
న్యూఢిల్లీ: యువ ఆటగాళ్లు కెరీర్‌లో ఎదిగేందుకు ప్రోత్సాహకంగా ఇప్పటి వరకు అందిస్తున్న ఆర్దిక సహకారాన్ని ఆపి వేయాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై అంతర్జాతీయ ఈవెంట్లలో విజయాలు సాధిస్తేనే నగదు పురస్కారాలు లభిస్తాయి. చెస్‌లో గ్రాండ్‌మాస్టర్‌గా (జీఎం) మారితే రూ. 4 లక్షలు, ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) సాధిస్తే రూ.1.5 లక్షలు ఇచ్చేవారు. అయితే వీటిని నిలిపివేయడం సరైన నిర్ణయం కాదని అగ్రశ్రేణి ఆటగాడు అర్జున్ ఇరిగేశి అభిప్రాయపడ్డాడు.
‘చెస్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వర్ధమాన ఆటగాళ్లకు ఈ సమస్య అర్థం కాకపోవచ్చు. కానీ వారిని ప్రోత్సహించే తల్లిదండ్రులకు మాత్రం ఈ నిర్ణయం తీవ్ర నిరాశ కలిగిస్తుంది. దీని వల్ల వారికి ఆర్దికపరమైన సమస్యలు వస్తాయి. డబ్బుల కోసం ప్రత్యామ్నాయాలు చూడాల్సి వస్తుంది. పిల్లలను ప్రోత్సహించాలనే ప్రేరణ తగ్గిపోతుంది. సరిగ్గా చెప్పాలంటే చెస్, చదువులో ఏదైనా ఎంచుకోవాల్సి వస్తే వారు ఆటను పక్కన పెట్టవచ్చు’ అని అర్జున్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment