vishwanath anand
-
చెస్ ఒలంపియాడ్‌ను ప్రారంభించిన మోదీ.. తమిళ తంబిలా పంచకట్టులో..!
‘విశ్వ’ వేడుకకు భారత్ వేదికైంది. అంబరాన్నంటే సంబరాలు.. ఆహుతులను మంత్రముగ్ధులను చేసే లేజర్ షోలు, చూపరులను కట్టిపడేసే సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా చెస్ ఒలంపియాడ్ పోటీల ప్రారంభోత్సవం గురువారం రాత్రి నభూతో నభవిష్యతీ అన్న రీతిలో సాగింది. అత్యంత వైభవంగా ముస్తాబైన.. చెన్నై నగరంలోని నెహ్రూ స్టేడియం వేదికగా ఈ పోటీలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. తమ దేశ జెండాలు, ప్లకార్డులను చేతబూని సభా ప్రాంగణంలో వివిధ దేశాల క్రీడాకారులు ర్యాలీ చేశారు. జనగణమన.. తమిళ్‌తాయ్ వాళ్తు గీతాలను గాయకులు ఆలపించారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ప్రపంచ స్థాయి పోటీలకు భారత్ వేదిక కావడం చారిత్రాత్మకం అని.. ఇదే స్ఫూర్తితో మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సాక్షి , చెన్నై: చెన్నై వేదికగా ప్రపంచ చెస్ పండుగ ప్రారంభమైంది. ఈ వేడుకలను ప్రధాని మోదీ ప్రారంభించారు. క్రీడా పోటీల్లో పరాజితులు ఉండరు.. విజేతలు, భావి విజేతలు మాత్రమే ఉంటారని ఉద్బోధించారు. ఇక ప్రధాని చేతుల మీదుగా 44వ చెస్ ఒలంపియాడ్ ప్రపంచ స్థాయి పోటీల ప్రారంభోత్సవ వేడుకలు గురువారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ర్యాలీగా సాగారు. జాతీయగీతం, తమిళ్‌తాయ్ వాళ్తు గీతాలను ఆలపించారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. విశ్వనాథన్ ఆనంద్ తీసుకురాగా.. చెస్ ఒలంపియాడ్ టార్చ్‌ను గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వేదికపైకి తీసుకురాగా ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్ అందుకున్నారు. తమిళనాడు క్రీడలశాఖ మంత్రి శివ వీ మెయ్యనాథన్ స్వాగతనోపన్యాసం చేయగా, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, మరో మంత్రి ఎల్. మురుగన్ ప్రసంగించారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, రాష్ట్ర మంత్రులు, సూపర్‌స్టార్ రజినీకాంత్ తదితర ప్రముఖులు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఎంతో ప్రతిష్టాత్మకమైన చెస్ పోటీలు భారత్‌లో జరుగుతున్నాయని, 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆజాదికా అమృత్ మహోత్సవాలు జరుపుతున్న వేళ చెస్ పోటీలు జరగడం చారిత్రాత్మకమన్నారు.. ‘‘చాలా తక్కువ వ్యవధిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి అతిథి దేవో భవ అని నిరూపించారు. చెస్ క్రీడకు భారత్‌లో ప్రత్యేక స్థానం ఉంది. చెన్నైలో జరుగుతున్న ఈ పోటీ లు చిరకాలం జ్ఞాపకం ఉంటాయి. చెస్ ఒలంపియాడ్ సందర్భంగా దేశంలో పర్యటించిన టార్చ్ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి ఎందరో క్రీడాకారులను ఉత్తేజ పరిచింది. ఇందుకు ప్రతి భారతీయునికి వందనాలు సమర్పిస్తున్నాను. చెస్‌తో తమిళనాడుకు చారిత్రాత్మకమైన అనుబంధం ఉంది. తమిళనాడు నుంచి ఎందరో చెస్ గ్రాండ్ మాస్టర్లు అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందుతున్నారు. చెస్ క్రీడలు స్ఫూర్తే కాదు, ప్రపంచ దేశాలను ఐక్యం చేస్తుంది. పోస్ట్ కోవిడ్‌తో భారత్ మానసికంగా, శారీరకంగా.. చాలా దృఢంగా మారింది అనేందుకు ఈ క్రీడలే నిదర్శనం. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీలను నిర్వహించి క్రీడావృద్ధి చెందడం తథ్యం. యువత మన దేశానికి ఒక పెద్ద శక్తి. ఇక్కడి మహిళల్లోనిS నాయకత్వ లక్షణాలు భారత్‌కు తలమానికం. చెస్ ఒలంపియాడ్ పోటీలలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులకు భారత్ ఘన స్వాVýæతం పలుకుతోంది’’ అని ఆయన అన్నారు. తమిళ ఖ్యాతి ఇనుమడించేలా.. ఒలంపియాడ్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ, ఈ చెస్ పోటీలు ప్రపంచం మన వైపు చూసేలా చేశాయని, తమిళనాడు ఖ్యాతిని మరింత పెరిగేలా మార్చాయని అభిప్రాయపడ్డారు.. ‘‘కఠోర శ్రమ తోనే ఇది సాధ్యమైంది. ప్రపంచ చెస్ గ్రాండ్ మాస్టర్లలో ఇండియా అగ్రశ్రేణిలో ఉంది. అందులో 36 శాతం గ్రాండ్‌మాస్టర్లు తమిళనాడుకు చెందిన వారే. చెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తమిళనాడు విరాజిల్లుతోంది. చెస్ ఒలంపియాడ్ పోటీలు భారత్‌లో జరగడం ఇదే తొలిసారి. ఇది దేశానికి, రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. చారిత్రాత్మకమైన ఈ పోటీలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించడం ఆనందదాయకం. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న కాలంలో 20 వేల మంది క్రీడాకారులతో చెస్ పోటీలను నిర్వహించి చెస్‌పై ఆయనకున్న మక్కువను ఆనాడే చాటారు. ఇక ఈ పోటీలకు ప్రధానిని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లాలని భావించాను. అయితే కరోనా సోకడం వల్ల వీలుకాలేదు. ఈ సమయంలో ప్రధాన మోదీ నాకు ఫోన్ చేసి మీరు విశ్రాంతి తీసుకోండి.. నేను తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాస్తవానికి ఈ చెస్ ఒలంపియాడ్ పోటీలు రష్యాలో జరగాల్సింది. అయితే కరోనా ప్రభావం వల్ల అక్కడ నిర్వహించలేకపోవడంతో ప్రత్యామ్నాయం కోసం అన్వేషించారు. ఈ సమయంలో భారత్‌లో జరపాలని భావించడం ఇందు కు తమిళనాడు సిద్ధం కావడం ఓ చారిత్రాత్మక ఘట్టంగా మారింది. ప్రతిష్టాత్మకమైన ఈ పోటీలను విజయవంతం చేసేందుకు 18 ఉప సంఘాలను నియమించాను. కేవలం నాలుగు నెలలలోనే అద్భుతంగా ఏర్పాట్లు చేసిన వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఈ పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించింది. అంతేకాక పాఠశాల స్థాయిలోనే చెస్ క్రీడను మా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అదృష్టంపై ఆధారపడి కాదు, మేధస్సు, తెలివితేటలు ఏకాగ్రతతో ఇది ముడిపడి ఉంటుంది.’’అని ఆయన వివరించారు. చదవండి: Commonwealth games 2022: పీవీ సింధుకు కోవిడ్..? -
విశ్వనాథన్ ఆనంద్‌కు మూడో స్థానం
సూపర్‌బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీలో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, అరో నియన్ (అర్మేనియా) 23.5 పాయింట్లతో కలసి సంయుక్తగా రెండో స్థానంలో నిలి చారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా అరోనియన్‌కు రెండో స్థానం, ఆనంద్‌కు మూడో స్థానం దక్కింది. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య పోలాండ్‌లో జరిగిన ఈ టోర్నీ సోమవారం ముగిసింది. 24 పాయింట్లతో జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్) విజేతగా నిలిచాడు. -
చెస్ ఒలింపియాడ్‌కు హంపి, హారిక, ఆనంద్
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఈసారీ భారత్ పూర్తి బలగంతో బరిలోకి దిగనుంది. మహిళల విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రాతినిధ్యం వహించనున్నారు. జట్టులోని మిగతా మూడు బెర్త్‌ల కోసం తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి, ఆర్.వైశాలి రేసులో ఉన్నారు. అయితే మే 1వ తేదీన మిగతా ముగ్గురు క్రీడాకారిణుల పేర్లను ఖరారు చేస్తామని అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. పురుషుల విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ పేరు ఖరారైంది. ర్యాంకింగ్ ప్రకారం పెంటేల హరికృష్ణ, విదిత్ ఎంపిక కూడా లాంఛనమే. మిగతా రెండు బెర్త్‌ల కోసం ఆధిబన్, కృష్ణన్ శశికిరణ్, సేతురామన్, సూర్యశేఖర గంగూలీ, అరవింద్ చిదంబరం రేసులో ఉన్నారు. చెస్ ఒలింపియాడ్ ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి 18 వరకు రష్యా రాజధాని మాస్కోలో జరుగుతుంది. మొత్తం 180 దేశాలు ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నాయి. -
గుప్తాకు గ్రాండ్‌మాస్టర్ హోదా
న్యూఢిల్లీ: భారత 64వ గ్రాండ్‌మాస్టర్(జీఎం)గా ఢిల్లీకి చెందిన ప్రీతు గుప్తా అవతరించాడు. పోర్చుగల్‌లో జరుగుతున్న పోర్చుగీస్ లీగ్–2019 చెస్ టోర్న మెంట్ ఐదో రౌండ్లో అంతర్జాతీయ మాస్టర్ లెవ్ యంకెలెవిచ్‌ను ఓడించిన ప్రీతు.. జీఎం హోదాకు అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను సంపాదించాడు. తొమ్మిదేళ్ల వయసులోనే చదరంగంలో ప్రవేశించిన గుప్తా 15 ఏళ్లకే జీఎం హోదా పొంది ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుల్లో ఒకడిగా నిలిచాడు. జీఎం హోదాకు కావాల్సిన మూడు నార్మ్‌ల్లో మొదటిది జిబ్రా ల్టర్ మాస్టర్స్‌లో, రెండోది బైయిల్ మాస్టర్స్‌లో గతేడాది సాధించిన గుప్తా.. మూడోది, చివరిదైన నార్మ్‌ను ఈ ఏదాది ఫిబ్రవరిలో పోర్టికో ఓపెన్‌లో అందుకున్నాడు. జీఎం హోదా సాధించిన గుప్తాను భారత దిగ్గజ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ ట్విట్టర్ వేదికగా అభినందించాడు. -
ఈ సారి ‘సోచి’లో...
ఆనంద్-కార్ల్సెన్ పోరు మాస్కో: విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే) మధ్య ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ రీ మ్యాచ్‌కు వేదిక ఖరారైంది. రష్యాలోని ‘సోచి’లో నవంబర్ 7నుంచి 28 వరకు వీరిద్దరు ప్రపంచ కిరీటం కోసం పోటీ పడతారు. వేదికను ప్రకటిస్తూ ‘ఫిడే’ అధ్యక్షుడు కిర్సాన్ ఇల్యుమ్‌జినోవ్, ఈ మెగా ఈవెంట్ కోసం 3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 18 కోట్లు) బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు. ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య మ్యాచ్‌లు ఒలింపిక్ విలేజ్‌లో జరుగుతాయి. దీనికి ఇద్దరు ఆటగాళ్లూ అంగీకరించారు. గత ఏడాది నవంబరులో ఆనంద్, తన వరల్డ్ టైటిల్‌ను కార్ల్సెన్కు కోల్పోయాడు. అయితే ఈ ఏడాది క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచి మరో సారి ప్రపంచ చాంపియన్‌షిప్ పోరుకు అర్హత సాధించాడు. -
ఆనంద్‌దే తుది నిర్ణయం
కొత్త సెకండ్స్ ఎంపికపై హరికృష్ణ అభిప్రాయం చెన్నై: క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తదుపరి లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్. ఈ ఏడాది చివర్లో జరిగే ఈ టోర్నీలో ఆనంద్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో తలపడనున్నాడు. గతేడాది సొంతగడ్డపై జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కార్ల్సన్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆనంద్ పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆనంద్ విశ్వవిజేతగా నిలిచేందుకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు గ్రాండ్‌మాస్టర్, తెలుగుతేజం పెంటేల హరికృష్ణ ప్రకటించాడు. భారత చెస్ ఆటగాళ్లలో ఆనంద్ (2785 ఎలో రేటింగ్) తర్వాత అత్యధిక ఎలో రేటింగ్ ఉన్న ఆటగాడు హరికృష్ణ (2726). అయితే ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం తన కోర్ టీమ్ (సెకండ్స్)లో మార్పులపై తుది నిర్ణయం ఆనంద్‌దే అని హరికృష్ణ అన్నాడు. ప్రతీసారి సహాయకుల బృందంలో మార్పులు చేయడం మంచి నిర్ణయం కాదని చెప్పుకొచ్చాడు. ‘సెకండ్స్పై నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా ఆనంద్‌దే. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆనంద్‌కు గ్రాండ్ మాస్టర్లు సందీపన్ చందా, శశికిరణ్, లెకో (హంగేరీ), వోజ్తస్జెక్(పోలాండ్) సెకండ్స్‌గా వ్యవహరించారు. ఈ కోర్ టీమ్‌తో ఆనంద్ విశ్వవిజేతగా నిలవలేకపోయాడు. అయితే ఆనంద్‌కు ఇప్పుడు యువకులు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతోపాటు.. ప్రపంచ టాప్-10తోపాటు 2750 ఎలో రేటింగ్ పైబడిన ఆటగాళ్లు అవసరమన్నాడు. ‘కార్ల్‌సన్‌ను గతంలో ఓడించిన వాళ్లు జట్టులో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతనికి కార్ల్సన్లా ఆలోచించేవాళ్లు కావాలి’ అని హరికృష్ణ వ్యాఖ్యానించాడు. -
ఆనంద్‌కు ఏడో ‘డ్రా’
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అజేయ రికార్డు కొనసాగుతోంది. మమైదైరోవ్ (అజర్బైజాన్)తో మంగళవారం జరిగిన పదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో ఆనంద్‌కిది ఏడో ‘డ్రా’ కావడం విశేషం. మరో మూడు గేముల్లో నెగ్గిన ఈ ప్రపంచ మాజీ చాంపియన్ పదో రౌండ్ తర్వాత 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇతర గేముల్లో స్విద్లెర్ (రష్యా) 39 ఎత్తుల్లో క్రామ్నిక్ (రష్యా)ను ఓడిం చగా... అరోనియన్ (అర్మేనియా), తొపలోవ్ (బల్గేరియా) గేమ్ 45 ఎత్తుల్లో; కర్జాకిన్ (రష్యా), ఆంద్రికిన్ (రష్యా) గేమ్ 29 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. -
ఆనంద్ ‘హ్యాట్రిక్’ డ్రా
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఖాంటీ మాన్సిస్క్ (రష్యా): భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో వరుసగా మూడో డ్రా ఫలితం ఎదురైంది. అయినప్పటికీ ప్రపంచ మాజీ చాంపియన్ ఆనంద్ నాలుగు పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. రష్యా ఆటగాడు సెర్గెయ్ కర్జాకిన్ (2.5)తో బుధవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ డ్రాగా ముగించుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాడు దీటుగా స్పందించడంతో ఆనంద్ ఎత్తులు పారలేదు. చివరకు 33 ఎత్తుల్లో గేమ్ డ్రా అయింది. మిగతా మ్యాచ్‌ల్లో తొపలోవ్ (బల్గేరియా-3)... క్రామ్నిక్ (రష్యా-3)పై గెలుపొందగా, మమెద్యరోవ్ (అజర్బైజాన్-3)... స్విడ్లెర్ (రష్యా-3)ను కంగుతినిపించాడు. అరోనియన్ (ఆర్మేనియా-3.5)... అండ్రెకిన్ (రష్యా-2)తో డ్రా చేసుకున్నాడు. -
మళ్లీ ఓడిన ఆనంద్
జ్యూరిచ్: ప్రపంచ మాజీ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జ్యూరిచ్ చెస్ టోర్నీలో రెండో రౌండ్లోనూ ఓటమి పాలయ్యాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్ నకమురతో శుక్రవారం జరిగిన ఈ గేమ్‌ను ఆనంద్ కేవలం 36 ఎత్తుల్లోనే కోల్పోయాడు. దీంతో వరుసగా రెండు పరాజయాలతో టోర్నీలో ఆనంద్ అట్టడుగు స్థానానికి పడిపోయాడు. మరోవైపు ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ (నార్వే) తన రెండో రౌండ్ గేమ్‌ను అరోనియన్ (అర్మేనియా)తో డ్రా చేసుకోగా, కరుఆనా (ఇటలీ), ఇజ్రాయెల్ ఆటగాడు బోరిస్ గెల్ఫాం డ్తో డ్రాగా ముగించాడు. ఆరుగురు ఆటగాళ్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో మూడు క్లాసికల్ రౌండ్లు, ఐదు ర్యాపిడ్ రౌండ్లు జరగనున్నాయి. -
ఆనంద్‌కు మరో పరీక్ష
జ్యూరిచ్: ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను చేజార్చుకున్నాక భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రెండో టోర్నమెంట్లో బరిలోకి దిగుతున్నాడు. గురువారం ఆరంభమయ్యే జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో ఆనంద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆనంద్‌తోపాటు ఈ టోర్నీలో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), లెవాన్ అరోనియన్ (అర్మేనియా), ఫాబియానో కరుఆనా (ఇటలీ), హికారు నకముర (అమెరికా), బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్) పోటీపడుతున్నారు. ఈ ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో ఐదు రౌండ్లపాటు టోర్నీ జరుగుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానానికి పడిపోయిన ఆనంద్ ఈ టోర్నీ ద్వారా మళ్లీ సత్తా చాటుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో విశ్వవిజేత కార్ల్సన్తో పోటీపడే ప్రత్యర్థిని నిర్ణయించేందుకు మార్చి 13 నుంచి 31 వరకు క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ప్రాక్టీస్‌గా జ్యూరిచ్ టోర్నమెంట్లో ఆడుతున్న ఆనంద్ ఏమేరకు రాణిస్తాడో వేచి చూడాలి. చెన్నైలో గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కార్ల్సన్ చేతిలో ఓడిన ఆనంద్ ఆ తర్వాత కొన్నిరోజులు విశ్రాంతి తీసుకొని లండన్ క్లాసిక్ టోర్నీలో పాల్గొన్నాడు. ర్యాపిడ్ విభాగంలో జరిగిన ఆ టోర్నీలో ఆనంద్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. -
క్రామ్నిక్‌తో ఆనంద్ గేమ్ డ్రా
లండన్: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ క్లాసిక్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్‌లో తొలి గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా)తో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌ను నల్లపావులతో ఆడిన ఆనంద్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. వీరిద్దరి మధ్యే మరో గేమ్ జరుగుతుంది. ఈ గేమ్‌లో నెగ్గిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. -
ఆధిక్యంలో ఆనంద్
లండన్: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ క్లాసిక్ ప్రిలిమినరీస్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడు. మూడో రౌండ్లో విషీ... ఆండ్రి ఇస్ట్రాటెక్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. ఈ రౌండ్ అనంతరం మొత్తం ఏడు పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. తొలి రౌండ్లో నల్ల పావులతో ఆడిన ఆనంద్ ఇంగ్లండ్ కు చెందిన ల్యూక్ మెక్షేన్ను ఓడించాడు. రెండో రౌండ్లో మైకేల్ ఆడమ్స్‌పై తెల్ల పావులతో ఆడిడ్రా చేసుకున్నాడు. ఈ టోర్నీలో మిగిలిన మూడు రౌండ్లలో కనీసం ఒక్క గేమ్‌లో గెలిచినా ఆనంద్ క్వార్టర్స్‌కు చేరుకుంటాడు. 16 మంది ప్లేయర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. -
ఎండ్ గేమ్‌లోనే తేడా
కార్ల్సెన్ ప్రపంచ చెస్ టైటిల్ సాధించిన 16వ క్రీడాకారుడిగా అవతరించడంతో పాటు రెండో పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో కాస్పరోవ్ ముందున్నాడు. యాదృచ్చికమేమిటంటే 2009 లో కొంతకాలం కాస్పరోవ్ దగ్గర కార్ల్సెన్ శిక్షణ తీసుకోవడం. టోర్నీ మొత్తం కార్ల్సెన్ చాలా పటిష్టంగా ఆడాడు. ‘డ్రా’ చేసుకోవడం మినహా అతనిపై గెలవ డం అసాధ్యంగా కనిపించింది. ప్రత్యర్థి అడిగితే తప్ప అతను ఎప్పుడూ ‘డ్రా’ వైపు మొగ్గలేదు. ఈ లక్షణమే కార్ల్సెన్ను ప్రత్యర్థులందరిలో ప్రత్యేకంగా నిలిపింది. టోర్నీ ఆరంభంలో ఆనంద్ వ్యూహాలు అద్భుతంగా పని చేశాయి. దీంతో మూడో గేమ్‌లో కార్ల్సెన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే నాలుగో గేమ్ నుంచి కార్ల్సెన్ ఆధిపత్యం కొనసాగింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న నార్వే ప్లేయర్... విషీ తప్పు చేసే వరకు ఓపికగా వేచి చూశాడు. కార్ల్సెన్ ఎండ్ గేమ్ టెక్నిక్ అద్భుతం. ఇది 12వ చాంపియన్‌గా నిలిచిన కార్పోవ్‌ను పోలి ఉంది. కార్ల్సెన్ వయసు 22 ఏళ్లే. ప్రపంచ రెండో ర్యాంకర్‌కు ఇతని మధ్య 70 పాయింట్ల తేడా ఉంది. కాబట్టి ఈ స్థానంలో అతను సుదీర్ఘ కాలం కొనసాగుతాడని నా నమ్మకం. 70వ దశకంలో బాబీ ఫిషర్ (అమెరికా) తెచ్చినట్లుగా చెస్‌కు మరింత ఆకర్షణ తీసుకొస్తాడని భావిస్తున్నాను. ఇద్దరి వ్యక్తిత్వాలు భిన్నమైనా చెస్‌లో రాజీ పడకుండా ఆడే తీరు మాత్రం అమోఘం. ప్రత్యర్థులపై చూపించే ఈ స్పష్టమైన ఆధిపత్యమే చెస్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు తోడ్పడుతుంది. ఈ టోర్నీ కోసం ఆనంద్ చాలా బాగా సన్నద్ధమయ్యాడు. అయితే కార్ల్సెన్ పెట్టిన మానసిక ఒత్తిడికి విషీ బోల్తా పడ్డాడు. ప్రత్యర్థిపై ఆధిపత్యం కొనసాగించే స్థాయిలో ఆటతీరు లేకపోవడం కూడా భారత ప్లేయర్‌ను దెబ్బతీసింది. 9వ గేమ్‌లో మాత్రమే కాస్త దూకుడుగా ఆడాడు. రెండు పాయింట్లు వెనుకబడ్డాననే ఆత్రుతతో కచ్చితంగా గెలవాల్సిన ఈ గేమ్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఆనంద్ ఓటమికి ఈ రెండు కారణాలు ప్రధానమైనవి. కొత్త చెస్ చాంపియన్‌గా అవతరించిన కార్ల్సెన్కు నా శుభాకాంక్షలు. అలాగే మార్చిలో ‘క్యాండిడేట్స్ టోర్నీ’లో విజేతగా నిలిచి ప్రపంచ టైటిల్ కోసం కార్ల్‌సెన్‌తో ఆనంద్ మళ్లీ పోటీకి దిగాలని కోరుకుంటున్నాను. -
ఇటలీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలిన నిజాలు
-
ఆనంద్‌కు మళ్లీ అవకాశం
ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను చేజార్చుకున్న భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు వచ్చే ఏడాది మళ్లీ ఈ కిరీటాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ నవంబరు 5 నుంచి 25 వరకు (వేదిక ఎంపిక చేయలేదు) జరుగుతుంది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హోదాలో మాగ్నస్ కార్ల్సెన్ ఉంటాడు. ‘క్యాండిడేట్స్ టోర్నమెంట్’ ద్వారా కార్ల్సెన్ ప్రత్యర్థి ఎవరో తేలుతుంది. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది మార్చి 12 నుంచి 30 వరకు ఖాంటీ మాన్సిస్క్ (రష్యా)లో జరుగుతుంది. మొత్తం 8 మంది బరిలోకి దిగుతారు. విజేతగా నిలిచిన వారు కార్ల్‌సెన్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ ఆడతారు. ఎవరు ఎలా అర్హత పొందారంటే... 2013 ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ హోదాలో విశ్వనాథన్ ఆనంద్ క్యాండిడేట్స్ టోర్నీలో ఆడతాడు. 2013 ప్రపంచ కప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా), దిమిత్రీ ఆంద్రికిన్ (రష్యా) కూడా ఈ టోర్నీకి అర్హత పొందారు. ‘ఫిడే’ 2012-2013 గ్రాండ్‌ప్రి సిరీస్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా), షకిర్యార్ మమెద్యారోవ్ (అజర్బైజాన్) కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నారు. 2013 ప్రపంచ కప్‌లో, గ్రాండ్‌ప్రి సిరీస్‌లో అత్యధిక రేటింగ్ కలిగిన ఇద్దరు క్రీడాకారులు లెవాన్ అరోనియన్ (అర్మేనియా), సెర్గీ కర్జాకిన్ (రష్యా) కూడా ఈ టోర్నీకి అర్హత పొందారు. ఆర్గనైజింగ్ కమిటీ ద్వారా ‘వైల్డ్ కార్డు’ పొందిన స్విద్లెర్ (రష్యా) కూడా టోర్నమెంట్లో పోటీపడతాడు. - సాక్షి క్రీడావిభాగం -
కార్ల్సెన్కు ప్రపంచ చెస్ టైటిల్
ప్రపంచ చెస్‌లో కొత్త శకం మొదలైంది! ఇన్నాళ్లూ చెస్‌కు పర్యాయపదంలా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్ ఆనంద్ స్థానంలో ఎట్టకేలకు కొత్త రాజు వచ్చాడు. 64 గడుల సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తిగా 22 ఏళ్ల నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్ పుట్టుకొచ్చాడు. భిన్నమైన శైలి, ఆటలో దూకుడు, పదునైన వ్యూహాలు అంతుకుమించిన ఎత్తుగడలతో 43 ఏళ్ల అపర మేధావి ఆనంద్‌ను అలవోకగా కట్టడి చేసి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. చెన్నై: కుర్రాడి దూకుడుతనం ముందు అపారమైన అనుభవం మూగబోయింది. ఒకటి, రెండు ఎత్తులకే చిత్తవుతాడనుకున్న యువకుడు 64 గడుల రారాజుగా అవతరించాడు. అసాధారణ నైపుణ్యానికి తోడు అద్భుతమైన ఎత్తుగడతో ఒక్కో మెట్టు ఎక్కుతూ... నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్ ప్రపంచ చెస్ కొత్త చాంపియన్‌గా అవిర్భవించాడు. శుక్రవారం ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య జరిగిన పదో గేమ్ 65 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. దీంతో 12 గేమ్‌ల ఈ టోర్నీలో మరో రెండు మిగిలి ఉండగానే... 6.5 పాయింట్లతో కార్ల్సెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫలితం వచ్చినందున ఆఖరి రెండు గేమ్‌లు జరగవు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన విషీ... ఈ టోర్నీలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తన అనుభవమంత వయసులేని కుర్రాడి చేతిలో పరాజయం పాలయ్యాడు. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆనంద్... ప్రత్యర్థి వ్యూహాలకు బిత్తరపోయాడు. 4 గంటల 45 నిమిషాల పాటు జరిగిన ఈ గేమ్‌లో డ్రా చేసుకునేందుకు చాలా అవకాశాలు వచ్చినా నార్వే కుర్రాడు మాత్రం విజయం కోసమే ప్రయత్నించాడు. చివరకు ఆనంద్ డ్రాకు ప్రతిపాదించడంతో తను కూడా ఆమోదం తెలిపాడు. ఇప్పటికి ఐదుసార్లు (2000, 2007, 2008, 2010, 2012) ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనంద్.. సొంతగడ్డపై ఓడటం ఎదురుదెబ్బే. ఈసారి టోర్నీలో ఆనంద్ ఒక్క గేమ్ కూడా గెలవకపోవడం గమనార్హం. ఆరంభం నుంచే పట్టు ఓపెనింగ్‌తో గేమ్‌పై పట్టు బిగించడం... మిడిల్ గేమ్‌లో ఆధిపత్యం కనబర్చడం... అటాకింగ్‌తో ఎండ్‌గేమ్‌ను ఫినిష్ చేయడం... టోర్నీ మొత్తం ఇదే ఆటతీరుతో చెలరేగిన కార్ల్సెన్ పదో గేమ్‌లోనూ ఊపును కొనసాగించాడు. గేమ్ ప్రధాన లైన్లోకి తీసుకెళ్లినా.. ఏదో ఓ చోట కచ్చితమైన మలుపుతో తన వైపు తిప్పుకున్నాడు. తెల్లపావులతో కార్ల్సెన్ మాస్కో వేరియేషన్‌తో వస్తే... ఆనంద్ నల్లపావులతో సిసిలియన్ ఓపెనింగ్‌ను ఎంచుకున్నాడు. మూడో ఎత్తు వద్ద ప్రత్యర్థి నైట్ కోసం కార్ల్సెన్ లైట్ బిషప్తో చెక్ పెట్టడంతో బోర్డుపై మార్కోజి బ్లైండ్ గేమ్ కనిపించింది. 14వ ఎత్తు వద్ద లైట్ బిషప్‌ను మళ్లీ రంగంలోకి దించడంతో గేమ్‌లో కొన్ని పావులు చేతులు మారాయి. 21 వ ఎత్తు తర్వాత ఎత్తులు పునరావృతం అవుతాయని ఊహించినా ఇరువురు ఆటగాళ్లు దాన్ని కాకుండా చూశారు. 28వ ఎత్తు వద్ద కింగ్‌ను ఐదో ర్యాంక్‌కు జరుపుతూ కార్ల్సెన్ తన ప్రణాళికను అమలు చేశాడు. కానీ విషీ... కొన్ని చిన్న ఎత్తులతో కోలుకున్నాడు. ఫలితంగా నైట్, పాన్లతో ఎండ్‌గేమ్ మొదలైంది. తొలిసారి టైమ్ కంట్రోలు వచ్చేసరికి గేమ్‌లో 40 ఎత్తులు పూర్తయ్యాయి. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆనంద్ గేమ్‌లో పూర్తిగా లీనంకాగా.. కార్ల్సెన్ కూడా ఫలితం కోసమే ప్రయత్నించాడు. అవకాశం కోసం ఓపికగా వేచి చూసిన అతను 46వ ఎత్తు వద్ద గేమ్‌ను మలుపు తిప్పాడు. సుదీర్ఘంగా ఆలోచించి ఓ పాన్‌ను త్యాగం చేశాడు. తర్వాతి కొన్ని ఎత్తులకే ఆనంద్ అన్ని పావులను కోల్పోయాడు. దీంతో ఇద్దరూ న్యూ క్వీన్స్‌ను ప్రమోట్ చేశారు. ఆనంద్‌కు ఎక్స్ట్రా నైట్ ఉంటే... కార్ల్సెన్ ఎక్స్ట్రా క్వీన్‌తో పాటు కొన్ని ప్రమాదకరమైన పాన్లు అందుబాటులో ఉంచుకున్నాడు. తర్వాత భారత ప్లేయర్ కొన్ని కచ్చితమైన ఎత్తులతో అలరించినా... చివరకు డ్రాతో సరిపెట్టుకున్నాడు. నార్వేలో ‘సీన్’మారింది ‘సాక్షి’కి ప్రత్యేకం చెస్‌కు శారీరక శ్రమ అవసరం లేదు... అసలు ఇది క్రీడే కాదు... దీనిని క్రీడల జాబితాలో చేర్చాల్సిన అవసరం లేదు... నార్వేలో జాతీయ క్రీడా సమాఖ్య (నార్వే స్పోర్ట్స్ కమ్యూనిటీ) అభిప్రాయం ఇది. ఏడాదిన్నర క్రితం నార్వే చెస్ సంఘం... తమను గుర్తించాలంటూ చేసుకున్న దరఖాస్తు ఇప్పటికీ జాతీయ సమాఖ్య దగ్గర పెండింగ్‌లో ఉంది. నార్వేలో చెస్‌కు ఉండే ఆదరణ, ఆట పట్ల ఉండే అభిప్రాయం ఏంటో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అలాంటి దేశం నుంచి వచ్చిన 22 ఏళ్ల కుర్రాడు ప్రపంచ చెస్ రారాజుగా నిలవడం సామాన్యమైన విషయం కాదు. నిజానికి కార్ల్సెన్ నంబర్‌వన్ ఆటగాడైనా... ఆ దేశంలో చాలామందికి అతనెవరో తెలియదు. ప్రపంచ చాంపియన్‌షిప్‌తో మొత్తం పరిస్థితి మారిపోయింది. ఆరో గేమ్ తర్వాత కార్ల్సెన్ 4-2 ఆధిక్యంలోకి రావడంతో ఒక్కసారిగా నార్వే అంతా ఆశ్చర్యపోయింది. తమ కుర్రాడు ప్రపంచ చాంపియన్ అవుతున్నాడనే సంబరం మొదలైంది. ఇక గెలిచాక సంబరాల సంగతి చెప్పక్కర్లేదు.సాధారణంగా నార్వేలో రెండే క్రీడలను పట్టించుకుంటారు. అందులో మొదటిది స్కీయింగ్. ఇందులో ప్రపంచ చాంపియన్స్ అంతా ఈ దేశం నుంచే ఉన్నారు. రెండో ఆట ఫుట్‌బాల్. కానీ ఇది అక్కడ క్లబ్ స్థాయికే పరిమితమైంది. జాతీయ జట్టు పెద్దగా ఆడేదీ, అద్భుతాలు చేసిందీ లేదు. అందుకే స్కీయింగ్ క్రీడాకారులే సూపర్‌స్టార్స్. ఇప్పుడు కార్ల్సెన్ నార్వేలో చెస్ స్వరూపాన్నే మార్చేశాడు. ఎప్పుడైతే ప్రపంచ చాంపియన్‌షిప్ మొదలైందో... నార్వేలో వేడి పెరిగింది. కార్ల్సెన్ స్కీయింగ్ స్టార్స్‌తో పాటు... దేశంలో టాప్-3 స్పోర్ట్స్ పర్సన్స్‌లో ఒకడిగా వెలుగులోకి వచ్చాడు. చెస్ గురించి ప్రతిరోజూ పత్రికల్లో మొదటి పేజీలో వార్తలు మొదలయ్యాయి. లోకల్ ట్రెయిన్స్, బస్‌లలో కార్ల్సెన్ ఫొటోలు, పోస్టర్లు వచ్చాయి. పలు కంపెనీలు కార్ల్సెన్కు అభినందనలు తెలుపుతూ తనని సూపర్ హీరోని చేశాయి. ఎంటర్కార్డ్ అనే క్రెడిట్‌కార్డ్ కంపెనీ ఇన్నాళ్లూ అనేకమంది క్రీడాకారులకు స్పాన్సర్ చేసినా చెస్‌ను పట్టించుకోలేదు. అలాంటి కంపెనీ ఇప్పుడు చెస్‌ను ప్రమోట్ చేయడానికి నడుం బిగించింది. అన్నింటికంటే చెప్పుకోదగ్గ విషయం... రాజధాని ఓస్లోకు సమీపంలోని డ్రమ్మెన్ ప్రాంతంలో చెస్‌కు సంబంధించిన బోర్డులు, పుస్తకాలు అమ్మే షాప్ ఉంది. దేశం మొత్తం మీద ఇదొక్కటే చెస్ షాప్. ప్రపంచ చాంపియన్‌షిప్ మొదలయ్యాక... కేవలం ఒక్క రోజులోనే ఈ షాప్‌లో స్టాక్ అంతా అయిపోవడం విశేషం. (ఇన్పుట్స్: ఓస్లోలో పని చేస్తున్న తెలుగువాసి మల్లేశ్వరరావు నందా) ‘కింగ్’ కార్ల్సెన్ పూర్తి పేరు: స్వెన్ మాగ్నస్ కార్ల్సెన్ పుట్టిన తేదీ: 30 నవంబరు, 1990 జన్మస్థలం: టాన్స్బర్గ్, వెస్ట్‌ఫోల్డ్ (నార్వే) టైటిల్: గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ ప్రస్తుత ‘ఫిడే’ రేటింగ్: 2870 పాయింట్లు అత్యుత్తమ రేటింగ్: 2872 పాయింట్లు (ఫిబ్రవరి, 2013లో) ప్రస్తుత ర్యాంక్: 1 అత్యుత్తమ ర్యాంక్: 1 (జనవరి, 2010లో తొలిసారి ఈ ఘనత సాధించాడు. 2011 జులై నుంచి ఇప్పటివరకు నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు) ఘనతలు 2004లో ఏప్రిల్ 26న కార్ల్సెన్ 13 ఏళ్ల 148 రోజుల వయస్సులో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా దక్కించుకున్నాడు. చెస్ చరిత్రలో పిన్న వయస్సులో జీఎం హోదా పొందిన రెండో క్రీడాకారుడిగా నిలిచాడు. 2010లో జనవరి 1న కార్ల్సెన్ 19 ఏళ్ల 32 రోజుల వయస్సులో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అతను చెస్ చరిత్రలో టాప్ ర్యాంక్ దక్కించుకున్న పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది జనవరిలో కార్ల్సెన్ 2861 ఎలో రేటింగ్‌తో చెస్ చరిత్రలో అత్యుత్తమ రేటింగ్ సాధించాడు. ఈ తర్వాత ఫిబ్రవరిలో 2872 పాయింట్లతో తన ఎలో రేటింగ్‌ను మరింత మెరుగుపర్చుకున్నాడు. 2009లో బ్లిట్జ్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. 2 ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచిన రెండో పిన్న వయస్కుడిగా కార్ల్సెన్ గుర్తింపు పొందాడు. 1985లో రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయసులో ప్రపంచ చాంపియన్‌గా నిలువగా... కార్ల్సెన్ 22 ఏళ్ల 11 నెలల 22 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. 16 ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నెగ్గిన 16వ క్రీడాకారుడిగా కార్ల్సెన్ నిలిచాడు. రూ. 9.58 కోట్లు విజేతగా నిలిచిన కార్ల్సెన్కు రూ. 9 కోట్ల 58 లక్షలు.... రన్నరప్ ఆనంద్‌కు రూ. 4 కోట్ల 42 లక్షలు ప్రైజ్‌మనీగా లభిస్తాయి. ‘‘మ్యాచ్ ఆద్యంతం నాపై కార్ల్సెన్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఈ పోటీ మొత్తంలో కీలక మలుపు ఐదో గేమ్. ఆ గేమ్‌లో ఓడిపోవడంతో కోలుకోలేకపోయాను. నా ప్రదర్శన తీవ్ర నిరాశకు గురి చేసింది. కొంతకాలం విశ్రాంతి తీసుకుంటాను. ఆ తర్వాత ఈ పోటీలో నా ఆటతీరుపై సమీక్ష చేసుకుంటాను. వచ్చే మార్చిలో జరిగే క్యాండిడేట్స్ టోర్నమెంట్లో బరిలోకి దిగుతాను.’’ - ఆనంద్ -
తప్పిదాలకు మూల్యం
ఎట్టకేలకు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో ఫలితం వచ్చింది. అందరూ ఆశించినట్టుగా ఆనంద్‌కు బదులు... తెల్ల పావులతో ఆడిన మాగ్నస్ కార్ల్సెన్ ఐదో గేమ్‌లో విజయాన్ని అందుకున్నాడు. క్రితం గేమ్‌ల మాదిరిగా కాకుండా ఈసారి కార్ల్సెన్ సీ4 ఓపెనింగ్‌తో గేమ్‌ను ఆరంభించాడు. ఆనంద్ ఈ6తో జవాబు ఇచ్చి స్లావ్ డిఫెన్స్‌లోని మార్షల్ గాంబిట్ వ్యూహానికి సిద్ధమై వచ్చినట్లు సంకేతం ఇచ్చాడు. మరోవైపు కార్ల్సెన్ అంతుబట్టని వ్యూహంతో ఆనంద్‌ను తికమకపెట్టాడు. ఆరంభంలో ఇద్దరూ కావాల్సినంత సమయం తీసుకున్నారు. 13వ ఎత్తులో ఆనంద్ తన ఒంటెను సీ7లోకి పంపిచడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆనంద్ రక్షణాత్మకంగా ఆడతాడని ఊహించలేదు. ఆనంద్ చేసిన ఈ తప్పిదంతో కార్ల్సెన్ గేమ్‌పై పట్టు సంపాదించుకున్నాడు. మిడిల్ గేమ్‌లో ఆనంద్ దూకుడు పెంచి గేమ్‌ను ‘డ్రా’దిశగా సాగేందుకు ప్రయత్నించాడు. కార్ల్సెన్ మాత్రం తడబాటుకు లోనుకాకుండా తనకున్న అవకాశాలను సజీవంగా పెట్టుకొని ముందుకుసాగాడు. ఆనంద్ 45వ ఎత్తులో తన ఏనుగుని సీ1లోకి పంపించి కోలుకోలేని పొరపాటు చేశాడు. సీ1లోకి బదులు ఏ1లోకి ఏనుగుని పంపించి ఉంటే ఆనంద్ ‘డ్రా’తో గట్టెక్కేవాడు. ఆనంద్ చేసిన ఈ తప్పిదాన్ని కార్ల్సెన్ తనకు అనుకూలంగా మలచుకొని భారత గ్రాండ్‌మాస్టర్ ఆట కట్టించి తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మరో ఏడు రౌండ్లు మిగిలి ఉన్న ఈ టోర్నీలో ఆనంద్ ఆరో గేమ్‌లో, ఏడో గేమ్‌లో తెల్ల పావులతో ఆడనున్నాడు. ఆరో గేమ్‌లో ఆనంద్ దూకుడుగా ఆడి విజయంపై దృష్టి పెట్టాలి.