
తొలి రోజు అజేయంగా నిలిచిన భారత్
Women World Chess Championship.. సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చాంపియన్‌షిప్ తొలి రోజు భారత్ అజేయంగా నిలిచింది. అజర్‌బైజాన్‌తో జరిగిన పూల్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకున్న భారత్... రెండో లీగ్ మ్యాచ్‌లో 2.5–1.5తో స్పెయిన్‌పై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్, భక్తి కులకర్ణి, మేరీఆన్ గోమ్స్‌లతో కూడిన భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు.
అజర్‌బైజాన్‌తో మ్యాచ్‌లో హారిక 34 ఎత్తుల్లో గునె మమద్‌జాదాపై, వైశాలి 60 ఎత్తుల్లో గుల్నార్ మమదోవాపై గెలిచారు. తానియా, భక్తి కులకర్ణి తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోయారు. స్పెయిన్‌తో మ్యాచ్‌లో హారిక, భక్తి కులకర్ణి, మేరీఆన్ గోమ్స్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... వైశాలి 47 ఎత్తుల్లో సబ్రీనాపై నెగ్గడంతో భారత విజయం ఖాయమైంది.
చదవండి: David Warner: మళ్లీ కనిపించకపోవచ్చు.. కానీ సపోర్టు చేయండి.. అన్నా అలా అనొద్దు!