Grand master
-
భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం
భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఫిడే రేటింగ్ లిస్ట్‌లో (ర్యాంకింగ్స్) తొలిసారి ముగ్గురు భారత గ్రాండ్‌మాస్టర్లు టాప్-10లో నిలిచారు.2024 జులై నెల ర్యాంకింగ్స్‌లో అర్జున్ ఎరిగైసి నాలుగో స్థానంలో, డి గుకేశ్ ఏడులో, ఆర్ ప్రజ్ఞానానంద ఎనిమిదో స్థానంలో నిలిచారు. భారతీయ చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 11వ స్థానంలో నిలిచాడు. అరవింద్ చితంబరం ఏకంగా 18.5 ఎలో రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని 44వ స్థానం నుంచి 29 స్థానానికి ఎగబాకాడు. జులై నెల పురుషుల రేటింగ్ లిస్ట్ టాప్ 100 జాబితాలో ఏకంగా పది మంది భారతీయులు (అర్జున్ ఎరిగైసి, డి గుకేశ్, ప్రజ్ఞానంద, విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతీ, అరవింద్ చితంబరం, హరికృష్ణ పెంటల, నిహాల్ సరిన్, ఎస్ ఎల్ నారాయణన్, సద్వాని రౌనక్) ఉండటం గమనార్హం.మహిళల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. జులై నెల రేటింగ్ లిస్ట్ టాప్-14లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ద్రోణవల్లి హారిక రెండో స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ఇటీవలే బాలికల జూనియర్ వరల్డ్ టైటిల్‌ను గెలిచిన దివ్య దేశ్‌ముఖ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానం నుండి 20వ స్థానానికి ఎగబాకింది. -
చెస్ గ్రాండ్‌మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
ఇటీవలికాలంలో భారత దేశం చెస్ గ్రాండ్‌మాస్టర్ల కర్మాగారంలా మారింది. ప్రతి ఏటా దేశం నుంచి పెద్ద సంఖ్యలో గ్రాండ్‌మాస్టర్లు పుట్టుకొస్తున్నాడు. 1987వ సంవత్సరంలో భారత్ నుంచి కేవలం విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే గ్రాండ్‌మాస్టర్‌గా ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 84కు చేరింది.కొద్ది రోజుల కిందట జరిగిన ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ఐదుగురు భారత గ్రాండ్‌మాస్టర్లు పాల్గొనగా.. గుకేశ్ ఆ టోర్నీ టైటిల్ కైవసం చేసుకుని రికార్డుల్లోకెక్కాడు. 17 ఏళ్ల గుకేశ్ క్యాండిడేట్స్ టైటిల్ నెగ్గిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టైటిల్ నెగ్గిన రెండో భారత ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించాడు.24 ఏళ్లలో 81 మంది గ్రాండ్‌మాస్టర్లు..1999 వరకు భారత్ తరఫున ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు మాత్రమే ఉండేవారు. గడిచిన 24 ఏళ్లలో భారత్ నుంచి ఏకంగా 81 మంది గ్రాండ్‌మాస్టర్లు తయారయ్యారు. గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య విషయంలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఫిడే ర్యాంకింగ్స్ టాప్-20లో ప్రస్తుతం నలుగురు భారత గ్రాండ్‌మాస్టర్లు ఉన్నారు.జూనియర్ల విభాగంలో టాప్-5 ర్యాంకింగ్స్ ఆటగాళ్లలో ఏకంగా ముగ్గురు (ప్రజ్ఞానంద, గుకేశ్, నిహల్ సరిన్) భారత ప్లేయర్లు ఉన్నారు. మహిళల విభాగంలో టాప్-20 ర్యాంకింగ్స్‌లో ముగ్గురు (ఆర్ వైశాలీ, ప్రజ్ఞానంద సోదరి) భారత ప్లేయర్లు ఉన్నారు.భారత గ్రాండ్‌మాస్టర్లు..విశ్వనాథన్ ఆనంద్ (తమిళనాడు)దిబ్యేందు బారువా (పశ్చిమ బెంగాల్)ప్రవీణ్ తిప్సే (మహారాష్ట)అభిజిత్ కుంటే (మహారాష్ట్ర)కృష్ణన్ శశికిరణ్ (తమిళనాడు)పెంటల హరికృష్ణ (ఆంధ్రప్రదేశ్) కోనేరు హంపీ (ఆంధ్రప్రదేశ్)సూర్య శేఖర్ గంగూలీ (పశ్చిమ బెంగాల్)సందీపన్ చందా (పశ్చిమ బెంగాల్) రామచంద్రన్ రమేష్ (తమిళనాడు) తేజస్ బక్రే (గుజరాత్ )మగేష్ చంద్రన్ పంచనాథన్ (తమిళనాడు)దీపన్ చక్రవర్తి (తమిళనాడు)నీలోత్పాల్ దాస్ (పశ్చిమ బెంగాల్)పరిమార్జన్ నేగి (ఢిల్లీ)గీతా నారాయణన్ గోపాల్ (కేరళ)అభిజీత్ గుప్తా (ఢిల్లీ)సుబ్రమణియన్ అరుణ్ ప్రసాద్ (తమిళనాడు)సుందరరాజన్ కిదాంబి (తమిళనాడు)ఆర్.ఆర్ లక్ష్మణ్ (తమిళనాడు)శ్రీరామ్ ఝా (ఢిల్లీ)దీప్ సేన్‌గుప్తా (పశ్చిమ బెంగాల్)బాస్కరన్ అధిబన్ (తమిళనాడు)ఎస్.పీ సేతురామన్ (తమిళనాడు)హారిక ద్రోణవల్లి (ఆంధ్రప్రదేశ్)లలిత్ బాబు (ఆంధ్రప్రదేశ్)వైభవ్ సూరి (ఢిల్లీ)ఎంఆర్. వెంకటేష్ (తమిళనాడు)సహజ్ గ్రోవర్ (ఢిల్లీ) విదిత్ గుజరాతీ (మహారాష్ట్ర)శ్యామ్ సుందర్ (తమిళనాడు)అక్షయ్‌రాజ్ కోర్ (మహారాష్ట్ర)విష్ణు ప్రసన్న (తమిళనాడు)దేబాషిస్ దాస్ (ఒడిషా 27)సప్తర్షి రాయ్ చౌదరి (పశ్చిమ బెంగాల్)అంకిత్ రాజ్‌పారా (గుజరాత్)చితంబరం అరవింద్ (తమిళనాడు)కార్తికేయ మురళి (తమిళనాడు)అశ్విన్ జయరామ్ (తమిళనాడు)స్వప్నిల్ ధోపడే (మహారాష్ట్ర)నారాయణన్ (కేరళ)శార్దూల్ గగారే (మహారాష్ట్ర)దీప్తయన్ ఘోష్ (పశ్చిమ బెంగాల్)ప్రియదర్శన్ కన్నప్పన్ (తమిళనాడు)ఆర్యన్ చోప్రా (ఢిల్లీ)శ్రీనాథ్ నారాయణన్ (తమిళనాడు)హిమాన్షు శర్మ (హర్యానా)అనురాగ్ మ్హమల్ (గోవా)అభిమన్యు పురాణిక్ (మహారాష్ట్ర)తేజ్‌కుమార్ (కర్ణాటక)సప్తర్షి రాయ్ (పశ్చిమ బెంగాల్)రమేష్‌బాబు ప్రజ్ఞానంద (తమిళనాడు)నిహాల్ సరిన్ (కేరళ)అర్జున్ ఎరిగైసి (తెలంగాణ)కార్తీక్ వెంకటరామన్ (ఆంధ్రప్రదేశ్)హర్ష భరతకోటి (తెలంగాణ)పి.కార్తికేయన్ (తమిళనాడు)స్టానీ (కర్ణాటక)విశాఖ (తమిళనాడు)డి గుకేష్ (తమిళనాడు)పి.ఇనియన్ (తమిళనాడు)స్వయంస్ మిశ్రా (ఒడిషా)గిరీష్ ఎ. కౌశిక్ (కర్ణాటక)పృథు గుప్తా (ఢిల్లీ)రౌనక్ సాధ్వని (మహారాష్ట్ర)జి. ఆకాష్ (తమిళనాడు)లియోన్ ల్యూక్ మెండోంకా (గోవా)అర్జున్ కళ్యాణ్ (తమిళనాడు)హర్షిత్ రాజా (మహారాష్ట్ర)రాజా రిథ్విక్ ఆర్ (తెలంగాణ)మిత్రభా గుహ (పశ్చిమ బెంగాల్)సంకల్ప్ గుప్తా (మహారాష్ట్ర)భరత్ సుబ్రమణ్యం (తమిళనాడు)రాహుల్ శ్రీవాత్సవ్ (తెలంగాణ)ప్రణవ్ (తమిళనాడు)ప్రణవ్ ఆనంద్ (కర్ణాటక)ఆదిత్య మిట్టల్ (మహారాష్ట్ర)కౌస్తవ్ ఛటర్జీ (పశ్చిమ బెంగాల్)ప్రాణేష్ (తమిళనాడు)విఘ్నేష్ (తమిళనాడు)సయంతన్ దాస్ (పశ్చిమ బెంగాల్)ప్రణీత్ వుప్పల (తెలంగాణ)ఆదిత్య సమంత్ (మహారాష్ట్ర)ఆర్ వైశాలి (తమిళనాడు)2022-2024 మధ్యలో వివిధ దేశాల్లో తయారైన గ్రాండ్‌మాస్టర్లు..2022🇮🇳 భారతదేశం: 8🇺🇸 USA: 5🇷🇺 రష్యా: 4🇩🇪 జర్మనీ: 3🇫🇷 ఫ్రాన్స్: 3🇺🇦 ఉక్రెయిన్: 3🇦🇿 అజర్బైజాన్: 2🇪🇸 స్పెయిన్: 2🇧🇾 బెలారస్: 2🇧🇬 బల్గేరియా: 2🇹🇲 తుర్క్మెనిస్తాన్: 1🇦🇹 ఆస్ట్రియా: 1🇨🇴 కొలంబియా: 1🇲🇪 మాంటెనెగ్రో: 1🇸🇰 స్లోవేకియా: 1 🁢 🁥🇳🇴 నార్వే: 1🇵🇱 పోలాండ్: 1🇱🇹 లిథువేనియా: 1🇻🇳 వియత్నాం: 1🇭🇷 క్రొయేషియా: 1🇮🇷 ఇరాన్: 1🇧🇷 బ్రెజిల్: 1🇲🇩 మోల్డోవా: 1🇦🇷 అర్జెంటీనా: 1🇸🇬 సింగపూర్: 1🇵🇾 పరాగ్వే: 1🇳🇱 నెదర్లాండ్స్: 1🇹🇷 టర్కీ: 12023🇮🇳 భారతదేశం: 7🇨🇳 చైనా: 3🇳🇱 నెదర్లాండ్స్: 2🇦🇲 అర్మేనియా: 2🇬🇷 గ్రీస్: 2🇭🇺 హంగేరి: 2🇺🇿 ఉజ్బెకిస్తాన్: 1🇯🇴 జోర్డాన్: 1🇦🇿 అజర్బైజాన్: 1🇹🇲 తుర్క్మెనిస్తాన్: 1🇨🇴 కొలంబియా: 1🇨🇺 క్యూబా: 1🇮🇷 ఇరాన్: 1🇷🇴 రొమేనియా: 1🇹🇷 టర్కీ: 1🇮🇱 ఇజ్రాయెల్: 1🇺🇸 USA: 1🇬🇪 జార్జియా: 1🇷🇺 రష్యా: 1🇫🇷 ఫ్రాన్స్: 1🇩🇪 జర్మనీ: 1🇩🇰 డెన్మార్క్: 1🇺🇦 ఉక్రెయిన్: 1🇹🇼 తైవాన్: 1🇮🇸 ఐస్లాండ్: 1🇸🇮 స్లోవేనియా: 1🇰🇿 కజకిస్తాన్: 1🇵🇱 పోలాండ్: 12024🇦🇹 ఆస్ట్రియా: 1🇵🇰 పాకిస్థాన్: 1🇪🇪 ఎస్టోనియా: 1 -
సంచలన విజయం.. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర
చెన్నై చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. కెరీర్లో తొలిసారిగా భారత టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. లెజెండ్ విశ్వనాథన్ ఆనందన్‌ను దాటుకుని మరీ అగ్రస్థానానికి ఎగబాకాడు. ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్లో భాగంగా.. చైనాకు చెందిన లిరెన్‌తో బుధవారం జరిగిన పోటీ సందర్భంగా ప్రజ్ఞానంద ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. నంబర్ 1 ప్రజ్ఞానంద ప్రస్తుత ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం.. ప్రజ్ఞానంద ఖాతాలో 2748.3 పాయింట్లు ఉండగా.. విశ్వనాథన్ ఆనంద్ ఖాతాలో 2748 పాయింట్లు ఉన్నాయి. ఈ క్రమంలో భారత టాప్ ర్యాంకర్‌గా అవతరించిన ప్రజ్ఞానంద వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో భారతీయ క్రీడాకారుడిగా రికార్డు అంతేకాదు.. లిరెన్‌పై విజయం సాధించడం ద్వారా మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత.. క్లాసికల్ చెస్‌లో వరల్డ్ చాంపియన్‌ను ఓడించిన భారత రెండో క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. బలమైన ప్రత్యర్థిని ఓడించడం అంత తేలికేమీ కాదని.. అందుకే తనకు ఈ విజయం మరింత ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. తొలిసారి వరల్డ్ చాంపియన్‌పై గెలుపొందడం రెట్టింపు సంతోషాన్నిస్తుందని హర్షం వ్యక్తం చేశాడు. అదానీ, సచిన్ ప్రశంసలు కాగా భారత టాప్ ర్యాంకర్‌గా నిలిచిన ప్రజ్ఞానందపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అగ్రశ్రేణి వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తదితరులు ఎక్స్ వేదికగా ప్రజ్ఞానందను అభినందించారు. ‘‘నిన్ను చూసి దేశం గర్విస్తోంది’’ అంటూ కితాబులిచ్చారు. చదవండి: IPL 2024: హార్దిక్ వెళ్లినా నష్టం లేదు.. గిల్ కూడా వెళ్లిపోతాడు: షమీ కీలక వ్యాఖ్యలు -
రెండో స్థానంలో కోనేరు హంపి
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రెండో రోజూ అద్భుత ఆటతో ఆకట్టుకుంది. తొలి రోజు నాలుగు రౌండ్ల తర్వాత మూడు పాయింట్లతో 15వ ర్యాంక్‌లో ఉన్న హంపి... రెండో రోజు రెండో స్థానానికి ఎగబాకింది. బుధవారం హంపి మూడు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని 8 రౌండ్ల తర్వాత 6.5 పాయింట్లతో మో జై (చైనా)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకుంది. 7 పాయింట్లతో అనస్తాసియా బొద్నారుక్ (రష్యా) అగ్రస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన యువతార నూతక్కి ప్రియాంక కూడా అద్భుతంగా ఆడింది. తొలి రోజు 2 పాయింట్లతో 61వ ర్యాంక్‌లో ఉన్న ప్రియాంక బుధవారం ఆడిన నాలుగు గేముల్లోనూ గెలిచి 6 పాయింట్లతో 10వ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. భారత్‌కే చెందిన వైశాలి, దివ్య దేశ్‌ముఖ్ 5 పాయింట్లతో వరుసగా 23, 31వ ర్యాంక్‌లో... ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో 40వ ర్యాంక్‌లో ఉన్నారు. -
భారత 83వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా ఆదిత్య
మహారాష్ట్రకు చెందిన ఆదిత్య సామంత్ భారత చెస్‌లో 83వ గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న బీల్ చెస్ ఫెస్టివల్లో ఆదిత్య జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను అధిగమించడంతోపాటు చివరిదైన మూడో జీఎం నార్మ్‌ను సాధించాడు. 20 ఏళ్ల ఆదిత్య అబుదాబి మాస్టర్స్‌లో తొలి జీఎం నార్మ్, ఎల్ లోలోబ్రెగట్ ఓపెన్‌లో రెండో జీఎం నార్మ్ సాధించాడు. -
చాంపియన్ గుకేశ్
Menorca Chess Open 2023- చెన్నై: భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ మెనోర్కా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది టైటిల్ సాధించాడు. స్పెయిన్‌లో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత గుకేశ్‌తోపాటు మరో తొమ్మిదిమంది ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... గుకేశ్, ప్రణవ్‌లకు తొలి రెండు ర్యాంక్‌లు లభించాయి. విజేతను నిర్ణయించేందుకు గుకేశ్, ప్రణవ్ మధ్య రెండు బ్లిట్జ్ టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల గుకేశ్ 1.5–0.5తో ప్రణవ్ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. గుకేశ్‌కు 3,000 యూరోలు (రూ. 2 లక్షల 69 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొమ్మిది రౌండ్లలో గుకేశ్ ఐదు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. ఇదే టోర్నీలో పాల్గొన్న తెలంగాణ ప్లేయర్లు హర్ష భరతకోటి 6.5 పాయింట్లతో 11వ ర్యాంక్‌లో, వుప్పాల ప్రణీత్ 6 పాయింట్లతో 19వ ర్యాంక్‌లో, రాజా రిత్విక్ 5.5 పాయింట్లతో 37వ ర్యాంక్‌లో నిలిచారు. -
రిల్టన్ కప్‌తో పాటు గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న తమిళ కుర్రాడు
స్టాక్‌హోమ్: తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల ఎం.ప్రణేశ్ భారత 79వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందాడు. స్టాక్‌హోమ్‌లో జరిగిన రిల్టన్ కప్‌లో విజేతగా నిలిచిన ప్రణేశ్ టైటిల్ గెలుచుకోవడంతో పాటు గ్రాండ్‌మాస్టర్ హోదా కూడా సాధించాడు. ఈ టోర్నీకి ముందే అతను మూడు జీఎం నార్మ్‌లు పొందగా, ఇప్పుడు 2500 ఎలో రేటింగ్ పాయింట్లు (లైవ్) కూడా దాటాడు. ‘ఫిడే’ సర్క్యూట్లో తొలి టోర్నీ అయిన రిల్టన్ కప్‌లో ప్రణేశ్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 136 మంది ఆటగాళ్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో ఆడిన 9 గేమ్‌లలో అతను 8 గెలిచి ఒకటి ఓడాడు. తెలంగాణకు చెందిన రాజా రిత్విక్ 6 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ప్రముఖ చెస్ కోచ్ ఆర్బీ రమేశ్ వద్ద ప్రణేశ్ శిక్షణ పొందుతున్నాడు. ‘అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్రణేశ్‌కు నా అభినందనలు. మంచి స్కోరుతో అతను విజేతగా నిలిచాడు. మన దేశంలో గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది’ అని దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ స్పందించారు. -
చైతన్య భారతి: చిచ్చర పిడుగు... విశ్వనాథ్ ఆనంద్ / 1969
ఢిల్లీలో జాతీయ జూనియర్ సంఘం చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. అది 1983. విశ్వనాథ్ ఆనంద్‌ను నేను మొదటిసారిగా కలుసుకున్న సందర్భం కూడా అదే. టోపీ పెట్టుకున్న ఓ సన్నటి కుర్రాడు పోటీలు జరుగుతున్న ఆవరణలోకి వచ్చాడు. అతని ముఖంలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అతని చదరంగం ఆటను మొట్టమొదటిసారిగా నేను అక్కడే చూశాను. అతను మెరుపు వేగంతో ఆడుతున్నాడు. నాకతని ఆట చూడగానే కలిగిన అభిప్రాయం అది. అతను అతి చురుకుగా, నిర్దుష్టంగా, ఆట ఆడుతున్నాడు. అతనికి మేమంతా వెంటనే ‘చిచ్చర పిడుగు’ అని పేరు పెట్టేశాం. ఆ వేగం అతని హావభావాల్లో కూడా కనిపిస్తోంది. అతను ఒక చోట నిలకడగా కూర్చొని ఆడడు. ఆడుతున్నంత సేపూ అలా తిరుగుతూనే ఉంటాడు. 1992లో నేనతన్ని మరోసారి కలిశాను. అప్పుడు నేనే అతనితో ఆడాను. 1980లలో, 1986 వరకు అతను ఓడించలేని వ్యక్తేమీ కాదు. అతనితో నేడు ఆడటమే కాదు, కొన్ని ఆటల్లో గెలిచాను కూడా! 1992లో అతన్ని నేను చూసినప్పుడు మాత్రం అతను తన ఆటలో బాగా పురోగతి సాధించాడనిపించింది. అతను మారినట్లే అతని ఆట కూడా మరో స్థాయికి చేరుకుంది. చిచ్చర పిడుగు దశ నుంచి అతను మరింత నిబ్బరంగా ఆడే స్థాయికి చేరుకున్నాడు. అసలు సిసలు గ్రాండ్ మాస్టర్‌గా మారిపోయాడు. ఆ మార్పు 1986 లోనే వచ్చిందనిపించింది. 1987 నాటికి అది స్థిరపడింది. అప్పుడు అతను ప్రపంచ జూనియర్ చాంపియన్ అయ్యాడు. అతనిలో అంతర్లీనంగా గ్రాండ్ మాస్టర్ కాగల లక్షణాలన్నీ ఉన్నాయి. ఆనంద్ అక్షరాలా బాల మేధావి. ఈ రంగంలో రష్యా ఆధిపత్యానికి ఆనంద్ చరమ గీతం పాడాడు. అంతకు ముందు ఆ పని బాబీఫిషర్ చేశాడు. గ్యారీ కాస్పరోవ్, అనాతొలి కార్పోవ్, లాదిమర్ క్రామ్నిక్ల ఆధిపత్యాన్ని నిలదీసిన వ్యక్తి ఆనంద్. ఆ రోజుల్లో చదరంగంలో భారత్‌కు అంతగా పేరు లేదు. అందువల్ల ఆనంద్ విజయం భారత ప్రతిష్టను ఆకాశానికెత్తేసింది. అతని విజయానికి అతని తల్లిదండ్రులు కూడా చాలా వరకు కారణం. విశ్వనాథ్‌కి వచ్చిన అవార్డులు దివ్యేందు బారువా, చదరంగంలో గ్రాండ్ మాస్టర్, అర్జున అవార్డు గ్రహీత తదితరాలు. (చదవండి: రాజా రామ్ మోహన రాయ్ / 1772–1833) -
తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్: అర్జున్ అదరహో...
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): మరో రౌండ్ మిగిలి ఉండగానే తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నమెంట్లో విజేతగా అవతరించాడు. థాయ్ దాయ్ వాన్ ఎన్గుయెన్ (చెక్ రిపబ్లిక్)తో శనివారం జరిగిన 12వ రౌండ్ గేమ్‌ను అర్జున్ కేవలం 15 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. పది గ్రాండ్మాస్టర్లతో సహా మొత్తం 14 మంది 13 రౌండ్లపాటు పోటీపడుతున్న ఈ టోర్నీలో 12వ రౌండ్ తర్వాత అర్జున్ 9.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతూ టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. ఎన్గుయెన్, జొనాస్ బుల్ బెరీ (డెన్మార్క్) ఇద్దరూ 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆదివారం చివరిదైన 13వ రౌండ్ గేమ్‌లో అర్జున్ ఓడిపోయి, ఎన్గుయెన్, జొనాస్ తమ గేముల్లో నెగ్గినా అర్జున్ స్కోరును దాటలేకపోతారు. వరంగల్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్ చాలెంజర్స్ టోర్నీ విజేత హోదాలో వచ్చే ఏడాది జరిగే టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీకి అర్హత సాధించాడు. పెంటేల హరికృష్ణ, ఆధిబన్, విదిత్ తర్వాత టాటా స్టీల్ చాలెంజర్స్ టోర్నీ టైటిల్ గెలిచిన నాలుగో భారతీయ చెస్ ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. ‘క్లాసికల్ ఫార్మాట్లో నా అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఆదివారం జరిగే చివరి రౌండ్ గేమ్‌లో నెగ్గి గెలుపు సంబరాలు చేసుకోవాలనుకుంటున్నా. ఇటీవల కాలంలో దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, శ్రీనాథ్ నారాయణన్ అందించిన సూచనలతో నా ఆట మరింత మెరుగైంది. ఈ టోర్నీ తొలి గేమ్‌లో ఓడిపోయే పరిస్థితి నుంచి తేరుకొని ‘డ్రా’ చేసుకోవడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రెండో గేమ్‌లో విజయం సాధించాక అదే జోరును కొనసాగించా’ అని అర్జున్ వ్యాఖ్యానించాడు. -
టాటా స్టీల్ ఇండియా ర్యాపిడ్ చెస్ టోర్నీలో రెండో స్థానంలో అర్జున్..
Arjun bests Karthikeyan in 17 moves: టాటా స్టీల్ ఇండియా ర్యాపిడ్ చెస్ టోర్నీలో తొలి మూడు రౌండ్లు ముగిశాక తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ 2 పాయింట్లతో ప్రజ్ఞానంద, విదిత్‌లతో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. అర్జున్ తొలి రౌండ్లో 45 ఎత్తుల్లో పర్హామ్ల్ (ఇరాన్)పై, మూడో రౌండ్లో 17 ఎత్తుల్లో కార్తికేయన్ (భారత్)పై నెగ్గి... రెండో రౌండ్లో ప్రజ్ఞానంద (భారత్) చేతిలో ఓడాడు. చదవండి: Deepak Chahar: అక్కా తను ఎక్కడ ఉంది... వీడియో వైరల్.. పాపం దీపక్.. మ్యాచ్ జరుగుతుండగానే! -
12 ఏళ్ల 4 నెలల 25 రోజుల వయస్సు.. ప్రపంచ రికార్డు!
బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ చెస్ చరిత్రలో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందిన పిన్న వయస్కుడిగా భారత సంతతికి చెందిన అమెరికా చిన్నారి అభిమన్యు మిశ్రా రికార్డు నెలకొల్పాడు. వెజెర్కెప్కో జీఎం టోర్నీలో భాగంగా తొమ్మిదో రౌండ్లో అభిమన్యు మిశ్రా 55 ఎత్తుల్లో భారత గ్రాండ్‌మాస్టర్ లియోన్ ల్యూక్ మెండోంకాపై గెలుపొంది గ్రాండ్‌మాస్టర్ హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను దక్కించుకున్నాడు. అభిమన్యు జీఎం హోదా 12 ఏళ్ల 4 నెలల 25 రోజుల వయస్సులో అందుకొని రష్యాకు చెందిన సెర్గీ కర్జాకిన్ (12 ఏళ్ల 7 నెలలు) పేరిట 2002 నుంచి ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక్కడ చదవండి: జొకోవిచ్ జోరు -
ద్రోణవల్లి హారిక లక్ష్యం నెరవేరాలి..
అంతర్జాతీయ మహిళల చెస్‌లో నిలకడగా రాణిస్తున్న క్రీడాకారిణుల్లో ద్రోణవల్లి హారిక ఒకరు. దశాబ్ద కాలంగా పలు అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తూ... నిరంతరం తన ఆటకు పదునుపెడుతూ ఈ తెలుగమ్మాయి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. 1991 జనవరి 12న గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా గోరంట్లలో జన్మించిన హారిక చిన్నతనం నుంచే చదరంగంపై మక్కువ ఏర్పరుచుకొని అండర్ 9 పోటీల్లో జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కొనేరు హంపి తర్వాత 2011లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన భారత క్రీడాకారిణిగా హారిక నిలిచారు. 2012, 2015, 2017 ‘ఉమెన్స్ వరల్డ్ చెస్ చాంపియన్’లలో కాంస్య పతకాలు సాధించారు. హారిక ప్రతిభకు గానూ 2007లో అర్జున అవార్డు, 2019లో పద్మశ్రీ అవార్డులతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది. 27 ఏళ్ల హారికకు చెస్‌లో వ్లాదిమర్ క్రామ్నిక్, జూడిత్ పోల్గార్, విశ్వనాథన్ ఆనంద్‌లు అభిమాన చెస్ ప్లేయర్లు. 2018లో బిజెనెస్ మెన్ కార్తీక్చంద్రను వివాహం చేసుకుంది. గత మూడు పర్యాయాల్లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించారు హారిక.. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్లాలనేది హారిక లక్ష్యం. ఈ రోజు హారిక బర్త్ డే సందర్భంగా ఆమె సాధించిన ఘనతల్ని గుర్తుచేసుకుంటూ.. -
శభాష్ ఇనియన్
చెన్నై: భారత గ్రాండ్ మాస్టర్ (జీఎం) పి.ఇనియన్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ ఓపెన్ చెస్ టోర్నమెంట్ చాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించాడు. గత నెల 7 నుంచి 9 మధ్య క్లాసికల్ టైమ్ కంట్రోల్ పద్ధతిలో ఈ టోర్నీ జరిగినా... ఫెయిర్ ప్లే నిబంధనలను పరీశిలించిన అనంతరం నిర్వాహకులు గురువారం విజేతను ప్రకటించారు. ఈ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత జీఎంగా ఇనియన్ ఖ్యాతికెక్కాడు. కరోనా వల్ల ఆన్లైన్లో 9 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో ఆరు విజయాలు, మూడు ‘డ్రా’లు నమోదు చేసిన ఇనియన్... 7.5 పాయింట్లతో రష్యా జీఎం స్జుగిరో సనన్‌తో పాటు సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన ‘టై బ్రేక్’ ఉండటంతో ఇనియన్‌కు టైటిల్ సొంతమైంది. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ఇనియన్ తన కంటే మెరుగైన పలువురు జీఎంలను ఓడించడం విశేషం. వారిలో బహదూర్ జొబావ (జార్జియా), స్యామ్ సెవియన్ (అమెరికా), సెర్గె ఎరెన్‌బర్గ్ (అమెరికా), నైజైక్ ఇలియా (ఉక్రెయిన్) ఉన్నారు. ఇటీవలె ప్రపంచ రెండో ర్యాంకర్ ఫాబియానోపై బ్లిట్జ్ ఈవెంట్లో గెలుపొంది ఇనియన్ అందరి దృష్టిని ఆకర్షించడం విశేషం. మొత్తం ఈ టోర్నీలో 16 దేశాలకు చెందిన 120 మంది చెస్ ప్లేయర్లు పాల్గొనగా... అందులో 30 మంది జీఎంలు ఉన్నారు. -
రాజా రిత్విక్‌కు తొలి జీఎం నార్మ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చెస్ క్రీడాకారుడు, ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) రాజా రిత్విక్ తన ప్రొఫెషనల్ కెరీర్లో మరో ముందడుగు వేశాడు. గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా సాధించే దిశగా 15 ఏళ్ల రాజా రిత్విక్ సాగుతున్నాడు. స్పెయిన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ఎలోబ్రెగట్ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో మెరుగ్గా రాణించిన రాజా రిత్విక్ తొలి జీఎం నార్మ్‌ను అందుకున్నాడు. ఈ టోర్నమెంట్లో నిర్ణీత తొమ్మిది రౌండ్ల అనంతరం మూడు విజయాలు, ఆరు ‘డ్రా’లు నమోదు చేసి 6 పాయింట్లతో అతను 16వ స్థానాన్ని దక్కించుకున్నాడు. టోర్నీలో భాగంగా తనకన్నా ఎంతో మెరుగైన క్రీడాకారులతో తలపడిన రిత్విక్ అజేయంగా నిలిచి 26 రేటింగ్ పాయింట్లను సాధించాడు. దీంతో అతని ఖాతాలో ప్రస్తుతం 2407 రేటింగ్ పాయింట్లతో పాటు తొలి జీఎం నార్మ్ వచ్చి చేరింది. ఇందులో ఆరుగురు గ్రాండ్మాస్టర్లతో ఆడిన రిత్విక్ ఒకరిని ఓడించి మరో ఐదుగురితో తన గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. తొలి గేమ్‌లో కొరిజే లిలీ (జార్జియా)పై, రెండో గేమ్‌లో గ్రాండ్‌మాస్టర్ నర్సిసో డుబ్లాన్ మార్క్ (స్పెయిన్)పై, నాలుగో గేమ్‌లో ఐఎం సోసా టోమస్ (అర్జెంటీనా)పై గెలుపొందిన రిత్విక్... జీఎం అరిజ్మెండి మార్టినెజ్ జులెన్ లూయిస్ (స్పెయిన్; మూడో గేమ్), జీఎం అలొన్సో రోసెల్ అల్వర్ (స్పెయిన్; ఐదో గేమ్), ఐఎం జనన్ ఎవినీ (స్పెయిన్; ఆరో గేమ్), జీఎం కార్తీక్ వెంకటరామన్ (భారత్; ఏడో గేమ్), జీఎం గుకేశ్ (భారత్; ఎనిమిదో గేమ్), ఏంజెలిస్ సాల్వడర్ (స్పెయిన్; తొమ్మిదో గేమ్)లతో ‘డ్రా’ చేసుకున్నాడు. -
శ్రీశ్వాన్‌కు ఐఎం హోదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ క్రీడాకారుడు మాస్టర్ ఎం. శ్రీశ్వాన్ తన ప్రొఫెషనల్ చెస్ కెరీర్లో మరో ఘనత సాధించాడు. స్పెయిన్‌లోని బార్సిలోనా చెస్ టోర్నీలో పాల్గొన్న శ్రీశ్వాన్ అద్భుతంగా రాణించి ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) హోదాను పొందడానికి అవసరమైన మూడో నార్మ్‌ను అందుకున్నాడు. తద్వారా తెలంగాణ నుంచి అతిపిన్న వయస్సులో ఐఎం హోదాను సంపాదించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం 13 ఏళ్ల 5 నెలల 10 రోజుల వయస్సున్న శ్రీశ్వాన్ ఐఎం హోదాను అందుకోవడానికి అవసరమైన 2400 ఎలో రేటింగ్ పాయింట్లను దాటేశాడు. అతని ఖాతాలో ఇప్పుడు 2461 ఎలో రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. శ్రీశ్వాన్ తెలంగాణ తరఫున ఏడో ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) ప్లేయర్ కావడం విశేషం. -
ఆనంద్ గేమ్ డ్రా
షంకిర్ (అజర్బైజాన్): భారత దిగ్గజ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు మళ్లీ ‘డ్రా’ ఫలితమే ఎదురైంది. వుగర్ గషిమోవ్ మెమోరియల్ చెస్ టోర్నమెంట్లో సోమవారం తైముర్ రద్జబొవ్ (అజర్బైజాన్)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ డ్రా చేసుకున్నాడు. నల్లపావులతో బరిలోకి దిగిన భారత ఆటగాడు గెలుపుకోసం చేసిన ఎత్తులేవీ ఫలించలేదు. దీంతో 33 ఎత్తుల వరకు సాగిన ఈ గేమ్ చివరకు డ్రాగా ముగిసింది. తాజా ఫలితంతో ఆనంద్ 4 పాయింట్లతో తైముర్తో పాటు ఉమ్మడిగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. నార్వే సూపర్ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ టైటిల్ వేటలో మళ్లీ విజయవంతమయ్యాడు. సెర్గీ కర్యాకిన్ (రష్యా 4.5)తో జరిగిన గేమ్‌లో గెలుపొందిన కార్ల్సన్ 6 పాయింట్లతో ఒక్కడే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గ్రిస్చుక్ (రష్యా; 4.5)... డేవిడ్ నవర (చెక్ రిపబ్లిక్; 3.5)పై నెగ్గగా, అనిశ్ గిరి (నెదర్లాండ్స్; 2.5)... షకిరియార్ (అజర్బైజాన్; 3)తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. -
చెన్నై కుర్రాడు... చరిత్రకెక్కాడు
చెన్నై: తమిళనాడు కుర్రాడు డి.గుకేశ్ పన్నెండేళ్ల వయసులోనే గ్రాండ్‌మాస్టర్ హోదాతో రికార్డులకెక్కాడు. 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో ఈ ఘనత సాధించిన అతిపిన్న భారతీయ గ్రాండ్‌మాస్టర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. తన రాష్ట్ర సహచరుడు ఆర్.ప్రజ్ఞానంద జూన్‌లో సాధించిన రికార్డు (12 ఏళ్ల 10 నెలల వయసులో)ను ఏడాది తిరగకుండానే చెరిపేశాడు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో మంగళవారం తొమ్మిదో రౌండ్లో డి.కె.శర్మను ఓడించడం ద్వారా గుకేశ్ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందాడు. మొత్తం మీద భారత చదరంగ క్రీడాకారుల్లో అతను 59వ జీఎం. 2002లో ఉక్రెయిన్‌కు చెందిన సెర్గీ కర్యాకిన్ 12 ఏళ్ల ఏడు నెలల వయసులో సాధించిన జీఎం ఘనత ప్రపంచ అతిపిన్న రికార్డు కాగా, గుకేశ్ కేవలం 17 రోజుల తేడాతో ఆ రికార్డుకు దూరమయ్యాడు. నిజానికి గత నెలలోనే గుకేశ్‌కు ‘ప్రపంచ రికార్డు’ అవకాశం వచ్చినా... తృటిలో చేజార్చుకున్నాడు. డిసెంబర్లో జరిగిన బార్సిలోనా టోర్నీలో అతను మూడో రౌండ్లో ఇటలీ గ్రాండ్‌మాస్టర్ డానియెల వొకటురో (ఇటలీ) చేతిలో ఓడిపోవడంతో మూడో జీఎం నార్మ్‌తో పాటు ‘ప్రపంచ అతిపిన్న’ ఘనత చేజారింది. తిరిగి నెల వ్యవధిలోనే తమిళ తంబి తన ఎత్తులకు పదును పెట్టాడు. తల్లిదండ్రులతో ఆడుతూనే... ఎత్తులు–పైఎత్తులతో ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తున్న ఈ చిచ్చర పిడుగు ‘చెస్’ నేపథ్యం కేవలం ఓ ‘ఆటవిడుపు’గా మొదలైంది. గుకేశ్ తల్లి పద్మ, తండ్రి రజినీకాంత్ ఇద్దరూ వైద్యులే. వాళ్లిద్దరు ఇంట్లో ఆడుతుంటే చూసిన చిన్నారి గుకేశ్ సరదాగా ఎత్తులు వేశాడు. ఆ తర్వాత తల్లిదండ్రులతో దీటుగా పోటీపడ్డాడు. అతని ఎత్తులకు, ఓర్పుగా దెబ్బతీసే పైఎత్తులకు వాళ్లిద్దరూ అబ్బురపడేవారు. అతని ఆసక్తిని ఆటవిడుపుకే పరిమితం కాకుడదని భావించిన తల్లిదండ్రులు తమ చిన్నారిని చెస్ అకాడమీలో చేర్పించారు. ఇక అక్కడ్నుంచి ఆట కాస్త చెస్ బాట అయ్యింది. ఇక ఆనంద్ సర్‌తో ఆడతా చాలా సంతోషంగా ఉంది. గ్రాండ్మాస్టరైనందుకు ఎంతో ఉద్విగ్నంగా ఉంది. మూడో జీఎం నార్మ్‌తో పాటు గ్రాండ్‌మాస్టర్ టైటిల్ దక్కింది. ఇక విశ్వనాథన్ ఆనంద్ సర్‌తో తలపడాలనుకుంటున్నా. ఈ గేమ్ (9వరౌండ్)కు ముందు నేనేమీ ఒత్తిడిని ఎదుర్కోలేదు. అయితే ఆటమధ్యలో కాస్త ఎదురైనప్పటికీ ఆటపైనే దృష్టిపెట్టి ముందడుగు వేశాను. స్పెయిన్ (బార్సిలోనా)లోనే కర్యాకిన్ రికార్డును చెరిపేసే అవకాశం చేజార్చినందుకు నిరాశగా ఉంది. ఆ తర్వాత ముంబై టోర్నీలోను సాంకేతిక కారణాల వల్ల ప్రపంచ రికార్డును కోల్పోయాను’ – గుకేశ్ -
‘గ్రాండ్‌మాస్టర్’ ప్రజ్ఞానంద
న్యూఢిల్లీ: ప్రపంచ చెస్ చరిత్రలో పిన్న వయస్సులో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందిన రెండో ప్లేయర్‌గా... భారత్ తరఫున జీఎం అయిన పిన్న వయస్కుడిగా చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. ఇటలీలో జరుగుతున్న గ్రెడైన్ ఓపెన్‌లో శనివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో ప్రజ్ఞానంద 33 ఎత్తుల్లో ఇటలీ గ్రాండ్‌మాస్టర్ లూకా మోరోనిపై గెలుపొందాడు. ఈ ప్రదర్శనతో ప్రజ్ఞానందకు జీఎం హోదా లభించేందుకు అవసరమైన మూడో జీఎం నార్మ్ ఖాయమైంది. 12 ఏళ్ల 10 నెలల 14 రోజుల వయస్సులో ప్రజ్ఞానంద జీఎం హోదా పొంది... భారత్ తరఫున జీఎం అయిన పిన్న వయస్కుడిగా ఇప్పటిదాకా పరిమార్జన్ నేగి (ఢిల్లీ–13 ఏళ్ల 4 నెలల 22 రోజులు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. మరోవైపు ప్రపంచంలో పిన్న వయస్సులో జీఎం అయిన రికార్డు సెర్గీ కర్జాకిన్ (రష్యా–12 ఏళ్ల 7 నెలలు) పేరిట ఉంది. -
ఆనంద్ గేమ్ డ్రా లండన్ క్లాసిక్ చెస్
లండన్: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్ సో వెస్లీతో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఐదో రౌండ్ తర్వాత ఆనంద్ 2.5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ప్రస్తుతం సో వెస్లీ 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
ఆనంద్ గేమ్ డ్రా
గ్రీంకి చెస్ టోర్నీ బాడెన్-బాడెన్ (జర్మనీ): భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్... గ్రీంకి చెస్ క్లాసిక్ టోర్నమెంట్లో తొలి రౌండ్ గేమ్‌ను డ్రాగా ముగించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ ఫ్యాబియానో కౌరానా (ఇటలీ)తో జరిగిన ఈ గేమ్‌ను భారత ప్లేయర్ 38 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. తెల్లపావులతో ఆడిన ఫ్యాబియానో ఎవరూ ఊహించని రీతిలో ఇటాలియన్ ఓపెనింగ్‌తో గేమ్ ఆడాడు. లండన్ క్లాసిక్ తర్వాత తొలి టోర్నీలో ఆడుతున్న విషీ ఈ వ్యూహాన్ని సులువుగానే అడ్డుకున్నాడు. లెవోన్ అరోనియన్ (ఆర్మేనియా), మాగ్నస్ కార్ల్సన్ (నార్వే); మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్), అర్కాడిజ్ నైడిశ్చ్ (జర్మనీ); ఎతినే బాక్రోట్ (ఫ్రాన్స్), డేవిడ్ బారామిడ్జీ (జర్మనీ)ల మధ్య గేమ్‌లు కూడా డ్రాగా ముగిశాయి. -
ఆనంద్‌కు మరో ‘డ్రా’
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఎనిమిదో ‘డ్రా’ నమోదు చేశాడు. వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా)తో బుధవారం జరిగిన 11వ రౌండ్ గేమ్‌ను ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ రౌండ్ తర్వాత ఆనంద్ ఏడు పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఆంద్రికిన్ (రష్యా)-మమెదైరోవ్ (అజర్బైజాన్) గేమ్ 46 ఎత్తుల్లో; పీటర్ స్విద్లెర్ (రష్యా)-అరోనియన్ (అర్మేనియా) గేమ్ 33 ఎత్తుల్లో; తొపలోవ్ (బల్గేరియా)-కర్జాకిన్ (రష్యా) గేమ్ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.