
న్యూఢిల్లీ: భారత గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ కాపెల్ ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిశాడు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో 7 పాయింట్లు సాధించిన తెలంగాణ స్టార్ ప్లేయర్ మూడో స్థానంలో నిలిచాడు. ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ బోయెర్ మహెల్ పసిడి పతకం సాధించగా... భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ఇనియాన్ పన్నీర్‌సెల్వం రజత పతకం దక్కించుకున్నాడు.
26 దేశాలకు చెందిన 533 మంది ప్లేయర్లు పాల్గొన్న ఈ టోర్నీలో రిత్విక్ 9 రౌండ్‌లలో 7 పాయింట్లు సాధించాడు. ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ 6 గేమ్‌లు గెలిచి రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. ఒక గేమ్‌లో ఓటమి పాలయ్యాడు. కాపెల్ అంతర్జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన రాజా రిత్విక్‌ను తెలంగాణ చెస్ సంఘం కార్యదర్శి జయచంద్ర ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment