- వెయిట్ లిఫ్టింగ్‌లో తెలంగాణకు గోల్డ్‌మెడల్
- 86 కేజీల బాలికల విభాగంలో సెమీస్‌కు..
హోరాహోరీగా జాతీయస్థాయి క్రీడలు
Published Thu, Oct 6 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
వరంగల్ స్పోర్ట్స్ : హన్మకొండలోని జేఎన్‌ఎస్‌లో జరుగుతున్న 62వ ఎస్‌జీ ఎఫ్‌ఐ అండర్–19 నేషనల్ చాంపియన్ షిప్–2016 పోటీలు బుధవారం రెండో రోజు హోరాహోరీగా కొనసాగాయి. బా క్సింగ్ పోటీలు సెమీఫైనల్‌కు చేరుకో గా, వెయిట్ లిఫ్టింగ్‌లోని పలు విభాగాల్లో పాల్గొన్న క్రీడాకారులు పతకాలు సాధించారు. లీగ్ పద్ధతిలో జరిగిన టెన్నీస్ వాలీబాల్ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు తలపడ్డాయి.
వెయిట్ లిఫ్టింగ్ : అండర్–19 బాలికల్లో వెయిట్ లిఫ్టర్లు తమ సత్తా చాటారు. 58 కేజీల్లో బి. కృష్ణకళ (తెలంగాణ) బంగారు, పి. శ్యామల (పాండిచ్చేరి) వెండి, సాక్షి పాండే (మహారాష్ట్ర) బ్రాం జ్ పతకాలు సాధించారు. 63 కేజీల్లో ప్రజిక్త కాలీకర్(మహారాష్ట్ర) విజేతగా నిలవగా, ఆరోఖ్య (తమిళనాడు) ద్వితీ య, కిరణ్‌జిత్‌కౌర్ (పంజాబ్)తృతీయ స్థానంలో నిలిచింది. అండర్–19 బా లురలో 62 కేజీల్లో మారషి పీఎస్ (తమిళనాడు) బంగారు, ఆర్‌ఎస్‌ఎల్ సా యి(తెలంగాణ) వెండి, కల్వేష్ ఎస్ (ఢి ల్లీ) బ్రాంజ్ పతకాలు సాధించారు.
సెమీస్‌కు చేరిన బాక్సింగ్..
44 నుంచి 46 కేజీల మధ్య బాలికల్లో ఎస్. కలాల్ (తమిళనాడు)పై జ్యోతి (ఏపీ), పూజా (మహారాష్ట్ర) పై నందిని (ఢిల్లీ), మీనాక్షి (పంజాబ్)పై నిట్టు (హర్యానా), బెనర్జీ (పశ్చిమబెంగా ల్)పై దియా (మధ్యప్రదేశ్)విజయం సాధించారు. 75 నుంచి 81 కేజీల మధ్య బాలికల్లో అక్షిత (తెలంగాణ)పై వైకే యోగాంకర్(మహారాష్ట్ర), కుషల్‌దీప్ (పంజాబ్)పై రాజ్ కే (హిమాచల్‌ప్రదేశ్), కళ్యాణి (ఏపీ) పై అనుపమ (హర్యానా), పాయల్ (మధ్యప్రదేశ్) పై సుష్మ (గోవా) విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నారు. 81 నుంచి 86 కేజీల్లో యజ్ఞ(ఏపీæ)పై జి.నాగనిక(తెలంగాణ), ఉమ (హర్యానా) పై నంది ని (చండీఘర్), సరోజ (బెంగాల్) పై కుష్బు (హిమాచల్‌ప్రదేశ్), దుర్గాదేవి (తమిళనాడు) పై సాయ¯ŒS (మహా రాష్ట్ర) విజయం సాధించింది.
Advertisement
Advertisement