
బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ చెస్ చరిత్రలో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందిన పిన్న వయస్కుడిగా భారత సంతతికి చెందిన అమెరికా చిన్నారి అభిమన్యు మిశ్రా రికార్డు నెలకొల్పాడు. వెజెర్‌కెప్కో జీఎం టోర్నీలో భాగంగా తొమ్మిదో రౌండ్‌లో అభిమన్యు మిశ్రా 55 ఎత్తుల్లో భారత గ్రాండ్‌మాస్టర్ లియోన్ ల్యూక్ మెండోంకాపై గెలుపొంది గ్రాండ్‌మాస్టర్ హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను దక్కించుకున్నాడు. అభిమన్యు జీఎం హోదా 12 ఏళ్ల 4 నెలల 25 రోజుల వయస్సులో అందుకొని రష్యాకు చెందిన సెర్గీ కర్జాకిన్ (12 ఏళ్ల 7 నెలలు) పేరిట 2002 నుంచి ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు.
ఇక్కడ చదవండి: జొకోవిచ్ జోరు
Comments
Please login to add a commentAdd a comment