వ్యాయామమే సగం బలం
సైక్లింగ్‌లో వండర్స్ సృష్టించే యువకుడిగా ఆదిత్య మెహతా సిటీలో చాలా మందికి తెలుసు. రోడ్డు ప్రమాదం కారణంగా ఒక కాలును కోల్పోయినా, ఒంటి కాలితోనే వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ ఎన్నో రికార్డ్స్ సృష్టిస్తున్న ఆదిత్య... తన మనోనిబ్బరానికి శారీరక సామర్థ్యమూ కారణమేనంటాడు.
అంతా బాగున్నవాళ్లు సైతం ‘అబ్బా ఎక్సర్‌సైజ్‌లా తర్వాత చూద్దాంలే’ అంటూ బద్దకిస్తుంటే... ఈ యంగ్ సైక్లిస్ట్ మాత్రం రెగ్యులర్ వ్యాయామంతో తనను తాను ఫిట్‌గా ఉంచుకుంటున్నాడు. ‘సిటీ ప్లస్’తో మాట్లాడుతూ... తన సైక్లింగ్ ట్రైనింగ్‌ను, ఫిట్‌నెస్ రొటీన్‌ను పంచుకున్నాడీ కుర్రాడు.
సైక్లింగ్ ట్రైనింగ్...
వారంలో తొలి రోజున 50 కి.మీ. సైక్లింగ్‌తో ప్రారంభమై, రెండో రోజున 5 కి.మీ. ఆల్ అవుట్, 5 కి.మీ. క్యాజువల్ రైడింగ్ చేస్తా. మొత్తం 4 సెట్లు కలిపి ఇది 40 కి.మీ. ఉంటుంది. మూడో రోజున క్యాజువల్ రైడింగ్ 50 కి.మీ. తరువాతి రోజున తాజ్‌కృష్ణ హోటల్‌లో 5- 8 సార్లు నిర్విరామంగా హిల్ ట్రైనింగ్ చేస్తా. ఐదో రోజున 50 కి.మీ. క్యాజువల్ రైడింగ్. మరుసటి రోజు 20 కి.మీ. స్పీడ్ వర్క్. తరువాతి రోజు రెస్ట్. సైక్లింగ్ సాధన అయిపోగానే ఆఫీస్.. అక్కడ వర్క్ మామూలే.
జిమ్‌లో వర్కవుట్స్...
సాయంత్రం 5.30 గంటల నుంచి గంటకు తక్కువ కాకుండా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తా. ఒక రోజు యాబ్స్, చెస్ట్‌కి, రెండో రోజు సర్క్యూట్ ట్రైనింగ్, నెక్స్ట్ డే లోయర్స్, ఫోర్త్ డే షోల్డర్స్, ఐదో రోజు విశ్రాంతి. ఆరో రోజు ఆర్మ్స్, ట్రైసప్స్, ఏడో రోజు మళ్లీ రెస్ట్. జిమ్ నుంచి 8.30కు ఆఫీస్‌కు వెళ్లి అకౌంట్స్ క్లోజ్ చేస్తా. నైట్ పది గంటలకు సలాడ్స్‌తో డిన్నర్... ఆ తరువాత నిద్ర. ఇదీ నా షెడ్యూల్.
వాళ్లకీ వర్కవుట్స్ ఉన్నాయి...
ఏదైనా కారణం వల్ల హ్యాండీక్యాప్డ్‌గా మారినంత మాత్రాన జిమ్‌కు, వర్కవుట్స్‌కి దూరం కానవసరం లేదు. డాక్టర్ల సలహాలు తీసుకుంటూ, ఫిట్‌నెస్ ట్రైనర్‌ల సూచనలతో అందరిలాగానే ఎక్సర్‌సైజ్‌లు చేయవచ్చు. స్పెషల్‌గా డిజైన్ చేసిన వర్కవుట్ రొటీన్‌ను వీరు ఫాలో అయితే
సరిపోతుంది.
- గెవిన్ హాల్ట్, ట్రైనర్