Pankaj Advani
-
పంకజ్... అదే జోరు
దోహా: భారత క్యూస్పోర్ట్స్ దిగ్గజం cమరో అంతర్జాతీయ టైటిల్ సాధించాడు. గురు వారం ముగిసిన ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్ లో అతను విజేతగా నిలిచాడు. ఫైనల్లో పంకజ్ 4–1 (42–72, 93–17, 93–1, 89–21, 70–41) ఫ్రేమ్‌ల తేడాతో ఇరాన్‌కు చెందిన మాజీ ఆసియా, ప్రపంచ స్నూకర్ చాంపియన్ అమిర్ సర్ఖోష్ పై గెలుపొందాడు. అతని ఖాతాలో ఇది 14వ ఆసియా టైటిల్ కావడం విశేషం. ఇదివరకే అతను స్నూకర్‌లో నాలుగు, cతొమ్మిది టైటిల్స్ గెలిచాడు. వీటితో పాటు 2006, 2020లలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ స్వర్ణ పతకాలు గెలిచాడు. తాజా ఆసియా టైటిల్‌తో ఓ క్యాలెండర్ ఇయర్లో జాతీయ, ఆసియా, ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లు గెలిచిన ఆటగాడిగా ఘనత వహించనున్నాడు. బిలియర్డ్స్‌లో ఇదివరకే ఈ రికార్డు లిఖించిన పంకజ్ స్నూకర్‌లో లిఖించాల్సి ఉంది. ఇదే జరిగితే క్యూస్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లోనే ఈ ఘనత వహించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కుతాడు. ‘ఆసియా పతకం నాకు ప్రత్యేక ఆనందాన్నిచ్చింది. ఈ టోర్నీ చాలా కఠినంగా సాగింది. చివరకు మరో బంగారు పతకాన్ని నా ఖాతాలో వేసుకున్నాను. ఇదే నిలకడైన ప్రదర్శనతో భారత్ గర్వించే విజయాలు మరెన్నో సాధించాలని ఆశిస్తున్నాను’ అని మ్యాచ్ విజయానంతరం పంకజ్ అద్వానీ అన్నాడు. -
36వసారి జాతీయ టైటిల్ సాధించిన పంకజ్ అద్వానీ
ఇండోర్: భారత స్టార్ క్యూయిస్ట్, ప్రపంచ చాంపియన్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో 36వసారి జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. మంగళవారం జరిగిన 91వ జాతీయ స్నూకర్ చాంపియన్‌షిప్ ఫైనల్లో పంకజ్ 5–1 ఫ్రేమ్‌ల తేడాతో బ్రిజేశ్ దమానిపై నెగ్గాడు. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్‌తో పాటు బ్రిజేశ్ జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నారు. ‘అంతర్జాతీయ టోరీ్నల్లో పాల్గొనే అవకాశం ఇచ్చే ఈవెంట్ ఇదొక్కటే కావడంతో... తీవ్ర పోటీ ఎదురైంది. గ్రూప్ దశలో పేలవ ప్రదర్శన అనంతరం తిరిగి పుంజుకొని స్వర్ణం నెగ్గడం ఆనందంగా ఉంది. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది’ అని పంకజ్ అన్నాడు. -
సింగపూర్ ఓపెన్ స్నూకర్ టోర్నీ విజేత పంకజ్ అద్వానీ
సింగపూర్: భారత దిగ్గజ క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్–స్నూకర్ ) ప్లేయర్ పంకజ్ అద్వానీ అంతర్జాతీయస్థాయిలో మరో టైటిల్ సాధించాడు. ఆదివారం ముగిసిన సింగపూర్ ఓపెన్ స్నూకర్ టోర్నమెంట్లో పంకజ్ అద్వానీ చాంపియన్‌గా నిలిచాడు. జాడెన్ ఓంగ్ (సింగపూర్)తో జరిగిన ఫైనల్లో పంకజ్ 5–1 (65–57, 62–46, 85–18, 15–66, 71–62, 75–11) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. సెమీఫైనల్లో పంకజ్ 4–3తో ప్రపంచ మాజీ స్నూకర్ చాంపియన్ దెచావత్ పూమ్జేంగ్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. ఐదు దేశాల నుంచి 123 మంది ప్లేయర్లు ఈ టోర్నీలో పోటీపడ్డారు. విజేతగా నిలిచిన పంకజ్‌కు 11 వేల సింగపూర్ డాలర్లు (రూ. 7 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. పుణేలో జన్మించి బెంగళూరులో స్థిరపడ్డ 39 ఏళ్ల పంకజ్ తన కెరీర్లో వివిధ ఫార్మాట్లలో 27 ప్రపంచ టైటిల్స్‌ను సాధించాడు. -
బిలియర్డ్స్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో పంకజ్ అద్వానీ
న్యూఢిల్లీ: భారత క్యూ స్పోర్ట్స్ (స్నూకర్, బిలియర్డ్స్) దిగ్గజం పంకజ్ అద్వానీ తన విజయవంతమైన కెరీర్లో మరో మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ బిలియర్డ్స్‌లో విశిష్ట క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. బిలియర్డ్స్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో పంకజ్‌కు స్థానం కల్పించారు. చైనాలోని షాంగ్రావొ నగరంలోని ప్రపంచ బిలియర్డ్స్ మ్యూజియంలో హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాను పొందుపరిచారు. ప్రపంచ విశిష్ట క్రీడాకారుల సరసన తన పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందని పంకజ్ చెప్పాడు. ‘అరుదైన గౌరవానికి అర్హుడినైనందుకు ఆనందంగా ఉంది. సుదీర్ఘమైన కెరీర్లో అభిమానులు, శ్రేయోభిలాషుల మద్దతు వల్లే అత్యున్నత శిఖరాలను అధిరోహించాను’ అని అద్వానీ అన్నాడు. గత నవంబర్‌లో 38 ఏళ్ల వయసులోనూ భారత విఖ్యాత ఆటగాడు అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఓవరాల్‌గా 26వ టైటిల్‌ను గెలుపొందాడు. ఇందులో పాయింట్ల ఫార్మాట్, లాంగ్ ఫార్మాట్, ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ విభాగాల్లో టైటిళ్లున్నాయి. -
పంకజ్ అద్వానీ ఖాతాలో 26వ ప్రపంచ టైటిల్
దోహా: క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో భారత దిగ్గజ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ బిలియర్డ్స్ లాంగ్ ఫార్మాట్లో 38 ఏళ్ల పంకజ్ అద్వానీ విజేతగా నిలిచాడు. సోమవారం జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 1000–416 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారిపై గెలుపొందాడు. సెమీఫైనల్స్‌లో పంకజ్ 900–273తో రూపేశ్ షా (భారత్), సౌరవ్ కొఠారి 900–756తో ధ్రువ్ సిత్వాలా (భారత్)పై విజయం సాధించారు. గతంలో పంకజ్ పాయింట్ల ఫార్మాట్లో 8 సార్లు...లాంగ్‌ఫార్మాట్‌లో 8 సార్లు... స్నూకర్‌లో 8 సార్లు... టీమ్ ఫార్మాట్లో ఒకసారి ప్రపంచ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. -
11 ఏళ్ల వయసులోనే చాంపియన్.. బ్రిలియంట్ పంకజ్
మన దేశంలో పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు ఆరాధించే ఆటగాళ్ల జాబితాలో అతను ఉండడు..! ఎందుకంటే అతను క్రికెటర్ కాదు! అతను సాధించిన విజయాలపై అన్ని వైపుల నుంచీ ఎప్పుడూ పెద్దగా చర్చ జరగదు..! ఎందుకంటే అతనేమీ ఒలింపిక్స్ పతకం గెలవలేదు! పాపులారిటీ పరంగా చూస్తే ఆ జాబితాలో అతని పేరు ఎక్కడా కనిపించదు! కానీ.. అతను విశ్వ వేదికలపై నమోదు చేసిన ఘనతలేమీ చిన్నవి కావు! అసాధారణ ఆటతో అతను చూపించిన ఫలితాలు అసమానం! బిలియర్డ్స్, స్నూకర్ టేబుల్స్‌పై అతను అందుకున్న విజయాలు నభూతో..! ‘క్యూ’ స్పోర్ట్స్‌లో విశ్వవ్యాప్తంగా వేర్వేరు వేదికలపై వరుస విజయాలతో సత్తా చాటిన ఆ దిగ్గజమే పంకజ్ అద్వానీ! ఏకంగా 25 వరల్డ్ టైటిల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన స్టార్. పంకజ్ అద్వానీకి అప్పుడు సరిగ్గా ఐదేళ్లు.. తండ్రి వ్యాపారరీత్యా ఆ కుటుంబం కొన్నేళ్లుగా కువైట్‌లోనే స్థిరపడిపోయింది. దానికి సంబంధించిన ఒక పని కోసం పంకజ్ తండ్రి అర్జున్ అద్వానీ కుటుంబంతో సహా వారం రోజుల పాటు బెల్గ్రేడ్కు వెళ్లాడు. పని ముగిసిన తర్వాత వారంతా తిరిగి కువైట్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అప్పుడే హోటల్ యాజమాన్యం వీరి గదికి వచ్చి ‘మీరు కువైట్ వెళ్లే అవకాశం ఇక ఏమాత్రం లేదు. కువైట్‌లో యుద్ధం జరుగుతోంది. ఆ దేశాన్ని ఇరాక్ ఆక్రమించింది. విమానాలన్నీ బంద్. మీరు ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు’ అని చెప్పేశాడు. దాంతో పంకజ్ తండ్రి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కానీ ఏమీ చేయలేని స్థితిలో వ్యాపారం మొత్తం వదిలేసి నేరుగా భారత్‌కు వచ్చేశాడు. ముందుగా ముంబై చేరిన ఆ కుటుంబం ఆపై బెంగళూరులో స్థిరపడింది. అయితే దాన్నే తన జీవితంలో కీలకమైన మలుపుగా పంకజ్ చెప్పుకున్నాడు. కువైట్‌లో ఉండుంటే తాను బిలియర్డ్స్ వైపు వెళ్లకపోయేవాడినని, వ్యాపారంలోనే మునిగిపోయేవాడినని అతను అన్నాడు. తన సన్నిహితులు కొందరి కారణంగా, సరదాగా ఆ ఆట వైపు ఆకర్షితుడైన తను భవిష్యత్తులో అదే ఆటలో స్టార్‌గా ఎదుగుతానని పంకజ్ కూడా ఏనాడూ ఊహించలేదు. జూనియర్ స్థాయి నుంచే.. ఒక్కసారి ‘టేబుల్’ ఓనమాలు నేర్చుకున్న తర్వాత పంకజ్‌కు ఏనాడూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 11 ఏళ్ల వయసులోనే రాష్ట్ర స్థాయిలో బిలియర్డ్స్ టైటిల్ గెలిచిన తర్వాత 15 ఏళ్ల వయసులో జాతీయ జూనియర్ చాంపియన్ షిప్ కూడా సొంతం చేసుకున్నాడు. జాతీయ జూనియర్ స్థాయి బిలియర్డ్స్, స్నూకర్ టైటిల్స్ మాత్రమే కాదు.. 17 ఏళ్లకే జాతీయ సీనియర్ స్నూకర్ ట్రోఫీ గెలిచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. తుది ఫలితాలు మాత్రమే కాదు.. అతని ఆటను చూసినప్పుడే మున్ముందు పెద్ద విజయాలు సాధించగలడని, గత తరం భారత బిలియర్డ్స్ దిగ్గజం గీత్ సేథీ సాధించిన ఘనతలను అధిగమించగలడని ‘క్యూ’ స్పోర్ట్స్ నిపుణులు పంకజ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత వాస్తవరూపం దాల్చడం విశేషం. ఒకటి తర్వాత మరొకటి.. అపార ప్రతిభ ఉన్నా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పోటీ కారణంగా పంకజ్‌కు ఆరంభంలోనే విశ్వ వేదికలపై విజయాలు దక్కలేదు. అయితే 14 ఏళ్లకే ఇంగ్లండ్‌లో వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్లో పాల్గొని అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరో నాలుగేళ్ల తర్వాత తొలిసారి వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్లో గెలవడంతోనే అతను ఏమిటో అందరికీ తెలిసింది. 18 ఏళ్ల వయసులో సాధించిన ఈ తొలి టైటిల్‌తో పంకజ్ విజయప్రస్థానం ఘనంగా మొదలైంది. ఆ తర్వాత ఎదురులేకుండా సాగిన అతని జోరు ఏకంగా 25వ ప్రపంచ టైటిల్ వరకు సాగింది. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా అతని ఆటకు ట్రోఫీలన్నీ దరి చేరాయి. ఈ క్రమంలో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో ఘనతలను అందుకున్న పంకజ్ తన పేరిట పలు రికార్డులను నమోదు చేశాడు. స్టీవ్ డేవిస్, జాన్ హిగిన్స్, జడ్ టంప్, డింగ్హుయ్.. ఇలా అప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన దిగ్గజాలను పంకజ్ వరుసగా ఓడిస్తూ వచ్చాడు. వరల్డ్ బిలియర్డ్స్‌లో ఒక అరుదైన రికార్డు పంకజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రీడలో ఉన్న రెండు ఫార్మాట్లు (టైమ్ అండ్ పాయింట్)లలో విశ్వ విజేతగా నిలిచిన తొలి ఆటగాడిగా అతను ఘనత వహించాడు. ఒకే సమయంలో వరల్డ్ చాంపియన్ , కాంటినెంటల్ (ఆసియా) చాంపియన్ గా కూడా ఉన్న ఏకైక ఆటగాడిగా పంకజ్ నిలిచాడు. ఒలింపిక్స్ ఒక్కటే గొప్ప కాదు దురదృష్టవశాత్తూ బిలియర్డ్స్, స్నూకర్లలో ఏ ఆటకు కూడా ఒలింపిక్స్‌లో చోటు లేదు. పంకజ్ ఇన్నేళ్ల ప్రదర్శనను చూస్తే ఒలింపిక్స్‌లో అతను కచ్చితంగా పతకాలు సాధించగలిగేవాడని ఎవరైనా చెప్పగలరు. ఇదే విషయాన్ని గతంలో ఒక అభిమాని పంకజ్‌కు గుర్తు చేశాడు. ఇన్ని ఘనతలతో పాటు ఒలింపిక్స్ పతకం సాధించి ఉంటే ‘ఆల్‌టైమ్ గ్రేట్’ అయ్యేవాడివి అంటూ అతను వ్యాఖ్యానించాడు. దీనిపై పంకజ్ తనదైన శైలిలో స్పందించాడు. ‘అంతా బాగుంది అంటున్నారు సరే.. ఏ క్రీడాకారుడైనా ఒలింపిక్స్ పతకం గెలిస్తేనే గొప్పా, అది లేకపోతే తక్కువా?! నాలుగేళ్లకు ఒకసారి చూపించే ప్రదర్శనను బట్టి ఒక క్రీడాకారుడి గొప్పతనాన్ని అంచనా వేస్తారా? నా దృష్టిలో దానికంటే నా దేశం తరఫున వరుసగా నాలుగేళ్ల పాటు నాలుగు వరల్డ్ చాంపియన్ షిప్‌లు గెలవడం కూడా గొప్పే. నేను దానిని ఇష్టపడతాను’ అంటూ అతను జవాబిచ్చాడు. విజయాల జాబితా (మొత్తం 25 ప్రపంచ టైటిల్స్) వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ (పాయింట్ ఫార్మాట్) – 8 వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ (లాంగ్ ఫార్మాట్) – 8 వరల్డ్ టీమ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ – 1 వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్ (15 రెడ్స్) – 3 వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్ (6 రెడ్స్) – 2 6 రెడ్ స్నూకర్ వరల్డ్ కప్ – 1 స్నూకర్ వరల్డ్ టీమ్ కప్ – 1 స్నూకర్ వరల్డ్ టీమ్ చాంపియన్య్ షిప్ – 1 ఆసియా క్రీడలు – 2 స్వర్ణాలు (2006, 2010) ఆసియా చాంపియన్ షిప్‌లు – 12 జాతీయ చాంపియన్ షిప్‌లు – 34 -
World Snooker Championship 2022: నాకౌట్ దశకు పంకజ్ అద్వానీ
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ పంకజ్ అద్వానీ నాకౌట్ దశకు అర్హత సాధించాడు. టర్కీలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో గ్రూప్ ‘కె’లో ఉన్న పంకజ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలిచాడు. తొలి మ్యాచ్‌లో పంకజ్ 3–0తో రెహమాన్ (టర్కీ)పై, రెండో మ్యాచ్‌లో 3–0తో సమీర్ (ఈజిప్ట్) పై, మూడో మ్యాచ్‌లో 3–0తో మార్కో రీజెర్స్ (నెదర్లాండ్స్)పై నెగ్గాడు. 37 ఏళ్ల పంకజ్ ఇప్పటి వరకు వివిధ ఫార్మాట్లలో కలిపి 25సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. -
IBSF World Billiards Championship: పంకజ్ ఖాతాలో 25వ ప్రపంచ టైటిల్
కౌలాలంపూర్: క్యూ స్పోర్ట్స్ (బిలియర్స్, స్నూకర్)లో భారత దిగ్గజ ప్లేయర్ పంకజ్ అద్వానీ విశ్వ వేదికపై మరోసారి మెరిశాడు. మలేసియాలో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ 150 పాయింట్ల ఫార్మాట్లో ఈ బెంగళూరు ఆటగాడు చాంపియన్‌గా నిలిచాడు. బిలియర్స్, స్నూకర్లలో వివిధ ఫార్మాట్లలో కలిపి పంకజ్‌కిది 25వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారితో శనివారం జరిగిన ఫైనల్లో 37 ఏళ్ల పంకజ్ అద్వానీ 4–0 (151–0, 150–31, 153–12, 150–29) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. ఆద్యంతం పూర్తి ఏకాగ్రతతో ఆడిన పంకజ్ ఏదశలోనూ తన ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి ఫ్రేమ్‌లో బ్రేక్ లేకుండా 149 పాయింట్లు స్కోరు చేసిన పంకజ్ ఆ తర్వాతి ఫ్రేమ్‌లలోనూ అదే జోరు కొనసాగించాడు. మ్యాచ్ మొత్తంలో కొఠారి కేవలం 72 పాయింట్లు స్కోరు చేయగా... పంకజ్ 604 పాయింట్లు సాధించడం అతని ఆధిపత్యాన్ని సూచిస్తోంది. ఈ గెలుపుతో పంకజ్ ఒకే ఏడాది జాతీయ, ఆసియా, ప్రపంచ బిలియర్స్ టైటిల్స్‌ను ఐదోసారి సాధించడం విశేషం. ఓవరాల్‌గా 150 పాయింట్ల ఫార్మాట్లో పంకజ్‌దికి ఐదో ప్రపంచ టైటిల్. చివరిసారి ఈ టోర్నీ 2019లో జరిగింది. ఆ ఏడాది కూడా పంకజ్‌కే టైటిల్ దక్కింది. కరోనా కారణంగా గత రెండేళ్లు ఈ టోర్నీని నిర్వహించలేదు. ‘వరుసగా ఐదేళ్లు ప్రపంచ టైటిల్‌ను నిలబెట్టుకోవడం కలలాంటిదే. ఈ ఏడాది ప్రతి టోర్నీలో నా ఆటతీరుపట్ల సంతృప్తి చెందాను. ప్రపంచస్థాయిలో భారత్‌కు మరో టైటిల్ అందించినందుకు ఆనందంగా ఉంది’ అని పంకజ్ వ్యాఖ్యానించాడు. 8: పాయింట్ల ఫార్మాట్లో పంకజ్ సాధించిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2008, 2014, 2016, 2017, 2018, 2019, 2022). 8: లాంగ్ ఫార్మాట్లో పంకజ్ గెలిచిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2007, 2008, 2009, 2012, 2014, 2015, 2018). 8: స్నూకర్‌లో పంకజ్ సొంతం చేసుకున్న ప్రపంచ టైటిల్స్ (15 రెడ్స్: 2003, 2015, 2107; 6 రెడ్స్: 2014, 2015, 2021), వరల్డ్ టీమ్ కప్ (2018), వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (2019). 1: పంకజ్ నెగ్గిన ప్రపంచ బిలియర్డ్స్ టీమ్ టైటిల్స్ సంఖ్య (2014). -
పంకజ్ అద్వానీ ఖాతాలో ఎనిమిదో ఆసియా టైటిల్
దోహా: భారత మేటి క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) ప్లేయర్ పంకజ్ అద్వానీ ఎనిమిదోసారి ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచాడు. శనివారం జరిగిన ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో 36 ఏళ్ల పంకజ్ 6–2 (101–66, 100–0, 101–29, 44–100, 104–90, 101–21, 88–100, 101–78) ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కే చెందిన ధ్రువ్ సిత్వాలాపై గెలుపొందాడు. 2005, 2008, 2009, 2010, 2012, 2017, 2018లలో కూడా పంకజ్ ఆసియా బిలియర్డ్స్ టైటిల్‌ను సాధించాడు. -
వారెవ్వా పంకజ్.. పాక్ ఆటగాడిపై నెగ్గి.. 24వ టైటిల్!
Pankaj Advani Wins 6 Red Snooker World Cup In Doha: భారత స్టార్ పంకజ్ అద్వానీ వారం రోజుల వ్యవధిలో మరో అంతర్జాతీయ టైటిల్ సాధించాడు. గత గురువారం ఆసియా స్నూకర్ టైటిల్‌ను నిలబెట్టుకున్న పంకజ్ దోహాలో మంగళవారం ముగిసిన 6 రెడ్స్ వరల్డ్‌కప్ స్నూకర్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో పంకజ్ 7–5 (42–13, 14–38, 53–0, 42–19, 1–53, 47–17, 44–0, 36–3, 0–43, 12–46, 15–59, 53–5) ఫ్రేమ్‌ల తేడాతో బాబర్ మసీ (పాకిస్తాన్)పై నెగ్గాడు. పంకజ్‌కు 12 వేల డాలర్ల (రూ. 8 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. కాగా అతడి కెరీర్లో ఇది 24 వ వరల్డ్ టైటిల్ కావడం విశేషం. చదవండి: PBKS vs RR: పరాజయానికి పంజాబ్ పిలుపు -
Pankaj Advani: ఆసియా స్నూకర్ టైటిల్ నిలబెట్టుకున్న పంకజ్ అద్వానీ
భారత మేటి ప్లేయర్ పంకజ్ అద్వానీ ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. దోహాలో గురువారం జరిగిన ఫైనల్లో పంకజ్ 6–3 ఫ్రేమ్‌ల తేడాతో అమీర్ సర్ఖోష్ (ఇరాన్)పై గెలిచాడు. స్నూకర్, బిలియర్డ్స్ క్రీడాంశాల్లో కలిపి పంకజ్ ఖాతాలో ఇప్పటివరకు 11 ఆసియా టైటిల్స్ చేరడం విశేషం. 2019లో పంకజ్ విజేతగా నిలువగా... కరోనా కారణంగా గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌ను నిర్వహించలేదు. డేవిస్ కప్ గ్రూఫ్-1: ఫిన్లాండ్తో తలపడనున్న భారత్ ఎస్పూ (ఫిన్లాండ్): డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1 పోరులో భాగంగా భారత్... ఫిన్లాండ్ తో తలపడనుంది. సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్కుమార్లపైనే భారత్ ఆశలు పెట్టు కుంది. డబుల్స్‌లో అనుభవజ్ఞుడైన రోహన్ బోపన్న ఉన్నప్పటికీ అతను ఫామ్‌లో లేడు. ఇలాంటి పరిస్థితుల్లో దివిజ్ శరణ్‌తో కలిసి బరిలోకి దిగనున్న అతను ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. శుక్రవారం జరిగే సింగిల్స్ మ్యాచ్‌ల్లో ప్రపంచ 165వ ర్యాంకర్ ప్రజ్నేశ్‌తో 419వ ర్యాంకర్ ఒట్టో విర్టనెన్; 187వ ర్యాంకర్ రామ్‌కుమార్‌తో 74వ ర్యాంకర్ ఎమిల్ రుసువురి తలపడతారు. శనివారం డబుల్స్, రెండు రివర్స్ సింగిల్స్ జరుగుతాయి. -
అద్వానీ ఖాతాలోమరో జాతీయ టైటిల్
పుణే: భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. సీనియర్ జాతీయ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ లో అద్వానీ విజేతగా నిలిచాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో అతను 5–2 ఫ్రేమ్స్ తేడాతో సౌరవ్ కొఠారీపై విజయం సాధించాడు. తొలి ఫ్రేమ్ కోల్పోయిన అద్వానీ 13–150, 152–12, 151–0, 62–150, 150–45, 150–48, 150–2తో ప్రత్యర్థిని ఓడించాడు. ఓవరాల్‌గా జాతీయ స్థాయిలో ఈ వెటరన్ క్యూ స్పోర్ట్స్ స్టార్‌కు 33వ టైటిల్ కాగా... సీనియర్ కేటగిరీలో పదో టైటిల్. 3, 4 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో ధ్వజ్ హరియా 3–0తో బ్రిజేశ్ దమానిపై గెలుపొందాడు. -
పంకజ్ ఖాతాలో 23వ ప్రపంచ టైటిల్
మండలే (మయన్మార్): భారత క్యూ స్పోర్ట్స్ దిగ్గజం పంకజ్ అద్వానీ మరో ప్రపంచ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఆదిత్య మెహ్రాతో జతకట్టిన అద్వానీ తాజాగా ప్రపంచ టీమ్ స్నూకర్ చాంపియన్íÙప్లో విజేతగా నిలిచాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) మెగా ఈవెంట్లో బుధవారం జరిగిన ఫైనల్లో అద్వానీ–మెహ్రా జోడీ 5–2 ఫ్రేమ్‌ల తేడాతో పొంగ్సకార్న్–పొరమిన్ (థాయ్‌లాండ్) జంటపై విజయం సాధించింది. బెస్టాఫ్ 9 ఫ్రేమ్‌ల తుదిపోరులో భారత అగ్రశ్రేణి జోడీ 65–31, 9–69, 55–8, 21–64, 55–44, 52–23, 83–9తో థాయ్ జంటను కంగుతినిపించింది. అంతకుముందు సెమీఫైనల్లో భారత ద్వయం 4–1 ఫ్రేమ్‌ల తేడాతో థాయ్‌లాండ్‌కే చెందిన తనవత్ తిరపొంగ్పైబూన్–క్రిత్సనుత్ లెర్ట్సటయతోర్న్ జంటపై ఘనవిజయం సాధించింది. ఇటీవలే వ్యక్తిగత ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ నెగ్గిన అద్వానీ ఇప్పుడు 23వ ప్రపంచ చాంపియన్íÙప్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదిత్య మెహ్రాకు మాత్రం ఇదే తొలి టైటిల్. -
బిలియర్డ్స్ రాజు మళ్లీ అతడే
భారత ‘క్యూ’స్పోర్ట్ కింగ్ పంకజ్ అద్వానీ మళ్లీ ప్రపంచ రారాజు అయ్యాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్‌లో ఏ ఫార్మాట్ ఎదురైనా తను మాత్రమే చాంపియన్ అని మరోసారి ఘనంగా చాటాడు. అద్భుతమైన ప్రదర్శనతో కెరీర్లో 22వ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గాడు. అతని జోరు చూస్తుంటే టైటిళ్ల రజతోత్సవం (25) జరుపుకున్నా ఆశ్చర్యం లేదు. మండాలే (మయన్మార్): క్యూ స్పోర్ట్స్‌కే వన్నె తెచ్చిన భారత చాంపియన్ ఆటగాడు పంకజ్ అద్వానీ మళ్లీ విశ్వవిజేతగా నిలిచాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ లో పంకజ్ గెలుపొందాడు. తాజాగా 150–అప్ ఫార్మాట్లో టైటిల్ సాధించాడు. అతని కెరీర్లో ఇది 22వ ఐబీఎస్ఎఫ్ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. 150–అప్ అనేది బిలియర్డ్స్‌లో పొట్టి ఫార్మాట్ కాగా... ఇందులో గత ఆరేళ్లలో పంకజ్ అద్వానీ ఐదు టైటిల్స్ సాధించాడు. ఆదివారం జరిగిన పోరులో 6–2 ఫ్రేమ్‌లతో స్థానిక మయన్మార్ ఆటగాడు నే త్వే వూపై విజయం సాధించాడు. గతేడాది జరిగిన ఫైనల్లోనూ వీళ్లిద్దరే తలపడ్డారు. ఆదివారం గత ఫైనల్‌కు రిపీట్‌గా జరిగిన పోరులో చిత్రంగా అదే ఫ్రేమ్‌ల (6–2) తేడాతో పంకజ్ గెలుపొందడం విశేషం. మ్యాచ్ అర్ధభాగం ముగిసేసరికి 145–4, 89–66, 127–50 స్కోరుతో 3–0 ఫ్రేమ్‌లతో పంకజ్ జోరుమీదుండగా... ప్రత్యర్థి తేరుకోలేకపోయాడు. విరామానంతరం కూడా అద్వానీ 63–0, 62–50 స్కోరుతో దూసుకెళ్లడంతో నే త్వే వూ ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. చివరకు 50–69, 64–105తో ప్రత్యర్థి రెండు ఫ్రేమ్‌లు గెలిచాడు. ఆఖరి ఫ్రేమ్‌ను 74–63తో గెలవడంతో పంకజ్ ప్రపంచ విజేతగా నిలిచాడు. 2003లో తొలిసారి చాంపియన్‌షిప్ అందుకున్న అద్వానీ తదనంతరం టైమ్ ఫార్మాట్లో 8 సార్లు, పాయింట్స్ ఫార్మాట్లో 6 సార్లు ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ సాధించాడు. స్నూకర్‌లో ఐదుసార్లు విజేతగా నిలిచిన భారత క్యూ స్టార్ ప్రపంచ టీమ్ బిలియర్డ్స్, టీమ్ స్నూకర్‌లో ఒక్కోసారి విజయం సాధించాడు. ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ప్రతీసారి నాకో విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ మెగా టోరీ్నలో రాణించాలనే కసి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అందువల్లే ఆటలో నా దూకుడు, టైటిళ్ల ఆకలి కొనసాగుతూ ఉంది’ అని పంకజ్ అన్నాడు. -
వరల్డ్ కప్ స్నూకర్ ఫైనల్లో భారత్
అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) వరల్డ్ కప్ స్నూకర్ టోర్నమెంట్లో పంకజ్ అద్వానీ, లక్ష్మణ్ రావత్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. దోహాలో సోమవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 3–2 (57–59, 7–76, 101–9, 66–16, 75–34) ఫ్రేమ్‌ల తేడాతో బ్రెండన్ ఒడొనోగుయె, ఆరన్ హిల్‌లతో కూడిన ఐర్లాండ్ జట్టుపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్ (అస్జద్ ఇక్బాల్, మొహమ్మద్ బిలాల్)తో భారత్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ 3–1తో ఖతర్‌పై గెలిచింది. -
ఆసియా టీమ్ స్నూకర్ రన్నరప్ భారత్
దోహా: ఆసియా టీమ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ, లక్ష్మణ్ రావత్, ఆదిత్య మెహతాలతో కూడిన భారత్ 2–3 (1–79, 1–71, 58–18, 67–39, 9–69) ఫ్రేమ్‌ల తేడాతో పాకిస్తాన్–2 జట్టు చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో టీమిండియా 3–2 (95–46, 55–42, 28–74, 43–51, 69–29) ఫ్రేమ్‌ల తేడాతో మయన్మార్ జట్టును ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 3–0 (98–0, 74–22, 68–17) ఫ్రేమ్‌లతో పాకిస్తాన్–1 జట్టుపై విజయం సాధించింది. -
పంకజ్ అద్భుత విజయం
దోహా: ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 5–4 (31–68, 1–54, 40–76, 1–96, 78–8, 89–33, 55–14, 89–24, 52–26) ఫ్రేమ్‌ల తేడాతో అస్జద్ ఇక్బాల్ (పాకిస్తాన్)పై అద్వితీయ విజయం సాధించాడు. బెస్ట్ ఆఫ్–9 ఫ్రేమ్‌ల పద్ధతిలో జరిగిన సెమీఫైనల్లో పంకజ్ తొలి నాలుగు ఫ్రేమ్‌లను చేజార్చుకొని ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే పంకజ్ అనూహ్యంగా పుంజుకొని ఆ తర్వాత వరుసగా ఐదు ఫ్రేమ్‌లను సొంతం చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకోవడం విశేషం. నేడు జరిగే ఫైనల్లో థనావత్ తిరపోంగ్పైబూన్ (థాయ్‌లాండ్)తో పంకజ్ తలపడతాడు. క్వార్టర్ ఫైనల్లో పంకజ్ 5–4తో ఆదిత్య మెహతా (భారత్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–1తో ఫంగ్ క్వోక్ వాయ్ (హాంకాంగ్)పై, రెండో రౌండ్లో 4–2తో నొప్పడన్ సాంగ్నిల్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. -
పంకజ్‌కు పతకం ఖాయం
దోహా: భారత స్టార్ క్యూయిస్ట్, 21 సార్లు ప్రపంచ చాంపియన్ పంకజ్ అద్వానీ ఖాతాలో మరో పతకం చేరనుంది. ఖతార్‌లోని దోహాలో జరుగుతున్న ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. తద్వారా కనీసం కాంస్యం ఖాయం చేసుకున్నాడు. గురువారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ఫైనల్స్ మ్యాచ్‌లో పంకజ్ 5–4 (0–99, 1–60, 64–50, 97–0, 35–90, 113–0, 8–107, 61–16, 72–48)తో మన దేశానికే చెందిన ఆదిత్య మెహతాపై చెమటోడ్చి నెగ్గాడు. ఒక దశలో మెహతా 4–3తో నెగ్గేలా కనిపించినప్పటికీ అనూహ్యంగా పుంజుకున్న పంకజ్ ఆఖరి రెండు రౌండ్లలోనూ నెగ్గి విజయ కేతనం ఎగరవేశాడు. ఈ గెలుపుతో టోర్నీలో మిగిలిన ఏకైక భారత క్రీడాకారుడిగా నిలిచిన పంకజ్.. సెమీఫైనల్లో అస్జాద్ ఇక్బాల్(పాకిస్థాన్)తో తలపడతాడు. -
పంకజ్‌కు కాంస్యం
చండీగఢ్: ఆసియా బిలియర్డ్స్ చాంపియన్ షిప్లో డిఫెండింగ్ చాంపియన్, భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 3–5 (98–100, 102–23, 15–100, 9–100, 101–76, 0–101, 102–3, 11–101) ఫ్రేమ్‌ల తేడాతో ప్రపుర్ట్ చైతానసకున్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడాడు. మరో సెమీఫైనల్లో నే త్వా ఓ (మయన్మార్) 5–3తో చిట్ కో కో (మయన్మార్)పై గెలిచి టైటిల్ కోసం ప్రపుర్ట్తో పసిడి పతక పోరుకు సిద్ధమయ్యాడు. -
ప్రపంచ టైటిల్ @ 21
యాంగూన్ (మయన్మార్): ప్రపంచ టైటిల్ సాధించడం ఇంత సులువా అన్నట్లు... ఫార్మాట్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా ఎదురే లేదన్నట్లు... బిలియర్డ్స్ దిగ్గజం పంకజ్ అద్వానీ తన ఖాతాలో మరో ఘనతను నమోదు చేసుకున్నాడు. ఈ ఏడాది నాలుగో ప్రపంచ టైటిల్ నెగ్గాడు. ఆదివారం ఇక్కడ జరిగిన ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ లాంగ్ అప్ ఫార్మాట్ ఫైనల్లో అతడు 1500–299 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన భాస్కర్ బాలచంద్రను అతి సునాయాసంగా ఓడించాడు. అతడీ టైటిల్‌ను రికార్డు స్థాయిలో నాలుగోసారి నెగ్గడం విశేషం. కాగా, పంకజ్‌కిది కెరీర్లో 21వ ప్రపంచ టైటిల్. గత గురువారం ఇదే వేదికపై జరిగిన 150 పాయింట్ల ఫార్మాట్లోనూ పంకజ్ టైటిల్ సాధించాడు. ‘తాజా విజయంతో నేను శిఖరంపై ఉన్నాను. ఈ విభాగంలో ఎంతోమంది మేటి ఆటగాళ్లు ఉన్నారు. వారం వ్యవధిలోనే టైమ్ ఫార్మాట్‌తోపాటు లాంగ్ అప్ ఫార్మాట్లోనూ ప్రపంచ టైటిల్స్ గెలవడం అమితానందాన్నిస్తోంది. రాబోయే పది రోజుల్లో ప్రపంచ స్నూకర్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఉన్నాను’ అని బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల పంకజ్ అద్వానీ వ్యాఖ్యానించాడు. గతంలో పంకజ్... బిలియర్డ్స్ టైమ్ ఫార్మాట్లో ఎనిమిది సార్లు (2018, 2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005)... పాయింట్ల ఫార్మాట్లో ఆరుసార్లు (2018, 2017, 2016, 2014, 2008, 2005)... వరల్డ్ స్నూకర్ టీమ్ విభాగంలో ఒకసారి (2018), వరల్డ్ స్నూకర్ వ్యక్తిగత విభాగంలో మూడుసార్లు (2017, 2015, 2003)... వరల్డ్ సిక్స్ రెడ్ స్నూకర్ వ్యక్తిగత విభాగంలో రెండుసార్లు (2015, 2014)... వరల్డ్ టీమ్ బిలియర్డ్స్ విభాగంలో (2014) ఒకసారి టైటిల్స్ గెలిచాడు. -
అద్వానీ అదరహో
యాంగన్ (మయన్మార్): అంతర్జాతీయ వేదికపై భారత క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ 150 అప్ పాయింట్ల ఫార్మాట్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన ఫైనల్లో బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల పంకజ్ 6–2 (150–21, 0–151, 151–0, 4–151, 151–11, 150–81, 151–109, 151–0) ఫ్రేమ్‌ల తేడాతో నే థ్వె ఓ (మయన్మార్)పై విజయం సాధించాడు. లీగ్ దశలో తన ప్రత్యర్థులకు ఒక్క ఫ్రేమ్ కోల్పోకుండా గ్రూప్ టాపర్‌గా నిలిచిన పంకజ్ అదే జోరును నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ కొనసాగించి విజయాన్ని దక్కించుకున్నాడు. పాయింట్ల ఫార్మాట్లో పంకజ్‌దికి వరుసగా మూడో ప్రపంచ టైటిల్ కావడం విశేషం. 2016లో బెంగళూరులో, 2017లో దోహాలో జరిగిన మెగా ఈవెంట్స్‌లోనూ అతను టైటిల్స్ గెలిచాడు. -
పంకజ్‌కు కాంస్యం
దోహా: ఆసియా టూర్ రెడ్–10 స్నూకర్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీకి కాంస్య పతకం లభించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 0–5 (1–48, 8–61, 37–48, 41–71, 25–66) ఫ్రేమ్‌ల తేడాతో బ్రెండన్ ఒ డొనొగుయె (ఐర్లాండ్) చేతిలో ఓడిపోయాడు. బెస్ట్ ఆఫ్–9 ఫ్రేమ్స్ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్‌లో వివిధ ఫార్మాట్లలో 19 సార్లు ప్రపంచ టైటిల్ గెలిచిన పంకజ్ ఒక్క ఫ్రేమ్‌ను కూడా గెలవకపోవడం గమనార్హం. మరో సెమీఫైనల్లో మొహమ్మద్ బిలాల్ (పాకిస్తాన్) 5–4 ఫ్రేమ్‌లతో చెయుంగ్ కా వాయ్ (హాంకాంగ్)పై విజయం సాధించి బ్రెండన్‌తో టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. -
ఆసియా స్నూకర్ రన్నరప్ భారత్
దోహా: ఆసియా టీమ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ, మల్కీత్ సింగ్‌లతో కూడిన భారత్–1 జట్టు రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్–1 జట్టు 2–3 (2–110, 81–47, 70–72, 107–5, 18–98) ఫ్రేమ్‌ల తేడాతో మొహమ్మద్ ఆసిఫ్, బాబర్ మసీలతో కూడిన పాకిస్తాన్–1 జట్టు చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్స్‌లో భారత్–1 జట్టు 3–2 ఫ్రేమ్‌ల తేడాతో మొహమ్మద్ మాజిద్ అలీ, మొహమ్మద్ బిలాల్‌లతో కూడిన పాకిస్తాన్–2 జట్టుపై... పాకిస్తాన్–1 జట్టు 3–1 ఫ్రేమ్‌ల తేడాతో వు యిజి, పాంగ్‌జున్‌జులతో కూడిన చైనా జట్టుపై విజయం సాధించాయి. -
ధోని... ఇప్పుడు ‘పద్మభూషణ్’
న్యూఢిల్లీ: ఏప్రిల్ 2, 2011... భారత క్రికెట్ అభిమానులు మర్చిపోలేని రోజు. ధోని సిక్సర్‌తో వన్డే ప్రపంచకప్ అందించిన రోజు. ఇపుడు సరిగ్గా ఏడేళ్ల తర్వాత మళ్లీ ఏప్రిల్ 2న ధోని ‘పద్మభూషణ్’ అవార్డు అందుకున్నాడు. భారత మూడో అత్యున్నత పౌర పురస్కారమైన ఈ అవార్డును మాజీ కెప్టెన్ ఆర్మీ డ్రెస్‌లో అందుకోవడం మరో విశేషం. సోమవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగిన ఈ వేడుకలో లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ హోదా) అయిన ధోని... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకునేందుకు మిలిటరీ డ్రస్‌లో వచ్చాడు. 2007లో టి20 ప్రపంచకప్, అనంతరం వన్డే ప్రపంచకప్ అందించిన ధోనిని భారత ఆర్మీ 2011, నవంబర్ 1న లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో సత్కరించింది. రెండు ఆసియా గేమ్స్ (2006, 2010)లలో భారత్‌కు బంగారు పతకాలు అందించడంతోపాటు కెరీర్లో మొత్తం 19 సార్లు వివిధ ఫార్మాట్లలో ప్రపంచ టైటిల్స్ నెగ్గిన క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీకి కూడా రాష్ట్రపతి ‘పద్మభూషణ్’ అవార్డు అందజేశారు. -
పంకజ్ ఏడోస్సారి...
యాంగాన్ (మయన్మార్): ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ టైటిల్ నిలబెట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ బెంగళూరు ప్లేయర్ ఫైనల్లో 6–1 ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కే చెందిన బాలచంద్ర భాస్కర్‌ను ఓడించాడు. ఓవరాల్‌గా పంకజ్‌కిది ఏడో ఆసియా బిలియర్డ్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో 2017, 2012, 2010, 2009, 2008, 2005లలో విజేతగా నిలిచాడు. అమీ కమాని అద్భుతం: ఇదే వేదికపై జరిగిన ఆసియా మహిళల స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి అమీ కమాని విజేతగా నిలిచింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఇండోర్‌కు చెందిన అమీకమాని ఫైనల్లో 3–0తో సిరిపపోర్న్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. -
ఫైనల్లో పంకజ్
యాంగాన్ (మయన్మార్): ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకునేందుకు భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ మరో విజయం దూరంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 5–1తో (100–72, 0–100, 100–30, 100–2, 100–6, 100–0) ధ్వజ్ హరియా (భారత్)పై గెలిచాడు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో ఇదే స్కోరుతో అంగ్ హెతె (మయన్మార్)ను ఓడించాడు. -
పంకజ్ శుభారంభం
యాంగాన్ (మయన్మార్): ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ పంకజ్ అద్వానీ శుభారంభం చేశాడు. తొలి లీగ్ మ్యాచ్‌లో పంకజ్ 4–0తో యో టెక్ షిన్ (సింగపూర్)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో రూపేశ్ షా (భారత్) 4–0తో సిహోమ్బింగ్ (ఇండోనేసియా)పై నెగ్గాడు. -
ప్రపంచ స్నూకర్ కప్ విజేత భారత్
దోహా: తొలిసారి నిర్వహించిన ప్రపంచ స్నూకర్ కప్ టీమ్ ఈవెంట్లో భారత్–1 జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. శుక్రవారం దోహాలో జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ–మానన్ చంద్రలతో కూడిన భారత్ 3–2తో మొహమ్మద్ ఆసిఫ్–బాబర్ మసీ సభ్యులుగా ఉన్న పాకిస్తాన్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో మానన్ చంద్ర 24–73తో బాబర్ చేతిలో... రెండో మ్యాచ్‌లో పంకజ్ అద్వానీ 56–61తో ఆసిఫ్ చేతిలో ఓడిపోవడంతో భారత్ 0–2తో వెనుకబడింది. అయితే మూడో మ్యాచ్‌లో పంకజ్–మానన్ చంద్ర ద్వయం 72–47తో ఆసిఫ్–బాబర్ జంటపై గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నాలుగో మ్యాచ్‌లో పంకజ్ 106–20తో బాబర్‌పై... ఐదో మ్యాచ్‌లో మానన్ చంద్ర 56–20తో ఆసిఫ్‌పై నెగ్గడంతో భారత్ విజయం ఖాయమైంది. -
‘పద్మ భూషణ్’ ధోని, పంకజ్
న్యూఢిల్లీ: తన నాయకత్వ పటిమతో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించిన మేటి క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని... క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో ప్రపంచ టైటిల్స్‌ను అలవోకగా సాధించే అలవాటున్న భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ కేంద్ర ప్రభుత్వం అం దించే దేశ అత్యున్నత మూడో పౌర పురస్కారం ‘పద్మ భూషణ్’కు ఎంపికయ్యారు. మరో నలుగురు క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్ (బ్యాడ్మింటన్–ఆంధ్రప్రదేశ్), సోమ్‌దేవ్ (టెన్నిస్–త్రిపుర), మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్–మణిపూర్), మురళీకాంత్ పేట్కర్ (స్విమ్మింగ్–మహారాష్ట్ర)లకు ‘పద్మశ్రీ’ పురస్కారాలు లభించాయి. జార్ఖండ్‌కు చెందిన 36 ఏళ్ల ధోని కెప్టెన్సీలో భారత్ టి20 వరల్డ్ కప్ (2007లో), వన్డే వరల్డ్ కప్ (2011లో), చాంపియన్స్ ట్రోఫీ (2013లో) టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ధోని 2014లో టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. 2009లో ‘పద్మశ్రీ’ పురస్కారం గెల్చుకున్న ధోని ప్రస్తుతం వన్డే, టి20 ఫార్మాట్లలో కొనసాగుతున్నాడు. కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల పంకజ్ అద్వానీ ఇప్పటివరకు 18 ప్రపంచ టైటిల్స్ సాధించాడు. గతేడాది వరల్డ్, ఆసియా స్నూకర్, బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచాడు. 2009లో ‘పద్మశ్రీ’ అవార్డు పొందిన పంకజ్ 2006లో ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’... 2004లో ‘అర్జున అవార్డు’ కూడా పొందాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ గతేడాది అద్వితీయ ప్రదర్శన చేశాడు. నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ (ఇండో నేసియా, ఆస్ట్రేలియన్, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్) సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. మణిపూర్‌కు చెందిన 23 ఏళ్ల మీరాబాయి చాను గతేడాది ప్రపంచ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. 1995లో కరణం మల్లీశ్వరి తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం నెగ్గిన రెండో లిఫ్టర్‌గా ఆమె గుర్తింపు పొందింది. త్రిపురకు చెందిన 32 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 2010 కామన్వెల్త్ గేమ్స్, 2010 ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించాడు. గతేడాది ఆటకు వీడ్కోలు పలికిన సోమ్‌దేవ్ డేవిస్‌కప్‌లో గొప్ప విజయాలు సాధించాడు. మహారాష్ట్రకు చెందిన 70 ఏళ్ల స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ 1972 పారాలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో 37.33 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణం సాధించడమే కాకుండా ప్రపంచ రికార్డు సృష్టించారు. పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించిన క్రీడాకారుడిగా చరిత్ర లిఖించారు. -
పంకజ్ 18వ సారి...
దోహా: మరోసారి అద్భుత ఆటతీరును ప్రదర్శించిన భారత క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ కెరీర్లో 18వ ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. సోమవారం ముగిసిన ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో 32 ఏళ్ల పంకజ్ అద్వానీ చాంపియన్‌గా నిలిచాడు. అమీర్ సర్ఖోష్ (ఇరాన్)తో జరిగిన ఫైనల్లో పంకజ్ 8–2 (19–71, 79–53, 98–23, 69–62, 60–5, 0–134, 75–7, 103–4, 77–13, 67–47) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 7–4 ఫ్రేమ్‌ల తేడాతో 15 ఏళ్ల ఫ్లోరియన్ నుబిల్ (ఆస్ట్రియా)పై; క్వార్టర్ ఫైనల్లో 6–2 ఫ్రేమ్‌ల తేడాతో లువో హాంగ్హావో (చైనా)పై గెలిచాడు. బెంగళూరుకు చెందిన పంకజ్ గతంలో ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్; 2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్; 2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... మూడు సార్లు ప్రపంచ స్నూకర్ (2017, 2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్‌ను సాధించాడు. -
క్వార్టర్ ఫైనల్లో పంకజ్ అద్వానీ
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఖతర్‌లోని దోహాలో శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో పంకజ్ 5–1 (69–8, 115–33, 75–56, 0–94, 101–18, 97–33) ఫ్రేమ్‌ల తేడాతో అసద్ ఇక్బాల్ (పాకిస్తాన్)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన 17 ఏళ్ల కుర్రాడు లువో హాంగ్హవోతో పంకజ్ తలపడతాడు. -
రెండో రౌండ్లో పంకజ్ అద్వానీ
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన నాకౌట్ తొలి రౌండ్లో పంకజ్ 4–0 (79–13, 54–2, 139–0, 74–1) ఫ్రేమ్‌ల తేడాతో అహ్మద్ సలూమీ (యెమెన్)పై విజయం సాధించాడు. లీగ్ దశలో గ్రూప్ ‘బి’లో పోటీపడిన పంకజ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టాపర్‌గా నిలిచాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగాడు. భారత్‌కే చెందిన అలోక్ కుమార్, లక్ష్మణ్ రావత్ కూడా నాకౌట్ తొలి రౌండ్లో గెలిచి ముందంజ వేశారు. -
మళ్లీ ప్రపంచాన్ని గెలిచాడు....
తాము ఎంచుకున్న ఆటలో ఒక్కసారైనా ప్రపంచ చాంపి యన్‌గా నిలవాలని క్రీడాకారులు కలలు కంటారు. అలాంటిది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా 17 సార్లు ప్రపంచ టైటిల్ సాధిస్తే ఆ ఘనత అసాధారణం. భారత క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) ప్లేయర్ పంకజ్ అద్వానీ అలాంటి ఘనతనే సాధించాడు. ప్రపంచ టైటిల్ అంటే తనకు మంచినీళ్లప్రాయంలా మారిందని నిరూపిస్తూ ఈ బెంగళూరు ఆటగాడు ఆదివారం మరోసారి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచాడు. దోహా: గత ఏడాది ఫలితాన్ని పునరావృతం చేస్తూ భారత స్టార్ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ (150 అప్ ఫార్మాట్) టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 6–2 (0–155, 150–128, 92–151, 151–0, 151–6, 151–0, 150–58, 150–21) ఫ్రేమ్‌ల తేడాతో తన చిరకాల ప్రత్యర్థి మైక్ రసెల్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. గత సంవత్సరం బెంగళూరులో జరిగిన ఈ మెగా ఈవెంట్లోనూ పంకజ్ చాంపియన్‌గా నిలిచాడు. రసెల్‌తో జరిగిన ఫైనల్లో పంకజ్‌కు శుభారంభం లభించలేదు. తొలి ఫ్రేమ్‌ను రసెల్ తన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దక్కించుకున్నాడు. అయితే రెండో ఫ్రేమ్‌లో పంకజ్ తేరుకొని స్కోరును సమం చేశాడు. మూడో ఫ్రేమ్‌ను కోల్పోయిన ఈ భారత స్టార్ నాలుగో ఫ్రేమ్ నుంచి తన జోరును ప్రదర్శించాడు. రసెల్‌కు కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుసగా ఐదు ఫ్రేమ్‌లు గెలిచి మ్యాచ్‌తోపాటు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్లో పంకజ్ 5–2తో రూపేశ్ షా (భారత్)పై, రసెల్ 5–1తో పీటర్ గిల్‌క్రిస్ట్ (ఇంగ్లండ్)పై గెలిచారు. సోమవారం ఇదే వేదికపై లాంగ్అప్ ఫార్మాట్లో ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ మొదలుకానుంది. ఈ ఫార్మాట్లోనూ పంకజ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. లాంగ్అప్ ఫార్మాట్ పోటీలు ముగిశాక ఈనెల 15న విజేతలకు ట్రోఫీలను అందజేస్తారు. తాజా విజయంతో పంకజ్ తన ఖాతాలో 17వ ప్రపంచ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. గతంలో పంకజ్ ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్–2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్–2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ స్నూకర్ (2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్‌ను సాధించాడు. -
‘క్యూ స్లామ్’కు శ్రీకారం
ఆగస్ట్ 19నుంచి మాస్టర్స్ లీగ్ హైదరాబాద్: బిలియర్డ్స్ క్రీడను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త తరహా ఆటను చూపించక తప్పని పరిస్థితి ఏర్పడిందని భారత దిగ్గజం, 16 సార్లు వరల్డ్ చాంపియన్ పంకజ్ అద్వానీ అభిప్రాయ పడ్డాడు. ఈ క్రమంలో తొలి సారి భారత్‌లో ‘క్యూ లీగ్’కు శ్రీకారం చుట్టినట్లు అతను చెప్పాడు. ‘ఇండియన్ క్యూ మాస్టర్స్ లీగ్’ పేరుతో ఆగస్టు 19నుంచి 25 వరకు ఈ టోర్నీ అహ్మదాబాద్‌లో జరుగుతుంది. స్పోర్ట్స్ లైవ్ సంస్థ ఈ లీగ్‌కు ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ హస్లర్స్, ఢిల్లీ డాన్స్, చెన్నై షార్క్స్, గుజరాత్ కింగ్స్, బెంగళూరు బడ్డీస్ పేర్లతో 5 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఒక్కో జట్టులో ఐదుగురు చొప్పున 25 మంది ఆటగాళ్లు ఈ లీగ్ బరిలోకి దిగుతున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో భారత బిలియర్డ్స్ సమాఖ్య కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం, స్పోర్ట్స్ లైవ్ ప్రతినిధులు ప్రసాద్, అతుల్ పాల్గొన్నారు. -
ఆసియా స్నూకర్ చాంప్ భారత్
బిష్కెక్ (కిర్గిస్తాన్): స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ అద్భుత ప్రదర్శనతో భారత్ ‘ఎ’ జట్టు ఆసియా స్నూకర్ టీమ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ‘బి’తో బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ ‘ఎ’ జట్టు 3–0తో విజయం సాధించింది. ఈ టోర్నీలో పంకజ్ అద్వానీ అజేయంగా నిలవడం విశేషం. ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్’ పద్ధతిలో జరిగిన ఫైనల్లో భారత్ మూడు మ్యాచ్‌లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లను నిర్వహించలేదు. తొలి మ్యాచ్‌లో పంకజ్ 87–5తో మొహమ్మద్ బిలాల్‌పై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో లక్ష్మణ్ రావత్ 133–0తో బాబర్ మాసిని ఓడించాడు. మూడో మ్యాచ్‌లో పంకజ్–లక్ష్మణ్ రావత్ ద్వయం 70–55తో బిలాల్–బాబర్ మాసి జోడీపై గెలిచింది. పంకజ్ అద్వానీ, లక్ష్మణ్ రావత్, మల్కీత్ సింగ్‌లతో కూడిన భారత బృందానికి అశోక్ శాండిల్య కోచ్‌గా వ్యవహరించారు. -
భారత్ x పాకిస్తాన్
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఇటీవలే క్రికెట్, హాకీ క్రీడాంశాల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకున్న భారత్ స్నూకర్ ఈవెంట్లోనూ పోరుకు సిద్ధమైంది. ఆసియా స్నూకర్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్ ‘ఎ’... పాకిస్తాన్ ‘బి’ జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. మంగళవారం జరిగిన సెమీఫైనల్స్‌లో పంకజ్ అద్వానీ, లక్ష్మణ్ రావత్‌లతో కూడిన భారత్ ‘ఎ’ జట్టు 3–0తో థాయ్‌లాండ్‌పై... పాకిస్తాన్ ‘బి’ 3–2తో పాకిస్తాన్ ‘ఎ’పై గెలుపొందాయి. నేడు ఫైనల్ జరుగుతుంది. ‘ఫైనల్ చేరే క్రమంలో మా ప్రదర్శనతో ఆకట్టుకున్నాం. పాక్‌తో ఫైనల్ పోరుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని పంకజ్ వ్యాఖ్యానించాడు. -
నాకౌట్ దశకు అద్వానీ
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా 6–రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ పంకజ్ అద్వానీ (భారత్) నాకౌట్ దశకు అర్హత సాధించాడు. గ్రూప్ దశలోని పంకజ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచాడు. తొలి మ్యాచ్‌లో 5–2తో ఫైతూన్ ఫోన్బన్ (థాయ్‌లాండ్)పై, రెండో మ్యాచ్‌లో 5–3తో అలీ రోషనికియా (ఇరాన్)పై, మూడో మ్యాచ్‌లో 5–3తో ఒమర్ అలీ (ఇరాక్)పై విజయం సాధించాడు. -
‘ఆసియా’ రన్నరప్ అద్వానీ
దోహా: తన కెరీర్లో లోటుగా ఉన్న ఆసియా స్నూకర్ (15–రెడ్ ఫార్మాట్) చాంపియన్‌షిప్ టైటిల్‌ను అందుకోవాలని ఆశించిన భారత స్టార్ పంకజ్ అద్వానీకి నిరాశ ఎదురైంది. శుక్రవారం ముగిసిన ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో 31 ఏళ్ల పంకజ్ 3–6 (32–95, 75–31, 43–69, 24–65, 78–0, 6–102, 61–48, 48–59, 69–71) ఫ్రేమ్‌ల తేడాతో 19 ఏళ్ల హావోతియాన్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. ఒకవేళ పంకజ్ గెలిచిఉంటే క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించేవాడు. బిలియర్డ్స్, స్నూకర్ క్రీడల్లో జాతీయ, ఆసియా, వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో లాంగ్, షార్ట్ ఫార్మాట్లలో టైటిల్స్ నెగ్గిన పంకజ్ ఖాతాలో ఆసియా (15–రెడ్ ఫార్మాట్) టైటిల్ మాత్రం ఇంకా చేరలేదు. -
సెమీఫైనల్లో పంకజ్ అద్వానీ
దోహా: భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో పంకజ్ 58–52, 102–0, 12–60, 60–31, 56–20, 71–59 తేడాతో మహ్మద్ అల్ జోయ్కర్ (యూఏఈ)పై గెలుపొందాడు. -
ఆసియా బిలియర్డ్స్ టోర్నీ విజేత అద్వానీ
భారత క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. చండీగఢ్‌లో శుక్రవారం ముగిసిన ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ విజేతగా నిలిచాడు. భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారితో జరిగిన ఫైనల్లో అద్వానీ 6–3 (54–101, 89–100, 100–9, 58–101, 100–0, 102–0, 100–0, 100–42, 101–0) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. అద్వానీ కెరీర్లో ఓవరాల్‌గా ఇది ఏడో ఆసియా టైటిల్. -
ఇంకా ఏం సాధించాలి?
వరుసగా రెండో ఏడాదీ తనకు పద్మభూషణ్ పురస్కారం దక్కకపోవడంపై భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 16 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తన ఘనత కేంద్రానికి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించాడు. ఇంకా ఏం సాధిస్తే ఈ పురస్కారం దక్కుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వెలిబుచ్చాడు. అద్వానీ పేరును మూడో అత్యున్నత పౌర పురస్కారానికి కర్ణాటక, భారత బిలియర్డ్స్ అండ్ స్నూకర్ సమాఖ్య (బీఎస్ఎఫ్ఐ) కేంద్రానికి ప్రతిపాదించాయి. అయితే ఈ ఏడాది ఏ ఆటగాడికీ పద్మభూషణ్ దక్కలేదు. దీంతో అద్వానీ తీవ్రంగా స్పందిస్తూ క్రీడల శాఖా మంత్రికి ట్వీట్ చేశారు. మరో వైపు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా తనకు అవార్డు లభించకపోవడంపై విమర్శలు చేసింది. అవార్డులు కావాలంటే సిఫారసులు చేసుకోవాలని, లేదంటే దక్కవన్న జ్వాల... దరఖాస్తు చేసుకునే ప్రక్రియనే ప్రశ్నించింది. -
16 ప్రపంచ టైటిళ్లు సాధించా.. ఇంకేం చేయాలి?
న్యూఢిల్లీ: 16 సార్లు ప్రపంచ బిలియర్డ్స్, స్నూకర్ చాంపియన్ టైటిల్ సాధించిన పంకజ్ అద్వానీ.. ఈ ఏడాది కూడా తనకు పద్మభూషణ్ అవార్డు రాకపోవడంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఈ అవార్డు రావాలంటే ఇంకా సాధించాలో తనకు అర్థంకావడం లేదని ప్రశ్నించాడు. బెంగళూరుకు చెందిన పంకజ్ గత ఎనిమిదేళ్లలో ఎనిమిది ప్రపంచ టైటిళ్లు సాధించాడు. భారత్ అత్యుత్తమ బిలియర్డ్స్, స్నూకర్ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. అతనికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వంతో పాటు భారత బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య.. కేంద్రానికి సిఫారసు చేశాయి. కాగా బుధవారం పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం అతని పేరును పరిగణలోకి తీసుకోలేదు. దీంతో నిరాశకు గురైన పంకజ్ సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇటీవల పుణెలో 28వ జాతీయ టైటిల్‌ను గెల్చుకున్న పంకజ్‌ను కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ అభినందించగా.. అందుకు అతను ధన్యవాదాలు తెలుపుతూ, తాను 16 ప్రపంచ టైటిళ్లు, ఆసియా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు సాధించానని, అయినా తనకు పద్మభూషణ్ అవార్డుకు పరిగణనలోకి తీసుకోలేదని, ఇంకా ఏం సాధించాలో తనకు అర్థంకావడం లేదంటూ కేంద్ర మంత్రిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. 2006లో రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు తీసుకున్న పంకజ్.. 2009లో పద్మశ్రీ అవార్డును స్వీకరించాడు. -
పంకజ్‌కు కోల్‌కతా ఓపెన్ టైటిల్
కోల్‌కతా: భారత క్యూ స్పోర్ట్స్ స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ కోల్‌కతా ఓపెన్ జాతీయ ఇన్విటేషనల్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్ ఆదిత్య మెహతాతో ఆదివారం జరిగిన ఫైనల్లో పంకజ్ 5–1 (75–56, 76–19, 87–47, 73–17, 0–101, 116–0) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. -
పంకజ్ అద్వానీకి 6–రెడ్ స్నూకర్ టైటిల్
ముంబై: ఇప్పటికే పలు ఫార్మాట్లలో 16 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత క్యూ స్పోర్ట్స్ (స్నూకర్, బిలియర్డ్స్) స్టార్ పంకజ్ అద్వానీ ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు. స్నూకర్‌లో పొట్టి ఫార్మాట్‌గా భావించే 6–రెడ్ స్నూకర్ జాతీయ టైటిల్‌ను ఈ బెంగళూరు ప్లేయర్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో పంకజ్ అద్వానీ 7–4 (40–7, 0–36, 55–1, 23–37, 45–13, 40–54, 49–6, 41–8, 6–38, 53–14, 38–17) ఫ్రేమ్‌ల తేడాతో కర్ణాటకకే చెందిన ఇష్ప్రీత్ చద్దాపై గెలుపొందాడు. ఈ విజయంతో జాతీయస్థాయిలో, ఆసియా స్థాయిలో, ప్రపంచ స్థాయిలో 6–రెడ్ స్నూకర్ టైటిల్స్ నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా పంకజ్ గుర్తింపు పొందాడు. -
మా సంగతేంటి?: పంకజ్ అద్వానీ
ముంబై: ఒలింపిక్స్ జరిగే ఏడాదిలోనే భారత్‌లో క్రీడల గురించి ఎక్కువగా ఆలోచిస్తారని... ఆ తర్వాత మూడున్నరేళ్లపాటు క్రీడల గురించి అంతగా పట్టించుకోరని భారత క్యూ స్పోర్ట్స్ (స్నూకర్, బిలియర్డ్స్) ప్లేయర్ పంకజ్ అద్వానీ ఆవేదన వ్యక్తం చేశాడు. 31 ఏళ్ల పంకజ్ ఇప్పటికే కెరీర్లో 16 సార్లు వివిధ ఫార్మాట్లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ‘మనం నాలుగేళ్లకోసారి ఒలింపిక్స్ జరిగే సమయంలో క్రీడల గురించి మాట్లాడుకుంటాం. మిగతా మూడున్నరేళ్లలో ఏం జరుగుతుందో ఎవరూ పట్టించుకోరు. మిగతా క్రీడల్లో నిలకడగా రాణిస్తున్న వారి సంగతేంటి? ఒక క్రీడను ఎలా పాపులర్ చేయాలో మిగతా క్రీడా సంఘాలు బీసీసీఐని చూసి నేర్చుకోవాలి’ అని ఈ బెంగళూరు ప్లేయర్ సూచించాడు. -
పంకజ్ ఖాతాలో 16వ ప్రపంచ టైటిల్
పంకజ్ ఖాతాలో 16వ ప్రపంచ టైటిల్ బెంగళూరు: సొంతగడ్డపై రాణించిన భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో 16వ ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సోమవారం జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ 150 అప్ ఫార్మాట్ ఫైనల్లో 31 ఏళ్ల పంకజ్ 6–3 (150–33, 150–95, 124–150, 101–150, 150–50, 150–35, 86–150, 150–104, 150–15) ఫ్రేమ్‌ల తేడాతో పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)ను ఓడించాడు. సెమీఫైనల్స్‌లో పంకజ్ 5–0తో ఆంగ్ హెచ్టె (మయన్మార్)పై, పీటర్ 5–1తో ధ్వజ్ హరియా (భారత్)పై గెలిచారు. గతంలో పంకజ్ బిలియర్డ్స్ టైమ్ ఫార్మాట్లో ఏడుసార్లు, పాయింట్స్ ఫార్మాట్లో మూడుసార్లు, టీమ్ ఫార్మాట్లో ఒకసారి, స్నూకర్‌లో రెండుసార్లు, సిక్స్ రెడ్ స్నూకర్‌లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచాడు. -
సెమీస్‌లో పంకజ్
బెంగళూరు: ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ 150 అప్ ఫార్మాట్లో భారత స్టార్ పంకజ్ అద్వానీ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పంకజ్ 5-2 (150-0, 150-0, 150-5, 89-150, 107-150, 150-69, 150-128) ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కే చెందిన ధ్రువ్ సిత్వాలాను ఓడించాడు. భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారి, అలోక్ కుమార్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోగా... మరో ప్లేయర్ ధ్వజ్ హరియా 5-3తో చిట్ కూ కూ (మయన్మార్)పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు. సోమవారం జరిగే సెమీఫైనల్స్‌లో పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)తో ధ్వజ్ హరియా; ఆంగ్ హెచ్‌టే (మయన్మార్)తో పంకజ్ అద్వానీ తలపడతారు. -
అద్వానీ కాంస్యంతో సరి
దోహా: ఐబీఎస్ఎఫ్ వరల్డ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ కాంస్యంతోనే సరిపెట్టుకున్నాడు.మంగళవారం జరిగిన సెమీ ఫైనల్లో పంకజ్ అద్వానీ 2-7తేడాతో అండ్రూ పాగెట్(వేల్స్) చేతిలో ఓటమి పాలయ్యాడు. దాంతో పంకజ్ కాంస్య పతకంతో సంతృప్తి చెందాడు. సెమీ ఫైనల్లో పోరులో ఒత్తిడికి లోనైన పంకజ్ 14-74, 8-71-0-87, 78-64, 0-81, 70-37, 7-80, 37-68 ఫ్రేమ్‌ల తేడాతో పరాజయం చెందాడు. -
అద్వానీకి కాంస్యం
బ్యాంకాక్ (థాయ్‌లాండ్): భారత స్టార్ క్యూరుుస్ట్ పంకజ్ అద్వానీ ఖాతాలో మరో ఘనత చేరింది. 6-రెడ్ స్నూకర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పంకజ్ కాంస్య పతకం గెలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా అతను చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 4-7 (0-37, 68-0, 73-0, 41-26, 49-15, 7-57, 0-57, 67-0, 57-0, 20-34, 69-9) ఫ్రేమ్‌ల తేడాతో డింగ్ జున్హుయ్ (చైనా) చేతిలో ఓడిపోరుు కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఇప్పటికే పంకజ్ బిలియర్డ్స్, స్నూకర్ విభాగాల్లో మొత్తం 15 ప్రపంచ టైటిల్స్ సాధించాడు. -
పద్మభూషణ్‌కు పంకజ్ పేరు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి బిలియర్డ్స్ చాంపియన్ పంకజ్ అద్వానీ పేరును మరోసారి ప్రతిపాదించారు. గతేడాది కూడా అతడి పేరును భారత బిలియర్డ్అండ్ స్నూకర్ సమాఖ్య (బీఎస్ఎఫ్ఐ) పంపించింది. ‘వరుసగా రెండో ఏడాది కూడా పంకజ్ పేరును మేం ప్రతిపాదించాం. అతడు కచ్చితంగా ఈ పురస్కారానికి అర్హుడు. ఈసారి మాకు నిరాశ కలగదనే అనుకుంటున్నాం’ అని బీఎస్ఎఫ్ఐ కార్యదర్శి ఎస్.బాలసుబ్రమణియన్ తెలిపారు. పంకజ్‌కు గతంలో పద్మశ్రీ, ఖేల్త్న్ర, అర్జున అవార్డులు దక్కాయి. క్వార్టర్స్‌లో అద్వానీ : బ్యాంకాక్‌లో జరుగుతున్న సాంగ్సోమ్ 6 రెడ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. గ్రూప్ దశలో ఒక్క ఓటమి లేకుండా దూసుకెళ్లిన పంకజ్ ... ప్రిక్వార్టర్స్‌లో యువాన్ సిజున్ (చైనా)పై 5-4తో గెలిచాడు. -
రెండో రౌండ్లో పంకజ్ అద్వానీ
సాక్షి, హైదరాబాద్: ఇండియా ఓపెన్ ప్రపంచ ర్యాంకింగ్ స్నూకర్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. హెచ్ఐసీసీ నోవాటెల్‌లో బుధవారం జరిగిన తొలి రౌండ్లో అతను 4-0తో ఎలియట్ స్లెసర్ (ఇంగ్లండ్)పై అలవోక విజయం సాధించాడు. ఈ పోరులో అద్వానీ నాలుగు ఫ్రేముల్లో కలిపి 266 పాయింట్లు సాధించగా, ప్రత్యర్థి మాత్రం 31 పాయింట్లకే పరిమితమయ్యాడు. భారత్‌కు చెందిన మరో ఆటగాడు ఇశ్ప్రీత్ చద్దా 2-4తో డామినిక్ డేల్ చేతిలో పరాజయం చవిచూశాడు. -
ఆసియా 6 రెడ్ స్నూకర్ విజేత పంకజ్ అద్వానీ
భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ను వేసుకున్నాడు. అబుదాబిలో ఆదివారం ముగిసిన ఆసియా 6 రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ చాంపియన్‌గా నిలిచాడు. బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల పంకజ్ ఫైనల్లో 7-5 ఫ్రేమ్‌లతేడాతో కీన్ హూ మో (మలేసియా)పై విజయం సాధించాడు. ఇప్పటికే 15 సార్లు వివిధ విభాగాల్లో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్స్ నెగ్గిన పంకజ్‌కు ఆసియా టైటిల్ దక్కడం ఇది ఆరోసారి కావడం విశేషం. -
నాకౌట్‌కు అద్వానీ
అబుదాబి: ఆసియా 6 రెడ్స్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ నాకౌట్ దశకు చేరాడు. శుక్రవారం జరిగిన తన మూడో గ్రూపు మ్యాచ్‌లో 5-0 (47-22, 51-12, 55-11, 36-1, 34-18) తేడాతో ఖాలిద్ అలస్టల్ (పాలస్తీనా)పై, నాలుగో మ్యాచ్‌లో 5-2 (17-41, 0-57, 32-1, 3-37, 46-19, 38-25, 34-19) తేడాతో అలీజలీల్ (ఇరాక్)పై గెలిచాడు. -
అద్వానీకి షాక్
దోహా: ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్, భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీకి అనూహ్య ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ అద్వానీ 3-5 (46-86, 64-21, 0-142, 99-0, 5-71, 99-18, 28-77, 31-66) ఫ్రేమ్‌ల తేడాతో క్రిట్సానట్ లెర్ట్సటాయాథోర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. ఇప్పటికే 14 ప్రపంచ టైటిల్స్‌ను సాధించిన అద్వానీకి ఈ మ్యాచ్‌లో తన ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. మూడో ఫ్రేమ్‌లో క్రిట్సానట్ భారత స్టార్ ప్లేయర్‌కు ఒక్క అవకాశం ఇవ్వకుండా ఏకంగా 142 పాయింట్ల బ్రేక్‌ను సాధించాడు. ఆ తర్వాత పంకజ్ తేరుకున్నా చివర్లో క్రిట్సానట్ నిలకడగా ఆడి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. -
సెమీస్‌లో అద్వానీ
దోహా: ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్ పంకజ్ అద్వానీ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ పంకజ్ అద్వానీ 5-0 (68-20, 80-0, 73-10, 72-0, 64-32) ఫ్రేమ్‌ల తేడాతో కరమ్ ఫాతిమా (సిరియా)పై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో అద్వానీ 4-3 (25-57, 116-16, 57-41, 79-64, 50-67, 42-85, 66-43) ఫ్రేమ్‌లో తేడాతో భారత్‌కే చెందిన ఇష్ప్రీత్ సింగ్ చడ్డాను ఓడించాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో క్రిట్సానట్ లెర్ట్సటాయతోర్న్ (థాయ్‌లాండ్)తో అద్వానీ తలపడతాడు. -
ప్రిక్వార్టర్స్‌లో పంకజ్
దోహా: ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్లో భారత ఆటగాడు పంకజ్ అద్వాని ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పోరులో 78-54, 107-2, 74-9, 29-65, 57-44 తో అలిజాలి అలీ(ఇరాక్)పై నెగ్గాడు. -
ఆసియా బిలియర్డ్స్: అద్వానీ ఓటమి
కొలంబో: ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన భాస్కర్ బాలచంద్ర 5-3 (102-0, 4-101, 102-80, 71-102, 100-94, 0-102, 101-32, 101-99) ఫ్రేమ్‌ల తేడాతో అద్వానీని ఓడించి సెమీఫైనల్‌కు చేరాడు. భారత ఆటగాళ్లు సిద్ధార్థ్ పారిఖ్, ధ్రువ్ సిత్వాలా కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్‌లో ధ్రువ్‌తో సిద్ధార్థ్; పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)తో భాస్కర్ తలపడతారు. -
అద్వానీ... అదరహో
15వసారి ప్రపంచ టైటిల్ సొంతం స్నూకర్ చాంపియన్‌షిప్‌లో విజేత ఫైనల్లో చైనా ప్లేయర్‌పై జయభేరి హర్గాడ (ఈజిప్టు): ‘క్యూ స్పోర్ట్స్’లో తనకు తిరుగులేదని భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ మరోసారి నిరూపించాడు. నమ్మశక్యంకాని రీతిలో ఏకంగా 15వసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. శనివారం ముగిసిన ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో ఈ బెంగళూరు ఆటగాడు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ సమరంలో 30 ఏళ్ల పంకజ్ అద్వానీ 8-6 ఫ్రేమ్‌ల (117-6, 75-16, 29-68, 63-23, 87-1, 16-72, 110-13, 113- 1, 52-65, 13-84, 77-36, 14-126, 26-82, 116-24) తేడాతో 18 ఏళ్ల జావో జిన్‌టాంగ్ (చైనా)పై విజయం సాధించాడు. ప్రపం చ స్నూకర్ టైటిల్ నెగ్గడం అద్వానీకిది రెండోసారి. 2003లో తొలిసారి అతను ఈ ఘనత సాధించాడు. జిన్టాంగ్తో జరిగిన ఫైనల్లో ఆరంభం నుంచే అద్వానీ తన సత్తా చాటుకున్నాడు. ఏకాగ్రతతో ఆడుతూ గురి తప్పకుండా నిలకడగా స్కోరు చేశాడు. 15 ఫ్రేమ్‌ల ఫైనల్ రెండు సెషన్లపాటు జరిగింది. తొలి సెషన్లో ఏడు, రెండో సెషన్లో ఎనిమిది ఫ్రేమ్‌లను నిర్వహించారు. తొలి సెషన్ పూర్తయ్యాక అద్వానీ 5-2తో ఆధిక్యంలో ఉన్నాడు. రెండో సెషన్ మొదలయ్యాక ఎనిమిదో ఫ్రేమ్‌ను అద్వానీ దక్కించుకొని విజయానికి చేరువయ్యాడు. ఆ తర్వాత జిన్‌టాంగ్ నుంచి గట్టిపోటీ ఎదురైనా అద్వానీ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇప్పటివరకు పంకజ్ అద్వానీ టైమ్ ఫార్మాట్ బిలియర్డ్స్‌లో ఏడుసార్లు (2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005)... పాయింట్ ఫార్మాట్ బిలియర్డ్స్‌లో మూడుసార్లు (2014, 2008, 2005) సిక్స్ రెడ్ స్నూకర్‌లో రెండుసార్లు (2015, 2014), ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ పోటీల్లో (2014) ఒకసారి ప్రపంచ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. -
సెమీస్‌లో పంకజ్ అద్వానీ
హర్గాడా (ఈజిప్టు): అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ పంకజ్ అద్వానీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పంకజ్ అద్వానీ 6-0 (70-62, 112-0, 107-14, 83-46, 114-12, 64-27) ఫ్రేమ్‌ల తేడాతో అలెక్స్ బోర్గ్ (మాల్టా)పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో లుకాస్ క్లెకెర్స్ (జర్మనీ)తో అద్వానీ తలపడతాడు. ఇప్పటికే 14 సార్లు ప్రపంచ టైటిల్స్‌ను నెగ్గిన అద్వానీ ఈ టోర్నీలో సెమీస్‌కు చేరడం ద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. -
అద్వానీకి మరో ప్రపంచ టైటిల్
అడిలైడ్: భారత అగ్రశ్రేణి క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఖాతాలో మరో ప్రపంచ టైటిల్ చేరింది. ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో సింగపూర్‌కు చెందిన పీటర్ గిల్‌క్రిస్ట్‌ను 1168 పాయింట్ల తేడాతో ఓడించిన అద్వానీ విజేతగా నిలిచాడు. 30 ఏళ్ల అద్వానీకి ఇది 14వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. గత వారం పాయింట్ ఫార్మాట్ ఫైనల్లో గిల్‌క్రిస్ట్ చేతిలోనే ఓడిన అద్వానీ తాజాగా టైమ్ ఫార్మాట్లో ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యింది. ఆదివారం జరిగిన ఈ ఫైనల్లో పంకజ్ 2408 (127, 360, 301, 284, 124, 101, 106, 171, 114, 430 నాటౌట్) పాయింట్లు సాధించగా... గిల్‌క్రిస్ట్ 1240 (102, 156, 249, 107, 198) పాయింట్లు సాధించి పరాజయం పాలయ్యాడు. అంతకుముందు పంకజ్ ఆరంభంలోనే సెంచరీ (127) బ్రేక్‌తో ఆధిక్యం కనబరిచాడు. ఆ తర్వాత వరుసగా రెండు ట్రిపుల్ సెంచరీ బ్రేక్‌లతో చెలరేగి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. ‘చక్కటి ప్రణాళికతోనే ఈ విజయం దక్కింది. ఫైనల్‌కు ముందు రోజు రాత్రి స్పోర్ట్స్ సైకాలజిస్ట్ శ్రీ సలహాలతో పాటు చక్కటి నిద్ర కూడా ఈ గెలుపునకు కారణమైంది’ అని ఇటీవలే 6-రెడ్ స్నూకర్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన అద్వానీ తెలిపాడు. -
వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అద్వానీ అర్హత
బ్యాంకాక్ : భారత బిలియర్డ్స్ మేటి ఆటగాడు పంకజ్ అద్వానీ.. సిక్స్-రెడ్ వరల్డ్ చాంపియన్‌షిప్ నాకౌట్ దశకు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ పోటీలో పంకజ్ 5-2తో డిఫెండింగ్ చాంపియన్ స్టీఫెన్ ముగురే (యూకే)పై నెగ్గాడు. అంతకుముందు జరిగిన రౌండ్లో ఈ బెంగళూరు కుర్రాడు 5-0 అలెన్ ట్రిగ్‌ను చిత్తు చేశాడు. దీంతో తన గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. గత నెలలో కరాచీలో జరిగిన ఐబీఎస్ఎఫ్-6 రెడ్ వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకోవడంతో పంకజ్‌కు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. -
ఖేల్ రత్న మీద విమర్శలెక్కుపెట్టిన పంకజ్ అద్వానీ
క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ముగిసి వారం రోజులు గడుస్తున్నా.. అవార్డుల ఎంపిక మీద విమర్శలు మాత్రం తగ్గటం లేదు. ఇప్పటికే టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఖేల్ రత్న అవార్డు ఇవ్వడంపై పలువురు క్రీడాకారులు విమర్శలు గుప్పించారు. దీనిపై కర్నాటక రాష్ట్రానికి చెందిన పారాలంపియన్ హెచ్ ఎన్ గిరీష ఏకంగా కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే.. తాజాగా.. ఇండియన్ స్టార్ స్నూకర్ ప్లేయర్ పంకజ్ అద్వానీ క్రీడా అవార్డుల ఎంపిక పై విమర్శనాస్త్రాలు సంధించాడు. ఎంపిక పారదర్శకంగా జరగటం లేదని.. ఎంపిక కమిటీ పారదర్శకంగా వ్యవహరించడం లేదని అన్నాడు. కేంద్ర క్రీడా శాఖ అవార్డుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన మార్గదర్శకాల్లో స్పష్టత లేమే దీనికి కారణమని అభిప్రాయపడ్డాడు. దీనికి సానియా మీర్జా ఉదంతాన్నే వివరించాడు. ఎంపిక కమిటీ ఏర్పాటు చేసిన పాయింట్ల ఆధారంగా.. పారాలంపియన్ గిరీష.. సానియా మీర్జా కంటే ఎంతో ముందు ఉన్నాడని చెప్పుకొచ్చాడు. అయితే పాయింట్ల వ్యవస్థ సరిగా లేక పోవడమే ఇందుకు కారణమని అన్నాడు. మరో వైపు గిరీష సైతం ఇదే అంశాన్ని సవాలు చేస్తూ ఖేల్ రత్న అవార్డుపై కోర్టు కెక్కాడు. అవార్డుల కమిటీ ఇచ్చిన మార్గ దర్శకాల్లో ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ప్రపంచ కప్ లు, ఛాంపియన్ షిప్ లలో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే అవార్డులు అందుకునే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని రెజ్లింగ్ కోచ్ వినోద్ కుమార్ పేర్కొన్నాడు. అయితే ఖేల్ రత్నకు వ్యతిరేకంగా పంకజ్ వ్యాఖ్యలు మీడియాలో ఒక్కరోజు కూడా గడవక ముందే పంకజ్ తన ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చాడు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ టెన్నిస్ లో సానియా ఆటతీరును తక్కువ చేసిన చూడలేమని.. ఖేల్ రత్నకు ఆమె అర్హురాలేనని అన్నాడు. ఐయామ్ హ్యాపీ ఫర్ సానియా అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ట్వీట్ చేయడం విశేషం. తన విమర్శ కేవలం కేంద్ర క్రీడాశాఖ, అవార్డుల ఎంపిక కమిటీ పారదర్శకత మీదనే అని వివరణ ఇచ్చుకున్నాడు. అంతే కాదు పంకజ్ అవార్డుల కమిటీ లోపాలను చూపుతూ.. మహిళా స్నూకర్ క్రీడాకారిణి విద్యా పిళ్లై ఉదంతాన్ని వివరించాడు. అంతర్జాతీయ స్థాయిలో లెక్కలేనన్ని మెడల్స్, ట్రోఫీలు గెలుచుకున్నా.. ఇప్పటి వరకూ ఆమెను అర్జున అవార్డుకు కూడా ఎంపిక చేయకపోవటం పట్ల అసంతృప్తిని వ్యక్తంచేశాడు. క్రీడాఅవార్డులు ప్రకటించిన ప్రతి సందర్భంలోనూ ఇలాంటి దుమారాలు చలరేగటం సాధారణమే అయినా.. ఖేల్ రత్న వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేట్లు లేదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. -
'కరాచీ నగరం ముంబయి లాంటిదే'
కరాచీ: పాకిస్తాన్, భారత్‌కు చాలా వ్యత్యాసం లేదని, కరాచీ నగరం ముంబయి లాంటిదేదనని భారత సూకర్ స్టార్ పంకజ్ వ్యాఖ్యానించాడు. పాక్ టూర్ కు వెళ్లేముందు జూనియర్ ఆటగాళ్లకు తాను ఈ విధంగా చెప్పినట్లు మ్యాచ్ అనంతరం తెలిపాడు. ఆసియాలోనే మేజర్ స్నూకర్ కేంద్రంగా పాక్ మారనుందని అన్నాడు. స్నూకర్ చాంపియన్‌షిప్ నిర్వహించిన పాక్ ను అద్వానీ ప్రశంసించాడు. క్రికెట్‌కు ఉన్నట్లే బిలియర్డ్స్, స్నూకర్ గేమ్స్‌కూ ఐపీఎల్ లీగ్ వంటివి ఉంటే తమకు బాగా కలిసొస్తుందని అద్వానీ ఆశాభావం వ్యక్తం చేశాడు. మంగళవారం జరిగిన ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్ సాధించిన తర్వాత ఈ విధంగా తన ఉద్దేశాన్ని తెలిపాడు. కెరీర్లో 13 స్నూకర్ టైటిల్స్ సాధించిన అనంతరం అద్వానీ మాట్లాడుతూ.. ఐపీఎల్ లీగ్ వంటివి బిలయర్డ్స్, స్నూకర్ గేమ్స్లకూ నిర్వహిస్తే అది తమకు ఆర్థికంగా ప్రయోజనకరమని అన్నాడు. ఈ ఆటలకు చాలా తక్కువ సమయం కేటాయించి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారన్నాడు. టోర్నీలో తొలి గేమ్ ఓటమికి అక్కడికి ఆలస్యంగా చేరుకోవడమే కారణమని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. -
ఆసియా బిలియర్డ్స్ చాంప్ ధ్రువ్
ఫైనల్లో అద్వానీకి షాక్ బీజింగ్: ముంబైకి చెందిన రైజింగ్ స్టార్ ధ్రువ్ సిత్వాలా సంచలన విజయంతో ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ సాధించాడు. ఫైనల్లో వెటరన్ స్టార్, ప్రపంచ చాంపియన్ అయిన పంకజ్ అద్వానీకి షాకిచ్చి తొలి అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత క్యూయిస్ట్‌లు ఆధిపత్యం చెలాయించిన ఈ టోర్నీలో సిత్వాలా అంచనాలకు మించి రాణించాడు. ఫైనల్లో అతను 6-3 ఫ్రేమ్‌ల తేడాతో దిగ్గజ ఆటగాడిని కంగుతినిపించాడు. సౌరవ్ కొఠారి, ప్రప్రుత్ (థాయ్‌లాండ్) ఉమ్మడిగా కాంస్య పతకాలు గెలచుకున్నారు. -
పంకజ్‌కు జాతీయ స్నూకర్ టైటిల్
కోల్‌కతా: భారత స్టార్ పంకజ్ అద్వానీ... జాతీయ సీనియర్ స్నూకర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. బెంగాల్ రోయింగ్ క్లబ్లో శనివారం జరిగిన ఫైనల్లో అద్వానీ 6-3 (83 (45)-15, 73 (54)-35, 27- 86 (57), 79 (47)-00, 13-87 (62), 76 (70)-35, 48-72, 74 (74)-00, 96 (81)-09)తో వరుణ్ మదన్‌పై విజయం సాధిం చాడు. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగి తొలిసారి ఫైనల్ వరకు వచ్చిన మదన్... మూడు, ఐదు, ఏడో ఫ్రేమ్‌ల్లో నెగ్గి 3-4 స్కోరుతో నిలిచాడు. అయితే ఇక్కడి నుంచి అద్వానీ తన సత్తాను చూపెట్టాడు. గతవారమే బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌ను నెగ్గిన అద్వానీ 2009 తర్వాత నాలుగోసారి రెండు టైటిల్స్‌ను సాధించాడు. ఇప్పటికే ఏడు సీనియర్ నేషనల్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లను సొంతం చేసుకున్న పంకజ్ అన్ని వయసు గ్రూప్‌ల్లో కలిసి 26 టైటిల్స్‌ను సాధించాడు. -
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా హెచ్ఎస్ బ్రహ్మ
క్రీడలు వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన డివిలియర్స్ దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. జొహన్నెస్‌బర్గ్‌లో జనవరి 18న వెస్టిండీస్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో వన్డేలో డివిలియర్స్ 31 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 16 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి మరో రికార్డు కూడా నెలకొల్పాడు. ఈ వన్డేలో మొత్తం 44 బంతుల్లో 149 పరుగులు చేశాడు. గతంలో న్యూజిలాండ్ క్రికెటర్ కోరె అండర్సన్ వెస్టిండీస్‌పై 36 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు ఉంది. పంకజ్‌కు జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌ను పంకజ్ అద్వానీ గెలుచుకున్నాడు. జనవరి 17న కోల్‌కతాలోని బెంగాల్ రోయింగ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో ధ్రువ్ సిత్వాలాను అద్వానీ ఓడించాడు. ఇది పంకజ్‌కు ఏడో జాతీయ బిలియర్డ్స్ టైటిల్. అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్, మాడ్రిడ్ క్లబ్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా నిలిచి 2014 బలాన్ డియోర్ అవార్డుకు ఎంపికయ్యాడు. సానియా జోడీకి ఏపియా ఇంటర్నేషనల్ డబుల్స్ టైటిల్ ఏపియా ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్‌ను సానియా జోడీ గెలుచుకుంది. జనవరి 16న సిడ్నీలో జరిగిన ఫైనల్లో అబిగైల్ స్పియర్స్-రకెల్ కోప్స్ జోన్స్ జోడీపై సానియామీర్జా, అమెరికాకు చెందిన బెథానీ మాటెక్ జోడీ విజయం సాధించింది. సానియా కెరీర్లో ఇది 23వ టైటిల్. సౌమ్యజిత్, మౌమాదాస్లకు జాతీయ టేబుల్ టెన్నిస్ టైటిళ్లు జాతీయ టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సౌమ్యజిత్ ఘోష్ గెలుచుకున్నాడు. పుదుచ్చేరిలో జనవరి 17న జరిగిన ఫైనల్లో జి.సాథియన్ను ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను మౌమాదాస్ గెలుచుకుంది. చరిత్ర సృష్టించిన సంధూ భారత గోల్ కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ భారత ఫుట్‌బాల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. 79 ఏళ్ల తర్వాత తొలి అంచె యూరోపియన్ క్లబ్లో ఆడిన భారత ఆటగాడిగా తను రికార్డులకెక్కాడు. 2014 ఆగస్టులో సంధూ.. నార్వేయన్ టిప్పెలిగేన్ క్లబ్లో ఆడే స్టాబేక్ ఎఫ్‌సీ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇటీవల ఫోలో ఫుట్‌బాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 ఏళ్ల సంధూ తొలిసారిగా బరిలోకి దిగాడు. రాష్ట్రీయం తెలుగు రాష్ట్రాల్లో 6.54 కోట్ల ఓటర్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 6.54 కోట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 3,70,82,855 కాగా వీరిలో మహిళా ఓటర్లు 1,86,64,912, పురుషులు 1,84,14,685 మంది. మూడో వర్గం వారు 3,258 మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 2,83,15,120. వీరిలో పురుషులు 1,44,72,054, మహిళలు 1,38,40,115, మూడో వర్గం వారు 2,351 మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణలో ఉమ్మడి ఏపీకి పురస్కారం 2014 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అత్యున్నత ప్రతిభను చూపిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సం ఘాన్ని అత్యుత్తమ రాష్ట్రంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలుచేయడంతో పాటు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించినందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపికైనట్లు ప్రకటించింది. ఈ అవార్డును జాతీయ ఓటర్ల దినోత్సవమైన జనవరి 25న అందజేస్తారు. విశాఖపట్నంలో ఐఐఎంకు శంకుస్థాపన: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)కు విశాఖపట్నం సమీపంలోని గంభీరం గ్రామంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ జనవరి 17న శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు ఐఐఎంలలో తొలిగా విశాఖలోనే శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు హామీ ఇచ్చిన 11 సంస్థల్లో ఇది మొదటిది. ఐఐఎం బెంగళూరు.. విశాఖపట్నం ఐఐఎంకు మెంటార్ ఇన్స్టిట్యూషన్గా ఉంటుంది.తెలంగాణకు పెట్రోలియం ఉత్పత్తుల పరిరక్షణ పురస్కారం: పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో అత్యుత్తమ పరిరక్షణ ప్రమాణాల్ని పాటించిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం పురస్కారాన్ని ప్రకటించింది. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో పాటించాల్సిన ప్రమాణాలు, ముందస్తు రక్షణ చర్యలపై విస్తృత ప్రచారాన్ని నిర్వహించినందుకు పెట్రోలియం ఉత్పత్తుల పరిరక్షణ-2014 పురస్కారాన్ని ఇస్తున్నట్లు వెల్లడించింది. స్మార్ట్ విలేజ్/వార్డు, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ప్రారంభం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 18న స్మార్ట్ విలేజ్/వార్డు; స్మార్ట్ ఏపీ కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని వేలివెన్ను గ్రామంలో ప్రారంభించారు. గ్రామాలు, వార్డుల్లో నెలకొన్న సమస్యల్ని అధిగమించేందుకు ‘ప్రగతి కోసం ప్రజా ఉద్యమం’ నినాదంతో స్మార్ట్ ఏపీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దీనికింద స్వచ్ఛమైన నీటి సరఫరా, ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణం, అందరికీ విద్య, మహిళా సాధికారత ఇలా వివిధ కార్యక్రమాలపై దృష్టిసారించి రాష్ట్రాన్ని స్మార్ట్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతారు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌గా సాయిబాబు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 20 సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్‌గా గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వై.శ్రీనివాస శేషసాయిబాబు నియమితులయ్యారు. ప్రతిభా రాజీవ్ పురస్కారాల పేరు మార్పు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే‘ప్రతిభా రాజీవ్ పురస్కారాల’పేరు మారింది. ‘తెలుగు ఆత్మగౌరవ పురస్కారాలు’గా వాటి పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎన్వీ రమణారెడ్డి జనవరి19న ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు అసోచామ్ అవార్డు ‘నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్త’ కార్యక్రమానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక ‘అసోచామ్’ అవార్డు లభించింది. రాష్ట్రంలో మూడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, ఏడు లక్షల మందికి శిక్షణ ఇవ్వడంతో ఈ అవార్డుకు ఎంపికైంది. అవార్డులు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు- 2015 72వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులను కాలిఫోర్నియాలో జనవరి 12న ప్రదానం చేశారు. వివరాలు.. ఉత్తమ చిత్రం (డ్రామా): బాయ్ హుడ్ ఉత్తమ చిత్రం (మ్యూజికల్/కామెడీ): ద గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ ఉత్తమ దర్శకుడు: రిచర్డ్ లింక్లేటర్ (బాయ్ హుడ్) ఉత్తమ విదేశీ చిత్రం: లెవియాథన్ (రష్యా) ఉత్తమ నటుడు: ఎడ్డీ రెడ్ మెయెనీ (చిత్రం: ద థియరీ ఆఫ్ ఎవిరీథింగ్) ఉత్తమ నటి (డ్రామా): జులియినే మోరె (చిత్రం: స్టిల్ అలైస్) ఉత్తమ నటుడు (మ్యూజికల్/కామెడీ): మైఖల్ కీటన్ (బర్డ్ మెన్) ఉత్తమ నటి (మ్యూజికల్/కామెడీ): అమీ ఆడమ్స్ (బిగ్ ఐస్) ఇస్రోకు స్పేస్ పయనీర్ -2015 అవార్డు అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ స్పేస్ పయనీర్- 2015 అవార్డును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఇవ్వనున్నట్లు జనవరి 13న ప్రకటించింది. ఇస్రో అంగారక యాత్ర మంగళ్యాన్ చేపట్టిన బృందానికి ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు తెలిపింది. జమ్మూకాశ్మీర్‌కు ఈ- గవర్నెన్స్ అవార్డు 2014-15 సంవత్సరానికి ఈ-గవర్నెన్స్ జాతీయ అవార్డు జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి లభించింది. జిల్లా స్థాయిలో సమర్థవంతంగా సేవలు అందించినందుకు బహుమతిని అందజేస్తున్నట్లు జనవరి 16న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డును ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిపాలనా సంస్కరణల విభాగం అందజేస్తుంది. అంతర్జాతీయం అత్యంత ఉష్ణ సంవత్సరంగా 2014 నాసా, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ చేపట్టిన రెండు వేర్వేరు అధ్యయనాల ప్రకారం 1880 మొదలు భూమిపై నమోదైన అత్యంత ఉష్ణ సంవత్సరంగా 2014 గుర్తింపు పొందింది. ఈ నివేదిక జనవరి 16న విడుదలైంది. ప్రపంచ టాప్-50లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రపంచంలో మార్కెట్ విలువ ఆధారంగా రెల్‌బ్యాంక్స్ టాప్-50 జాబితాను (2014కు) రూపొందించింది. ఇందులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 40.58 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో 45వ స్థానంలో నిలిచింది. టాప్-50లోని ఏకైక భారతీయ బ్యాంక్ ఇదే కావడం గమనార్హం. అమెరికాకు చెందిన వెల్స్‌ఫార్గో నంబర్ వన్ ర్యాంకును చేజిక్కించుకుంది. వార్తల్లో వ్యక్తులు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా హెచ్ఎస్ బ్రహ్మ భారత ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్‌గా హరిశంకర్ బ్రహ్మ జనవరి 16న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఈ స్థానంలో కొనసాగిన వీఎస్ సంపత్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో బ్రహ్మ నియమితులయ్యారు. ఈ హోదాలో కొనసాగేందుకు గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు. ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు కమిషనర్లు ఉంటారు. గవర్నర్ ఆఫ్ ద ఇయర్‌గా రఘురామ్ రాజన్ భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్‌కు గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. లండన్ కు చెందిన ఫైనాన్షియల్ జర్నల్ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ అవార్డును జనవరి 12న ప్రకటించింది. బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్.కె.సిన్హా బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా హిందూ మతానికి చెందిన జస్టిస్ సురేందర్ కుమార్ సిన్హా (64) జనవరి 13న ప్రమాణ స్వీకారం చేశారు. ముస్లింలు అధికంగా ఉన్న బంగ్లాదేశ్‌లో అత్యున్నత న్యాయమూర్తి హోదా హిందూ మత వ్యక్తికి లభించడం ఇదే తొలిసారి. కేంద్ర సెన్సార్ బోర్డు కొత్త చైర్మన్‌గా పహ్లాజ్ నిహలానీ కేంద్ర సెన్సార్ బోర్డు కొత్త చైర్‌పర్సన్‌గా చిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ జనవరి 19న నియమితులయ్యారు. లీలా శాంసన్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో నిహలానీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన మూడేళ్లపాటు పదవిలో ఉంటారు. తొమ్మిది మంది కొత్త సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. వీరిలో తెలుగు నటి జీవిత ఉన్నారు. బీఎస్ఎన్ఎల్ కొత్త చైర్మన్‌గా శ్రీవాస్తవ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా జనవరి 16న అనుపమ్ శ్రీవాస్తవ బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల పాటు లేదా 60 ఏళ్ల వయసు వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. శ్రీవాస్తవ 1981 బ్యాచ్ ఇండియన్ టెలికం సర్వీస్ (ఐటీఎస్) అధికారి. జాతీయం వైమానిక దళంలో తేజస్ దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన అధునాతన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) తేజస్ వైమానికదళంలో చేరింది. జనవరి 17న రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ లోహ విహంగాన్ని అందించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా.. తేజస్ పత్రాల్ని పారికర్ నుంచి అందుకున్నారు. తేజస్ గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాల్ని, గగనతలం నుంచి నేలమీదున్న లక్ష్యాల్ని, గగనతలం నుంచి సముద్రం మీదున్న లక్ష్యాల్ని ఛేదించగలదు. భారత్ వృద్ధి రేటు 2016లో 6.3 శాతం భారత్ వృద్ధి రేటు 2016లో 6.3 శాతంగా ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనావేసింది. ఈ ఏడాది వృద్ధి 5.9 శాతమని, 2014లో 5.4 శాతమని అంచనాల్లో పేర్కొంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు, కీలక సంస్కరణల ప్రకటన, అమలు వంటి అంశాలు భారత్ ఆర్థిక వ్యవస్థ సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయని ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2015’ అనే పేరుతో విడుదలైన నివేదికలో తెలిపింది. -
అద్వానీకి జాతీయ టైటిల్
కోల్‌కతా: ప్రముఖ క్యూ యిస్ట్ పంకజ్ అద్వానీ సీనియర్ జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలి చాడు. బెంగాల్ రోయిం గ్ క్లబ్లో శనివారం జరిగిన ఫైనల్లో ధ్రువ్ సిట్వాలాపై 5-0 తేడాతో అద్వానీ నెగ్గాడు. వివిధ విభాగాల్లో 12 ప్రపంచ టైటిల్స్ తన ఖాతాలో వేసుకున్న అద్వానీ రెండు, మూడో ఫ్రేమ్‌లో 150, 153 పాయింట్లతో క్లీన్‌స్వీప్ చేశాడు. 29 ఏళ్ల అద్వానీకిది ఏడో జాతీయ బిలియర్డ్స్ టైటిల్. -
అవార్డుల కోసం అత్యాశ పడొదు
భారత క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ కోల్‌కతా: ఏ క్రీడాకారుడైనా తమ ప్రదర్శన ద్వారానే గుర్తింపు తెచ్చుకోవాలి కానీ అవార్డుల కోసం అత్యాశ పడకూడదని స్నూకర్ అండ్ బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ అభిప్రాయపడ్డాడు. ‘నేనెన్నటికీ అవార్డులు ఇవ్వాలని బయటికెళ్లి నిరసన వ్యక్తం చేయను. వాటిని సాధించాలి కానీ వెంపర్లాడకూడదు. నేను కూడా దరఖాస్తు చేసుకున్నాను. అయితే నేను అర్హుడిని కాదని ప్రభుత్వం అనుకుంటే నాకేమీ దిగులు లేదు. గుర్తింపును మనం డిమాండ్ చేయకూడదు. ఇక్కడ మనముంది దేశం తరఫున పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచేందుకు. ఏ ఆటలోనైనా ప్రతిభ చాటుకుంటే ఏదో ఒక రోజు గుర్తింపు దానంతటదే వస్తుంది. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పద్మ అవార్డు విశ్వసనీయత ఏమీ తగ్గలేదు. కొద్ది మంది బహిరంగంగా తమ ఆక్రోషాన్ని వెల్లడించినంత మాత్రాన వీటి గుర్తింపుకొచ్చిన ప్రమాదమేమీ లేదు. ఇక సైనా ప్రతిఘటనపై కామెంట్ చేయలేను కానీ వ్యక్తిగతంగా నేను అలాంటి చేష్టలకు మాత్రం దిగను’ అని అద్వానీ స్పష్టం చేశాడు. -
పంకజ్‌కు షాక్
బెంగళూరు: సొంతగడ్డపై భారత స్టార్ పంకజ్ అద్వానీకి ఊహించని పరాభవం ఎదురైంది. ఫలితంగా ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల విభాగం క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ పంకజ్ అద్వానీ 4-6 (63-38, 75-47, 0-107, 10-68, 16-60, 83-4, 24-89, 67-40, 26-71, 40-59)ఫ్రేమ్‌ల తేడాతో చైనాకు చెందిన 14 ఏళ్ల కుర్రాడు యాన్ బింగ్‌తావో చేతిలో ఓడిపోయాడు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పంకజ్‌ను ఓడించిన యాన్ బింగ్‌తావో... అదే జోరులో ఫైనల్‌కు చేరాడు. సెమీస్‌లో 7-5తో క్రిట్ సానట్ (థాయ్‌లాండ్)పై నెగ్గాడు. ఫైనల్లో మహ్మద్ సజ్జాద్ (పాకిస్తాన్)తో యాన్ బింగ్‌తావో తలపడతాడు. సజ్జాద్ సెమీఫైనల్లో 7-3తో జిన్‌టాంగ్ (చైనా)పై, క్వార్టర్ ఫైనల్లో 6-1తో మానన్ చంద్ర (భారత్)పై గెలిచాడు. మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత క్రీడాకారిణి చిత్రా మగిమైరాజన్ 1-4 ఫ్రేమ్‌ల తేడాతో వెండీ జాన్స్ (బెల్జియం) చేతిలో పరాజయం పాలైంది. -
నాకౌట్ దశకు పంకజ్
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్ బెంగళూరు: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకున్న భారత స్టార్ పంకజ్ అద్వానీ నాకౌట్ దశకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన గ్రూప్ ‘హెచ్’ నాలుగో లీగ్ మ్యాచ్‌లో పంకజ్ 4-2 (44-74, 60-32, 12-60, 98-0, 80-3, 72-21) ఫ్రేమ్‌ల తేడాతో హైదరాబాద్‌కు చెందిన లక్కీ వత్నానిపై గెలిచాడు. ఇదే గ్రూప్‌లో పంకజ్ మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. గ్రూప్ ‘ఎఫ్’లో భారత్‌కే చెందిన కమల్ చావ్లా వరుసగా నాలుగో విజయాన్ని సాధించి నాకౌట్ దశకు చేరుకున్నాడు. మహిళల విభాగం నుంచి చిత్రా మగిమైరాజన్, అమీ కమాని కూడా నాకౌట్ దశకు అర్హత పొందారు. -
పంకజ్‌కు మూడో గెలుపు
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్ బెంగళూరు: తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేశాడు. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘హెచ్' లీగ్ మ్యాచ్‌లో పంకజ్ 4-0 (103-4, 119-7, 56-26, 136-0) ఫ్రేమ్‌ల తేడాతో పాల్ ష్కాఫ్ (ఆస్ట్రియా)పై గెలిచాడు. హైదరాబాద్ ప్లేయర్ లక్కీ వత్నాని వరుసగా రెండో మ్యాచ్‌లో నెగ్గాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో లక్కీ 4-3 (14-65, 30-75, 86-22, 65-43, 46-54, 88-0, 65-22) ఫ్రేమ్‌ల తేడాతో నొబ్రెస్ (బ్రెజిల్)ను ఓడించాడు. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక మొత్తం 16 గ్రూప్‌ల నుంచి నలుగురు చొప్పున 64 మంది నాకౌట్ దశకు అర్హత సాధిస్తారు. -
పంకజ్ కొత్త చరిత్ర
ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ సొంతం మూడోసారి ‘గ్రాండ్ డబుల్’ సాధించిన తొలి ఆటగాడు కెరీర్లో రికార్డు స్థాయిలో 12వ ప్రపంచ టైటిల్ లీడ్స్: భారత స్టార్ పంకజ్ అద్వానీ బిలియర్డ్స్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. అద్భుతమైన ఆటతీరుతో గత వారమే పాయింట్ల ఫార్మాట్లో విజేతగా నిలిచిన అతను టైమ్ ఫార్మాట్లో కూడా ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో పంకజ్ 1928-893తో ప్రపంచ మూడో ర్యాంకర్ రాబర్ట్ హాల్ (ఇంగ్లండ్)పై గెలిచాడు. ఐదు గంటల పాటు జరిగిన ఫైనల్లో 29 ఏళ్ల పంకజ్ పూర్తి హవా కొనసాగించాడు. తొలి గంటలో 185 బ్రేక్ పాయింట్లు సాధించిన భారత స్టార్ ఆ తర్వాత కూడా చెలరేగిపోయాడు. 85, 92, 123 బ్రేక్ పాయింట్లతో పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ ఆడుతున్న హాల్ మాత్రం 89, 64, 64 బ్రేక్ పాయింట్లతోనే సరిపెట్టుకున్నాడు. ఓరాల్‌గా తొలి సెషన్ ముగిసేసరికి పంకజ్ 746-485 ఆధిక్యంలో నిలిచాడు. రెండో సెషన్లో కూడా పంకజ్ 94, 182, 289, 145 బ్రేక్ పాయింట్లతో దూసుకుపోయాడు. దీంతో ఇంకా గంట ఆట మిగిలి ఉండగానే దాదాపుగా టైటిల్‌కు చేరువగా వచ్చాడు. చివరి గంటలో కూడా పంకజ్ 94, 93, 59, 58, 62, 90 బ్రేక్ పాయింట్లను సాధించాడు. చివరకు వెయ్యికిపైగా పాయింట్ల తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఉమాదేవికి రజతం మహిళల విభాగంలో రెవన్న ఉమాదేవి వరుసగా రెండోసారి రజతంతో సరిపెట్టుకుంది. లీడ్స్‌లోనే మంగళవారం జరిగిన ఫైనల్లో ఆమె 191-237 ఎమ్మా బోని (ఇంగ్లండ్) చేతిలో ఓడి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 90 నిమిషాల సెషన్లో బోని 44, 31 పాయింట్లతో రెండు బ్రేక్‌లు సాధించింది. ఓవరాల్‌గా కెరీర్లో బోనికి ఇది 9వ టైటిల్. ఏప్రిల్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో కూడా ఉమాదేవి.. బోని చేతిలోనే ఓడటం గమనార్హం. ఒకే ఏడాదిలో పాయింట్ల, టైమ్ ఫార్మాట్లో ప్రపంచ టైటిల్స్ (గ్రాండ్ డబుల్)ను మూడోసారి సాధించిన తొలి ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గతంలో పంకజ్ 2005 (మాల్టా), 2008 (బెంగళూరు)లో గ్రాండ్ డబుల్‌ను సాధించాడు. ఇప్పుడు మూడోసారి గెలిచి మైక్ రస్సెల్ (2010, 2011లో గ్రాండ్ డబుల్)నూ అధిగమించాడు. కెరీర్లో 12 ప్రపంచ టైటిల్‌ను నెగ్గిన ఆటగాడిగా రికార్డులకెక్కిన ఈ బెంగళూరు ప్లేయర్‌కు... వ్యక్తిగత విభాగాల్లో ఇది 9వ టైటిల్. ఈ సందర్భంగా గీత్‌సేథీ (8 టైటిల్స్) రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ‘ఒకేసారి ఇన్ని రికార్డులు సొంతం చేసుకున్నందుకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఈ విజయాలు నా మాటలను కప్పేశాయి. ఇక్కడికి రావడానికి ముందు గేమ్, ఫిట్నెస్ కోసం చాలా కష్టపడ్డా. అది ఇప్పుడు ఫలితాన్నిచ్చింది. మా అమ్మ జన్మదినం రోజున 12వ టైటిల్ గెలవడం చాలా ప్రత్యేకమైందిగా భావిస్తున్నా’. - పంకజ్ -
ప్రపంచ ఛాంపియన్‌గా అద్వానీ
బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. సింగపూర్ క్రీడాకారుడు గిల్‌క్రిస్ట్‌పై 6-2 తేడాతో గెలిచాడు. తాను ఏడో స్వర్గాన్ని అధిగమించానని ఈ సందర్భంగా అద్వానీ చెప్పాడు. తన ఆశయం సగమే పూర్తయిందని, మరో ఫార్మాట్లో ఇంకా విజయం సాధించాలని అన్నాడు. మంచి వార్త కోసం అందరూ వేచి చూడాలని చెప్పాడు. అప్పుడే ఎవరూ అభినందనలు తెలపొద్దని కూడా అన్నాడు. ఇప్పటివరకు పంకజ్ అద్వానీ 150కి పైగా అంతర్జాతీయ ట్రోఫీలు వశమయ్యాయి. -
పంకజ్‌కు మరో ప్రపంచ టైటిల్
లీడ్స్ (ఇంగ్లండ్): భారత ‘క్యూ స్పోర్ట్స్’ స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో 11వ ప్రపంచ టైటిల్‌ను జమచేసుకున్నాడు. శుక్రవారం ముగిసిన 150 పాయింట్ల ఫార్మాట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ బెంగళూరు క్రీడాకారుడు విజేతగా నిలిచాడు. పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)తో జరిగిన ఫైనల్లో 29 ఏళ్ల పంకజ్ అద్వానీ 6-2 (23-151, 151-16, 116-150, 151-104, 150-0, 151-58, 150-4, 150-145) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 5-2తో భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారిని ఓడించాడు. -
పంకజ్ అద్వానీ అదుర్స్
వరల్డ్ 6-రెడ్ స్నూకర్ టైటిల్ కైవసం షార్మ్ ఎల్ షీక్ (ఈజిప్టు): భారత స్నూకర్ స్టార్ పంకజ్ అద్వానీ వరల్డ్ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో పంకజ్ 6-1 తేడాతో పోలండ్‌కు చెందిన కాస్పర్ ఫ్లిల్పియాక్‌పై విజయం సాధించాడు. దీంతో కెరీర్లో తొమ్మిదో ప్రపంచ టైటిల్‌ను (బిలియర్డ్స్‌లో 7, స్నూకర్‌లో 2) తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అద్వానీ ప్రపంచంలో లాంగ్, షార్ట్ ఫార్మాట్లలోనూ ప్రపంచ టైటిల్ నెగ్గిన తొలి ఆటగాడయ్యాడు. ‘ఇదంతా కలలా అనిపిస్తోంది. ఈ చాంపియన్‌షిప్‌లో గెలుస్తానని ఊహించలేదు’ అని అద్వానీ వ్యాఖ్యానించాడు. -
క్వార్టర్స్‌లో పంకజ్ అద్వానీ
షార్మ్ ఎల్ షీక్ (ఈజిప్టు): వరల్డ్ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌లో శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో పంకజ్ 4-0తో అలెక్స్ బోర్గ్ (మాల్టా)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో కమల్ చావ్లా 2-4తో మెహసెన్ బుక్షాషీష్ (ఖతర్) చేతిలో ఓటమిపాలయ్యాడు. 15-రెడ్ స్నూకర్ టీమ్ ఈవెంట్లో భారత జోడీలు నిరాశపర్చాయి. క్వార్టర్స్‌లో పంకజ్-బ్రిజేష్ దమానీ జోడి 1-4తో మహ్మద్ ఆసిష్-సజ్జాద్ హుస్సేనీ (పాకిస్థాన్) చేతిలో; సౌరవ్ కొఠారీ-శివమ్ అరోరా ద్వయం 0-4తో హోస్సెనీ వాఫెయి అయోరీ-ఎహ్సాన్ హైదర్ అలీ (ఇరాన్) చేతిలో పరాజయం చవిచూశాయి. మహిళల విభాగంలో విద్య పిళ్లై-అమీ కామని 3-0తో జెస్సీకా వుడ్స్-క్యాతీ పరాశీష్పై నెగ్గారు. -
పంకజ్ ఖాతాలో 24వ టైటిల్
జాతీయ స్నూకర్ చాంపియన్‌షిప్ లక్నో: ప్రపంచ చాంపియన్ పంకజ్ అద్వానీ ఆరోసారి జాతీయ స్నూకర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. పీఎస్‌పీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతను శుక్రవారం జరిగిన ఫైనల్లో 6-3తో కమల్ చావ్లా (రైల్వేస్)పై విజయం సాధించాడు. ఓవరాల్‌గా పంకజ్‌కు ఇది 24వ జాతీయ టైటిల్. పంకజ్ ధాటికి మ్యాచ్‌లో ఎక్కువ భాగం చావ్లా కుర్చికే పరిమితమయ్యాడు. తొమ్మిదో ప్రేమ్‌లో 139 పాయింట్లను సాధించడం పీఎస్‌పీబీ ఆటగాడికి టైటిల్‌ను తెచ్చిపెట్టింది. ఓ దశలో చావ్లా కూడా పోరాడినా స్వల్ప తేడాతో పాయింట్లు చేజార్చుకున్నాడు. అంతకుముందు జరిగిన పోటీల్లో పంకజ్ 84, 69, 61, 64 పాయింట్లు సాధించాడు. ఈ టైటిల్‌ను మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అంకితమిస్తున్నట్లు బెంగళూరుకు చెందిన అద్వానీ చెప్పాడు. ‘జాతీయ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడం ఎప్పటికీ గర్వకారణమే. గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమాజాన్ని నిజంగా తీర్చిదిద్దుతున్నది మహిళలే కాబట్టి వారికే ఈ టైటిల్ అంకితం’ అని పంకజ్ వ్యాఖ్యానించాడు.