కడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ‘ప్రపంచ ర్యాం కింగ్స్‌లో నంబర్‌వన్ కావాలంటే ఆద్యంతం నిలకడగా రాణించాలి. అలా జరిగితే ర్యాంక్ తనంతటతానే మెరుగవుతుంది. ఇప్పటికిప్పుడు టాప్ ర్యాంక్ సాధించాలని ఆరాట పడటంలేదు’ అని ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న శ్రీకాంత్ అన్నాడు. ‘అంచనాల గురించి ఎక్కువగా ఆలోచించను. కేవలం విజయం గురించే ఆలోచిస్తాను. మంచి ఫలితాలు వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తాను. రియో ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడం ఈ ఏడాది నేను పెట్టుకున్న ఏకైక లక్ష్యం’ అని శ్రీకాంత్ తెలిపాడు. -
చాంప్స్ చైనా, ఇండోనేసియా
రెండు విభాగాల్లోనూ జపాన్‌కు నిరాశ ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో చైనా... పురుషుల విభాగంలో ఇండోనేసియా విజేతలుగా నిలిచాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ముగిసిన ఈ ఈవెంట్లో మహిళల ఫైనల్లో చైనా 3-2తో జపాన్‌పై... పురుషుల ఫైనల్లో ఇండోనేసియా 3-2తో జపాన్‌పై విజయం సాధించాయి. పురుషుల విభాగంలో సెమీస్‌లో ఓడిన భారత్‌కు కాంస్యం లభిం చింది. భారత మహిళల జట్టు మాత్రం క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించింది. జపాన్‌తో జరిగిన ఫైనల్లో చైనా మహిళల జట్టు అనూహ్యంగా పుంజుకుంది. తొలి మ్యాచ్‌లో షిజి యాన్ వాంగ్ 21-17, 16-21, 15-21తో నొజోమి ఒకుహారా చేతిలో ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో యింగ్ లు-కింగ్ తియాన్ జోడీ 12-21, 16-21తో మిసాకి మత్సుతోమో-అయాకా తకహాషి జంట చేతిలో పరాజయం పాలైంది. దాంతో చైనా 0-2తో వెనుకబడింది. అయితే ఆ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో చైనా క్రీడాకారిణులు అద్వితీయ ఆటతీరుతో జపాన్ ఆశలను వమ్ము చేశారు. మూడో మ్యాచ్‌లో సున్ యు 22-20, 21-19తో సయాకా సాటోపై గెలుపొం దగా... నాలుగో మ్యాచ్‌లో యు లు-యువాన్‌టింగ్ టాంగ్ జంట 21-11, 21-10తో నోకో ఫకుమాన్-కురిమి ద్వయంపై నెగ్గింది. దాంతో స్కోరు 2-2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో హీ బింగ్జియావో 21-18, 21-12తో యు హాషిమోటోను ఓడించడంతో చైనా 3-2తో విజయాన్ని ఖాయం చేసుకొని టైటిల్‌ను సొంతం చేసుకుంది. పురుషుల విభాగం ఫైనల్ తొలి మ్యాచ్‌లో కెంటో మోమోటా 21-17, 21-7తో మౌలానా ముస్తఫాను ఓడించి జపాన్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. రెండో మ్యాచ్‌లో అంగా ప్రతమ-రికీ సువార్ది ద్వయం 22-20, 14-21, 21-17తో హిరోయుకి ఎండో-కెనిచి హయకావా జోడీపై గెలువడంతో స్కోరు 1-1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో జిన్‌టింగ్ ఆంథోనీ 21-7, 21-16తో షో ససాకిపై నెగ్గడంతో ఇండోనేసియా 2-1తో ముందంజ వేసింది. నాలుగో మ్యాచ్‌లో తకెషి కముర-కీగో సొనోడా జంట 21-16, 21-15తో బెరీ అంగ్రియవాన్-రియాన్ సపుత్ర జోడీని ఓడించడంతో స్కోరు 2-2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో క్రిస్టీ జొనాథన్ 14-21, 21-19, 21-13తో కెంటా నిషిమోటోపై నెగ్గడంతో ఇండోనేసియా 3-2తో విజయం సాధించి విజేతగా నిలిచింది.