Snooker Championship
-
11 ఏళ్ల వయసులోనే చాంపియన్.. బ్రిలియంట్ పంకజ్
మన దేశంలో పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు ఆరాధించే ఆటగాళ్ల జాబితాలో అతను ఉండడు..! ఎందుకంటే అతను క్రికెటర్ కాదు! అతను సాధించిన విజయాలపై అన్ని వైపుల నుంచీ ఎప్పుడూ పెద్దగా చర్చ జరగదు..! ఎందుకంటే అతనేమీ ఒలింపిక్స్ పతకం గెలవలేదు! పాపులారిటీ పరంగా చూస్తే ఆ జాబితాలో అతని పేరు ఎక్కడా కనిపించదు! కానీ.. అతను విశ్వ వేదికలపై నమోదు చేసిన ఘనతలేమీ చిన్నవి కావు! అసాధారణ ఆటతో అతను చూపించిన ఫలితాలు అసమానం! బిలియర్డ్స్, స్నూకర్ టేబుల్స్‌పై అతను అందుకున్న విజయాలు నభూతో..! ‘క్యూ’ స్పోర్ట్స్‌లో విశ్వవ్యాప్తంగా వేర్వేరు వేదికలపై వరుస విజయాలతో సత్తా చాటిన ఆ దిగ్గజమే పంకజ్ అద్వానీ! ఏకంగా 25 వరల్డ్ టైటిల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన స్టార్. పంకజ్ అద్వానీకి అప్పుడు సరిగ్గా ఐదేళ్లు.. తండ్రి వ్యాపారరీత్యా ఆ కుటుంబం కొన్నేళ్లుగా కువైట్‌లోనే స్థిరపడిపోయింది. దానికి సంబంధించిన ఒక పని కోసం పంకజ్ తండ్రి అర్జున్ అద్వానీ కుటుంబంతో సహా వారం రోజుల పాటు బెల్గ్రేడ్కు వెళ్లాడు. పని ముగిసిన తర్వాత వారంతా తిరిగి కువైట్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అప్పుడే హోటల్ యాజమాన్యం వీరి గదికి వచ్చి ‘మీరు కువైట్ వెళ్లే అవకాశం ఇక ఏమాత్రం లేదు. కువైట్‌లో యుద్ధం జరుగుతోంది. ఆ దేశాన్ని ఇరాక్ ఆక్రమించింది. విమానాలన్నీ బంద్. మీరు ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు’ అని చెప్పేశాడు. దాంతో పంకజ్ తండ్రి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కానీ ఏమీ చేయలేని స్థితిలో వ్యాపారం మొత్తం వదిలేసి నేరుగా భారత్‌కు వచ్చేశాడు. ముందుగా ముంబై చేరిన ఆ కుటుంబం ఆపై బెంగళూరులో స్థిరపడింది. అయితే దాన్నే తన జీవితంలో కీలకమైన మలుపుగా పంకజ్ చెప్పుకున్నాడు. కువైట్‌లో ఉండుంటే తాను బిలియర్డ్స్ వైపు వెళ్లకపోయేవాడినని, వ్యాపారంలోనే మునిగిపోయేవాడినని అతను అన్నాడు. తన సన్నిహితులు కొందరి కారణంగా, సరదాగా ఆ ఆట వైపు ఆకర్షితుడైన తను భవిష్యత్తులో అదే ఆటలో స్టార్‌గా ఎదుగుతానని పంకజ్ కూడా ఏనాడూ ఊహించలేదు. జూనియర్ స్థాయి నుంచే.. ఒక్కసారి ‘టేబుల్’ ఓనమాలు నేర్చుకున్న తర్వాత పంకజ్‌కు ఏనాడూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 11 ఏళ్ల వయసులోనే రాష్ట్ర స్థాయిలో బిలియర్డ్స్ టైటిల్ గెలిచిన తర్వాత 15 ఏళ్ల వయసులో జాతీయ జూనియర్ చాంపియన్ షిప్ కూడా సొంతం చేసుకున్నాడు. జాతీయ జూనియర్ స్థాయి బిలియర్డ్స్, స్నూకర్ టైటిల్స్ మాత్రమే కాదు.. 17 ఏళ్లకే జాతీయ సీనియర్ స్నూకర్ ట్రోఫీ గెలిచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. తుది ఫలితాలు మాత్రమే కాదు.. అతని ఆటను చూసినప్పుడే మున్ముందు పెద్ద విజయాలు సాధించగలడని, గత తరం భారత బిలియర్డ్స్ దిగ్గజం గీత్ సేథీ సాధించిన ఘనతలను అధిగమించగలడని ‘క్యూ’ స్పోర్ట్స్ నిపుణులు పంకజ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత వాస్తవరూపం దాల్చడం విశేషం. ఒకటి తర్వాత మరొకటి.. అపార ప్రతిభ ఉన్నా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పోటీ కారణంగా పంకజ్‌కు ఆరంభంలోనే విశ్వ వేదికలపై విజయాలు దక్కలేదు. అయితే 14 ఏళ్లకే ఇంగ్లండ్‌లో వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్లో పాల్గొని అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరో నాలుగేళ్ల తర్వాత తొలిసారి వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్లో గెలవడంతోనే అతను ఏమిటో అందరికీ తెలిసింది. 18 ఏళ్ల వయసులో సాధించిన ఈ తొలి టైటిల్‌తో పంకజ్ విజయప్రస్థానం ఘనంగా మొదలైంది. ఆ తర్వాత ఎదురులేకుండా సాగిన అతని జోరు ఏకంగా 25వ ప్రపంచ టైటిల్ వరకు సాగింది. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా అతని ఆటకు ట్రోఫీలన్నీ దరి చేరాయి. ఈ క్రమంలో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో ఘనతలను అందుకున్న పంకజ్ తన పేరిట పలు రికార్డులను నమోదు చేశాడు. స్టీవ్ డేవిస్, జాన్ హిగిన్స్, జడ్ టంప్, డింగ్హుయ్.. ఇలా అప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన దిగ్గజాలను పంకజ్ వరుసగా ఓడిస్తూ వచ్చాడు. వరల్డ్ బిలియర్డ్స్‌లో ఒక అరుదైన రికార్డు పంకజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రీడలో ఉన్న రెండు ఫార్మాట్లు (టైమ్ అండ్ పాయింట్)లలో విశ్వ విజేతగా నిలిచిన తొలి ఆటగాడిగా అతను ఘనత వహించాడు. ఒకే సమయంలో వరల్డ్ చాంపియన్ , కాంటినెంటల్ (ఆసియా) చాంపియన్ గా కూడా ఉన్న ఏకైక ఆటగాడిగా పంకజ్ నిలిచాడు. ఒలింపిక్స్ ఒక్కటే గొప్ప కాదు దురదృష్టవశాత్తూ బిలియర్డ్స్, స్నూకర్లలో ఏ ఆటకు కూడా ఒలింపిక్స్‌లో చోటు లేదు. పంకజ్ ఇన్నేళ్ల ప్రదర్శనను చూస్తే ఒలింపిక్స్‌లో అతను కచ్చితంగా పతకాలు సాధించగలిగేవాడని ఎవరైనా చెప్పగలరు. ఇదే విషయాన్ని గతంలో ఒక అభిమాని పంకజ్‌కు గుర్తు చేశాడు. ఇన్ని ఘనతలతో పాటు ఒలింపిక్స్ పతకం సాధించి ఉంటే ‘ఆల్‌టైమ్ గ్రేట్’ అయ్యేవాడివి అంటూ అతను వ్యాఖ్యానించాడు. దీనిపై పంకజ్ తనదైన శైలిలో స్పందించాడు. ‘అంతా బాగుంది అంటున్నారు సరే.. ఏ క్రీడాకారుడైనా ఒలింపిక్స్ పతకం గెలిస్తేనే గొప్పా, అది లేకపోతే తక్కువా?! నాలుగేళ్లకు ఒకసారి చూపించే ప్రదర్శనను బట్టి ఒక క్రీడాకారుడి గొప్పతనాన్ని అంచనా వేస్తారా? నా దృష్టిలో దానికంటే నా దేశం తరఫున వరుసగా నాలుగేళ్ల పాటు నాలుగు వరల్డ్ చాంపియన్ షిప్‌లు గెలవడం కూడా గొప్పే. నేను దానిని ఇష్టపడతాను’ అంటూ అతను జవాబిచ్చాడు. విజయాల జాబితా (మొత్తం 25 ప్రపంచ టైటిల్స్) వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ (పాయింట్ ఫార్మాట్) – 8 వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ (లాంగ్ ఫార్మాట్) – 8 వరల్డ్ టీమ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ – 1 వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్ (15 రెడ్స్) – 3 వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్ (6 రెడ్స్) – 2 6 రెడ్ స్నూకర్ వరల్డ్ కప్ – 1 స్నూకర్ వరల్డ్ టీమ్ కప్ – 1 స్నూకర్ వరల్డ్ టీమ్ చాంపియన్య్ షిప్ – 1 ఆసియా క్రీడలు – 2 స్వర్ణాలు (2006, 2010) ఆసియా చాంపియన్ షిప్‌లు – 12 జాతీయ చాంపియన్ షిప్‌లు – 34 -
ప్రపంచ వరల్డ్ 6–రెడ్ స్నూకర్ చాంప్ శ్రీకృష్ణ
కౌలాలంపూర్: ప్రపంచ 6–రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్ శ్రీకృష్ణ సూర్యనారాయణన్ విజేతగా అవతరించాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో తమిళనాడుకు చెందిన శ్రీకృష్ణ 5–1 ఫ్రేమ్‌ల (51–4, 0–39, 63–0, 39–0, 45–7, 43–2) తేడాతో హబీబ్ సబా (బహ్రెయిన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో శ్రీకృష్ణ 5–4 ఫ్రేమ్‌ల తేడాతో జేమ్స్ వతానా (థాయ్‌లాండ్)పై నెగ్గాడు. 22 ఏళ్ల శ్రీకృష్ణ జాతీయ 6–రెడ్ స్నూకర్ చాంపియన్ కాగా, 2019లో జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచాడు. చదవండి: World TT Championship: ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్ -
Pankaj Advani: ఆసియా స్నూకర్ టైటిల్ నిలబెట్టుకున్న పంకజ్ అద్వానీ
భారత మేటి ప్లేయర్ పంకజ్ అద్వానీ ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. దోహాలో గురువారం జరిగిన ఫైనల్లో పంకజ్ 6–3 ఫ్రేమ్‌ల తేడాతో అమీర్ సర్ఖోష్ (ఇరాన్)పై గెలిచాడు. స్నూకర్, బిలియర్డ్స్ క్రీడాంశాల్లో కలిపి పంకజ్ ఖాతాలో ఇప్పటివరకు 11 ఆసియా టైటిల్స్ చేరడం విశేషం. 2019లో పంకజ్ విజేతగా నిలువగా... కరోనా కారణంగా గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌ను నిర్వహించలేదు. డేవిస్ కప్ గ్రూఫ్-1: ఫిన్లాండ్తో తలపడనున్న భారత్ ఎస్పూ (ఫిన్లాండ్): డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1 పోరులో భాగంగా భారత్... ఫిన్లాండ్ తో తలపడనుంది. సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్కుమార్లపైనే భారత్ ఆశలు పెట్టు కుంది. డబుల్స్‌లో అనుభవజ్ఞుడైన రోహన్ బోపన్న ఉన్నప్పటికీ అతను ఫామ్‌లో లేడు. ఇలాంటి పరిస్థితుల్లో దివిజ్ శరణ్‌తో కలిసి బరిలోకి దిగనున్న అతను ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. శుక్రవారం జరిగే సింగిల్స్ మ్యాచ్‌ల్లో ప్రపంచ 165వ ర్యాంకర్ ప్రజ్నేశ్‌తో 419వ ర్యాంకర్ ఒట్టో విర్టనెన్; 187వ ర్యాంకర్ రామ్‌కుమార్‌తో 74వ ర్యాంకర్ ఎమిల్ రుసువురి తలపడతారు. శనివారం డబుల్స్, రెండు రివర్స్ సింగిల్స్ జరుగుతాయి. -
పంకజ్ అద్భుత విజయం
దోహా: ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 5–4 (31–68, 1–54, 40–76, 1–96, 78–8, 89–33, 55–14, 89–24, 52–26) ఫ్రేమ్‌ల తేడాతో అస్జద్ ఇక్బాల్ (పాకిస్తాన్)పై అద్వితీయ విజయం సాధించాడు. బెస్ట్ ఆఫ్–9 ఫ్రేమ్‌ల పద్ధతిలో జరిగిన సెమీఫైనల్లో పంకజ్ తొలి నాలుగు ఫ్రేమ్‌లను చేజార్చుకొని ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే పంకజ్ అనూహ్యంగా పుంజుకొని ఆ తర్వాత వరుసగా ఐదు ఫ్రేమ్‌లను సొంతం చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకోవడం విశేషం. నేడు జరిగే ఫైనల్లో థనావత్ తిరపోంగ్పైబూన్ (థాయ్‌లాండ్)తో పంకజ్ తలపడతాడు. క్వార్టర్ ఫైనల్లో పంకజ్ 5–4తో ఆదిత్య మెహతా (భారత్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–1తో ఫంగ్ క్వోక్ వాయ్ (హాంకాంగ్)పై, రెండో రౌండ్లో 4–2తో నొప్పడన్ సాంగ్నిల్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. -
పంకజ్‌కు పతకం ఖాయం
దోహా: భారత స్టార్ క్యూయిస్ట్, 21 సార్లు ప్రపంచ చాంపియన్ పంకజ్ అద్వానీ ఖాతాలో మరో పతకం చేరనుంది. ఖతార్‌లోని దోహాలో జరుగుతున్న ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. తద్వారా కనీసం కాంస్యం ఖాయం చేసుకున్నాడు. గురువారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ఫైనల్స్ మ్యాచ్‌లో పంకజ్ 5–4 (0–99, 1–60, 64–50, 97–0, 35–90, 113–0, 8–107, 61–16, 72–48)తో మన దేశానికే చెందిన ఆదిత్య మెహతాపై చెమటోడ్చి నెగ్గాడు. ఒక దశలో మెహతా 4–3తో నెగ్గేలా కనిపించినప్పటికీ అనూహ్యంగా పుంజుకున్న పంకజ్ ఆఖరి రెండు రౌండ్లలోనూ నెగ్గి విజయ కేతనం ఎగరవేశాడు. ఈ గెలుపుతో టోర్నీలో మిగిలిన ఏకైక భారత క్రీడాకారుడిగా నిలిచిన పంకజ్.. సెమీఫైనల్లో అస్జాద్ ఇక్బాల్(పాకిస్థాన్)తో తలపడతాడు. -
క్వార్టర్ ఫైనల్లో హిమాన్షు జైన్
ముంబై: ఆలిండియా ఓపెన్ స్నూకర్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో హిమాన్షు జైన్ క్వార్టర్స్‌కు చేరుకోగా... లక్కీ వత్నాని ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో హిమాన్షు జైన్ (తెలంగాణ) 4–0 (78–50, 59–30, 89–50, 72–34)తో రూపేశ్ షా (గుజరాత్)పై గెలుపొందగా... లక్కీ వత్నాని (తెలంగాణ) 3–4 (54–72, 29–71, 63–16, 44–53, 58–38, 72–31, 18–57)తో ఇష్ప్రీత్ సింగ్ చద్దా (ముంబై) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు జరిగిన రౌండ్–32 మ్యాచ్‌ల్లో లక్కీ వత్నాని (తెలంగాణ) 4–3 (24–67(52), 77–58, 62–19, 33–77(45), 45–40, 7–61, 66 (52)–0)తో స్పర్‌న్ష్ పేర్వానీ (ముంబై)పై, హిమాన్షు జైన్ (తెలంగాణ) 4–1 (59–55, 61–43, 69–8, 11–71, 66–18)తో మోను చౌదరీ (ఢిల్లీ)పై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కి అర్హత సాధించారు. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు పంకజ్ అద్వానీ (ఓఎన్జీసీ) 4–2 (99–33, 36–103(74), 44–65, 62–54, 95(53)–25, 89–13)తో అనురాగ్ గిరి (మధ్యప్రదేశ్)పై, ముకుంద్ భరాడియా (ముంబై) 4–3 (22–82(69), 24–56, 69–24, 74–48, 65–21, 55–67, 47–38)తో బ్రిజేశ్ దామని (ఇండియన్ ఆయిల్)పై, మల్కీత్ సింగ్ (రైల్వేస్) 4–3 (63(40)–12, 43–79, 82(82)–0, 53–60, 9–55, 66–40, 73–43)తో ఎస్. దిలీప్ కుమార్ (రైల్వేస్)పై, ఆదిత్య మెహతా (ఓఎన్ జీసీ) 4–1 (1–88(69), 79(57)–42, 91(91)–23, 73(68)–1, 62(43)–24)తో ఆర్. గిరీశ్ (రైల్వేస్)పై, వరుణ్ మదన్ (ఢిల్లీ) 4–2 (2–61, 1–76, 70–27, 64(42)–16, 84(52)–16, 88(67)–21)తో సుమిత్ తల్వార్ (చండీగఢ్)పై, లక్ష్మణ్ రావత్ (ఇండియన్ ఆయిల్) 4–2 (62–34, 35–74, 65–25, 36–95, 75–39, 68–7)తో మనన్ చంద్ర (బీపీసీఎల్)పై గెలుపొందారు. , , , -
లక్కీ వత్నాని గెలుపు
ముంబై: సీసీఐ ఆలిండియా ఓపెన్ స్నూకర్ చాంపియన్ షిప్లో తెలంగాణ క్రీడాకారుడు లక్కీ వత్నాని మరో విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన రౌండ్–64 మ్యాచ్‌లో లక్కీ వత్నాని 4–1 (55–57, 73–8, 65–8, 61–53, 75–2)తో భారత నెం.4 ర్యాంకర్ కమల్ చావ్లాపై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల్లో టాప్ ప్లేయర్ పంకజ్ అద్వానీ (ఓఎన్ జీసీ) 4–0 (78–24, 65–4, 131(131)–0, 73(53)–22)తో మానవ్ పాంచల్‌పై, దివ్య శర్మ (హరియాణా) 4–1 (22–72, 54–43, 56–28, 77–17, 72(52)–29) పుష్పీందర్ సింగ్‌పై, గిరీశ్ (రైల్వేస్) 4–0 (65–31, 56–27, 62–37, 80(58)–0) హితేశ్ కొత్వానీ (ముంబై)పై, మోను చౌదరీ (ఢిల్లీ) 4–2 (44–58, 1–67(67), 70(54)–23, 75–37, 74–15, 84–42) షాబాజ్ ఆదిల్‌ఖాన్(ఓఎన్జీసీ)పై, రూపేశ్ షా (గుజరాత్) 4–3 (34–64, 61–6, 61–7, 45–61, 69–59, 50–60, 86(86)–60) సందీప్ గులాటి (ఢిల్లీ)పై, వరుణ్ మదన్ (ఢిల్లీ) 4–2 (81–42, 52–65, 73–38, 49–78, 60–28, 71–28) భరత్ సిసోడియా (మధ్యప్రదేశ్)పై, విమల్ మరివాలా (ముంబై) 4–3 (80(49)–9, 45–51, 52–39, 19–49, 62–63, 43–39, 50–29) వర్షా సంజీవ్ (కర్ణాటక)పై, దిలీప్ కుమార్ (రైల్వేస్)4–2 (68(47)–30, 68(54)–49, 54–60, 63–53, 50–62, 70–36) కనిష్క్ (ముంబై)పై, మనన్ చోప్రా (బీపీసీఎల్)4–1 (72–24, 70–12, 44–76, 94(63)–22, 75–40) ఎస్. అరుణ్ (కర్ణాటక)పై, మల్కీత్ సింగ్ (రైల్వేస్) 4–3 (83–12, 27–68, 1–86(86), 59–8, 1–69, 69–27, 74(60)–34) సౌరవ్ కొఠారి (ఓఎన్జీసీ)పై గెలుపొంది ముందంజ వేశారు. -
లక్కీ వత్నాని ముందంజ
ముంబై: ఆలిండియా ఓపెన్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుడు లక్కీ వత్నాని ముందంజ వేశాడు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో లక్కీ వత్నాని రెండోరౌండ్లో గెలుపొందాడు. బుధవా రం జరిగిన పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో లక్కీ వత్నాని (తెలంగాణ) 3–0 (68–17, 87– 63, 79–38) ఫ్రేమ్‌ల తేడాతో సిద్ధేశ్‌పై నెగ్గాడు. -
కీర్తన సంచలనం
ముంబై: అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ప్రపంచ అండర్–16 స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన కీర్తన పాండియన్ విజేతగా నిలిచింది. కర్ణాటకకు చెందిన కీర్తన ఫైనల్లో 3–1 (53–44, 16–49, 62–42, 72–39) ఫ్రేమ్‌ల తేడాతో అల్బీనా లెస్‌చుక్ (బెలారస్)పై గెలిచింది. అంతకుముందు నాకౌట్ మ్యాచ్‌ల్లో కీర్తన 3–0తో మనస్విని (భారత్)పై, 3–0తో అలీనా ఖైరూలినా (రష్యా)లపై గెలిచి సెమీస్ చేరింది. సెమీఫైనల్లో ఆమె 3–1తో డిఫెండింగ్ చాంపియన్ అనుపమ (భారత్)పై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. -
గౌస్ ముందంజ
తెలంగాణ ఓపెన్ స్నూకర్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో మొహమ్మద్ గౌస్ ముందంజ వేశాడు. సోమవారం జరిగిన మూడోరౌండ్ గేమ్‌లో గౌస్ 3–1తో వరుణ్ విక్టర్‌పై గెలుపొందాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ముస్తాక్ 3–1తో డి.రోహిత్ కుమార్‌పై, బాలకృష్ణ 3–2తో శరత్‌పై, రషీద్ ఖురేషి 3–1తో అస్లామ్‌పై, సయ్యద్ అహ్మద్ 3–0తో మజీద్ ఖాన్‌పై, అబ్దుల్ మజీద్ 3–1తో పి. సాయినాథ్‌పై, చేతన్ 3–0తో జాన్ వలీపై, జేమ్స్ సుందర్ 3–0తో సజ్జద్ ఖాన్‌పై, పాండురంగయ్య 3–0తో శ్రీనివాస్ రావుపై, సందీప్ రెడ్డి 3–1తో నిజాముద్దీన్‌పై, పర్వేజ్ షరీఫ్ 3–0తో ధ్రువ్ సింగ్‌పై, దేవ్‌పాల్ 3–1తో పవన్‌కుమార్‌పై, అజయ్ భూషణ్ 3–0తో అభిరాజ్‌పై, రాజీవ్ 3–0తో షేక్ షుకూర్‌పై గెలుపొందారు. -
నాకౌట్ దశకు అద్వానీ
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా 6–రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ పంకజ్ అద్వానీ (భారత్) నాకౌట్ దశకు అర్హత సాధించాడు. గ్రూప్ దశలోని పంకజ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచాడు. తొలి మ్యాచ్‌లో 5–2తో ఫైతూన్ ఫోన్బన్ (థాయ్‌లాండ్)పై, రెండో మ్యాచ్‌లో 5–3తో అలీ రోషనికియా (ఇరాన్)పై, మూడో మ్యాచ్‌లో 5–3తో ఒమర్ అలీ (ఇరాక్)పై విజయం సాధించాడు. -
సెమీఫైనల్లో పంకజ్ అద్వానీ
దోహా: భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో పంకజ్ 58–52, 102–0, 12–60, 60–31, 56–20, 71–59 తేడాతో మహ్మద్ అల్ జోయ్కర్ (యూఏఈ)పై గెలుపొందాడు. -
స్నూకర్ టోర్నీలో రన్నరప్ విద్యా పిళ్లై
సింగపూర్: భారత క్రీడాకారిణి విద్యా పిళ్లై ప్రపంచ మహిళల స్నూకర్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో విద్య 5–6 ఫ్రేమ్‌లతేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ ఎన్గ్ ఓన్ యి (హాంకాంగ్) చేతిలో పోరాడి ఓడింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్ నుంచి ఫైనల్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 40 ఏళ్ల విద్య తుది పోరులో ఒకదశలో 4–2 ఫ్రేమ్‌లతో విజయానికి చేరువైంది. అయితే కీలకదశలో ఈ తమిళనాడు క్రీడాకారిణి ఏకాగ్రత కోల్పోయి, తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. -
పంకజ్‌కు కోల్‌కతా ఓపెన్ టైటిల్
కోల్‌కతా: భారత క్యూ స్పోర్ట్స్ స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ కోల్‌కతా ఓపెన్ జాతీయ ఇన్విటేషనల్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్ ఆదిత్య మెహతాతో ఆదివారం జరిగిన ఫైనల్లో పంకజ్ 5–1 (75–56, 76–19, 87–47, 73–17, 0–101, 116–0) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. -
ఆసియా 6 రెడ్ స్నూకర్ విజేత పంకజ్ అద్వానీ
భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ను వేసుకున్నాడు. అబుదాబిలో ఆదివారం ముగిసిన ఆసియా 6 రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ చాంపియన్‌గా నిలిచాడు. బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల పంకజ్ ఫైనల్లో 7-5 ఫ్రేమ్‌లతేడాతో కీన్ హూ మో (మలేసియా)పై విజయం సాధించాడు. ఇప్పటికే 15 సార్లు వివిధ విభాగాల్లో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్స్ నెగ్గిన పంకజ్‌కు ఆసియా టైటిల్ దక్కడం ఇది ఆరోసారి కావడం విశేషం. -
నాకౌట్‌కు అద్వానీ
అబుదాబి: ఆసియా 6 రెడ్స్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ నాకౌట్ దశకు చేరాడు. శుక్రవారం జరిగిన తన మూడో గ్రూపు మ్యాచ్‌లో 5-0 (47-22, 51-12, 55-11, 36-1, 34-18) తేడాతో ఖాలిద్ అలస్టల్ (పాలస్తీనా)పై, నాలుగో మ్యాచ్‌లో 5-2 (17-41, 0-57, 32-1, 3-37, 46-19, 38-25, 34-19) తేడాతో అలీజలీల్ (ఇరాక్)పై గెలిచాడు. -
రెండో రౌండ్‌కు ఆంథోని
తెలంగాణ-ఏపీ స్నూకర్ టోర్నీ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ-ఏపీ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో క్యూ మ్యాక్స్‌కు చెందిన జె. ఆంథోని రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. సికింద్రాబాద్‌లోని డెక్కన్ క్లబ్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన సీని యర్ విభాగం తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆంథోని 3-2 ఫ్రేమ్స్ తేడాతో ఫెరోజ్ అలీ (ఎస్డీ పార్లర్) పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆంథో ని 57-14, 28-82, 69-30, 43-60, 57-28 స్కోరుతో అలీపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇతర తొలి రౌండ్ ఫలితాలు : సల్మాన్ 66-28, 53-23, 45-37తో విభాస్పై, చింటూ 63-41, 16-46, 51-37, 69-18తో సురేశ్‌పై, కార్తీక్ 59-40, 15-49, 8-68, 15-52తో సుధీర్‌పై, యశ్వంత్ 63-25, 63-38, 48-28తో వంశీకృష్ణా రెడ్డిపై విజయం సాధించారు. దేవ్ 55-31, 69-55, 25-53, 31-61, 46-32తో హేమంత్ సింగ్ ఠాకూర్‌ను, రియాజ్ 73-51, 18-62, 64-62, 65-35తో ధీరజ్‌ను, సతీశ్ 45-5, 74-7, 61-27తో షాదిద్‌ను, సాయిచంద్ 47-56, 61-28, 48-59, 47-12, 43-18తో నరేశ్ కుమార్‌ను ఓడించారు. విజయా రెడ్డి 23-44, 21-51, 28-34తో కేవల్ చేతిలో, బిర్జి 5-42, 27-40, 32-45తో బి. రవీందర్ చేతిలో, రాజ్ కుమార్ 12-43, 49-8, 43-60, 13-62తో భరత్ చేతిలో, అనిరుధ్ 14-57, 28-82, 30-69 తేడాతో నాగార్జున చేతిలో పరాజయంపాలయ్యారు. -
పంకజ్ అద్వానీ అదుర్స్
వరల్డ్ 6-రెడ్ స్నూకర్ టైటిల్ కైవసం షార్మ్ ఎల్ షీక్ (ఈజిప్టు): భారత స్నూకర్ స్టార్ పంకజ్ అద్వానీ వరల్డ్ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో పంకజ్ 6-1 తేడాతో పోలండ్‌కు చెందిన కాస్పర్ ఫ్లిల్పియాక్‌పై విజయం సాధించాడు. దీంతో కెరీర్లో తొమ్మిదో ప్రపంచ టైటిల్‌ను (బిలియర్డ్స్‌లో 7, స్నూకర్‌లో 2) తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అద్వానీ ప్రపంచంలో లాంగ్, షార్ట్ ఫార్మాట్లలోనూ ప్రపంచ టైటిల్ నెగ్గిన తొలి ఆటగాడయ్యాడు. ‘ఇదంతా కలలా అనిపిస్తోంది. ఈ చాంపియన్‌షిప్‌లో గెలుస్తానని ఊహించలేదు’ అని అద్వానీ వ్యాఖ్యానించాడు. -
క్వార్టర్స్‌లో పంకజ్ అద్వానీ
షార్మ్ ఎల్ షీక్ (ఈజిప్టు): వరల్డ్ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌లో శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో పంకజ్ 4-0తో అలెక్స్ బోర్గ్ (మాల్టా)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో కమల్ చావ్లా 2-4తో మెహసెన్ బుక్షాషీష్ (ఖతర్) చేతిలో ఓటమిపాలయ్యాడు. 15-రెడ్ స్నూకర్ టీమ్ ఈవెంట్లో భారత జోడీలు నిరాశపర్చాయి. క్వార్టర్స్‌లో పంకజ్-బ్రిజేష్ దమానీ జోడి 1-4తో మహ్మద్ ఆసిష్-సజ్జాద్ హుస్సేనీ (పాకిస్థాన్) చేతిలో; సౌరవ్ కొఠారీ-శివమ్ అరోరా ద్వయం 0-4తో హోస్సెనీ వాఫెయి అయోరీ-ఎహ్సాన్ హైదర్ అలీ (ఇరాన్) చేతిలో పరాజయం చవిచూశాయి. మహిళల విభాగంలో విద్య పిళ్లై-అమీ కామని 3-0తో జెస్సీకా వుడ్స్-క్యాతీ పరాశీష్పై నెగ్గారు. -
సెమీస్‌లో చిత్ర
దౌగాపిల్స్ (లాట్వియా): ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన చిత్ర మగిమైరాజన్ సత్తా చాటుకుంది. క్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన వర్ష సంజీవ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో చిత్ర 4-0 (59-47, 71-42, 61-26, 61-27) తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే రెండు బిలియర్డ్స్ టైటిళ్లు, ఆస్ట్రేలియా ఓపెన్ గెలుచుకున్న చిత్ర సెమీస్ బెర్తుతో కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో చిత్ర 4-2 (79-40, 85-16, 33-59, 43-46, 74-56, 61-52)తో సహచరిణి విద్యా పిళ్లైపై... వర్ష 4-1 (68-26, 37-64, 54-19, 68-4, 59-33)తో అరంటా సాంచిస్పై విజయం సాధించారు. మరోవైపు పురుషుల విభాగంలో మనన్ చంద్ర, షాబాజ్ ఆదిల్ ఖాన్ తమ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఓడారు. చంద్ర 0-5 (54-75, 0-120, 25-65, 49-74, 20-77)తో ఇంగ్లండ్ ఆటగాడు జెఫ్ కండీ చేతిలో ఘోరంగా ఓడిపోగా... షాబాజ్ 1-5 (46-83, 18-72, 40-67, 31-61, 85-0, 55-68)తో చైనాకు చెందిన జావో గ్జింటోంగ్ చేతిలో ఓడాడు.