National championship
-
‘మట్టి’లో మాణిక్యాలు
ఏ దేశంలోని మైదానంలోనైనా సరే.. ప్రత్యర్థి జట్టును మట్టికరిపిస్తూ దూసుకెళ్లే భారత హాకీ జట్టు అంటే ప్రపంచ దేశాలకు హడల్.. ఆసియా ఛాంపియన్ ట్రోఫీలతో పాటు ఒలింపిక్స్‌లోనూ భారత్ సత్తాచాటి ఎన్నో మెడల్ సాధించిన సంగతి తెలిసిందే.. క్రికెట్‌తో పోలిస్తే మన దేశంలో జాతీయ క్రీడ హాకీకి ఆదరణ అంతంత మాత్రమే.. హాకీలో మహిళలు సైతం పతకాల పంట పండిస్తుండటంతో ఉత్తరాది రాష్ట్రాల్లో క్రీడాకారులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తూ శిక్షణ అందిస్తున్నారు. దీంతో కొందరు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఇక మన రాష్ట్రంలో హాకీ క్రీడకు కనీస సదుపాయాలు లేకపోయినా క్రీడాకారులు మాత్రం తగ్గేదే లే అన్నట్లు పక్క రాష్ట్రాలకు వెళ్లిమరీ కోచింగ్ తీసుకుంటున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. టర్ఫ్ గ్రౌండ్స్‌ను అభివృద్ధి చేస్తే మరింత ప్రాక్టీస్ చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాల వేట కొనసాగిస్తామంటున్నారు హైదరాబాదీలు.. సికింద్రాబాద్ ఆర్ఆర్సీ గ్రౌండ్లో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు 14వ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ చాంపియన్‌షిప్ –2024 పోటీలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన లాలస తెలంగాణ జట్టుకు కెప్టెన్‌గా, మరో ఇద్దరు సోదరీమణులు భవిష్య, చరిత్ర తెలంగాణ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లాలస ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) క్యాంపులో ఉంటూ ప్రాక్టీస్ చేస్తోంది. భవిష్య, చరిత్ర కేరళలో సాయ్ క్యాంపులో శిక్షణ పొందుతున్నారు. హాకీ పట్ల ఉన్న మక్కువతో జాతీయ స్థాయికి ఎదిగిన క్రమంలో వీరు పడ్డ కష్టాలు, సాధించిన విజయాల గురించి వారి మాటల్లోనే..కేరళలో శిక్షణ పొందుతున్నాం: భవిష్య, చరిత్ర మల్కాజిగిరికి చెందిన సందీప్ రాజ్ తెలంగాణ మాస్టర్స్ హాకీ టీమ్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన ఆయన ఇద్దరు కుమార్తెలు భవిష్య, చరిత్ర తెలంగాణ బాలికల జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక కీస్ హైసూ్కల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన భవిష్య, చరిత్ర తొలినాళ్లలో జింఖానా మైదానంలో కోచ్ కామేశ్ శిక్షణలో హాకీ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. కేరళలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ శిబిరానికి ఎంపిక కావడంతో ప్రస్తుతం అక్కడే ఉండి శిక్షణ తీసుకుంటున్నారు. 9, 10వ తరగతి చదువుతున్న వీరు అక్కడి రాష్ట్ర భాష మళయాళీ నేర్చుకుని మరీ పరీక్షలకు హాజరవుతున్నారు. తన ఇద్దరు కూతుళ్లు ఇప్పటి వరకు 6 జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. ఆట కోసం ఒడిశా వెళ్లా: లాలస సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్‌లోని ఆక్సిల్లమ్ స్కూల్లో 1 నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నాను. స్థానిక జింఖానా మైదానంలో హాకీ శిక్షణ తీసుకున్నా. కోచ్ కామేశ్ ప్రోత్సాహంతో ఆటలో నైపుణ్యం సాధించా.. హైదరాబాద్‌లో టర్ఫ్ కోర్టులు అందుబాటులో లేకపోవడంతో గ్రావల్ (కంకర మట్టి) కోర్టుల్లోనే ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. ఉత్తమమైన శిక్షణ కోసం తొలుత బెంగళూరుకు వెళ్లా. పదో తరగతి పరీక్షలు అక్కడే రాయాల్సి వచ్చింది. స్థానిక భాష కన్నడ నేర్చుకుని మరీ పదో తరగతిలో పాసయ్యా. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని నవల్ టాటా క్రీడాప్రాంగణంలో శిక్షణ తీసుకుంటున్నాను. ప్రముఖ హాకీ క్రీడాకారుడు భారత జాతీయ జట్టు మాజీ కెపె్టన్, గోల్ కీపర్ శ్రీజేశ్ ద్వారా స్ఫూర్తి పొంది గోల్ కీపర్‌గా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నదే లక్ష్యం. తండ్రి జగన్, తల్లి ప్రోత్సాహం ఉంది. ఇప్పటి వరకు మూడు జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. -
I-League 2023-24: శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు మరో విజయం
లుధియానా: ఐ–లీగ్ జాతీయ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఖాతాలో 11వ విజయం చేరింది. ఢిల్లీ ఎఫ్‌సీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ జట్టు 1–0 గోల్ తేడాతో గెలుపొందింది. ఆట 22వ నిమిషంలో రిల్వాన్ పాస్‌ను హెడర్ షాట్‌తో లాల్రొమావియా బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో శ్రీనిధి డెక్కన్ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత శ్రీనిధి జట్టు ఈ ఆధిక్యాన్ని చివరి నిమిషందాకా కాపాడుకుంది. మొత్తం 13 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో ప్రస్తుతం శ్రీనిధి జట్టు 36 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈనెల 17న జరిగే తదుపరి మ్యాచ్‌లో గోకులం కేరళ ఎఫ్‌సీతో శ్రీనిధి జట్టు తలపడుతుంది. -
రెక్కలిచ్చిన ఆసనం
మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పెద్దయ్యాక ఇది అవ్వాలి, అది అవ్వాలి అని రకరకాల కలలు కంటాము. ఎంతో ఇష్టమైన కలను నిజం చేసుకునేందుకు ఎదురైన అడ్డంకులన్నింటిని దాటుకుని సాధిస్తాం. హమ్మయ్య చేరుకున్నాం అని కాస్త సంతోషపడేలోపు అనుకోని కుదుపులు కెరీర్‌ను పూర్తిగా నాశనం చేస్తాయి. తిరిగి కోలుకోలేని దెబ్బకొడతాయి. అచ్చం ఇలానే జరిగింది అన్షుక పర్వాణి జీవితంలో. తనకెంతో ఇష్టమైన కెరీర్‌ను వదిలేసినప్పటికీ... యోగా ఇచ్చిన ధైర్యంతో యోగానే కెరీర్‌గా మలుచుకుని సెలబ్రెటీ యోగా ట్రైనర్‌గా రాణిస్తోంది పర్వాణి. ముంబైకి చెందిన అన్షుక పర్వాణి విద్యావంతుల కుటుంబంలో పుట్టింది. అన్షుకకు చిన్నప్పటినుంచి ఆస్తమా ఉంది. అయితే మందులు మింగడం అంటే ఇష్టం ఉండేది కాదు. దీంతో డాక్టర్స్ అయిన తాతయ్య, నాయనమ్మలు... ‘‘రోజూ స్విమ్మింగ్ చేస్తుంటే నీ ఊపిరి తిత్తులు బలంగా మారతాయి’’ అని ప్రోత్సహించేవారు. మందులు మింగే బాధ ఉండదని, అన్షుక ఎంతో ఆసక్తిగా స్విమ్మింగ్ నేర్చుకుని రోజూ ఈతకొట్టేది. ఈతలో పట్టుసాధించి జాతీయస్థాయి ఛాంపియన్ షిప్స్‌లో గోల్డ్‌మెడల్ గెలిచింది. స్విమ్మింగ్‌తోపాటు విమాన ప్రయాణం అన్నా అన్షుకకు చాలా ఇష్టం. ఈ ఇష్టంతోనే పైలట్ కావాలని కలలు కనేది. పైలట్ అయ్యి, ప్రపంచమంతా తిరిగిరావాలని... కష్టపడి కమర్షియల్ పైలట్ అయ్యింది. ► ఎగరలేకపోయింది అది 2008.. అన్షుక అనుకున్నట్టుగానే పైలెట్‌గా గాలిలో తేలిపోతున్న రోజులవి. ఒకరోజు బైక్ యాక్సిడెంట్లో అనుష్క కాళ్లు, తల, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఎటూ కదల్లేని పరిస్థితి. కొన్ని నెలలపాటు బెడ్‌కే పరిమితమైంది. దీంతో కమర్షియల్ పైలట్ ఉద్యోగానికి ఫిట్ కాదని జాబ్ నుంచి తొలగించారు. ఒకపక్క గాయాలతో గుచ్చుకుంటోన్న శరీరం, మరోపక్క విమానం నడపలేని పరిస్థితి అన్షుకను కలచివేసింది. ఇదే సమయంలో తల్లిదండ్రులు అండగా ఉండి, తమ సంపూర్ణ సహకారం అందించడంతో... ఫిజియోథెరపీ, యోగాలతో కొన్ని వారాలలోనే కోల్పోయిన మనోధైర్యాన్ని కూడదీసుకుంది. ఎలాగైనా లేచి నడవాలి అని నిర్ణయించుకుని ఆసనాలను కఠోరంగా సాధన చేసేది. తన తల్లి యోగా టీచర్ కావడం, చిన్నప్పటి నుంచి ఆస్తమాను ఎదుర్కోవడానికి యోగాసనాలు వేసిన అనుభవంతో ఎనిమిది నెలల్లోనే కోలుకుని తిరిగి నడవగలిగింది. ► యోగ శక్తిని తెలపాలని... యోగాతో సాధారణ స్థితికి వచ్చిన అన్షుక.. తిరిగి పైలట్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ యోగాపై ఏర్పడిన నమ్మకం, ఆసక్తితో ‘యోగాను ఎందుకు కెరీర్‌గా ఎంచుకోకూడదు? ఎగరలేక కిందపడిపోయిన తనని తిరిగి లేచి నyì చేలా చేసిన ఈ యోగా శక్తిని అందరికీ తెలియచేయాలి’ అనుకుని.. తొమ్మిది నెలల పాటు యోగాలో శిక్షణ తీసుకుని సర్టిఫికెట్ అందుకుంది. యోగాను మరింత లోతుగా తెలుసుకునేందుకు ముంబై యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పీజీ చేస్తూనే వివిధ రకాల సంప్రదాయ యోగాలను సాధన చేసి ఔపోసన పట్టింది. ఈ క్రమంలోనే పైలట్స్, బాలే, జుంబాను నేర్చుకుని సర్టిఫికెట్ పొందింది. 2015లో బాంద్రాలో యోగా ఇన్స్టిట్యూట్ను నెలకొల్పింది. సంప్రదాయ యోగాసనాలకు కొన్ని టెక్నిక్స్‌ను జోడించడంతో మంచి ఫలితాలు వచ్చేవి. దీంతో అన్షుక యోగా సెంటర్ బాగా పాపులర్ అయ్యింది. ► అన్షుక యోగా స్టూడియో! యోగాపై పెరిగిన అవగాహనతో సెలబ్రెటీలు సైతం తమ ఫిట్నెస్కోసం యోగాను ఎంచుకుంటున్నారు. అన్షుక ట్రైనింగ్ బావుండడంతో.. మలైకా అరోరా, హూమా ఖురేషి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్, ఆలియాభట్, దీపికా పదుకోన్, రకుల్æప్రీత్ సింగ్, మిస్బా గుప్తా, అనన్య పాండే, జాహ్నవీ కపూర్, సోనాల్ చౌహాన్ వంటి సెలబ్రెటీలు అన్షుక దగ్గర యోగాలో శిక్షణ తీసుకున్నారు. ఎంతమంది సెలబ్రెటీలకు యోగా ట్రైనర్‌గా పనిచేసినా నాకు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. శిక్షణ ఇవ్వడమంటే ఇష్టం. ట్రైనింగ్ ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే, నేను మనసా వాచా కర్మణ్యా పనిచేస్తున్నాను. ఎవరికైనా సలహాలు, సూచనలు ఇచ్చినప్పుడు అవి కచ్చితత్వంతోనూ, సత్యంతోనూ ఉంటేనే వాటికి విలువ ఉంటుంది. అందుకే నేను యోగాసనాలు వేసి, వేయించి, దాని శక్తిని అందరికీ తెలిసేలా చేస్తున్నాను. అందుకే నా శిక్షణకు ఆదరణ లభిస్తోంది. -
వైరల్ వీడియో: స్టేజీపైనే ఆటగాడి చెంప చెళ్లుమనిపించిన బీజేపీ ఎంపీ
రాంచీ: బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్ బహిరంగంగా ఓ వ్యక్తి చెంప చెల్లుమనిపించారు. స్టేజ్‌పైనే ఆటగాడికి రెండు చెంపలు వాయించడంతో వేదికపై ఉన్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని రాంచీలో అండర్-15 జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఈవెంట్లో చోటుచేసుకుంది. షహీద్ గణ్‌పత్ రాయ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీ భూషణ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ యువకుడికి15 ఏళ్లు దాటడంతో అండర్ -15 ఈవెంట్లో పాల్గొనేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో తనను పోటీల్లో పాల్గొనడానికి అనుమతించాలని స్టేజ్ మీదకు వెళ్లి ఎంపీ సింగ్‌ను పదే పదే ఇబ్బంది పెట్టాడు. దీంతో సహనం కోల్పోయిన ఎంపీ వేదికపై ఉన్న రెజ్లర్‌ను అందరిముందే చెంప దెబ్బ కొట్టాడు. యువ రెజ్లర్ వేదిక నుంచి కిందకు దిగుతుండగా రెండు సార్లు అతనిపై చేయిచేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆటగాడిపై ఎంపీ చేయి చేసుకోవడంపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఎంపీ సింగ్ ప్రస్తుతం లోక్‌సభలో ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. BJP सांसद व भारतीय कुश्ती संघ के अध्यक्ष बृजभूषण शरण सिंह ने रांची में अंडर-15 नेशनल कुश्ती चैंपियनशिप के दौरान मंच पर एक युवा पहलवान को थप्पड़ जड़ दिया। वीडियो वायरल… pic.twitter.com/Tlm6LpXSHG — Ashraf Hussain (@AshrafFem) December 17, 2021 -
AICF: చెస్‌కు ‘ఎంపీఎల్’ అండ.. కోటితో మొదలుపెట్టి..
న్యూఢిల్లీ: భారత క్రికెట్ టీమ్‌కు కిట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ‘ఎంపీఎల్ స్పోర్ట్స్’ ఇప్పుడు మరో క్రీడకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. చదరంగానికి తాము అండగా నిలుస్తామంటూ అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్)తో ఒప్పందం చేసుకుంది. వచ్చే ఐదేళ్లలో జరిగే అన్ని జాతీయ చాంపియన్‌షిప్‌లకు తాము స్పాన్సర్షిప్ అందిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటి ఏడాది రూ. 1 కోటితో మొదలు పెట్టి ప్రతీ ఏటా ఈ మొత్తాన్ని 20 శాతం పెంచుతారు. అండర్–7 స్థాయినుంచి జరిగే అన్ని జాతీయ టోర్నీలకు ఎంపీఎల్ సహకారం లభిస్తుంది. దీర్ఘకాలిక ప్రాతిపదికన చెస్‌కు స్పాన్సర్షిప్ అందించేందుకు గత కొన్నేళ్లలో ముందుకు వచ్చిన తొలి కార్పొరేట్ సంస్థ ఎంపీఎల్ మాత్రమే కావడం విశేషం. చదవండి: IPL 2021: ఫైనల్‌కు ముందు కేకేఆర్‌కు బిగ్ షాక్! The All India Chess Federation (AICF) signed a historic agreement with MPL Sports Foundation for a sponsorship amount of One Crore towards the sponsorships for Indian National Championships for the next five years with a 20% increase every year. @PlayMPL pic.twitter.com/viIjlfUr27 — All India Chess Federation (@aicfchess) October 14, 2021 -
క్యాన్సర్‌తో పోరాడి... ఒలింపిక్స్‌కు అర్హత
టోక్యో: సాధారణంగా ఒలింపిక్స్ కోసం అథ్లెట్లు అందరూ క్వాలిఫయింగ్‌లో పోరాడతారు. కానీ జపాన్‌కు చెందిన మహిళా స్విమ్మర్ రికాకో ఐకీ మాత్రం క్యాన్సర్‌తో పోరాడింది. దానిని జయించి మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది. జపాన్ జాతీయ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో లక్ష్యదూరాన్ని ఆమె 57.77 సెకన్లలో పూర్తి చేసి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. రెండేళ్ల క్రితం లుకేమియా (రక్త క్యాన్సర్) బారిన పడిన ఆమె తాజా విజయంతో వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. -
అద్వానీ ఖాతాలోమరో జాతీయ టైటిల్
పుణే: భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. సీనియర్ జాతీయ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ లో అద్వానీ విజేతగా నిలిచాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో అతను 5–2 ఫ్రేమ్స్ తేడాతో సౌరవ్ కొఠారీపై విజయం సాధించాడు. తొలి ఫ్రేమ్ కోల్పోయిన అద్వానీ 13–150, 152–12, 151–0, 62–150, 150–45, 150–48, 150–2తో ప్రత్యర్థిని ఓడించాడు. ఓవరాల్‌గా జాతీయ స్థాయిలో ఈ వెటరన్ క్యూ స్పోర్ట్స్ స్టార్‌కు 33వ టైటిల్ కాగా... సీనియర్ కేటగిరీలో పదో టైటిల్. 3, 4 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో ధ్వజ్ హరియా 3–0తో బ్రిజేశ్ దమానిపై గెలుపొందాడు. -
శభాష్... హర్ష
నిరీక్షణ ముగిసింది. హైదరాబాద్ చెస్ క్రీడాకారుడు హర్ష భరతకోటి అనుకున్నది సాధించాడు. భారత్ నుంచి 56వ గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. ఎరిగైసి అర్జున్ తర్వాత తెలంగాణ నుంచి ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఆగస్టులో అబుదాబి మాస్టర్స్ టోర్నీలో హర్ష మూడో జీఎం నార్మ్ సంపాదించినా... జీఎం హోదా ఖాయం కావడానికి అవసరమైన 2500 రేటింగ్ పాయింట్లు ఆ సమయానికి అతని ఖాతాలో లేకపోవడంతో జీఎం టైటిల్ రాలేదు. ఆ తర్వాత ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచిన హర్ష తన రేటింగ్ పాయింట్లను 2492కు పెంచుకున్నాడు. తాజాగా గుజరాత్ ఓపెన్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో హర్ష వరుసగా నాలుగో విజయం సాధించి మరో 8 రేటింగ్ పాయింట్లు సంపాదించాడు. ఈ క్రమంలో జీఎం టైటిల్ ఖరారు కావడానికి అవసరమైన 2500 పాయింట్ల మైలురాయి దాటి తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: చెస్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వారందరూ ఏనాటికైనా గ్రాండ్‌మాస్టర్ (జీఎం) కావాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే మేధో క్రీడ అయిన చెస్‌లో ఈ ఘనత సాధించడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఎన్నో ప్రతికూలతలు ఉన్నా... కష్టాన్ని ఇష్టంగా మలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. కాస్త ఆలస్యమైనా అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటాం. హైదరాబాద్ చెస్ ప్లేయర్ హర్ష భరతకోటి విషయంలో అదే జరిగింది. గత ఆగస్టులోనే జీఎం హోదా దక్కాల్సినా... అవసరమైన రేటింగ్ పాయింట్లు లేకపోవడంతో ఈ ఘనత అందుకోలేకపోయాడు. అయితేనేం తన ఆటతీరుకు మరింత పదునుపెట్టి... తనకంటే మేటి ఆటగాళ్లను మట్టికరిపించి... రెండు నెలల వ్యవధిలోనే 2500 మైలురాయిని అందుకున్నాడు. గ్రాండ్‌మాస్టర్ (జీఎం) అయ్యాడు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న గుజరాత్ ఓపెన్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నమెంట్లో 18 ఏళ్ల హర్ష వరుసగా నాలుగో విజయం సాధించాడు. తజకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్, 2651 రేటింగ్ ఉన్న ఫారూఖ్ అమనతోవ్తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడుతూ 32 ఎత్తుల్లో గెలిచి సంచలనం సృష్టించాడు. అంతకుముందు హర్ష మూడో రౌండ్లో పరాబ్ రిత్విజ్ (భారత్)పై 48 ఎత్తుల్లో... రెండో రౌండ్లో రక్షిత రవి (భారత్)పై 32 ఎత్తుల్లో... తొలి రౌండ్లో చంద్రేయి హజ్రాపై గెలిచాడు. నాలుగో రౌండ్ తర్వాత హర్ష నాలుగు పాయింట్లతో మరో ఐదుగురితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ... తొమ్మిదేళ్ల ప్రాయంలో చెస్ ఆడటం ప్రారంభించిన హర్ష రెండేళ్లు తిరిగేలోపు జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించాడు. కోచ్ ఎన్వీఎస్ రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్న హర్ష క్రమం తప్పకుండా తన ఆటతీరుకు మెరుగులు దిద్దుకున్నాడు. అటాకింగ్ గేమ్‌ను ఇష్టపడే ఈ హైదరాబాద్ అబ్బాయి గేమ్ పరిస్థితిని బట్టి వెంటవెంటనే వ్యూహాలు మార్చి ఫలితాన్ని తారుమారు చేయగల సమర్థుడు. ఏడేళ్లుగా చెస్‌లో ఉన్న హర్ష ఇప్పటివరకు 25 మంది కంటే ఎక్కువ మంది గ్రాండ్మాస్టర్లను ఓడించాడు. 2017 అక్టోబరులో ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ టోర్నీలో తొలి జీఎం నార్మ్ పొందిన హర్ష... ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన దుబాయ్ ఓపెన్‌లో రెండో జీఎం నార్మ్... ఆగస్టులో అబుదాబి మాస్టర్స్ టోర్నీలో మూడో జీఎం నార్మ్ సంపాదించాడు. హర్ష భరతకోటి ముఖ్య విజయాలు ∙2011: జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం. ∙2012: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ అండర్–12 ర్యాపిడ్ విభాగంలో స్వర్ణం. ∙2012: కామన్వెల్త్ చాంపియన్‌షిప్ అండర్–12 విభాగంలో స్వర్ణం. ∙2013: జాతీయ జూనియర్ అండర్–13 చాంపియన్‌షిప్‌లో స్వర్ణం. 2014: ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో రజతం ∙2016: ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం ∙2017: జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం ∙2017: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో బ్లిట్జ్ విభాగంలో రజతం ∙2017: ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ టోర్నీలో తొలి జీఎం నార్మ్ ∙2018: కఠ్మాండూ ఓపెన్‌లో స్వర్ణం ∙ 2018: దుబాయ్ ఓపెన్‌లో రెండో జీఎం నార్మ్ ∙2018: అబుదాబి మాస్టర్స్ టోర్నీలో మూడో జీఎం నార్మ్. ‘గ్రాండ్‌మాస్టర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. నా కలను సాకారం చేసుకునేందుకు పదేళ్లుగా శ్రమిస్తున్నాను. నేనీస్థాయికి చేరుకోవడం వెనుక కోచ్ ఎన్వీఎస్ రామరాజు కృషి ఎంతో ఉంది. ఆటపరంగానూ, ఆర్థికంగానూ ఆయన నాకెంతో సహాయం చేశారు. జీఎం లక్ష్యం నెరవేరడంతో మున్ముందు నా రేటింగ్‌ను మరింత పెంచుకుంటాను. 2700 రేటింగ్‌ను అందుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతాను. ఈ క్రమంలో ఎవరైనా స్పాన్సర్లు ఆర్థికంగా అండగా నిలవాలని కోరుకుంటున్నాను.’ – ‘సాక్షి’తో హర్ష -
హోరాహోరీగా జాతీయస్థాయి క్రీడలు
వెయిట్ లిఫ్టింగ్‌లో తెలంగాణకు గోల్డ్‌మెడల్ 86 కేజీల బాలికల విభాగంలో సెమీస్‌కు.. వరంగల్ స్పోర్ట్స్ : హన్మకొండలోని జేఎన్ఎస్లో జరుగుతున్న 62వ ఎస్జీ ఎఫ్ఐ అండర్–19 నేషనల్ చాంపియన్ షిప్–2016 పోటీలు బుధవారం రెండో రోజు హోరాహోరీగా కొనసాగాయి. బా క్సింగ్ పోటీలు సెమీఫైనల్‌కు చేరుకో గా, వెయిట్ లిఫ్టింగ్‌లోని పలు విభాగాల్లో పాల్గొన్న క్రీడాకారులు పతకాలు సాధించారు. లీగ్ పద్ధతిలో జరిగిన టెన్నీస్ వాలీబాల్ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు తలపడ్డాయి. వెయిట్ లిఫ్టింగ్ : అండర్–19 బాలికల్లో వెయిట్ లిఫ్టర్లు తమ సత్తా చాటారు. 58 కేజీల్లో బి. కృష్ణకళ (తెలంగాణ) బంగారు, పి. శ్యామల (పాండిచ్చేరి) వెండి, సాక్షి పాండే (మహారాష్ట్ర) బ్రాం జ్ పతకాలు సాధించారు. 63 కేజీల్లో ప్రజిక్త కాలీకర్(మహారాష్ట్ర) విజేతగా నిలవగా, ఆరోఖ్య (తమిళనాడు) ద్వితీ య, కిరణ్జిత్కౌర్ (పంజాబ్)తృతీయ స్థానంలో నిలిచింది. అండర్–19 బా లురలో 62 కేజీల్లో మారషి పీఎస్ (తమిళనాడు) బంగారు, ఆర్ఎస్ఎల్ సా యి(తెలంగాణ) వెండి, కల్వేష్ ఎస్ (ఢి ల్లీ) బ్రాంజ్ పతకాలు సాధించారు. సెమీస్‌కు చేరిన బాక్సింగ్.. 44 నుంచి 46 కేజీల మధ్య బాలికల్లో ఎస్. కలాల్ (తమిళనాడు)పై జ్యోతి (ఏపీ), పూజా (మహారాష్ట్ర) పై నందిని (ఢిల్లీ), మీనాక్షి (పంజాబ్)పై నిట్టు (హర్యానా), బెనర్జీ (పశ్చిమబెంగా ల్)పై దియా (మధ్యప్రదేశ్)విజయం సాధించారు. 75 నుంచి 81 కేజీల మధ్య బాలికల్లో అక్షిత (తెలంగాణ)పై వైకే యోగాంకర్(మహారాష్ట్ర), కుషల్దీప్ (పంజాబ్)పై రాజ్ కే (హిమాచల్‌ప్రదేశ్), కళ్యాణి (ఏపీ) పై అనుపమ (హర్యానా), పాయల్ (మధ్యప్రదేశ్) పై సుష్మ (గోవా) విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నారు. 81 నుంచి 86 కేజీల్లో యజ్ఞ(ఏపీæ)పై జి.నాగనిక(తెలంగాణ), ఉమ (హర్యానా) పై నంది ని (చండీఘర్), సరోజ (బెంగాల్) పై కుష్బు (హిమాచల్‌ప్రదేశ్), దుర్గాదేవి (తమిళనాడు) పై సాయ¯ŒS (మహా రాష్ట్ర) విజయం సాధించింది. -
సెమీస్‌లో ఓడిన తెలంగాణ జట్లు
► జాతీయ సబ్-జూనియర్ సెపక్తక్రా టోర్నీ సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్-జూనియర్ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు సెమీఫైనల్లో పరాజయం చవిచూశాయి. బాలికల విభాగంలో ఒడిశా జట్టు విజేతగా నిలిచింది. విక్టరీ ప్లే గ్రౌండ్స్‌లోని ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన ఫైనల్లో ఒడిశా జట్టు 2-0తో తమిళనాడుపై విజయం సాధించింది. తొలి రెగులో 17-21, 21-16, 21-16తో రెండో రెగులో 21-5, 21-16తో ఒడిశా గెలిచింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో తమిళనాడు చేతిలో తెలంగాణ ఓడింది. తమిళనాడు 2-0 (22-20, 21-13), (21-19, 23-21)తో తెలంగాణపై గెలిచింది. మరో సెమీస్‌లో ఒడిశా 2-0 (21-2, 21-5), (21-4, 21-7)తో రాజస్తాన్‌పై నెగ్గింది. బాలుర ఈవెంట్లో జరిగిన సెమీస్‌లో తెలంగాణ 0-2 (17-21, 21-15, 13-21), (16-21, 18-21)తో ఒడిశా చేతిలో పరాజయం చవిచూసింది. -
ఓడిపోయిన వైకల్యం!
-
విష్ణుకు పోల్ పొజిషన్
జాతీయ కార్టింగ్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: జాతీయ కార్టింగ్ చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్‌లో చెన్నైకి చెందిన విష్ణు ప్రసాద్ తొలి స్థానంలో నిలిచాడు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ట్రాక్‌లో మొత్తం మూడు విభాగాల్లో ఈ ఈవెంట్ జరుగుతోంది. శనివారం జరిగిన పోటీల్లో సీనియర్ విభాగంలో విష్ణు (మెకో రేసింగ్ టీమ్) సత్తా చాటాడు. తొలి హీట్‌లో మూడో స్థానంలో నిలిచినా...ఆ తర్వాత దూసుకుపోయిన విష్ణు మొత్తం మూడు పాయింట్లతో ముందంజ వేశాడు. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన చిత్తేశ్ మండోడి (మొహిత్స్ రేసింగ్) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. జూనియర్ మ్యాక్స్ కేటగిరీలో కుష్ మైని, మైక్రో మ్యాక్స్ కేటగిరీలో యష్ ఆరాధ్య అగ్ర స్థానాల్లో నిలిచారు. ఈ చాంపియన్‌షిప్ ప్రధాన రేస్‌లు ఆదివారం జరుగుతాయి. క్వాలిఫయింగ్ పోటీల్లో టాప్-5లో నిలిచిన రేసర్లు: సీనియర్స్ మ్యాక్స్ కేటగిరీ- 1. విష్ణు ప్రసాద్, 2. చిత్తేశ్ మండోడి, 3. నయన్ చటర్జీ, 4. అమేయ బఫ్నా, 5. ఆర్య గాంధీ. జూనియర్ మ్యాక్స్ కేటగిరీ - 1. కుశ్ మైని, 2. రికీ డానిసన్, 3. ఆకాశ్ గౌడ, 4. మిరా ఎర్డా, 5. ఆరోహ్ రవీంద్ర. మైక్రో మ్యాక్స్ కేటగిరీ: 1. యష్ ఆరాధ్య, 2. షహాన్ అలీ మొహసీన్, 3. అర్జున్ నాయర్, 4. పాల్ ఫ్రాన్సిస్, 5. నిఖిల్ బోహ్రా.