హైడ్రాలిక్ లెగ్‌తో.. తిరుమల కొండకు పారా సైక్లిస్ట్
సాక్షి, తిరుమల: ప్రమాదంలో కుడికాలు కోల్పోయిన ఆదిత్యా మెహతా మొక్కవోని దీక్షతో అంతర్జాతీయ స్థాయిలో ఫారా సైక్లిస్ట్‌గా పేరు సంపాదించాడు. అదే స్ఫూర్తితో మంగళవారం ఒకే కాలుతోపాటు కుడికాలికి అమర్చుకున్న హైడ్రాలిక్ కాలి సాయంతో తిరుమల కొండెక్కి శ్రీవేంకటేశ్వర స్వామివారికి మొక్కు చెల్లించుకున్నాడు.
2,400 మెట్లను 2.05 గంటల్లోనే ఎక్కాడు. హైదరాబాద్‌కు చెందిన 35 ఏళ్ల మెహతా ప్రమాదంలో కుడికాలు కోల్పోయాడు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న హైడ్రాలిక్ లెగ్‌తో సైక్లింగ్‌లో శిక్షణ పొంది అంతర్జాతీయ పారా స్లైక్లింగ్ పోటీల్లో రాణించాడు. 2013లో 100 కిలోమీటర్ల సైక్లింగ్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాడు. 2014 లోనూ మరోసారి స్థానం సంపాదించాడు.