![Pankaj Advani Bags 36th National Title](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/pankaj.jpg.webp?itok=KdM7eH7q)
ఇండోర్: భారత స్టార్ క్యూయిస్ట్, ప్రపంచ చాంపియన్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో 36వసారి జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. మంగళవారం జరిగిన 91వ జాతీయ స్నూకర్ చాంపియన్‌షిప్ ఫైనల్లో పంకజ్ 5–1 ఫ్రేమ్‌ల తేడాతో బ్రిజేశ్ దమానిపై నెగ్గాడు. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్‌తో పాటు బ్రిజేశ్ జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నారు.
‘అంతర్జాతీయ టోరీ్నల్లో పాల్గొనే అవకాశం ఇచ్చే ఈవెంట్ ఇదొక్కటే కావడంతో... తీవ్ర పోటీ ఎదురైంది. గ్రూప్ దశలో పేలవ ప్రదర్శన అనంతరం తిరిగి పుంజుకొని స్వర్ణం నెగ్గడం ఆనందంగా ఉంది. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది’ అని పంకజ్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment