సింగపూర్: భారత దిగ్గజ క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్–స్నూకర్ ) ప్లేయర్ పంకజ్ అద్వానీ అంతర్జాతీయస్థాయిలో మరో టైటిల్ సాధించాడు. ఆదివారం ముగిసిన సింగపూర్ ఓపెన్ స్నూకర్ టోర్నమెంట్‌లో పంకజ్ అద్వానీ చాంపియన్‌గా నిలిచాడు. జాడెన్ ఓంగ్ (సింగపూర్)తో జరిగిన ఫైనల్లో పంకజ్ 5–1 (65–57, 62–46, 85–18, 15–66, 71–62, 75–11) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు.
సెమీఫైనల్లో పంకజ్ 4–3తో ప్రపంచ మాజీ స్నూకర్ చాంపియన్ దెచావత్ పూమ్‌జేంగ్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. ఐదు దేశాల నుంచి 123 మంది ప్లేయర్లు ఈ టోర్నీలో పోటీపడ్డారు. విజేతగా నిలిచిన పంకజ్‌కు 11 వేల సింగపూర్ డాలర్లు (రూ. 7 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. పుణేలో జన్మించి బెంగళూరులో స్థిరపడ్డ 39 ఏళ్ల పంకజ్ తన కెరీర్‌లో వివిధ ఫార్మాట్‌లలో 27 ప్రపంచ టైటిల్స్‌ను సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment