వరల్డ్‌ కప్‌ స్నూకర్‌ ఫైనల్లో భారత్‌ | India beats Ireland on Snooker World Cup | Sakshi

వరల్డ్‌ కప్‌ స్నూకర్‌ ఫైనల్లో భారత్‌

Jul 2 2019 4:31 AM | Updated on Jul 2 2019 4:31 AM

India beats Ireland on Snooker World Cup - Sakshi

పంకజ్‌ అద్వానీ, లక్ష్మణ్‌ రావత్‌

అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్‌ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్‌) వరల్డ్‌ కప్‌ స్నూకర్‌ టోర్నమెంట్‌లో పంకజ్‌ అద్వానీ, లక్ష్మణ్‌ రావత్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. దోహాలో సోమవారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 3–2 (57–59, 7–76, 101–9, 66–16, 75–34) ఫ్రేమ్‌ల తేడాతో బ్రెండన్‌ ఒడొనోగుయె, ఆరన్‌ హిల్‌లతో కూడిన ఐర్లాండ్‌ జట్టుపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌ (అస్జద్‌ ఇక్బాల్, మొహమ్మద్‌ బిలాల్‌)తో భారత్‌ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌ 3–1తో ఖతర్‌పై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement