ఆనంద్‌కు మరో పరీక్ష | A new challenge for Viswanathan Anand in Zurich | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు మరో పరీక్ష

Published Thu, Jan 30 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

A new challenge for Viswanathan Anand in Zurich

జ్యూరిచ్: ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను చేజార్చుకున్నాక భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రెండో టోర్నమెంట్‌లో బరిలోకి దిగుతున్నాడు. గురువారం ఆరంభమయ్యే జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో ఆనంద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆనంద్‌తోపాటు ఈ టోర్నీలో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే), లెవాన్ అరోనియన్ (అర్మేనియా), ఫాబియానో కరుఆనా (ఇటలీ), హికారు నకముర (అమెరికా), బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్) పోటీపడుతున్నారు. ఈ ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో ఐదు రౌండ్లపాటు టోర్నీ జరుగుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానానికి పడిపోయిన ఆనంద్ ఈ టోర్నీ ద్వారా మళ్లీ సత్తా చాటుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.
 
 ఈ ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో విశ్వవిజేత కార్ల్‌సన్‌తో పోటీపడే ప్రత్యర్థిని నిర్ణయించేందుకు మార్చి 13 నుంచి 31 వరకు క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ప్రాక్టీస్‌గా జ్యూరిచ్ టోర్నమెంట్‌లో ఆడుతున్న ఆనంద్ ఏమేరకు రాణిస్తాడో వేచి చూడాలి. చెన్నైలో గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కార్ల్‌సన్ చేతిలో ఓడిన ఆనంద్ ఆ తర్వాత కొన్నిరోజులు విశ్రాంతి తీసుకొని లండన్ క్లాసిక్ టోర్నీలో పాల్గొన్నాడు. ర్యాపిడ్ విభాగంలో జరిగిన ఆ టోర్నీలో ఆనంద్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement