
దోహా: ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 5–4 (31–68, 1–54, 40–76, 1–96, 78–8, 89–33, 55–14, 89–24, 52–26) ఫ్రేమ్‌ల తేడాతో అస్జద్ ఇక్బాల్ (పాకిస్తాన్)పై అద్వితీయ విజయం సాధించాడు. బెస్ట్ ఆఫ్–9 ఫ్రేమ్‌ల పద్ధతిలో జరిగిన సెమీఫైనల్లో పంకజ్ తొలి నాలుగు ఫ్రేమ్‌లను చేజార్చుకొని ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే పంకజ్ అనూహ్యంగా పుంజుకొని ఆ తర్వాత వరుసగా ఐదు ఫ్రేమ్‌లను సొంతం చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకోవడం విశేషం. నేడు జరిగే ఫైనల్లో థనావత్ తిరపోంగ్‌పైబూన్ (థాయ్‌లాండ్)తో పంకజ్ తలపడతాడు. క్వార్టర్ ఫైనల్లో పంకజ్ 5–4తో ఆదిత్య మెహతా (భారత్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–1తో ఫంగ్ క్వోక్ వాయ్ (హాంకాంగ్)పై, రెండో రౌండ్‌లో 4–2తో నొప్పడన్ సాంగ్‌నిల్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు.
Comments
Please login to add a commentAdd a comment