
వుహాన్(చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధులు క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్ ప్రిక్వార్టర్ పోరులో సైనా, సింధులు వరుస సెట్లలో తమ తమ ప్రత్యర్థులపై విజయం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు.
పీవీ సింధు 21-15, 21-19 తేడాతో చోరన్నిసా(ఇండోనేసియా)పై విజయం సాధించగా, సైనా నెహ్వాల్ 21-13, 21-13 తేడాతో కిమ్ గా ఎన్(దక్షిణకొరియా)పై గెలుపొందారు. మరొకవైపు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 21-12, 21-19 తేడాతో కా లాంగ్ ఆంగస్(హాంకాంగ్)పై విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment