భారత మేటి ప్లేయర్ పంకజ్ అద్వానీ ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. దోహాలో గురువారం జరిగిన ఫైనల్లో పంకజ్ 6–3 ఫ్రేమ్‌ల తేడాతో అమీర్ సర్ఖోష్ (ఇరాన్)పై గెలిచాడు. స్నూకర్, బిలియర్డ్స్ క్రీడాంశాల్లో కలిపి పంకజ్ ఖాతాలో ఇప్పటివరకు 11 ఆసియా టైటిల్స్ చేరడం విశేషం. 2019లో పంకజ్ విజేతగా నిలువగా... కరోనా కారణంగా గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌ను నిర్వహించలేదు.
డేవిస్ కప్ గ్రూఫ్-1: ఫిన్లాండ్‌తో తలపడనున్న భారత్
ఎస్పూ (ఫిన్లాండ్): డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1 పోరులో భాగంగా భారత్... ఫిన్లాండ్ తో తలపడనుంది. సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్‌కుమార్‌లపైనే భారత్ ఆశలు పెట్టు కుంది. డబుల్స్‌లో అనుభవజ్ఞుడైన రోహన్ బోపన్న ఉన్నప్పటికీ అతను ఫామ్‌లో లేడు. ఇలాంటి పరిస్థితుల్లో దివిజ్ శరణ్‌తో కలిసి బరిలోకి దిగనున్న అతను ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. శుక్రవారం జరిగే సింగిల్స్ మ్యాచ్‌ల్లో ప్రపంచ 165వ ర్యాంకర్ ప్రజ్నేశ్‌తో 419వ ర్యాంకర్ ఒట్టో విర్టనెన్; 187వ ర్యాంకర్ రామ్‌కుమార్‌తో 74వ ర్యాంకర్ ఎమిల్ రుసువురి తలపడతారు. శనివారం డబుల్స్, రెండు రివర్స్ సింగిల్స్ జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment