Snooker Tournament
-
సింగపూర్ ఓపెన్ స్నూకర్ టోర్నీ విజేత పంకజ్ అద్వానీ
సింగపూర్: భారత దిగ్గజ క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్–స్నూకర్ ) ప్లేయర్ పంకజ్ అద్వానీ అంతర్జాతీయస్థాయిలో మరో టైటిల్ సాధించాడు. ఆదివారం ముగిసిన సింగపూర్ ఓపెన్ స్నూకర్ టోర్నమెంట్లో పంకజ్ అద్వానీ చాంపియన్‌గా నిలిచాడు. జాడెన్ ఓంగ్ (సింగపూర్)తో జరిగిన ఫైనల్లో పంకజ్ 5–1 (65–57, 62–46, 85–18, 15–66, 71–62, 75–11) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. సెమీఫైనల్లో పంకజ్ 4–3తో ప్రపంచ మాజీ స్నూకర్ చాంపియన్ దెచావత్ పూమ్జేంగ్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. ఐదు దేశాల నుంచి 123 మంది ప్లేయర్లు ఈ టోర్నీలో పోటీపడ్డారు. విజేతగా నిలిచిన పంకజ్‌కు 11 వేల సింగపూర్ డాలర్లు (రూ. 7 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. పుణేలో జన్మించి బెంగళూరులో స్థిరపడ్డ 39 ఏళ్ల పంకజ్ తన కెరీర్లో వివిధ ఫార్మాట్లలో 27 ప్రపంచ టైటిల్స్‌ను సాధించాడు. -
వరల్డ్ కప్ స్నూకర్ ఫైనల్లో భారత్
అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) వరల్డ్ కప్ స్నూకర్ టోర్నమెంట్లో పంకజ్ అద్వానీ, లక్ష్మణ్ రావత్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. దోహాలో సోమవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 3–2 (57–59, 7–76, 101–9, 66–16, 75–34) ఫ్రేమ్‌ల తేడాతో బ్రెండన్ ఒడొనోగుయె, ఆరన్ హిల్‌లతో కూడిన ఐర్లాండ్ జట్టుపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్ (అస్జద్ ఇక్బాల్, మొహమ్మద్ బిలాల్)తో భారత్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ 3–1తో ఖతర్‌పై గెలిచింది. -
ఆసియా టీమ్ స్నూకర్ రన్నరప్ భారత్
దోహా: ఆసియా టీమ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ, లక్ష్మణ్ రావత్, ఆదిత్య మెహతాలతో కూడిన భారత్ 2–3 (1–79, 1–71, 58–18, 67–39, 9–69) ఫ్రేమ్‌ల తేడాతో పాకిస్తాన్–2 జట్టు చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో టీమిండియా 3–2 (95–46, 55–42, 28–74, 43–51, 69–29) ఫ్రేమ్‌ల తేడాతో మయన్మార్ జట్టును ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 3–0 (98–0, 74–22, 68–17) ఫ్రేమ్‌లతో పాకిస్తాన్–1 జట్టుపై విజయం సాధించింది. -
చాంపియన్ హిమాన్షు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ స్నూకర్, బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో హిమాన్షు జైన్ విజేతగా నిలిచాడు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ)లో జరిగిన ఈ టోర్నీలో సీనియర్ స్నూకర్ విభాగంలో హిమాన్షు టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్లో హిమాన్షు 5–3 ఫ్రేమ్‌ల తేడాతో (38–93, 73–16, 40–66, 79–29, 76–0, 59–66, 74–42, 85–0) మొహమ్మద్ గౌస్‌పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో హిమాన్షు 87–13, 86–4, 82–34, 85–4, 65–47తో ముస్తాక్‌పై గెలుపొందగా, గౌస్ 51–64, 9–61, 55–26, 43–54, 64–11, 39–84, 61–43, 62–30, 70–12తో నబిల్‌ను ఓడించాడు. -
రెండో రౌండ్లో పంకజ్ అద్వానీ
సాక్షి, హైదరాబాద్: ఇండియా ఓపెన్ ప్రపంచ ర్యాంకింగ్ స్నూకర్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. హెచ్ఐసీసీ నోవాటెల్‌లో బుధవారం జరిగిన తొలి రౌండ్లో అతను 4-0తో ఎలియట్ స్లెసర్ (ఇంగ్లండ్)పై అలవోక విజయం సాధించాడు. ఈ పోరులో అద్వానీ నాలుగు ఫ్రేముల్లో కలిపి 266 పాయింట్లు సాధించగా, ప్రత్యర్థి మాత్రం 31 పాయింట్లకే పరిమితమయ్యాడు. భారత్‌కు చెందిన మరో ఆటగాడు ఇశ్ప్రీత్ చద్దా 2-4తో డామినిక్ డేల్ చేతిలో పరాజయం చవిచూశాడు.