
మహారాష్ట్రకు చెందిన ఆదిత్య సామంత్ భారత చెస్‌లో 83వ గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న బీల్ చెస్ ఫెస్టివల్‌లో ఆదిత్య జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను అధిగమించడంతోపాటు చివరిదైన మూడో జీఎం నార్మ్‌ను సాధించాడు.
20 ఏళ్ల ఆదిత్య అబుదాబి మాస్టర్స్‌లో తొలి జీఎం నార్మ్, ఎల్ లోలోబ్రెగట్ ఓపెన్‌లో రెండో జీఎం నార్మ్ సాధించాడు.