గ్రీంకి చెస్ టోర్నీ
బాడెన్-బాడెన్ (జర్మనీ): భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్... గ్రీంకి చెస్ క్లాసిక్ టోర్నమెంట్‌లో తొలి రౌండ్ గేమ్‌ను డ్రాగా ముగించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ ఫ్యాబియానో కౌరానా (ఇటలీ)తో జరిగిన ఈ గేమ్‌ను భారత ప్లేయర్ 38 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు.
తెల్లపావులతో ఆడిన ఫ్యాబియానో ఎవరూ ఊహించని రీతిలో ఇటాలియన్ ఓపెనింగ్‌తో గేమ్ ఆడాడు. లండన్ క్లాసిక్ తర్వాత తొలి టోర్నీలో ఆడుతున్న విషీ ఈ వ్యూహాన్ని సులువుగానే అడ్డుకున్నాడు. లెవోన్ అరోనియన్ (ఆర్మేనియా), మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే); మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్), అర్కాడిజ్ నైడిశ్చ్ (జర్మనీ); ఎతినే బాక్రోట్ (ఫ్రాన్స్), డేవిడ్ బారామిడ్జీ (జర్మనీ)ల మధ్య గేమ్‌లు కూడా డ్రాగా ముగిశాయి.
ఆనంద్ గేమ్ డ్రా
Published Wed, Feb 4 2015 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement