
కౌలాలంపూర్: ప్రపంచ 6–రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్ శ్రీకృష్ణ సూర్యనారాయణన్ విజేతగా అవతరించాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో తమిళనాడుకు చెందిన శ్రీకృష్ణ 5–1 ఫ్రేమ్‌ల (51–4, 0–39, 63–0, 39–0, 45–7, 43–2) తేడాతో హబీబ్ సబా (బహ్రెయిన్)పై గెలిచాడు.
సెమీఫైనల్లో శ్రీకృష్ణ 5–4 ఫ్రేమ్‌ల తేడాతో జేమ్స్ వతానా (థాయ్‌లాండ్)పై నెగ్గాడు. 22 ఏళ్ల శ్రీకృష్ణ జాతీయ 6–రెడ్ స్నూకర్ చాంపియన్ కాగా, 2019లో జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచాడు.
చదవండి: World TT Championship: ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్
Comments
Please login to add a commentAdd a comment