Aditya Mehta
-
పంకజ్ ఖాతాలో 23వ ప్రపంచ టైటిల్
మండలే (మయన్మార్): భారత క్యూ స్పోర్ట్స్ దిగ్గజం పంకజ్ అద్వానీ మరో ప్రపంచ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఆదిత్య మెహ్రాతో జతకట్టిన అద్వానీ తాజాగా ప్రపంచ టీమ్ స్నూకర్ చాంపియన్íÙప్లో విజేతగా నిలిచాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) మెగా ఈవెంట్లో బుధవారం జరిగిన ఫైనల్లో అద్వానీ–మెహ్రా జోడీ 5–2 ఫ్రేమ్‌ల తేడాతో పొంగ్సకార్న్–పొరమిన్ (థాయ్‌లాండ్) జంటపై విజయం సాధించింది. బెస్టాఫ్ 9 ఫ్రేమ్‌ల తుదిపోరులో భారత అగ్రశ్రేణి జోడీ 65–31, 9–69, 55–8, 21–64, 55–44, 52–23, 83–9తో థాయ్ జంటను కంగుతినిపించింది. అంతకుముందు సెమీఫైనల్లో భారత ద్వయం 4–1 ఫ్రేమ్‌ల తేడాతో థాయ్‌లాండ్‌కే చెందిన తనవత్ తిరపొంగ్పైబూన్–క్రిత్సనుత్ లెర్ట్సటయతోర్న్ జంటపై ఘనవిజయం సాధించింది. ఇటీవలే వ్యక్తిగత ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ నెగ్గిన అద్వానీ ఇప్పుడు 23వ ప్రపంచ చాంపియన్íÙప్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదిత్య మెహ్రాకు మాత్రం ఇదే తొలి టైటిల్. -
పంకజ్ అద్భుత విజయం
దోహా: ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 5–4 (31–68, 1–54, 40–76, 1–96, 78–8, 89–33, 55–14, 89–24, 52–26) ఫ్రేమ్‌ల తేడాతో అస్జద్ ఇక్బాల్ (పాకిస్తాన్)పై అద్వితీయ విజయం సాధించాడు. బెస్ట్ ఆఫ్–9 ఫ్రేమ్‌ల పద్ధతిలో జరిగిన సెమీఫైనల్లో పంకజ్ తొలి నాలుగు ఫ్రేమ్‌లను చేజార్చుకొని ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే పంకజ్ అనూహ్యంగా పుంజుకొని ఆ తర్వాత వరుసగా ఐదు ఫ్రేమ్‌లను సొంతం చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకోవడం విశేషం. నేడు జరిగే ఫైనల్లో థనావత్ తిరపోంగ్పైబూన్ (థాయ్‌లాండ్)తో పంకజ్ తలపడతాడు. క్వార్టర్ ఫైనల్లో పంకజ్ 5–4తో ఆదిత్య మెహతా (భారత్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–1తో ఫంగ్ క్వోక్ వాయ్ (హాంకాంగ్)పై, రెండో రౌండ్లో 4–2తో నొప్పడన్ సాంగ్నిల్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. -
ఆరు గంటల్లో తిరుమల కొండెక్కిన పారా సైక్లిస్ట్
తిరుమల: ప్రముఖ పారా సైక్లిస్ట్ ఆదిత్యా మెహతా బుధవారం అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండెక్కారు. 9 కిలోమీటర్ల ఈ మార్గంలోని మొత్తం 3,300 మెట్లను తన కృత్రిమ కాలుతో ఎక్కారు. అలిపిరి వద్ద ఉదయం 10.45 గంటలకు నడక ప్రారంభించిన ఆదిత్యా సాయంత్రం 4.45 గంటలకు తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆదిత్యా మెహతా మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల బెంగళూరు, హైదరాబాద్ మధ్య ఒంటి కాలితో పారా సైక్లింగ్ విజయవంతం కావడంతో శ్రీవారికి మొక్కు చెల్లించేందుకు వచ్చానన్నారు. పారా సైక్లింగ్ ద్వారా క్రీడారంగానికి చేయూతనివ్వాలని తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. -
ఆరు గంటల్లో తిరుమల కొండెక్కిన పారా సైక్లిస్ట్
తిరుమల: ప్రముఖ పారాసైక్లిస్ట్ ఆదిత్య మెహతా బుధవారం అలిపిరి మెట్లమార్గంలో తిరుమల కొండెక్కారు. తొమ్మిది కిలోమీటర్ల మార్గంలోని మొత్తం 3,300 మెట్లను తన కృత్రిమ కాలు (ఆర్టిఫిషియల్ లెగ్) తో ఆరు గంటల్లో ఎక్కారు. అలిపిరి వద్ద ఉదయం 10.45 గంటలకు నడక ప్రారంభించిన ఆయన సాయంత్రం 4.45 గంటలకు తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ వద్దకు చేరుకున్నారు. గతంలో మూడు కిలోమీటర్ల దూరంలోని శ్రీవారిమెట్టు మార్గంలో 2.05 గంటల్లోనే ఎక్కారు. ఆదిత్య మెహతా మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల బెంగళూరు, హైదరాబాద్ మధ్య ఒంటికాలితో పారాసైక్లింగ్ విజయవంతం కావడంతో శ్రీవారికి మొక్కు చెల్లించేందుకు వచ్చానన్నారు. గతంలోనూ శ్రీవారికి మొక్కు చెల్లించడంతో పారాసైక్లింగ్, వికలాంగ క్రీడలకు మంచి ప్రోత్సాహం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. పెట్టుడు కాలుతో ఎక్కేందుకు కొంత ఇబ్బంది ఉన్నా స్వామిపైన భారం వేసి ఆనందంగానే తిరుమలకొండకు చేరుకున్నానని ఆదిత్య మెహతా తెలిపారు. -
హైడ్రాలిక్ లెగ్‌తో.. తిరుమల కొండకు పారా సైక్లిస్ట్
సాక్షి, తిరుమల: ప్రమాదంలో కుడికాలు కోల్పోయిన ఆదిత్యా మెహతా మొక్కవోని దీక్షతో అంతర్జాతీయ స్థాయిలో ఫారా సైక్లిస్ట్‌గా పేరు సంపాదించాడు. అదే స్ఫూర్తితో మంగళవారం ఒకే కాలుతోపాటు కుడికాలికి అమర్చుకున్న హైడ్రాలిక్ కాలి సాయంతో తిరుమల కొండెక్కి శ్రీవేంకటేశ్వర స్వామివారికి మొక్కు చెల్లించుకున్నాడు. 2,400 మెట్లను 2.05 గంటల్లోనే ఎక్కాడు. హైదరాబాద్‌కు చెందిన 35 ఏళ్ల మెహతా ప్రమాదంలో కుడికాలు కోల్పోయాడు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న హైడ్రాలిక్ లెగ్‌తో సైక్లింగ్‌లో శిక్షణ పొంది అంతర్జాతీయ పారా స్లైక్లింగ్ పోటీల్లో రాణించాడు. 2013లో 100 కిలోమీటర్ల సైక్లింగ్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాడు. 2014 లోనూ మరోసారి స్థానం సంపాదించాడు. -
వ్యాయామమే సగం బలం
సైక్లింగ్‌లో వండర్స్ సృష్టించే యువకుడిగా ఆదిత్య మెహతా సిటీలో చాలా మందికి తెలుసు. రోడ్డు ప్రమాదం కారణంగా ఒక కాలును కోల్పోయినా, ఒంటి కాలితోనే వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ ఎన్నో రికార్డ్స్ సృష్టిస్తున్న ఆదిత్య... తన మనోనిబ్బరానికి శారీరక సామర్థ్యమూ కారణమేనంటాడు. అంతా బాగున్నవాళ్లు సైతం ‘అబ్బా ఎక్సర్‌సైజ్‌లా తర్వాత చూద్దాంలే’ అంటూ బద్దకిస్తుంటే... ఈ యంగ్ సైక్లిస్ట్ మాత్రం రెగ్యులర్ వ్యాయామంతో తనను తాను ఫిట్‌గా ఉంచుకుంటున్నాడు. ‘సిటీ ప్లస్’తో మాట్లాడుతూ... తన సైక్లింగ్ ట్రైనింగ్‌ను, ఫిట్నెస్ రొటీన్‌ను పంచుకున్నాడీ కుర్రాడు. సైక్లింగ్ ట్రైనింగ్... వారంలో తొలి రోజున 50 కి.మీ. సైక్లింగ్‌తో ప్రారంభమై, రెండో రోజున 5 కి.మీ. ఆల్ అవుట్, 5 కి.మీ. క్యాజువల్ రైడింగ్ చేస్తా. మొత్తం 4 సెట్లు కలిపి ఇది 40 కి.మీ. ఉంటుంది. మూడో రోజున క్యాజువల్ రైడింగ్ 50 కి.మీ. తరువాతి రోజున తాజ్‌కృష్ణ హోటల్లో 5- 8 సార్లు నిర్విరామంగా హిల్ ట్రైనింగ్ చేస్తా. ఐదో రోజున 50 కి.మీ. క్యాజువల్ రైడింగ్. మరుసటి రోజు 20 కి.మీ. స్పీడ్ వర్క్. తరువాతి రోజు రెస్ట్. సైక్లింగ్ సాధన అయిపోగానే ఆఫీస్.. అక్కడ వర్క్ మామూలే. జిమ్‌లో వర్కవుట్స్... సాయంత్రం 5.30 గంటల నుంచి గంటకు తక్కువ కాకుండా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తా. ఒక రోజు యాబ్స్, చెస్ట్‌కి, రెండో రోజు సర్క్యూట్ ట్రైనింగ్, నెక్స్ట్ డే లోయర్స్, ఫోర్త్ డే షోల్డర్స్, ఐదో రోజు విశ్రాంతి. ఆరో రోజు ఆర్మ్స్, ట్రైసప్స్, ఏడో రోజు మళ్లీ రెస్ట్. జిమ్ నుంచి 8.30కు ఆఫీస్‌కు వెళ్లి అకౌంట్స్ క్లోజ్ చేస్తా. నైట్ పది గంటలకు సలాడ్స్‌తో డిన్నర్... ఆ తరువాత నిద్ర. ఇదీ నా షెడ్యూల్. వాళ్లకీ వర్కవుట్స్ ఉన్నాయి... ఏదైనా కారణం వల్ల హ్యాండీక్యాప్డ్‌గా మారినంత మాత్రాన జిమ్‌కు, వర్కవుట్స్‌కి దూరం కానవసరం లేదు. డాక్టర్ల సలహాలు తీసుకుంటూ, ఫిట్నెస్ ట్రైనర్ల సూచనలతో అందరిలాగానే ఎక్సర్సైజ్లు చేయవచ్చు. స్పెషల్‌గా డిజైన్ చేసిన వర్కవుట్ రొటీన్‌ను వీరు ఫాలో అయితే సరిపోతుంది. - గెవిన్ హాల్ట్, ట్రైనర్ -
సైకిల్‌పై హైదరాబాదీ సాహసయాత్ర
హైదరాబాద్‌కు చెందిన పారా సైక్లిస్ట్ ఆదిత్య మెహతా మనాలీ నుంచి ఖర్దుంగా లా వరకు దాదాపు 500 కిలోమీటర్ల సాహస యాత్రను పూర్తి చేసుకున్నారు. మనాలీ నుంచి జాతీయ పతాకాన్ని ధరించి, ఆగస్టు 1న బయలుదేరిన ఆదిత్య సరిగా స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ఖర్దుంగా లా చేరుకున్నారు. సముద్రమట్టానికి దాదాపు 13 వేల అడుగుల ఎత్తయిన మనాలీ-లేహ్ హైవేపై బలమైన ఎదురుగాలులను, వణికించే చలిని తట్టుకుంటూ ఏమాత్రం స్థైర్యం కోల్పోకుండా ఈ యాత్ర పూర్తి చేయడం విశేషం. ఈ ప్రయాణంలో ఆయన ఆగస్టు 9న లేహ్ చేరుకున్నారు.