సెమీస్‌లో ఓడిన తెలంగాణ జట్లు | odisha beats telangana at national championship | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ఓడిన తెలంగాణ జట్లు

Published Fri, Jul 29 2016 10:08 AM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

సెమీస్‌లో ఓడిన తెలంగాణ జట్లు

సెమీస్‌లో ఓడిన తెలంగాణ జట్లు

జాతీయ సబ్-జూనియర్ సెపక్‌తక్రా టోర్నీ
 
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్-జూనియర్ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు సెమీఫైనల్లో పరాజయం చవిచూశాయి. బాలికల విభాగంలో ఒడిశా జట్టు విజేతగా నిలిచింది. విక్టరీ ప్లే గ్రౌండ్స్‌లోని ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన ఫైనల్లో ఒడిశా జట్టు 2-0తో తమిళనాడుపై విజయం సాధించింది. తొలి రెగులో 17-21, 21-16, 21-16తో రెండో రెగులో 21-5, 21-16తో ఒడిశా గెలిచింది.

అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో తమిళనాడు చేతిలో తెలంగాణ ఓడింది. తమిళనాడు 2-0 (22-20, 21-13), (21-19, 23-21)తో తెలంగాణపై గెలిచింది. మరో సెమీస్‌లో ఒడిశా 2-0 (21-2, 21-5), (21-4, 21-7)తో రాజస్తాన్‌పై నెగ్గింది. బాలుర ఈవెంట్‌లో జరిగిన సెమీస్‌లో తెలంగాణ 0-2 (17-21, 21-15, 13-21), (16-21, 18-21)తో ఒడిశా చేతిలో పరాజయం చవిచూసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement