dronavalli Harike
-
రెండో స్థానంలో హంపి, హారిక, అర్జున్
కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో తొలి రోజు మూడో రౌండ్ గేమ్‌లు ముగిశాక మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక... ఓపెన్ విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ రెండు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తొలి రౌండ్లో అనా ముజిచుక్ (ఉక్రెయిన్)పై 30 ఎత్తుల్లో నెగ్గిన హంపి... అనా ఉషెనినా (ఉక్రెయిన్), మరియా (ఉక్రెయిన్)లతో జరిగిన తదుపరి రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. వైశాలితో తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న హారిక... రెండో గేమ్‌లో ఒలివియా (పోలాండ్)పై గెలిచి, మూడో గేమ్‌ను ఉషెనినాతో ‘డ్రా’గా ముగించింది. అర్జున్ తొలి గేమ్‌లో 38 ఎత్తుల్లో నొదిర్బెక్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచి, విదిత్, గుకేశ్ (భారత్)లతో గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు. బుధవారం మరో మూడు రౌండ్లు, గురువారం మరో మూడు రౌండ్లు జరుగుతాయి. తొలిసారి ఈ టోర్నీలో ఓపెన్, మహిళల విభాగాల్లో సమాన ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. -
Dronavalli Harika: స్పెయిన్‌పై భారత్ విజయం
Women World Chess Championship.. సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చాంపియన్‌షిప్ తొలి రోజు భారత్ అజేయంగా నిలిచింది. అజర్‌బైజాన్‌తో జరిగిన పూల్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకున్న భారత్... రెండో లీగ్ మ్యాచ్‌లో 2.5–1.5తో స్పెయిన్‌పై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి, మేరీఆన్ గోమ్స్‌లతో కూడిన భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. అజర్‌బైజాన్‌తో మ్యాచ్‌లో హారిక 34 ఎత్తుల్లో గునె మమద్జాదాపై, వైశాలి 60 ఎత్తుల్లో గుల్నార్ మమదోవాపై గెలిచారు. తానియా, భక్తి కులకర్ణి తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోయారు. స్పెయిన్‌తో మ్యాచ్‌లో హారిక, భక్తి కులకర్ణి, మేరీఆన్ గోమ్స్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... వైశాలి 47 ఎత్తుల్లో సబ్రీనాపై నెగ్గడంతో భారత విజయం ఖాయమైంది. చదవండి: David Warner: మళ్లీ కనిపించకపోవచ్చు.. కానీ సపోర్టు చేయండి.. అన్నా అలా అనొద్దు! -
ద్రోణవల్లి హారిక లక్ష్యం నెరవేరాలి..
అంతర్జాతీయ మహిళల చెస్‌లో నిలకడగా రాణిస్తున్న క్రీడాకారిణుల్లో ద్రోణవల్లి హారిక ఒకరు. దశాబ్ద కాలంగా పలు అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తూ... నిరంతరం తన ఆటకు పదునుపెడుతూ ఈ తెలుగమ్మాయి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. 1991 జనవరి 12న గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా గోరంట్లలో జన్మించిన హారిక చిన్నతనం నుంచే చదరంగంపై మక్కువ ఏర్పరుచుకొని అండర్ 9 పోటీల్లో జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కొనేరు హంపి తర్వాత 2011లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన భారత క్రీడాకారిణిగా హారిక నిలిచారు. 2012, 2015, 2017 ‘ఉమెన్స్ వరల్డ్ చెస్ చాంపియన్’లలో కాంస్య పతకాలు సాధించారు. హారిక ప్రతిభకు గానూ 2007లో అర్జున అవార్డు, 2019లో పద్మశ్రీ అవార్డులతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది. 27 ఏళ్ల హారికకు చెస్‌లో వ్లాదిమర్ క్రామ్నిక్, జూడిత్ పోల్గార్, విశ్వనాథన్ ఆనంద్‌లు అభిమాన చెస్ ప్లేయర్లు. 2018లో బిజెనెస్ మెన్ కార్తీక్చంద్రను వివాహం చేసుకుంది. గత మూడు పర్యాయాల్లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించారు హారిక.. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్లాలనేది హారిక లక్ష్యం. ఈ రోజు హారిక బర్త్ డే సందర్భంగా ఆమె సాధించిన ఘనతల్ని గుర్తుచేసుకుంటూ.. -
టైబ్రేక్‌లపై హారిక, పద్మిని ఆశలు
టెహరాన్ (ఇరాన్ ): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హరిక, పద్మిని రౌత్ ముందంజ వేసే అవకాశాలు మళ్లీ టైబ్రేక్ గేమ్‌లపై ఆధారపడింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో గేమ్‌లలో వీరిద్దరూ తమ ప్రత్యరు్థలతో ‘డ్రా’ చేసుకున్నారు. సోపికో గురామిష్‌విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌ను హారిక 36 ఎతు్తల్లో... తాన్ జోంగి (చైనా)తో జరిగిన గేమ్‌ను పద్మిని 23 ఎతు్తల్లో ‘డ్రా’గా ముగించారు. ఫలితంగా వీరిద్దరి మధ్య నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత స్కోరు 1–1తో సమవైుంది. ఆదివారం జరిగే టైబ్రేక్ గేముల్లో గెలిచిన వారు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.