
అంతర్జాతీయ మహిళల చెస్‌లో నిలకడగా రాణిస్తున్న క్రీడాకారిణుల్లో ద్రోణవల్లి హారిక ఒకరు. దశాబ్ద కాలంగా పలు అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తూ... నిరంతరం తన ఆటకు పదునుపెడుతూ ఈ తెలుగమ్మాయి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. 1991 జనవరి 12న గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా గోరంట్లలో జన్మించిన హారిక చిన్నతనం నుంచే చదరంగంపై మక్కువ ఏర్పరుచుకొని అండర్ 9 పోటీల్లో జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కొనేరు హంపి తర్వాత 2011లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన భారత క్రీడాకారిణిగా హారిక నిలిచారు. 2012, 2015, 2017 ‘ఉమెన్స్ వరల్డ్ చెస్ చాంపియన్’లలో కాంస్య పతకాలు సాధించారు.
హారిక ప్రతిభకు గానూ 2007లో అర్జున అవార్డు, 2019లో పద్మశ్రీ అవార్డులతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది. 27 ఏళ్ల హారికకు చెస్‌లో వ్లాదిమర్ క్రామ్నిక్, జూడిత్ పోల్గార్, విశ్వనాథన్ ఆనంద్‌లు అభిమాన చెస్ ప్లేయర్లు. 2018లో బిజెనెస్ మెన్ కార్తీక్‌చంద్రను వివాహం చేసుకుంది. గత మూడు పర్యాయాల్లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించారు హారిక.. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్లాలనేది హారిక లక్ష్యం. ఈ రోజు హారిక బర్త్ డే సందర్భంగా ఆమె సాధించిన ఘనతల్ని గుర్తుచేసుకుంటూ..