జ్యూరిచ్: ప్రపంచ మాజీ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జ్యూరిచ్ చెస్ టోర్నీలో రెండో రౌండ్‌లోనూ ఓటమి పాలయ్యాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్ నకమురతో శుక్రవారం జరిగిన ఈ గేమ్‌ను ఆనంద్ కేవలం 36 ఎత్తుల్లోనే కోల్పోయాడు.
దీంతో వరుసగా రెండు పరాజయాలతో టోర్నీలో ఆనంద్ అట్టడుగు స్థానానికి పడిపోయాడు. మరోవైపు ప్రపంచ చాంపియన్ కార్ల్‌సన్ (నార్వే) తన రెండో రౌండ్ గేమ్‌ను అరోనియన్ (అర్మేనియా)తో డ్రా చేసుకోగా, కరుఆనా (ఇటలీ), ఇజ్రాయెల్ ఆటగాడు బోరిస్ గెల్ఫాం డ్‌తో డ్రాగా ముగించాడు. ఆరుగురు ఆటగాళ్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో మూడు క్లాసికల్ రౌండ్లు, ఐదు ర్యాపిడ్ రౌండ్లు జరగనున్నాయి.
మళ్లీ ఓడిన ఆనంద్
Published Sun, Feb 2 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement
Advertisement