మాస్కో: ప్రపంచ పురుషుల చెస్ చాంపియన్‌షిప్ కిరీటం కోసం రష్యా గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నెపోమ్‌నిషి బరిలో నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో ఈ ఏడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 16 వరకు దుబాయ్‌లో జరిగే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో నెపోమ్‌నిషి తలపడనున్నాడు. కార్ల్‌సన్ ప్రత్యర్థి ఎవరో నిర్ణయించేందుకు మాస్కోలో నిర్వహించిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో 30 ఏళ్ల నెపోమ్‌నిషి విజేతగా నిలిచాడు.
కాగా, ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో నిర్వహించిన క్యాండిడేట్స్ టోర్నీలో నెపోమ్‌నిషి 8.5 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచాడు. మరో రౌండ్ మిగిలి ఉండగానే 8.5 పాయింట్లతో సోమవారమే టైటిల్‌ను ఖాయం చేసుకున్న నెపోమ్‌నిషి మంగళవారం జరిగిన చివరిదైన 14వ రౌండ్ గేమ్‌లో లిరెన్ డింగ్ (చైనా) చేతిలో 35 ఎత్తుల్లో ఓడిపోయాడు. 8 పాయింట్లతో లాగ్రెవ్ (ఫ్రాన్స్) రెండో స్థానంలో, 7.5 పాయింట్లతో అనీశ్ గిరి (నెదర్లాండ్స్) మూడో స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment