వరల్డ్ ఛాంపియన్ షిప్ లాంటి మెగా ఈవెంట్‌లో పాల్గొనే ఆటగాడి సన్నాహాలు అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. ఈ క్రమంలో అతను కేవలం తన బుర్రకు మాత్రమే పదును పెడితే సరిపోదు. వ్యూహ ప్రతివ్యూహాల విషయంలో అనేక మంది సహాయం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ట్రెయినర్లు, సెకండ్‌లు, ట్రెయినింగ్ పార్ట్‌నర్‌లు కూడా అతని విజయంలో భాగస్వాములే. గుకేశ్ టీమ్‌లో ఐదుగురు గ్రాండ్‌మాస్టర్లు (జీఎం), ఒక ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) ఉన్నారు.
భారత ఆటగాడు, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఇందులో కీలక సభ్యుడు. పోలాండ్‌కు చెందిన నలుగురు గ్రాండ్‌మాస్టర్లు గ్రెగొర్జ్ గజేస్కీ, రడొస్లావ్ వొజాసెక్, జాన్ క్రిస్టాఫ్ డ్యూడాలతో పాటు పోలాండ్‌కే చెందిన ఐఎం జాన్ క్లిమ్‌కోవ్‌స్కీ వీరిలో ఉన్నారు. జర్మన్ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీపర్ కూడా గుకేశ్ టీమ్‌లో సభ్యుడే. వీరితో పాటు మానసికంగా దృఢంగా ఉండేందుకు మెంటల్ ట్రెయినర్ ప్యాడీ ఆప్టన్‌తో కూడా గుకేశ్ కలిసి పని చేయడం విశేషం. ప్యాడీ ఆప్టన్ 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుతో... 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుతో కలిసి పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment