
దోహా: ఆసియా టీమ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ, లక్ష్మణ్ రావత్, ఆదిత్య మెహతాలతో కూడిన భారత్ 2–3 (1–79, 1–71, 58–18, 67–39, 9–69) ఫ్రేమ్‌ల తేడాతో పాకిస్తాన్–2 జట్టు చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో టీమిండియా 3–2 (95–46, 55–42, 28–74, 43–51, 69–29) ఫ్రేమ్‌ల తేడాతో మయన్మార్ జట్టును ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 3–0 (98–0, 74–22, 68–17) ఫ్రేమ్‌లతో పాకిస్తాన్–1 జట్టుపై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment