
టోక్యో: సాధారణంగా ఒలింపిక్స్ కోసం అథ్లెట్లు అందరూ క్వాలిఫయింగ్‌లో పోరాడతారు. కానీ జపాన్‌కు చెందిన మహిళా స్విమ్మర్ రికాకో ఐకీ మాత్రం క్యాన్సర్‌తో పోరాడింది. దానిని జయించి మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది. జపాన్ జాతీయ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్‌లో లక్ష్యదూరాన్ని ఆమె 57.77 సెకన్లలో పూర్తి చేసి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. రెండేళ్ల క్రితం లుకేమియా (రక్త క్యాన్సర్) బారిన పడిన ఆమె తాజా విజయంతో వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment