జాతీయ కార్టింగ్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: జాతీయ కార్టింగ్ చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్‌లో చెన్నైకి చెందిన విష్ణు ప్రసాద్ తొలి స్థానంలో నిలిచాడు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ట్రాక్‌లో మొత్తం మూడు విభాగాల్లో ఈ ఈవెంట్ జరుగుతోంది. శనివారం జరిగిన పోటీల్లో సీనియర్ విభాగంలో విష్ణు (మెకో రేసింగ్ టీమ్) సత్తా చాటాడు.
తొలి హీట్‌లో మూడో స్థానంలో నిలిచినా...ఆ తర్వాత దూసుకుపోయిన విష్ణు మొత్తం మూడు పాయింట్లతో ముందంజ వేశాడు. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన చిత్తేశ్ మండోడి (మొహిత్స్ రేసింగ్) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. జూనియర్ మ్యాక్స్ కేటగిరీలో కుష్ మైని, మైక్రో మ్యాక్స్ కేటగిరీలో యష్ ఆరాధ్య అగ్ర స్థానాల్లో నిలిచారు. ఈ చాంపియన్‌షిప్ ప్రధాన రేస్‌లు ఆదివారం జరుగుతాయి.
క్వాలిఫయింగ్ పోటీల్లో టాప్-5లో నిలిచిన రేసర్లు:
సీనియర్స్ మ్యాక్స్ కేటగిరీ- 1. విష్ణు ప్రసాద్, 2. చిత్తేశ్ మండోడి, 3. నయన్ చటర్జీ, 4. అమేయ బఫ్నా, 5. ఆర్య గాంధీ.
జూనియర్ మ్యాక్స్ కేటగిరీ - 1. కుశ్ మైని, 2. రికీ డానిసన్, 3. ఆకాశ్ గౌడ, 4. మిరా ఎర్డా, 5. ఆరోహ్ రవీంద్ర.
మైక్రో మ్యాక్స్ కేటగిరీ: 1. యష్ ఆరాధ్య, 2. షహాన్ అలీ మొహసీన్, 3. అర్జున్ నాయర్, 4. పాల్ ఫ్రాన్సిస్, 5. నిఖిల్ బోహ్రా.
విష్ణుకు పోల్ పొజిషన్
Published Sun, Jul 27 2014 12:01 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement