స్నూకర్‌ టోర్నీలో రన్నరప్‌ విద్యా పిళ్లై | Vidya Pillai bags silver in Women World Snooker Championship | Sakshi
Sakshi News home page

స్నూకర్‌ టోర్నీలో రన్నరప్‌ విద్యా పిళ్లై

Published Tue, Mar 21 2017 10:25 AM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM

స్నూకర్‌ టోర్నీలో రన్నరప్‌ విద్యా పిళ్లై

స్నూకర్‌ టోర్నీలో రన్నరప్‌ విద్యా పిళ్లై

సింగపూర్‌: భారత క్రీడాకారిణి విద్యా పిళ్లై ప్రపంచ మహిళల స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో విద్య 5–6 ఫ్రేమ్‌లతేడాతో ప్రపంచ మాజీ చాంపియన్‌ ఎన్గ్‌ ఓన్‌ యి (హాంకాంగ్‌) చేతిలో పోరాడి ఓడింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌ నుంచి ఫైనల్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 40 ఏళ్ల విద్య తుది పోరులో ఒకదశలో 4–2 ఫ్రేమ్‌లతో విజయానికి చేరువైంది. అయితే కీలకదశలో ఈ తమిళనాడు క్రీడాకారిణి ఏకాగ్రత కోల్పోయి, తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement