రెండో రౌండ్లో పంకజ్ అద్వానీ | Pankaj Advani moves to the second round of Indian Open | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్లో పంకజ్ అద్వానీ

Published Thu, Jul 7 2016 1:49 AM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

Pankaj Advani moves to the second round of Indian Open

సాక్షి, హైదరాబాద్: ఇండియా ఓపెన్ ప్రపంచ ర్యాంకింగ్ స్నూకర్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి క్యూయిస్ట్  పంకజ్ అద్వానీ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో బుధవారం జరిగిన తొలి రౌండ్లో అతను 4-0తో ఎలియట్ స్లెసర్ (ఇంగ్లండ్)పై అలవోక విజయం సాధించాడు. ఈ పోరులో అద్వానీ నాలుగు ఫ్రేముల్లో కలిపి 266 పాయింట్లు సాధించగా, ప్రత్యర్థి మాత్రం 31 పాయింట్లకే పరిమితమయ్యాడు. భారత్‌కు చెందిన మరో ఆటగాడు ఇశ్‌ప్రీత్ చద్దా 2-4తో డామినిక్ డేల్ చేతిలో పరాజయం చవిచూశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement