న్యూఢిల్లీ: భారత క్రికెట్ టీమ్‌కు కిట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ‘ఎంపీఎల్ స్పోర్ట్స్’ ఇప్పుడు మరో క్రీడకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. చదరంగానికి తాము అండగా నిలుస్తామంటూ అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్)తో ఒప్పందం చేసుకుంది. వచ్చే ఐదేళ్లలో జరిగే అన్ని జాతీయ చాంపియన్‌షిప్‌లకు తాము స్పాన్సర్‌షిప్ అందిస్తామని ప్రకటించింది.
ఇందులో భాగంగా మొదటి ఏడాది రూ. 1 కోటితో మొదలు పెట్టి ప్రతీ ఏటా ఈ మొత్తాన్ని 20 శాతం పెంచుతారు. అండర్–7 స్థాయినుంచి జరిగే అన్ని జాతీయ టోర్నీలకు ఎంపీఎల్ సహకారం లభిస్తుంది. దీర్ఘకాలిక ప్రాతిపదికన చెస్‌కు స్పాన్సర్‌షిప్ అందించేందుకు గత కొన్నేళ్లలో ముందుకు వచ్చిన తొలి కార్పొరేట్ సంస్థ ఎంపీఎల్ మాత్రమే కావడం విశేషం.
చదవండి: IPL 2021: ఫైనల్‌కు ముందు కేకేఆర్‌కు బిగ్ షాక్!
The All India Chess Federation (AICF) signed a historic agreement with MPL Sports Foundation for a sponsorship amount of One Crore towards the sponsorships for Indian National Championships for the next five years with a 20% increase every year. @PlayMPL pic.twitter.com/viIjlfUr27
— All India Chess Federation (@aicfchess) October 14, 2021
Comments
Please login to add a commentAdd a comment