
దోహా: భారత స్టార్ క్యూయిస్ట్, 21 సార్లు ప్రపంచ చాంపియన్ పంకజ్ అద్వానీ ఖాతాలో మరో పతకం చేరనుంది. ఖతార్‌లోని దోహాలో జరుగుతున్న ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. తద్వారా కనీసం కాంస్యం ఖాయం చేసుకున్నాడు. గురువారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ఫైనల్స్ మ్యాచ్‌లో పంకజ్ 5–4 (0–99, 1–60, 64–50, 97–0, 35–90, 113–0, 8–107, 61–16, 72–48)తో మన దేశానికే చెందిన ఆదిత్య మెహతాపై చెమటోడ్చి నెగ్గాడు. ఒక దశలో మెహతా 4–3తో నెగ్గేలా కనిపించినప్పటికీ అనూహ్యంగా పుంజుకున్న పంకజ్ ఆఖరి రెండు రౌండ్లలోనూ నెగ్గి విజయ కేతనం ఎగరవేశాడు. ఈ గెలుపుతో టోర్నీలో మిగిలిన ఏకైక భారత క్రీడాకారుడిగా నిలిచిన పంకజ్.. సెమీఫైనల్లో అస్జాద్ ఇక్బాల్(పాకిస్థాన్)తో తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment