ఆనంద్‌కు ఏడో ‘డ్రా’ | Viswanathan Anand maintains lead after drawing with Shakhriyar Mamedyarov in Candidates Chess | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు ఏడో ‘డ్రా’

Published Wed, Mar 26 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM

ఆనంద్‌కు ఏడో ‘డ్రా’

ఆనంద్‌కు ఏడో ‘డ్రా’

ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అజేయ రికార్డు కొనసాగుతోంది. మమైదైరోవ్ (అజర్‌బైజాన్)తో మంగళవారం జరిగిన పదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో ఆనంద్‌కిది ఏడో ‘డ్రా’ కావడం విశేషం.
 
 మరో మూడు గేముల్లో నెగ్గిన ఈ ప్రపంచ మాజీ చాంపియన్ పదో రౌండ్ తర్వాత 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇతర గేముల్లో స్విద్లెర్ (రష్యా) 39 ఎత్తుల్లో క్రామ్నిక్ (రష్యా)ను ఓడిం చగా...  అరోనియన్ (అర్మేనియా), తొపలోవ్ (బల్గేరియా) గేమ్ 45 ఎత్తుల్లో; కర్జాకిన్ (రష్యా), ఆంద్రికిన్ (రష్యా) గేమ్ 29 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement