cycling
-
‘కామన్వెల్త్’లో స్విమ్మింగ్, సైక్లింగ్లకు పెద్దపీట
గ్లాస్గో: వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో క్రీడల్ని కుదించినప్పటికీ కొన్ని క్రీడలకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా సైక్లింగ్, స్విమ్మింగ్, పారా పోటీల్లో గణనీయంగా పతకాల ఈవెంట్లు పెంచారు. దీంతో వచ్చే ఏడాది గ్లాస్గో ఆతిథ్యమివ్వబోయే ఈ కామన్వెల్త్ మెగా ఈవెంట్లో 200కు పైగా బంగారు పతకాలు అథ్లెట్ల పరం కానున్నాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత మిక్స్డ్ 4–400 మీటర్ల రిలే విభాగాన్ని తిరిగి ఈ కామన్వెల్త్లో చేర్చారు. చివరిసారిగా 1966లో మిక్స్డ్ రిలే విభాగం పోటీలు నిర్వహించాక తదనంతరం క్రీడల్లో ఆ ఈవెంట్‌కు మంగళం పాడారు. దీనిపై ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో హర్షం వ్యక్తం చేశారు. 1930 నుంచి 1966 వరకు కామన్వెల్త్లో అలరించిన మిక్స్డ్ రిలే ఈవెంట్ మళ్లీ ఆరు దశాబ్దాల తర్వాత గ్లాస్గోలో పతకాల కోసం పరుగుపెట్టబోతోంది’ అని అన్నారు. పారా అథ్లెటిక్స్‌లోని 10 ఈవెంట్లలో ఏకంగా ఆరు క్రీడాంశాలకు గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రికార్డుస్థాయిలో 47 పతకాలు పారా అథ్లెట్లు అందుకోనున్నారు. సైక్లింగ్‌లో 26 పతకాల ఈవెంట్లు (పారా సైక్లింగ్ కలిపి), స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్‌లలో 56 పతకాలు ఈతకొలనులో కొల్లగొట్టనున్నారు. ఈ సారి కొత్తంగా 800 మీటర్ల ఫ్రీస్టయిల్, 1500 మీటర్ల మహిళల ఫ్రీస్టయిల్ రేసుల్ని చేర్చారు. 2026లో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు 11 రోజుల పాటు గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ జరుగనున్నాయి. పది క్రీడాంశాలు జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, వీల్‌చైర్ బాస్కెట్‌బాల్, బాక్సింగ్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్ , బౌల్స్, పారా బౌల్స్ (ఇండోర్), జూడో, నెట్‌బాల్, ట్రాక్ సైక్లింగ్, పారా సైక్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, పారా పవర్‌లిఫ్టింగ్‌లో పోటీలుంటాయి. కామన్వెల్త్ ఎరెనా, సర్ క్రిస్ హో వెలొడ్రోమ్, స్కాటిష్ ఎగ్జిబిషన్ సెంటర్ (ఎస్ఈసీ), స్కాట్స్టౌన్ స్టేడియం, టోల్క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్ వేదికల్లో పది రోజుల పాటు పోటీలు జరుగుతాయి. తొలి రోజు కేవలం ఆరంభ వేడుకలు నిర్వహిస్తారు. -
అలలపై అలా..
సాక్షి, హైదరాబాద్: పోటెత్తే అలలను వీక్షిస్తూ హుస్సేన్ సాగర్‌లో ఇటు నుంచి అటు నడుచుకుంటూ వెళితే ఎలా ఉంటుంది? నీటిపై తేలే బాక్సుల్లో చేరి ఏదో ఒక ఆట ఆడితే ఆ థ్రిల్ ఎలా ఉంటుంది? అర్ధరాత్రి దాటిన తర్వాత స్ట్రీట్ ఫర్నిచర్ వద్ద నింగిని తాకే ఫౌంటేన్ వెల్లువను చూస్తూ గడపడం చక్కటి అనుభూతినిస్తుంది కదా. అంతేకాదు, సాగర్ చుట్టూ సైకిల్ తొక్కవచ్చు. హాయిగా నడుచుకుంటూ ఎక్కడికంటే అక్కడికి వెళ్లొచ్చు. అందమైన పార్కుల్లో సేదతీరొచ్చు. పార్టీలు, ఫంక్షన్లు, విందులు, వినోదాలు, ఆటా పాటలు వెరసీ.. ఒక అద్భుతమైన నైట్‌లైఫ్. నగరవాసులకే కాదు. దేశ విదేశాలకు చెందిన పర్యాటకులను సైతం ఆకట్టుకొనేలా హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కైవాక్, సైకిలింగ్, ఎంటర్టైన్మెంట్, నైట్‌లైఫ్ షాపింగ్ వంటి సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అనుబంధ హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (హుమ్టా) ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, బాబాసాహెచ్ అంబేడ్కర్ భారీ విగ్రహం, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, సంజీవయ్య పార్కు, లేక్‌వ్యూ పార్కులతో ఆకట్టుకుంటున్న ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు ప్రాంతాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు హుమ్టా దృష్టి సారించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక ఎంటర్టైన్మెంట్ డిజైన్లను రూపొందించింది. స్కైవాక్, సైక్లింగ్.. హుస్సేన్‌సాగర్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో స్కైవాక్, సైకిల్ ట్రాక్ నిర్మించనున్నారు. ఈ ట్రాక్ అటు ట్యాంక్‌బండ్, సంజీవయ్య పార్కు నుంచి ఇటు ఐమాక్స్ థియేటర్ వరకు, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌కు కనెక్టివిటీని కలిగి ఉంటుంది. పర్యాటకులు ట్యాంక్‌బండ్ మీ దుగా ఇందిరా పార్కుకు వెళ్లేందుకు అనుగుణంగా నిర్మి స్తారు. ఇలా నలువైపులా కనెక్టివిటీ ఉండడంతో పర్యాటకులు అన్ని వైపులా రాకపోకలు సాగిస్తారు. సైకిలింగ్ పట్ల అభిరుచి ఉన్నవాళ్లకు ప్రత్యేకంగా పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేసి సైకిళ్లను అందుబాటులో ఉంచుతారు. సొంత సైకిళ్లను తెచ్చుకోవచ్చు. గంటల చొప్పున అద్దెకు తీసుకోవచ్చు. మొత్తం 5.5 మీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేయనున్న స్కైవాక్‌లో 3.3 మీటర్లు సైకిలింగ్ కోసం కేటాయిస్తారు. అలాగే 10 కిలోమీటర్ల మార్గంలో అక్కడక్కడా రెస్టరెంట్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు ఉంటాయి. సాగర్‌లోంచి రాకపోకలు సాగించేవిధంగా స్కైవాక్, సైక్లింగ్ సదుపాయాలు ఉంటాయి. నైట్‌లైఫ్ ప్లాజాలు.. నెక్లెస్‌రోడ్డు, పీపుల్స్‌ప్లాజా ప్రాంతంలో నైట్‌లైఫ్ షాపింగ్‌లో భాగంగా ప్రత్యేకమైన ఎంటర్టైన్మెంట్ ప్లాజాలను ఏర్పాటు చేయాలని హుమ్టా ప్రతిపాదించింది. పర్యాటకులు రాత్రి వేళల్లో హాయిగా కాలక్షేపం చేసేందుకు వీలుగా స్ట్రీట్ ఫర్నిచర్ ఉంటుంది. రెస్టరెంట్లు, హోటళ్లు రాత్రిపూట అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఉన్న పార్కులతో పాటు అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో మరిన్ని పార్కులను ఏర్పాటు చేయనున్నారు. స్పోర్ట్స్ బాక్సులు.. సింగపూర్‌లోని ఫ్లోటెడ్ ఫుట్‌బాల్ తరహాలో హుస్సేన్‌సాగర్‌లో చిన్న గ్రౌండ్లో ఒక క్రికెట్బాక్సు లేదా ఇతర ఆటలకు అనుగుణమైన బాక్సులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. నీటిపై తేలియాడే వేదికలపై క్రీడాకారులు ఆటలాడుకోవచ్చు. మరోవైపు ఫ్లోటెడ్ ఫౌంటెన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు ప్రశాంతంగా ఫౌంటెన్ చుట్టూ కూర్చొని గడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. ఈ భారీ ప్రాజెక్టుకు సుమారు రూ.500 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. పబ్లిక్ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నిర్మించాలని హుమ్టా ప్రతిపాదించింది. సందర్శకుల నుంచి కొంత మొత్తం రుసుము వసూలు చేస్తారు.చదవండి : భుజంగరావు, రాధాకిషన్‌రావుకు బెయిల్ -
వైజాగ్ లో స్కై సైక్లింగ్
-
పెడల్ పవర్.. సైకిల్ ఫర్ ఎవర్
ఎటువైపు చూసినా ఆకాశమంత ఎత్తైన అద్దాల భవనాలు.. నిత్యం ట్రాఫిక్‌తో కిక్కిరిసిన రహదారులు.. కిలోమీటర్ల మేర బారులు తీరే వాహనాలు.. ఇది నగరంలోని రహదారుల పరిస్థితి.. దీంతో పాటు నగర శివారులోని టెక్ పార్కుల్లోనూ లక్షలాది మంది ఉద్యోగులతో ట్రాఫిక్ సమస్యలు తప్పడంలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇటీవల కొంత కాలంగా వీధుల్లో సైక్లింగ్ ట్రెండ్ నడుస్తోంది. రహదారులకు సమాంతరంగా సైక్లింగ్ ట్రాక్‌లను జీహెచ్ఎంసీ అభివృద్ధి చేసింది. దీంతో టెకీల్లో చాలా మంది సైక్లింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వారంలో కొన్ని రోజులైనా సైకిల్‌పై కార్యాలయానికి వెళ్లాలని కొంత మంది రూల్ పెట్టుకుంటున్నారు. క్లబ్‌లుగా ఏర్పడి వారాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలుకు శ్రీకారం చుడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడటం, ట్రాఫిక్‌లో సమయం, డబ్బు ఆదా, వాతావరణ కాలుష్య నివారణకు ఈ విధానం సహాయపడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టెక్కీలుగా స్థిరపడిన చాలా కుటుంబాల ఇళ్లల్లో కారు, మోటారు సైకిల్‌తో పాటు ఎలక్రి్టక్, గేర్, సాధారణ సైకిల్ తప్పనిసరిగా ఉంటోంది. మెట్రో స్టేషన్లకు, కూరగాయల మార్కెట్‌కు, వాకింగ్‌కో వెళ్లడానికి, ఐదు కిలో మీటర్ల లోపు పనులకు సైకిల్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. వివిధ సైక్లింగ్ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక టూర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక్కో వారం ఒక్కో రకమైన థీమ్ ఉండేలా సెట్ చేసుకుంటున్నారు. వందలాది కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణాలు చేస్తున్నారు. ఆపై ట్రెక్కింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే వారాంతంలో కుటుంబ సభ్యులతో కలసి టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా కారు వెనకన తమ సైకిల్ కట్టుకుని పోతున్నారు. రిసార్ట్, ఫాం హౌస్, ఇతర డెస్టినేషన్‌లో సైక్లింగ్ చేస్తున్నారు.డెడికేటెడ్ ట్రాక్స్ కోసం.. నగరంలోని సైక్లిస్టులంతా ప్రస్తుతం ఉన్న సైకిల్ ట్రాక్‌లను డెడికేటెడ్ ట్రాక్‌లుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కేబీఆర్ పార్క్, హైటెక్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. అయితే సాధారణ వాహనాలు సైతం ఈ సైకిల్ ట్రాక్‌పై నడిపిస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ట్రాక్‌పై పదుల సంఖ్యలో వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌తో నిండిన రహదారిపై సైకిల్ తొక్కాలంటే భయమేస్తుదని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సైక్లింగ్ ట్రాక్స్‌కు బారికేడ్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇలా చేయడంతో మోటారు సైకిళ్లు, ఇతర వాహనాలు సైకిల్ ట్రాక్‌పైకి వచ్చే అవకాశం ఉండదు. దీంతో సైక్లిస్టులు వేగంగా, ధైర్యంగా ముందకు సాగేందుకు వీలుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓఆర్ఆర్ సమీపంలో సోలార్ రూఫ్‌తో ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ దేశంలోనే ప్రత్యేకమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరహాలో నగరాన్ని సైక్లింగ్ సిటీగా తీర్చిదిద్దాలనే డిమాండ్ వినిపిస్తోంది.ఏడేళ్ల నుంచి సైక్లింగ్..చిన్న చిన్న ప్రయాణాలకు సైకిల్‌పైనే వెళతాను. ఏడేళ్ల నుంచి క్రమం తప్పకుండా సైక్లింగ్ చేస్తున్నాను. ప్రతి మహిళ సైక్లింగ్ చేయాలి. ఆరోగ్యం పరంగా చాలా ఉపయోగాలున్నాయి. ఇతరులపైఆధారపడకుండా స్వతహాగా బయటకు వెళ్లి కూరగాయలు, పాలు, ఇతర సామాగ్రి తెచ్చుకుంటా. ఆఫీస్‌కి వెళ్లేందుకు మెట్రో వరకూ సైకిల్‌పైనే వెళతాను. సరికొత్త మోడళ్లు..ప్రధానంగా టెక్ వీధుల్లో వివిధ మోడల్ సైకిళ్ల హవా కనిపిస్తోంది. మెట్రో స్టేషన్ల నుంచి తమతమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఉద్యోగులు సైకిళ్లను వినియోగిస్తున్నారు. ఎత్తుపల్లాలు ఉన్నా సైక్లిస్టులకు ఇబ్బంది లేకుండా బ్యాటరీ, గేర్ సైకిళ్లు అందుబాటులో ఉంటున్నాయి. రహదారికి సమాంతరంగా ఉన్నపుడు సైకిల్ తొక్కడం, ఎత్తు ఉన్నపుడు బ్యాటరీతో నడిపిస్తున్నారు. ఈ విధానం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కొనుక్కోవడం ఇష్టం లేకుండా, తమకు నచ్చినప్పుడు సైకిల్ సవారీ చేయడానికి అద్దె ప్రాతిపదికన వందలాది సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. టైం పాస్ కోసం.. సైక్లింగ్ టైం పాస్ కోసం ప్రారంభించాను. 10 కిలో మీటర్లు సైకిల్‌పై వెళ్లడానికి కష్టంగా ఉండేది. క్రమంగా అసోసియేషన్ సభ్యులతో సంబంధాలు ఏర్పడ్డాయి. సైక్లింగ్ వల్ల లాభాలపై అవగాహన వచి్చంది. ఇప్పుడు 100 కిలో మీటర్ల వరకూ వెళ్లిపోతున్నాం. వీలైతే ట్రెక్కింగ్ చేస్తున్నాం. సొంతంగా ఎస్కేప్ అండ్ ఎక్స్ప్లోర్ క్లబ్ స్థాపించాను. వారాంతంలో టూర్ ప్లాన్ చేస్తుంటాం. – అశోక్, ఎస్కేప్ అండ్ ఎక్స్ప్లోర్ నిర్వాహకులు21 వేల మంది సభ్యులు.. 2011లోనే సైక్లింగ్ రివల్యూషన్ ప్రారంభించాము. సాఫ్ట్వేర్ కంపెనీల్లో పర్యావరణం, ఆరోగ్యం, సమయం, డబ్బు ఆదాపై అవగాహన కల్పించాం. హైదరాబాద్ బైస్కిల్ క్లబ్‌ను స్థాపించాం. ప్రస్తుతం ఇందులో 21 వేల మంది సభ్యులున్నారు. 60 ఏళ్ల వయసులో లండన్ నుంచి పారిస్ వరకూ 518 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లాను. మూడున్నర రోజులు పట్టింది. ఢిల్లీ, ఛంఢీఘర్, చెన్నైలోనూ సైక్లింగ్ అసోసియేషన్స్ స్థాపించాం. సుమారు 6 వేల సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఏడేళ్ల క్రితం ఓఆర్ఆర్ సమీపంలో సైకిల్ ట్రాక్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించాం. 23 కిలోమీటర్ల సోలార్ రూఫ్ ట్రాక్ సిద్ధమైంది. – మనోహర్, ప్రపంచ సైక్లింగ్ సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ -
Nagalakshmi: సైక్లింగ్ ఫిఫ్టీస్!
సాక్షి, సిటీబ్యూరో: ఓ వయసు దాటాక సాధారణంగా ఇంట్లో ఉండి.. మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు.. లేదంటే పుణ్యక్షేత్రాలు చుట్టొస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమలోని చిన్ననాటి అభిలాషను నెరవేర్చుకుంటారు. ఆ కోవకే చెందుతారు.. డాక్టర్ నాగలక్ష్మి. నిమ్స్ నేచురోపతి విభాగాధిపతిగా పనిచేసిన ఆమె.. 50 ఏళ్ల వయసులో సైక్లింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సాధారణంగా ఆ వయసులో కిలోమీటర్ దూరం నడిస్తేనే అలసిపోతుంటారు. కానీ డాక్టర్ నాగలక్ష్మి మాత్రం అలవోకగా కిలోమీటర్ల మేర సైకిల్‌పై ఎంచక్కా షికారు చేస్తూ, యూత్‌కు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు.ఉదయం నాలుగు గంటలకే..సైక్లిల్ అనగానే ఉదయం నాలుగు గంటలకే మెలకువ వస్తుందని, ఆ వెంటనే రెడీ అయి సైక్లింగ్ చేస్తుంటామని పేర్కొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో సైక్లింగ్ చేస్తామని వివరించారు. మంత్లీ చాలెంజ్లా పెట్టుకుని, 30 రోజులు 30 ప్రదేశాలు వెళ్లాలనే టార్గెట్ పెట్టుకుని మరీ సైక్లింగ్ చేశామని చెప్పారు.శారీరక, మానసిక ఆరోగ్యం..సైక్లింగ్‌తో ఎన్నో లాభాలు ఉంటాయని, శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా, రోజంతా యాక్టివ్‌గా ఉంటామని నాగలక్ష్మి వివరించారు. అంతేకాకుండా హ్యాపీ హార్మోన్లు విడుదల అవుతాయని, దీంతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు.సైకిల్ అంటే ఎమోషన్..చిన్నప్పటి నుంచి తనకు సైకిల్ అంటే ఒక భావోద్వేగమని డా.నాగలక్ష్మి చెబుతున్నారు. చిన్నతనంలో తన తండ్రిని అడిగితే సైకిల్ కొనివ్వలేదని, అప్పటినుంచి ఆ కోరిక అలానే ఉండేదని చెప్పారు. చివరకు తన భర్త, పిల్లలు 50వ పుట్టిన రోజున సైకిల్ కొనిచ్చారని, అప్పటి నుంచి సైక్లింగ్ అలవాటుగా మారిందని వివరించారు. ఒక్కరోజు తాను 7 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లిన విషయాన్ని స్టేటస్ పెట్టుకోవడంతో తన స్నేహితులు ఆశ్యర్యపోయి.. ఆ తర్వాత చాలామంది తమ గ్యాంగ్‌లో కలిసిపోయి చాలా దూరం వెళ్తుండేవారని చెప్పారు. అనంతరం హ్యాపీ హైదరాబాద్ అనే సైక్లింగ్ గ్రూప్‌లో చేరామని వివరించారు. ఆ తర్వాత పైరేట్స్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో 14 మంది స్నేహితులతో గ్రూప్ ఏర్పాటు చేశామని, అప్పటినుంచి కొత్త వారిని కలుస్తూ.. వారితో ఐడియాలు పంచుకుంటూ సైక్లింగ్ చేస్తూ సరదాగా గడుపుతుండేవారిమని పేర్కొన్నారు.ఇవి చదవండి: డాలస్‌లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..! -
దేశం మారనున్న పారిస్ ఒలింపిక్స్ మూడు పతకాల విజేత
మెల్బోర్న్: విశ్వక్రీడల్లో మూడు పతకాలు సాధించిన ఓ అథ్లెట్... వారం రోజుల వ్యవధిలో దేశం మారాలని నిర్ణయించుకొని అభిమానులకు షాక్ ఇచ్చాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగి అద్వితీయ ప్రదర్శనతో మూడు పతకాలు సాధించిన ట్రాక్ సైక్లిస్ట్ మాథ్యూ రిచర్డ్సన్.. అనూహ్య నిర్ణయంతో అభిమానులను విస్మయ పరిచాడు. ఇకపై ఆ్రస్టేలియాకు ప్రాతినిధ్యం వహించబోనని తాను పుట్టి పెరిగిన బ్రిటన్ తరఫున బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. ‘పారిస్’ క్రీడల్లో రిచర్డ్సన్ రెండు వ్యక్తిగత రజతాలు, ఒక టీమ్ కాంస్యం గెలుచుకున్నాడు. 25 ఏళ్ల రిచర్డ్సన్ తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆ్రస్టేలియాకు వలస వచ్చాడు. ‘మాథ్యూ నిర్ణయం అనూహ్యం. చాలా వేదనకు గురయ్యాం. అయితే అతడు మాతృదేశానికి ప్రాతినిధ్యం వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం’ అని ఆ్రస్టేలియా సైక్లింగ్ సమాఖ్య మేనేజర్ జెస్ కోర్ఫ్ తెలిపాడు. ఇదేదో ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదని.. బాగా ఆలోచించి తీసుకున్నదని రిచర్డ్సన్ పేర్కొన్నాడు. ‘ఆస్ట్రేలియాపై గౌరవం ఉంది. అయినా ఇది అనాలోచిత నిర్ణయం కాదు. ఇకపై బ్రిటన్ తరఫున పోటీ పడాలనుకుంటున్నా’ అని రిచర్డ్సన్ పేర్కొన్నాడు. మరోవైపు బ్రిటన్ సైక్లింగ్ సమాఖ్య సోషల్ మీడియా వేదికగా రిచర్డ్సన్కు స్వాగతం పలికింది. -
వెయిట్ లాస్ స్టోరీ: జస్ట్ 90 రోజుల్లోనే ఏకంగా 14 కిలోలు..!
వెయిట్ లాస్ జర్నీ అనేది ఎప్పటికీ ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే బరువు పెరగడం ఈజీగానీ తగ్గడమే బహు కష్టం. పోనీ వర్కౌట్లు, డైటింగ్లు చేసి బరువు తగ్గించుకోగలమా అంటే.. అంత ఈజీ కాదు. కొన్ని రోజుల చేశాక వామ్మో..! అని స్కిప్ చేసేస్తాం. కానీ ఈ వ్యక్తి మాత్రం జస్ట్ 90 రోజుల్లో ఏకంగా 14 కిలోల బరువు తగ్గి చూపించాడు. ఇంతకీ అతడు అన్ని కిలోల బరువు ఎలా తగ్గాడు? ఏంటీ అతడి ఫిట్నెస్ సీక్రెట్ అంటే..పులక్ బాజ్‌పాయ్ జస్ట్ రెండు నెలల్లోనే 14 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆరోగ్యకరమైన డైట్ ఫాలోవుతూ బరువు తగ్గడం విశేషం. అతడి వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందంటే..ప్రతిరోజూ ఆరోగ్యకరమైన డైట్ తీసుకునేవాడట. రాత్రి పదిగంటలకు తేలికపాటి ఆహారాన్ని తీసుకునేవాడనని చెబుతున్నాడు పులక్. చక్కెరకు, అందుకు సంబంధించిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెప్పాడు. అలాగే బయటి ఆహారం, జంక్‌ఫుడ్ కూడా తీసుకోలేదని తెలిపాడు. పండ్లు, బంగాళదుంపలు, బియ్యం వంటి వాటిని మాత్రం తీసుకున్నట్లు వివరించాడు. ఐతే వారంలో ఒక రోజు మాత్రం ఈ కఠిన డైట్‌కి విరామం ఇచ్చి వెజ్ శాండ్విచ్, తేలికపాటి చక్కెరతో కూడిన కోల్డ్ కాఫీ మాత్రం తీసుకునేలా డైట్ ప్లాన్ చేసుకున్నాడు పులక్. దీంతోపాటు సాధారణ వ్యాయామం, సైక్లింగ్ తప్పనిసరిగా చేసేవాడు. రెగ్యులర్ వ్యాయామం, సైక్లింగ్ ఆహార నియంత్రణ, కేలరీలను బర్న్ చేసేందుకు అద్భుతంగా ఉపయోగిపడిందని అంటున్నాడు పులక్. చివరిగా పులక్.. "నిలకడగా బరువు తగ్గాలనే నిర్ణయంపై స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాగే ఆహార నియంత్రణ తోపాటు తీసుకునే విషయంలో శ్రద్ధ వహించడం వంటివి చేస్తే ప్రభావవంతంగా బరువు తగ్గుతాం". అని చెబుతున్నాడు. అంతేగాదు సదా మసులో తాను బరువు తగ్గుతున్నాను, బరువు తగ్గాలి వంటి పాజిట్ ఆటిట్యూడ్‌ని డెవలప్ చేసుకుంటే ఆటోమెటిక్‌గా మన బ్రెయిన్ దాని గురించి ఆలోచిచడం మొదలు పెట్టి డైట్‌ని స్కిప్ చేయాలనే ఆలోచన రానివ్వదని చెప్పుకొచ్చాడు పులక్.(చదవండి: ఆమె స్థైర్యం ముందు..విధే చిన్నబోయింది..! ఆస్తమాతో పోరాడుతూ..) -
12 రోజులు.. 5000 కిలోమీటర్లు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ సైక్లింగ్ పోటీల్లో అత్యంత కఠినమైన రేస్ ఎక్రాస్ అమెరికా (వరల్డ్ అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ) సైక్లింగ్ ఈవెంట్. దీనికి అర్హత సాధించానని హైదరాబాద్ బండ్లగూడకు చెందిన రవీందర్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 10 నుంచి సైక్లింగ్ పోటీలు ప్రారంభం కానున్నాయన్నారు. భారత్ నుంచి తొలిసారి ఈ పోటీల్లో పాల్గొంటున్న తొలి వ్యక్తి తానేనని, 12 రోజులు, 12 నగరాల మీదుగా 5 వేల కిలో మీటర్ల నిరంతరాయంగా సైక్లింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.ఈస్ట్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రారంభమై న్యూజెర్సీలో ముగుస్తుందన్నారు. ప్రపంచంలో 60 ఏళ్ల పైబడిన వారు ఇద్దరు, 50 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసులో 5 గరు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి ప్లస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో ఈ సైక్లింగ్ ఉంటుందన్నారు. పేద పిల్లలకు ఫండ్ రైజింగ్‌లో భాగంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారని, గతంలో 29 మంది సైక్లిస్టులు రూ.100 కోట్ల ఫండ్ రైజ్ చేశారని గుర్తుచేశారు.గతంలో రేస్ ఎక్రాస్ ఇండియా, రేస్ ఎక్రాస్ ఆసియా పోటీల్లో విజేతగా నిలిచానని తెలిపారు. రేస్ ఎక్రాస్ అమెరికా ఈట్లోనూ 50 ఏళ్ల కేటగిరిలో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ముందస్తు ట్రయల్స్‌లో భాగంగా ప్రస్తుతం అమెరికాలో సైక్లింగ్ చేయనున్న రూట్లో ట్రయల్ వేస్తున్నారు.ఇవి చదవండి: Singer Smita: ఓల్డ్ స్కూల్ బృందావనం! నగరంలో కొత్త కాన్సెప్ట్.. -
వాకింగ్ చేస్తే మోకాళ్లు అరిగిపోతాయా?
ఆర్థరైటిస్ కారణంగా మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు తాము వాకింగ్ చేస్తే తమ మోకాళ్లు మరింతగా అరిగిపోతాయని అపోహపడుతుంటారు. ఇది వాస్తవం కాదు. నిజానికి మోకాళ్ల కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ అంత బాగా రక్తప్రసరణ అవుతుంటుంది. దాంతో కీళ్లకు పోషకాలు బాగా అందడమే కాకుండా కండరాలూ, ఎముకలు బాగా బలపడతాయి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారే కాకుండా, మధ్యవయసుకు వచ్చిన ఆరోగ్యవంతులందరూ వెంటనే వాకింగ్ మొదలుపెట్టడం మంచిది. సైక్లింగ్ వల్ల మోకాళ్లు మరింత అరుగుతాయనుకుంటారు కానీ ఒంటి బరువు పడకపోవడంతో సైక్లింగ్ కూడా మంచిదే. శరీరం బరువు మోకాళ్ల మీదా, తమ కాళ్ల మీద పడదు కాబట్టి స్విమ్మింగ్ కూడా మంచి ఎక్సర్సైజ్. పైగా స్విమ్మింగ్‌లో కేవలం మోకాళ్లకే కాకుండా ఒంటికంతటికీ మంచి వ్యాయామం సమకూరుతుంది. -
దేశం వద్దు పొమ్మంది.. అయినా పట్టువీడలే! సాహసం చేసి మరీ..
ఫరీబా హషిమి, యుల్డుజ్ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు. వారిద్దరికి చిన్నతనం నుంచి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఒలింపిక్స్‌లో తమ దేశం తరుపన సత్తాచాటాలని ఎన్నో కలలు కన్నారు. విశ్వవేదికపై తమ జాతీయ జెండాను రెపరెపలాడించాలని తహతహలడారు. కానీ విధి మాత్రం మరోలా తలపిచింది.సొంత దేశమే వారికి అండగా నిలవలేదు. వారి కలను ఆదిలోనే తుంచేయాలని అక్కడి పాలకులు నిర్ణయించారు. మహిళలలు క్రీడల్లో పాల్గోకూడదని ఆంక్షలు విధించారు. కానీ ఆ అక్కచెల్లెల్లు మాత్రం ఎక్కడా నిరాశచెందలేదు. విశ్వక్రీడలే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఏకంగా దేశాన్ని విడిచి మరి ఒలిపింక్స్‌లో సత్తాచాటేందుకు సిద్దమయ్యారు. తమ కలలను మరో వారం రోజుల్లో సాకారం చేసుకునేందుకు ఉర్రూతలూగుతున్నారు. ఇదింతా ఏ దేశమే కోసమో ఇప్పటికే మీకు ఓ అంచనా వచ్చి ఉంటుంది. అవును మీరు అనుకున్నది నిజమే. ఆ దేశమే తాలిబాన్లు పరిపాలిస్తున్న అఫ్గానిస్తాన్. ప్యారిస్ ఒలిపింక్స్ నేపథ్యంలో ఈ అఫ్గాన్ సైక్లిస్ట్ సిస్టర్ల స్టోరీపై ఒ లుక్కేద్దాం.అఫ్గాన్ ధీర వనితలు..2021లో అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు ఆధీనంలో తీసుకున్నాక మహిళలు క్రీడల్లో పాల్గొనడంపై నిషేధం విధించారు. ఈ క్రమంలో ఫరీబా హషిమి, యుల్డుజ్ తమ కలలను సాకారం చేసుకునుందుకు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్న తమ దేశ సైక్లిస్ట్ల తరలింపు కోసం ఇటలీ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది.దీంతో ఫరీబా, యుల్డుజ్ సైతం ఇటలీ వెళ్లే విమానం ఎక్కారు. అక్కడ వెళ్లాక సరైన కోచింగ్‌ను పొందేందుకు ఇటలీలోని సైక్లింగ్ టీమ్‌లో ఈ అఫ్గాన్ సోదరిలు చేరారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్‌లో ఏవోసీ(అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) ప్యారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ ఆరుగురు సభ్యులతో కూడిన అఫ్గాన్ జట్టును ప్రకటించింది. అందులో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ జాబితాలో ఫరీబా హషిమి, యుల్డుజ్లు చోటుదక్కించుకున్నారు. దీంతో ఒలిపింక్స్‌లో పాల్గోవాలన్న తమ కలను నేరువేర్చుకునేందుకు ఈ అక్కచెల్లెల్లు అడుగు దూరంలో నిలిచారు.మాకంటూ ప్రత్యేకమైన బలమేమి లేదు. మాకు మేమే బలం. నేను ఆమెకు ధైర్యంగా ఉంటాను. ఆమె నాకు సపోర్ట్‌గా ఉంటుంది: యుల్డుజ్ఒలింపిక్స్లో పాల్గోనే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. మేము సాధించిన ఈ ఘనతను అఫ్గానిస్తాన్ మహిళలకు అంకితమివ్వాలనకుంటున్నాము. ఎందుకంటే వారి వాళ్లే మేము ఒలింపిక్స్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాము. మా హక్కులను కాలరాసినప్పటకి, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలమని నిరూపించాం. ఈ విశ్వక్రీడల్లో మేము 20 మిలియన్ల ఆఫ్ఘన్ మహిళల తరపున ప్రాతినిథ్యం వహిస్తాము: ఫరీబా -
"టూర్ డి ఫ్రాన్స్" టైటిల్ గెలిచిన బినియం గిర్మే.. తొలి ఆఫ్రికన్‌గా రికార్డు
ట్యురిన్‌లో జరిగిన సైక్లింగ్ పోటీల్లో ఎరిట్రియాకు చెందిన బినియం గిర్మే చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మకమైన టూర్ డి ఫ్రాన్స్ (ఫ్రాన్స్‌లో జరిగే పురుషుల మల్టీ స్టేజ్ సైకిల్ రేసు) స్టేజ్ టైటిల్ గెలిచిన తొలి నల్లజాతి ఆఫ్రికన్ రైడర్‌గా రికార్డు నెలకొల్పాడు. సోమవారం జరిగిన మూడో దశ స్ప్రింట్‌లో గిర్మే విజయం సాధించాడు. ఇంటర్‌మార్చే వాంటీ జట్టుకు చెందిన గిర్మే.. ఫెర్నాండో గవిరియా, ఆర్నాడ్ డి లీ కంటే ముందే రేస్ ఫినిష్ చేసి టైటిల్ గెలిచాడు.Biniam Girmay makes history as the first African rider to win a Tour de France stage🇪🇷 pic.twitter.com/AB8xvzyxox— Typical African (@Joe__Bassey) July 3, 202424 ఏళ్ల గిర్మేకు ఇది రెండో టూర్. గిర్మే 2022లో గిరో డి'ఇటాలియా స్టేజ్ టైటిల్ గెలిచాడు. మరోవైపు టూర్ డి ఫ్రాన్స్‌లో రిచర్డ్ కరాపాజ్.. తదేజ్ పొగాకర్ నుంచి పసుపు జెర్సీని (రేస్ లీడర్) దక్కించుకున్నాడు. తద్వారా కరాపాజ్ ఈ ఘనత సాధించిన మొదటి ఈక్వెడారియన్గా రికార్డుల్లోకెక్కాడు. ఇంకో వైపు గిర్మే గెలుపుతో స్టేజ్ విజయాల రికార్డు బద్దలు కొట్టాలన్న మార్క్ కావెండిష్ ఆశలు అడియాశలయ్యాయి.టూర్ డి ఫ్రాన్స్ గెలిచిన అనంతరం గిర్మే మాట్లాడుతూ.. నేను సైక్లింగ్ ప్రారంభించినప్పటి నుండి ఈ టైటిల్ గురించి కలలు కంటున్నాను. రెండో ప్రయత్నంలోనే టైటిల్ గెలవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది వ్యక్తిగతంగా నాకు, నా ప్రాంతానికి (ఆఫ్రికా) గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. -
ఇక ఎంత దూరం తొక్కినా నొప్పి లేని సైక్లింగ్
‘వెబ్స్ రైడర్’.. ప్రపంచంలోని మొట్టమొదటి వర్చువల్ యాక్సిస్ సైకిల్ సీటు. ఇది మరింత సౌకర్యవంతమైన రైడ్ కోసం ఉపయోగపడుతుంది. సైకిల్‌కు గల ఈ సీటుపై కూర్చుని పెడల్ తొక్కుతున్నప్పుడు శరీర బరువును ఇరువైపులా సమానంగా పంపిణీ చేసి, దానిని తొక్కుతున్న వ్యక్తి శరీరంలోని సీటు దగ్గర ఏమాత్రం నొప్పి కలుగకుండా చూస్తుంది. ఆస్ట్రేలియన్ ఇంజనీర్ రాబిన్ మకాన్ మరింత సౌకర్యవంతమైన సైకిల్ సీటును రూపొందించేందుకు ప్రయత్నిస్తుండేవాడు. మానవ శరీరంలోని స్వాభావిక నొప్పి పాయింట్లను సైకిల్‌కు ఉన్న కుషనింగ్ సీటు భర్తీ చేయలేదనే విషయాన్ని గమనించిన ఆయన శరీర బరువును ఇరువైపులా సమానంగా పంపిణీ చేసే సైకిల్ సీటును రూపొందించే దిశగా ముందుకు సాగాడు.తాను రూపొందించిన నమూనాను ‘ఇన్వెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనే సంస్థకు తెలియజేశాడు. ఇది నూతన ఆవిష్కర్తలకు మద్దతును అందించే స్వచ్ఛంద సంస్థ. అక్కడ రాబిన్ మకాన్ పారిశ్రామిక డిజైనర్ ఫిలిప్ గుయిచార్డ్ను కలుసుకున్నాడు. వీరిద్దరూ ఈ రెండేళ్ల పాటు కష్టపడి ఈ డిజైన్‌ను మరింతగా మెరుగుపరిచారు. ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ విజిల్ సహకారంతో వారు రూపొందించిన ‘వెబ్స్ రైడర్’ మార్కెట్లోకి తీసుకువచ్చారు.ఈ వెబ్రైడర్ స్ప్లిట్ సైకిల్ సీటు వినియోగదారులకు అత్యంత సౌకర్యవంతమైన సైకిల్ రైడ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ సీటుపై కూర్చుని సైకిల్ తొక్కుతున్నప్పుడు రెండు కాళ్లు సమానంగా కలిలేందుకు వీలు కల్పిస్తుంది. సీటు ఎముకల నుండి తొడ ఎముకలకు ఒత్తిడిని బదిలీ చేసి, కాళ్లకు నొప్పి కలుగుకుండా చూస్తుందని రాబిన్ మకాన్ తెలిపారు. This revolutionaly bike seat design.[🎞️ AtaraxyBSC]pic.twitter.com/cLOV3MWmuw— Massimo (@Rainmaker1973) June 11, 2024 -
సైక్లింగ్‌తో మెకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ప్రమాదాలకు చెక్!
ఆర్థరైటిస్ అనేది కీళ్ళను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల పుండ్లు పడడం, కీళ్ళు గట్టిగా మారడం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఆర్థరైటిస్‌లో 100 కంటే ఎక్కువ స్టేజెస్ ఉంటాయి. ప్రతిది కూడా వేర్వేరు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇది పిల్లలు, యువకులనూ కూడా ప్రభావితం చేస్తుంది. అలాంటి సమస్యలకు సైక్లింగ్ చెక్ పెడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అసలు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఈ సైక్లింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుందనేది ఈ పరిశోధనలో సవివరంగా తెలిపింది. శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో జీవితంలో కనీసం ఒక్కసారైన సైక్లింగ్ చేసే అలవాటు ఉన్నవారికి మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశం 17% తక్కువగా ఉందని, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం 21% తక్కువగా ఉందని వెల్లడయ్యింది. అందుకోసం 60 ఏళ్ల లోపు సుమారు రెండు వేలకు పైగా వ్యక్తుల డేటాను విశ్లేషించి మరీ పేర్కొంది. ఈ పరిశక్షధన మెడిసిన్ అండ్ సైన్స్‌లో ప్రచురితమయ్యింది. స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్లో ఆరుబయట చేసే సైక్లింగ్ మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులను నివారిస్తుందని గుర్తించారు శాస్త్రవేత్తలు. తమ పరిశోధనల ఆధారంగా జీవితాకాలంలో సైకిల్ తొక్కడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గడం తోపాటు మెరుగైన మోకాలి ఆరోగ్యం ఉంటుందని, పైగా ఈ ప్రమాదం బారినపడే అవకాశం తక్కువగా ఉంటుందని రుమాటాలజీ చీప్ డాక్టర్ గ్రేస్ అన్నారు. అంతేగాదు ఎక్కువ సమయం సైకిల్‌పై గడిపితే అతడు లేదా ఆమెకు మోకాళ్ల నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. అలాగే 12 నుంచి 50 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు వారి డేటాను ట్రాక్ చేయగా వారిలో సగానికిపైగా మంది సైక్లింగ్ని తమ రోజువారి వ్యాయమంలో భాగం చేసినట్లు తెలిపారు. వారందరిలో క్వాడ్రిస్ప్లు బోలపేతమయ్యాయని అన్నారు. వారంతా సైక్లింగ్ని మానేసిన తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగిందన్నారు. సైక్లింగ్ వల్ల కలిగే లాభాలు..రన్నింగ్ లేదా జంపింగ్ వంటి అధిక ప్రభావ వ్యాయామాలతో పోలిస్తే సైక్లింగ్ అనేది ప్రభావ చర్య కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలగజేస్తుంది. మోగాలి గాయాల ప్రమాదాన్ని తగ్గిండానికి, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.మోకాళ్ల చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా క్వాడ్రిస్ప్స్, హామ్ స్ట్రింగ్స, కండరాలు బలంగా ఉన్నప్పుడు, మోకాలి కీలుకు మెరుగైన మద్దతునిచ్చి, తద్వారా గాయలయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.క్రమం తప్పకుండా సైకిల్ నడుపుతున్నప్పుడు కదలికల పరిధిని నిర్వహించడానికి, మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పెడలింగ్ సైనోవియల్ ద్రవం ప్రవాహంలో సహాయపడుతుంది. ఇది కీళ్ల సరళతకు తోడ్పడుతుంది.అలాగే బరువు నిర్వహణలో సహాయపడుతుంది. శరీరంలోని కేలరీలను బర్న్ చేయడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సైక్లింగ్ మంచి మార్గం. అధిక బరువు మోకాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. అందువల్ల, సైక్లింగ్ ద్వారా మీ బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. ఇది ఒత్తిడిని తగ్గించడంలో, మోకాలి సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.(చదవండి: ఆ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే బరువు తగ్గుతారు! పోషాకాహార నిపుణులు) -
భూగర్భ గనుల్లో సైకిల్ తొక్కితే ఎలా ఉంటుందంటే.?
-
జాబ్ కోసం సైకిల్ తొక్కుతున్న ఇంజినీర్లు!
ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజ్ మరే ఉద్యగానికి ఉండదు. చిన్న ఉద్యోగమైనా చాలు లైఫ్ సెటిల్ అవుతుందని యువత భావిస్తుంటారు. అయితే కేరళ రాష్ట్రంలో ఉన్నత విద్యార్హత ఉన్న అభ్యర్థులు చాలా కిందిస్థాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు. కేరళలో ప్రభుత్వ కార్యాలయాలలో ప్యూన్ ఉద్యోగానికి అవసరమైన అర్హత 7వ తరగతి ఉత్తీర్ణత. దీంతోపాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. (టీసీఎస్‌లో మరో కొత్త సమస్య! ఆఫీస్‌కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..) ప్యూన్ ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండకూడదని నిబంధన ఉన్ననప్పటికీ చాలా మంది బీటెక్ గ్రాడ్యుయేట్లు, ఇతర డిగ్రీ ఉత్తీర్ణులు ఏటా దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సైకిల్ పరీక్ష కోసం వరుసలో ఉంటున్నారు. గత రెండు రోజులుగా ఆ రాష్ట్రంలోని వివిధ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో డిగ్రీలు ఉన్న యువకులు సైకిల్‌తో వచ్చి తమ వంతు కోసం వేచి ఉంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ భద్రతే కారణం ప్రైవేటు ఉద్యోగాలంటే ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడతాయో తెలియదు. అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే భద్రత ఉంటుందని యువత భావిస్తున్నారు. దీంతో కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దశాబ్దాలుగా అధిక డిమాండ్ ఉంది. అంతేకాకుండా పెళ్లిళ్ల విషయంలోనూ ప్రభుత్వ ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత ఉండటం మరో కారణం. ప్యూన్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి ప్రారంభ జీతం దాదాపు రూ. 23వేలు ఉంటుంది. దరఖాస్తుల్లో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను అక్టోబర్ 26, 27 తేదీల్లో సైక్లింగ్ పరీక్షకు పిలిచారు. గతంలో ఆఫీసు అసిస్టెంట్లు విధుల్లో భాగంగా సైకిళ్లపైనే వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడా అవసరం లేకపోయినప్పటికీ, ప్యూన్ పోస్టుల కోసం ఇప్పటికీ సైక్లింగ్ పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ పోస్టులకు అభ్యుర్థులు దరఖాస్తు సమయంలోనే తమకు ఎటాంటి డిగ్రీ లేదని డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ అధికారి ఒకరు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. డిగ్రీ లేని వ్యక్తులు కేరళ రాష్ట్రంలో అరుదుగా కనిపిస్తారని చెప్పారు. సైక్లింగ్ పరీక్ష పూర్తయిన తర్వాత, ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగార్థులు ఉండే రాష్ట్రాల్లో కేరళ ఒకటి. -
స్కిప్పింగ్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్లిందిగా ఈ డ్యాన్సర్!
స్కిప్పింగ్ అదేనండి తాడాట అందరికి తెలిసింది. ముఖ్యంగా ఆడపిల్లలు ఎంతో ఇష్టంగా ఆడే ఆట. చాలా మంది పలురకాలుగా స్కిప్పింగ్ చేస్తారు. కానీ ఈ డ్యాన్సర్ చేసిన స్కిప్పింగ్‌ని చూస్తే మాటల్లు లేవు అనాల్సిందే!. ప్రత్యేకతను చాటుకోవాలనుకునే వారికి సాధ్యం కానిదేది ఉండదు అంటే ఇదేనేమో! స్కిప్పింగ్ రోప్ (తాడాట) అనేది అసాధ్యమైనదేమీ కాదు. అందరూ చేసేదే. అయితే భోపాల్‌కు చెందిన డాన్సర్, ఆర్టిస్ట్ బుష్రా తాడాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఖాళీ రోడ్డు మీద సైకిలింగ్ చేస్తూనే తాడాట ఆడుతూ ‘ఆహా’ అనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. ‘సూపర్బ్ బ్రిలియెంట్ టాలెంట్’ ‘దిస్ ఈజ్ వెరీ రిస్కీ సిస్టర్. ప్లీజ్ బీ కేర్‌ఫుల్’ ఇలా రకరకాల కామెంట్స్ కనిపించాయి. View this post on Instagram A post shared by 🍁 B_ush_ra🍁 (@iamsecretgirl023) (చదవండి: ఔరా అండర్ వాటర్ గార్బా) -
సైక్లింగ్‌తో స్ఫూర్తి నింపుతూ...
సాక్షి, వరంగల్: ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదని అందరూ అంటారు. కానీ కొందరు మాత్రమే ఆరోగ్యంకోసం తపిస్తారు. ఆదాయం వేటలోపడి ఆరోగ్యాన్ని మరచిపోతారు. అయితే యుక్త వయసులోనే రంజిత్ కుమార్ దవేరాకు ఆరోగ్యం ఎంత విలువైనదో తెలియజెప్పింది కరోనా... మార్చిన మహమ్మారి... కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఆ మహమ్మారి బారిన పడిన నాన్న రాములే కాదు...కళ్లెదుటే ఎంతో మంది చనిపోవడం వరంగల్ గిర్మాజీపేటకు చెందిన ఈ డీఫార్మసీ గ్రాడ్యుయేట్‌ను కదిలించింది. సరైన శారీరక శ్రమ లేక వ్యాధినిరోధకత కోల్పోయి ఈ మహమ్మారికి బలయ్యారని ఆయనకు అవగతమైంది. దీంతో ప్రతిఒక్కరిలో ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలన్న ఆలోచన కలిగించడమే లక్ష్యంగా సైక్లింగ్ వైపు రంజిత్ అడుగులు పడ్డాయి. అలా 2021 ఏప్రిల్ 5న మొదలైన ‘రంజిత్ ఆన్ వీల్స్’సైక్లింగ్....దశలవారీగా రాష్ట్రాలు దాటింది. ఇప్పుడు ఏకంగా ఖండాంతరాలు దాటింది. ఏ ఉద్దేశంతో ఈ సైక్లింగ్ మొదలెట్టాడో... ఇప్పుడు అదీ కార్యాచరణ రూపంలో కనిపించడం ఎంతో సంతృప్తిగా ఉందని అంటున్నాడు రంజిత్. దాదాపు 500 మంది వరకు తనను చూసి స్ఫూర్తి పొందారని మలేసియాలో సైక్లింగ్ కొనసాగిస్తున్న రంజిత్ ‘సాక్షి’కి తెలిపారు. తనను ఆగస్టు 15న మలేసియా ఇండియన్ హైకమిషన్ సత్కరించడం సంతోషం కలిగించిందన్నాడు. అలా మొదలైంది... 2021 ఏప్రిల్ ఐదున హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు మొదలైన సైక్లింగ్...దాదాపు 3,000 కిలోమీటర్లు తిరిగి హైదరాబాద్‌లోనే జూన్ 14న ముగిసింది. మళ్లీ జూలై 17న ప్రారంభించి హైదరాబాద్ నుంచి లడఖ్ వరకు సైక్లింగ్ చేశాడు. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, లదాఖ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా తిరిగి అక్టోబర్ 22న హైదరాబాద్‌లో ముగిసింది. ఈ సమయంలోనే రంజిత్ సినీ హీరో సోనూసూద్‌ను కలిశాడు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి చైనా సరిహద్దు వరకు పెంపుడు శునకం భగీరతో కలిసి రంజిత్ సైక్లింగ్ చేశాడు. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా, అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్,అస్సాం, వెస్ట్‌బెంగాల్, సిక్కింల నుంచి నథులాపాస్‌లో చైనా బార్డర్ వరకు వెళ్లాడు. గత 2022 ఫిబ్రవరి 8న మొదలైన ఈ ఆరువేల కిలోమీటర్ల యాత్ర జూలై 25న ముగిసింది. ఆ్రస్టేలియా వైపుగా... హైదరాబాద్ నుంచి వియత్నాంకు రోడ్డు మార్గాన వెళ్లే అవకాశం లేకపోవడంతో 2023 మే ఐదున శంషాబాద్ విమానాశ్రయంలో సైకిల్ ప్యాక్ చేసుకొని వియత్నాం వెళ్లాడు. అక్కడ హానోయ్ సిటీ నుంచి హోచి మిన్హ్ వరకు దాదాపు మూడు వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి, ఆ తర్వాత కాంబోడియాలోకి ప్రవేశించి 900 కిలోమీటర్లు, థాయ్‌లాండ్‌లో 2,200 కిలోమీటర్లు, మలేసియాలో 400 కిలోమీటర్లు దాటి ప్రస్తుతం కౌలంలంపూర్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత సింగపూర్, ఇండోనేసియా, జకార్తాకు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాకు విమానం ద్వారా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేస్తాడు రంజిత్. 2021 ఏప్రిల్ ఐదు నుంచి ఇప్పటివరకు 22 వేల కిలోమీటర్ల మార్క్ చేరుకున్నాడు. ఆసియా, ఆ్రస్టేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో సైక్లింగ్ చేసే దిశగా ముందుకు వెళుతున్నానని వెల్లడించాడు. సోషల్ మీడియాతో మరింత క్రేజ్ సైక్లింగ్ చేస్తున్న సమయంలో రంజిత్ తీస్తున్న వీడియోలు, ఫొటోలు తనకు సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్స్‌ను తెస్తున్నాయి. ‘రంజిత్ ఆన్ వీల్స్’ఫేస్బుక్ పేజీలో 40,000 మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 3,15,000 మంది, యూట్యూబ్‌లో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా సైక్లింగ్ చేస్తూనే...ఇంకోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా రంజిత్ ఎంతో మందిని చైతన్యవంతం చేస్తున్నారు. -
ఈ–సైకిళ్ల జోరు.. ప్రయాణంలో హుషారు
సాక్షి, అమరావతి: భారతదేశంలో సైక్లింగ్‌పై మక్కువ పెరుగుతోంది. కరోనా తర్వాత ఆరోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ స్పృహతో చాలామంది సైకిళ్లను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో ఈ–సైకిళ్ల వాడకం జోరందుకుంది. సంప్రదాయ శిలాజ ఇంధనాలను విడుదల చేసే వాహనాలు తక్కువ దూరం ప్రయాణించడంలో పర్యావరణాన్ని దెబ్బతీయడంతోపాటు రవాణాకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ–సైకిళ్లే భవిష్యత్‌గా గుర్తించిన కంపెనీలు బహుళార్థ సాధక ప్రయోజనాన్ని కలిగేలా డిజైన్లు చేస్తున్నాయి. కొన్ని మెట్రో సిటీలు, నగరాల్లో సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు రోడ్లపై ప్రత్యేక పాత్‌వేలు నిర్మిస్తుండటం విశేషం. యాప్ సాయంతో కంట్రోల్ టెక్ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీలు ఈ–సైకిళ్లలో కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నాయి. యాప్ సాయంతో నియంత్రించే ఈ–సైకిల్, ఈ–బైక్‌లు మార్కెట్లోకి వచ్చేశాయి. మొబైల్ ఆధారిత యాప్‌ల ద్వారా వినియోగదారులకు వారి వేగం, దూరం, కేలరీలు కరిగిపోవడం, హృదయ స్పందన రేటుపై రియల్ టైమ్ అప్డేట్లను అందిస్తున్నాయి. వాస్తవానికి దేశంలో ఈ–సైకిళ్లు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ వాటి కొనుగోళ్లు ఏటా రెట్టింపు అవుతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ), క్లిన్వెల్డ్ పీట్ మారి్వక్ గోర్డెలర్ (కేపీఎంజీ) నివేదిక ప్రకారం త్వరలోనే భారతదేశ ఈ–సైకిల్ మార్కెట్ మిలియన్ యూనిట్లకు పైగా ఉంటుందని అంచనా. గ్లోబల్ ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్ పరిమాణం 2021లో 18.58 బిలియన్ల డాలర్ల నుంచి 2028లో 52.36 బిలియన్ల డాలర్లకు వృద్ధి చెందడంతోపాటు భారతదేశంలో ఈ–సైకిల్ మార్కెట్ విలువ 2021లో 1.02 మిలియన్ డాలర్ల నుంచి 2026 నాటికి 2.08 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తర్వాత సైక్లింగ్ గణనీయంగా పెరుగుతుందనడానికి ఉదాహరణ.. యూరప్ మొత్తం పరిశ్రమల్లో 50 శాతం కంటే ఎక్కువ ఈ–సైకిళ్లు ఉత్పత్తి కావడమే. సైక్లిస్ట్ ఫ్రెండ్లీ వాతావరణం ప్రస్తుతం దేశంలో చిన్నారులు, యువతతో పాటు మౌంటైన్ బైక్స్ విభాగంలో ఈ–సైకిళ్లలో ఎక్కువ వృద్ధి నమోదవుతోంది. ప్రతిరోజూ దాదాపు 20 కోట్ల మంది ప్రజలు తక్కువ దూరం (20 కిలోమీటర్ల లోపు) ప్రయాణిస్తున్నట్టు సెన్సస్ డేటా చెబుతోంది. ఈ ప్రయాణ విధానానికి ఈ–సైకిల్స్ సరైన పరిష్కారమని పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు. చురుకైన జీవనశైలి, సాహనం, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే పట్టణ వాసులే ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. పాశ్చాత్య నగరాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా సైక్లిస్ట్ ఫ్రెండ్లీ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఈ–సైకిళ్లలో థొరెటల్ అసిస్ట్, పెడల్ అసిస్ట్ అనే రెండు రకాలు ఉన్నాయి. థొరెటల్ అసిస్ట్ అంటే మోటార్‌ను ఆన్ చేస్తే బైక్ పెడల్ చేయకుండా ముందుకు కదులుతుంది. పెడల్ అసిస్ట్ అంటే సైక్లిస్ట్ పెడల్ చేస్తున్నప్పుడు మాత్రమే మోటార్ రన్నింగ్‌లో ఉంటుంది. పెడల్ సహాయక ఎలక్ట్రిక్ బైక్‌లను మనం సంప్రదాయ సైకిల్‌ను తొక్కడంతో పోలి్చనప్పుడు మానవ ప్రయత్నాన్ని 70–80 శాతం వరకు తగ్గిస్తాయి. అయితే ప్రామాణిక మోటార్ బైక్‌లతో పోలిస్తే ఈ–సైకిళ్లు వైరింగ్, డిజైన్, మోటార్/మినీ ఇంజిన్, బ్యాటరీ శక్తి కారణంగా ఖరీదైనవిగా మారుతున్నాయి. ఈ–సైకిల్ ధర ఎక్కువగా దాని గ్రేడ్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. సుమారు రూ.20 వేల నుంచి రూ.1.50 లక్షలకు పైగా పలుకుతోంది. -
అదొక్కటే! ఎన్నో వ్యాయామాలకు సరిసాటి..
వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే విషయం అందరికీ తెలుసు. అయితే అందరికీ వ్యాయామం చేయడం కుదరకపోవచ్చు. కొందరికైతే కనీసం వాకింగ్ చేయడం కూడా కష్టమే అవుతుంటుంది వారున్న పరిస్థితులలో. అలాంటప్పుడు కనీసం ఇండోర్ సైక్లింగ్ లేదా స్టేషనరీ సైకిల్‌తో వ్యాయామం చేసినా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇండోర్ సైక్లింగ్ వల్ల ఏయే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.. ఇండోర్ సైక్లింగ్ శరీరాన్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా గుండె జబ్బుల ముప్పును కూడా తగ్గిస్తుంది ఇండోర్ సైక్లింగ్ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇండోర్ సైక్లింగ్ ఎన్నో రోగాల ముప్పు నుంచి కాపాడుతుంది. ఏరోబిక్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అలాగే హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది మీ గుండె కండరాలను బలోపేతం చేయడానికి, శరీరంలోకి రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయడానికి సహాయపడుతుంది. ఈ వ్యాయామాన్ని స్థిరంగా చేయడం వల్ల రక్త ప్రసరణ, ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. దీంతో అధిక రక్తపోటు పోటు సమస్యలు రావు. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది ఏ రకమైన కదలిక అయినా సరే శరీరానికి ఎంతో మంచి చేస్తుంది. సైక్లింగ్ ఎఫెక్టీవ్ కేలరీల బర్నింగ్ వ్యాయామం. సైక్లింగ్ తో బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం.. 70 కిలోల బరువున్న వ్యక్తి ఇండోర్ సైక్లింగ్ వల్ల 250 నిమిషాల్లో 30 కేలరీలను కరిగించగలడు. అందుకే మీరు బరువు తగ్గాలనుకుంటే జిమ్ముకు బదులుగా ఇంట్లో ఉండి ఇండోర్ సైక్లింగ్ చేస్తే సరి! అంతేకాదు ఈ సైకిల్‌ను తొక్కడం వల్ల మీ కాలి కదలికలు మెరుగుపడతాయి. ఫలితంగా కాళ్లలోని కండరాల సమూహాలు – క్వాడ్రిసెప్స్, గ్లూట్స్, తొడ కండరాలు కాలక్రమేణా బలంగా, టోన్ అయ్యేలా చేస్తాయి. ఇండోర్ సైక్లింగ్ మీ కీళ్లకు మంచిది ఇండోర్ సైక్లింగ్ ప్రభావవంతమైన తక్కువ–ప్రభావ వ్యాయామంగా పరిగణించబడుతుంది. ఇది వృద్ధులకు, మోకాలి, కీళ్ల నొప్పులు ఉన్నవారికి బాగా సహాయపడుతుంది. ఇది కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. మోకాలి సమస్య లేదా వెన్నునొప్పి ఉన్నవారు ఇండోర్ సైక్లింగ్‌కు ముుందు డాక్టర్‌తో మాట్లాడాలి. వైద్యుడి సలహా మేరకే ఈ సైకిల్‌ను తొక్కాలి. ఒత్తిడిని తగ్గిస్తుంది ఇండోర్ సైక్లింగ్ మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఏదో ఒక రూపంలో శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల మీ శరీరం ఎండార్ఫిన్లు అని పిలువబడే ఫీల్–గుడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. çకొన్ని అధ్యయనాల ప్రకారం.. సైక్లింగ్ డోపామైన్, సెరోటోనిన్ ను కూడా పెంచుతుంది. ఫలితంగా మీ మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడి స్థాయులు కూడా తగ్గుతాయి. శక్తి సామర్థ్యాలను పెంచుతుంది ఇండోర్ సైక్లింగ్ మీ స్టామినాను పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తొక్కుతుంటే క్రమంగా అలసట తగ్గి రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి, ఇతర వ్యాయామాలలో పాల్గొనడానికి ఎక్కువ శక్తి, సామర్థ్యాన్ని కలిగి ఉండటానికి సహాయపడుతుంది. (చదవండి: మనిషన్నవాడు ఏమైపోయాడో..ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిన హత్యాకాండలు!) -
ప్లాగింగ్ గురించి మీకు తెలుసా? బోలెడన్నీ కేలరీలు ఖర్చవుతాయి
ఉదయాన్నే లేచి వ్యాయామం చేస్తే ఒంటికి మంచిదని తెలుసు. కానీ రకరకాల కారణాలతో వ్యాయామం చేయడానికి బద్దకించేస్తుంటాం. ‘‘కనీసం నాలుగడుగులేయండి, కాస్త జాగింగ్ అయినా చేయండి’’ అని పెద్దలు చెబుతుంటారు. ‘‘జాగింగ్‌తో పాటు ప్లాగింగ్ కూడా చేయండి మీరు ఫిట్‌గా ఉండడమేగాక మీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా క్లీన్ అవుతాయి’’ అని చెబుతున్నాడు నాగరాజు. రోజూ చేసే జాగింగ్ కంటే ప్లాగింగ్‌లో మరిన్ని కేలరీలు ఖర్చవడంతో΄ పాటు, అహం కూడా తగ్గుతుందని హామీ ఇస్తోన్న ప్లాగింగ్ నాగరాజు గురించి అతని మాటల్లోనే... ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్ మా స్వస్థలం. ఎమ్బీఏ చదివేందుకు పదిహేనేళ్ల క్రితం బెంగళూరు వచ్చాను. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తూ ఇక్కడే స్థిరపడిపోయాను. 2012లో ఒకరోజు సైక్లింగ్ ఈవెంట్ పూర్తిచేసుకుని ఇంటికి తిరిగొస్తున్నాను. ఆ సమయంలో... కొంతమంది యువతీ యువకులు జాగింగ్ చేస్తూనే రోడ్డు మీద పడి ఉన్న చెత్తాచెదారాన్ని ఏరుతున్నారు. నాకు కొంచెం చిత్రంగా అనిపించి, ‘‘ఏం చేస్తున్నారు?’’ అని అడిగాను. ‘‘మేము ఇక్కడ ఉన్న చెత్తనంతటిని తీసివేస్తే ఎవరూ ఇక్కడ చెత్తవేయరు. అంతా చెత్తడబ్బాలోనే వేస్తారు. దీంతో ఈ ప్రాంతం అంతా పరిశుభ్రంగా ఉంటుంది’’ అని చెప్పారు. అది విన్న నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఐడియా చాలా బావుంది అనుకున్నాను. అప్పటి నుంచి నేను కూడా చెత్తను తగ్గించడానికి ప్రయత్నిస్తూ.. ఎక్కడైనా చెత్త కనిపిస్తే, దానిని తీసుకెళ్లి చెత్తడబ్బాలో వేసేవాణ్ణి. స్వీడన్లో పుట్టింది ప్లాగింగ్ పుట్టింది స్వీడన్లో. స్వీడిష్‌లో ప్లాగింగ్ అంటే ‘టు పికప్’ అని అర్థం. ఎరిక్ అలస్ట్రమ్ రోజూ అనే అతను కార్డియో వర్కవుట్స్ చేస్తూ తను వెళ్లే దారిలో కనపడిన చెత్తను ఏరివేస్తూ 2016లో ప్లాగింగ్ ప్రారంభించాడు. టీవీలో అది చూసిన నేను.. ఇండియాలో ఎలా ప్లాగింగ్ చేయాలో నెట్లో శోధించి తెలుసుకున్నాను. అదే సంవత్సరం కబ్బన్ పార్క్‌లో 500 మందితో రన్నింగ్ ఈవెంట్ జరుగుతోంది. ఆ ఈవెంట్లో ప్లాగింగ్ ప్రారంభించాను. అక్కడ రన్నర్స్ పడేసే ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఏరి చెత్తబుట్టలో వేయడం చూసి కొంతమంది నన్ను అభినందించారు. ఈ అభినందనలు నన్ను ప్లాగింగ్ దిశగా మరింతగా ప్రోత్సహించాయి. అప్పటి నుంచి నా ప్లాగింగ్ జర్నీ కొనసాగుతూనే ఉంది. అహం కరుగుతుంది ఎక్కడపడితే అక్కడ చెత్తవేయకూడదని, వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకూడదని అందరిలో అవగాహన కల్పించడమే ప్లాగింగ్ ముఖ్య ఉద్దేశ్యం. జాగింగ్ చేసినప్పుడు కేలరీలు కరుగుతాయి. అయితే అక్కడక్కడ పడిఉన్న చెత్తను వంగి తీయడం వల్ల మరిన్ని కేలరీలు ఖర్చవుతాయి. వేరే ఎవరో పడేసిన చెత్తను పెద్దమనసుతో మనం ఎత్తినప్పుడు మనలో పేరుకుపోయిన అహంభావం కూడా కరిగిపోతుంది. ఇండియన్ ప్లాగర్స్ ఆర్మీ నేను ప్లాగింగ్ మొదలు పెట్టిన తొలినాళ్లలో ఎవరూ ఆసక్తి కనబరచలేదు. ఒక్కడ్నే ఇది చేయాలంటే కష్టంగా అనిపించింది. దాంతో అందరి ఇళ్లకు వెళ్లి ప్లాస్టిక్ వేస్ట్‌ను కలెక్ట్ చేసేవాడ్ని. రోడ్లమీద పడి ఉన్న చెత్తను ఏరేందుకు నా నాలుగేళ్ల కూతురు ఒక బ్యాగ్‌ను పట్టుకుని వచ్చి నాతో పాటు చెత్తను ఏరి బ్యాగ్‌లో వేసుకునేది. అలా నా ప్లాగింగ్ నిదానంగా సాగుతోండగా 2018లో కూర్గ్‌లో జరిగిన ‘బేర్‌ఫూట్ మారథాన్’ నా ప్లాగింగ్కు పాపులారిటీని తెచ్చింది. అతిపెద్ద మారథాన్‌లో ప్లాగింగ్ చేయడంతో అక్కడ పాల్గొన్న సెలబ్రిటీలు, ఔత్సాహికులకు దానిపై అవగాహన కల్పించాను. మిలింద్ సోనమ్ నన్ను మెచ్చుకుని , ప్లాగింగ్ గురించి అవగాహన కల్పించడానికి సాయం చేశారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు సాయం చేయడంతో..‘ద ఇండియన్ ప్లాగర్స్ ఆర్మీ’ ని ఏర్పాటు చేశాం. ఈ ఆర్మీతో కలిసి వీకెండ్స్‌లో కనీసం ఒక ప్లాగింగ్ ఈవెంట్‌ను అయినా ఏర్పాటు చేసేవాళ్లం. అలా ఆరేళ్లలో 550కు పైగా ఈవెంట్స్ చేశాం. ఏరిన చెత్తమొత్తాన్ని బెంగళూరు రీసైక్లింగ్ యూనిట్‌కు పంపి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తున్నాం. -
హైదరాబాద్ సిటీలో సైక్లింగ్ రెవల్యూషన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొంతకాలంగా సైక్లిస్టుల సంఖ్య పెరిగింది. ఆఫీసులకు వాహనాలకు బదులు సైకిల్‌నే వినియోగిస్తున్నారు. ఈ అవగాహన పెంచడంలో సిటీలోని సైక్లింగ్ క్లబ్‌లు, కమ్యూనిటీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్యం కూడా సైక్లిస్టుల సౌకర్యార్థం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ట్రాక్‌లను ఏర్పాటు చేసింది. వాహనాలకు బదులు సైకిళ్లను వాడాలని, కాలుష్య నివారణకు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని ‘హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్’ సభ్యులు నినదిస్తున్నారు. యాక్టివ్ మొబిలిటీ కోసం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఆదివారం ‘హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ 3.0’ పేరుతో సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 5 వేల మంది సైక్లిస్టులు పాల్గొననున్నారు. సైక్లింగ్ కమ్యూనిటీ పెరుగుతోంది.. నగరంలో 93 లక్షల జనాభాలో దాదాపు 50 లక్షల మందిని యాక్టివ్ మొబిలిటీ వైపు మళ్లించేలా, దూరాన్ని బట్టి నడక, సైకిల్, బస్సు, మెట్రోలను వినియోగించేలా అవగాహన కల్పించేందుకు ఈ సైక్లింగ్ రివల్యూషన్ 3.0 ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నాం. నగరంలో ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం మూడోసారి. నగరం వేదికగా పదివేల మందితో సైక్లింగ్ కమ్యూనిటీ ఉంది. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. – శాంతనా సెల్వన్, హైదరాబాద్ సైకిల్ మేయర్ -
సైరా... సైకిల్ సవారీ.. ఆమెకు 74 సంవత్సరాలు అంటే నమ్మడం కష్టం
ఉత్తర కర్ణాటకలోని గోకర్ణకు చెందిన జ్యోత్స్న కాగల్ను చూస్తే ‘74 సంవత్సరాలు’ అని నమ్మడం చాలా కష్టం. దీనికి కారణం ఆమె చలాకీతనం. 74 ఏళ్ల వయసులో కొందరికి నడవడం కష్టం కావచ్చు. అయితే జ్యోత్స్న మాత్రం వేగంగా నడవడంతో పాటు వేగంగా సైకిల్ తొక్కుతూ వీధి వీధీ తిరుగుతుంది. 1968లో తన తొలి సైకిల్‌ను కొన్నది. ఆ రోజుల్లో ఆడవాళ్లు సైకిల్ తొక్కడం అనేది అతి అరుదైన దృశ్యం. అలాంటి రోజుల్లో సైకిల్‌పై మెరుపు వేగంతో దూసుకుపోయే జ్యోత్స్నను చూసి సర్వజనులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేవారు. ఆమె పేరు తెలియక ‘సైకిల్ అమ్మాయి’ అని పిలిచేవారు. ఆమె గోకర్ణలోని మహాబలేశ్వర్ కో–ఆపరేటివ్ సొసైటీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసింది. ధ్యానం, యోగాలతో జ్యోత్స్న దినచర్య మొదలవుతుంది. సైకిల్ సవారీ తన విజయ రహస్యం అని చెబుతున్న జ్యోత్స్న కాగల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
వైకల్యాన్ని జయించి, స్పూర్తిగా నిలిచిన గీతా ఎస్ రావు
ఎవరి సామర్థ్యాలేంటో వారికే తెలిసినప్పటికీ శరీరం సహకరించడం లేదనో, ఆర్థిక స్థితిగతులు బాగోలేవనో ఏదో కారణంతో వెనకడుగు వేస్తుంటారు. కానీ, 42 ఏళ్ల గీతా ఎస్ రావు వాటన్నింటినీ అధిగమించి తన సత్తా ఏమిటో ప్రపంచానికి చూపుతోంది. పోలియోతో బాధపడుతున్నా శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయస్థాయిలో నేడు ప్రారంభమయ్యే లాంగెస్ట్ సైకిల్ రేస్‌లో పాల్గొనబోతోంది. ఈ సైక్లింగ్‌లో రేస్‌లో పాల్గొంటున్న ఏకైక మహిళ గీతా ఎస్ రావు. ‘నేను సాధించగలను’ అనే ధీమాను తన విజయంలోనే చూపుతున్న మహిళగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంపాజిబుల్ అనేవారికి ఇటీజ్ పాజిబుల్ అనే సమాధానం ఇస్తుంది. నేడు శ్రీనగర్ నుండి ప్రారంభమై కన్యాకుమారి వరకు జరిగే 3,551 కిలోమీటర్ల లాంగ్ సైక్లింగ్ రేస్‌లో పాల్గొంటున్నది గీతా ఎస్ రావు. డిఫరెంట్లీ–ఏబుల్డ్ గానే కాదు ఇలా సైక్లింగ్ రేస్‌లో పాల్గొంటున్న ఏకైక మహిళగా కూడా గుర్తింపు పొందింది ఆమె. అహ్మదాబాద్‌లో ఉంటున్న గీతకు మూడేళ్ల వయసులో పోలియో కారణంగా ఎడమ కాలు చచ్చుపడిపోయింది. గీత తల్లిదండ్రులు ఆమెను మిగతా పిల్లలమాదిరిగానే ధైర్యం నూరిపోస్తూ పెంచారు. కొన్నాళ్లు బెడ్‌కే అంకితమైపోయిన గీత ఆ తర్వాత వీల్ చెయిర్, హ్యాండికాప్డ్ బూట్స్‌తో నిలబడింది. అక్కడ నుంచి ఒక్కో మెట్టు సాధన చేస్తూ ట్రెక్కింగ్, బంగీ జంపింగ్, పారాగ్లైడింగ్, వాక్ త్రూ, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, మారథాన్.. ఇలా ఒక్కో ప్రయత్నం ఆమెను శక్తిమంతురాలిగా నిలబెట్టాయి. ఆమె తన కలలను సాకారం చేసుకోవడానికి తన సంకల్ప శక్తినే ఆయుధంగా చేసుకుంది. పడిపోతూ.. నిలబడింది రెండు కాళ్లూ సరిగ్గా ఉన్న సైక్లిస్టులు రోడ్డు ప్రమాదాల్లో మరణించడం చూసి చలించిపోయేది. తను సైక్లిస్ట్‌గా మారలేనా అనుకుంది. ముప్పై ఏళ్ల వయసులో సైకిల్ నేర్చుకునే ప్రయత్నం చేసింది. రోడ్డు మీద సైక్లింగ్ చేసే సమయంలోనూ చాలా సార్లు పడిపోయింది. తల నుండి కాలి వరకు గాయలయ్యాయి. కానీ, శరీరం సహకరించలేదనే నెపంతో తనకు నచ్చిన సైక్లింగ్‌ను మూలనపడేయకూడదు అనుకుంది. తన లాంటి వారికి ప్రేరణగా నిలవాలనుకుంది. ఆ స్థైర్యమే ఆమెను పారా ఒలిపింక్ గేమ్స్ వరకు తీసుకెళ్లింది. 2016లో మొదలుపెట్టిన ఆమె సైకిల్ ప్రయాణం ఇప్పటికి 80 వేల కిలోమీటర్ల వరకు సాగింది. మొదట్లో 200 మీటర్లు కూడా సైకిల్ తొక్కలేకపోయేది. కానీ, త్వరలో పారిస్‌కు చెందిన ఆడాక్స్ క్లబ్ పర్షియన్ రాండెన్యుర్ రైడ్స్‌లో పాల్గొనబోతోంది. ఒక యేడాదిలోనే 200, 300, 400, 600 కిలోమీటర్ల రైడ్లను కొన్ని గంటల్లోనే సాధించింది. తన రికార్డులను తనే తిరగరాస్తూ.. నియమాలకు కట్టుబడి, సమయాన్ని సమర్థంగా ఉపయోగించుకుంటే వికలాంగులు కూడా సమర్థులైన వ్యక్తులుగా సమాజంలో నిలబడతారు అని తన కథనం ద్వారానే నిరూపిస్తుంది గీత. 2017 డిసెంబర్లో లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకుంది. భారతదేశపు మొట్టమొదటి డిఫరెంట్లీ–ఏబుల్ సైక్లిస్ట్‌గా పేరు సంపాదించుకుంది. 2020–21లో తన రికార్డును తనే తిరగరాసుకుంది. ఈ యేడాది జనవరిలో వడోదర నుండి ధోలవీర వరకు వెయ్యి కిలోమీటర్ల రైడ్‌ను 73 గంటల 30 నిమిషాలలో పూర్తి చేసింది. హైదరాబాద్‌లో జరిగిన భారత జట్టు జాతీయ సెలక్షన్లలోనూ గీత మొదటి స్థానంలో నిలిచింది. ఆసియా ఛాంపియన్షిప్ కోసం ఆమెకు శిక్షణ ఇచ్చేందుకు స్వచ్ఛందంగా కోచ్‌లు ముందుకు వచ్చారు. మద్దతు కోసం తన కలలను సాకారం చేసుకోవడానికి గీత ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుండి స్పాన్సర్షిప్ కోసమూ ప్రయత్నిస్తోంది. ఈ పోరాట ప్రయాణానికి ఎంతో మంది తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా లాంగెస్ట్ రేస్‌లో గీత పాల్గొనడానికి హైదరాబాద్‌లోని సుహానా హెల్త్ ఫౌండేషన్, ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ –‘ఇది జాతీయ స్థాయిలో జరిగే అతి పెద్ద రేస్. విభిన్నంగా ఉండే మన దేశీయ వాతావరణంలో, సుందరమైన ప్రదేశాల మీదుగా ఈ రేస్ ఉంటుంది. దేశంలోని వారే కాదు ప్రపంచంలోని మారు మూలప్రాంతాల నుంచి కూడా ఈ రేస్‌లో పాల్గొంటున్నారు. అతి ΄పొడవైన ఈ సైక్లింగ్ రేస్ 12 రోజుల్లో 12 రాష్ట్రాలను దాటాలి’ అని తెలియజేస్తుంది. సైక్లిస్ట్గానే కాదు గీత ట్రావెలర్‌గానూ పేరు తెచ్చుకుంది. కార్పొరేట్ కమ్యూనికేషన్, బిఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన గీత ఐటీ మేనేజర్‌గా ఉద్యోగమూ చేసింది. ఎంట్రప్రెన్యూర్‌గా సొంతంగా కార్పొరేట్ కంపెనీకి డైరెక్టర్‌గా ఉంది. పిల్లలు సైకిల్ నేర్చుకునేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటారో గీత అంతే హుషారును చూపుతుంది. ఆ సాధన, ఆనందం ఆమెను ప్రపంచ కప్ సాధించే దిశగా తీసుకెళుతుంది.. వచ్చే సంవత్సరం పారిస్‌లో జరిగే పారాలింపిక్స్‌లో భారతదేశం నుంచి సైక్లింగ్‌లో మొట్టమొదటి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకురావాలని తపిస్తున్న గీత కలలు ఎంతో మందికి ఆదర్శం కావాలి. సమస్యలకు ఎదురెళ్లి ఆసియా ఛాంపియన్షిప్ రేసులో ఎదురుదెబ్బ తగిలి, కింద పడిపోయింది. సైక్లింగ్ షూస్ చిరిగిపోవడం, పెడల్ నుంచి జారి పడిపోవడంతో ఎడమ కాలు మరింతగా బాధపెట్టింది. అయినప్పటికీ కొండ ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాల గుండా ఆమె తన రేస్‌లో పాల్గొంది. రెండవ స్థానంలో నిలిచి బహుమతి ప్రదానోత్సవానికి గంట ముందు అంబులెన్స్‌లో చికిత్స తీసుకుంటూ ఉంది. కిందటేడాది పారాసైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సూపర్ రాండన్యుర్గా పేరొందింది. ఒలింపిక్ ట్రై–అథ్లెట్లో రజత పతకాన్ని సాధించింది. -
ఒంటి కాలితో దేశాన్ని చుట్టొస్తా
సనత్‌నగర్: ఒంటికాలితోనే మహిళల ప్రత్యేక సోలో కేటగిరి సైక్లింగ్ రేస్‌లో శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు సాగే ఐకానిక్ సైకిల్ రైడ్ పూర్తి చేస్తానని పారా అథ్లెట్ గీతా ఎస్.రావు ధీమా వ్యక్తం చేశారు. ఎడమ కాలు పోలియో వ్యాధికి గురైనప్పటికీ ఆమె ఒక కాలుతోనే సైకిల్ తొక్కుతూ ఇప్పటికే డీఎస్ఆర్, ఒలింపిక్ ట్రై అథ్లెట్, పారా సైక్లింగ్ 2022 చాంపియన్‌గా నిలిచారు. సుషేనా హెల్త్ ఫౌండేషన్ టీమ్ సభ్యులను కలిసేందుకు శుక్రవారం ఆమె నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా నిలోఫర్, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న ‘ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్’ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 18,950 కిలోమీటర్ల ఎత్తులో, 3,651 కిలోమీటర్ల పొడవైన ఈ ఐకానిక్ సైకిల్ రైడ్ మార్చి 1న శ్రీనగర్ నుంచి ప్రారంభమై కన్యాకుమారిలో ముగుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా సాగే జాతీయ స్థాయి అల్ట్రా సైక్లింగ్ రేస్‌లో భాగంగా దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సోలో, రిలే టీమ్‌లు పాల్గొంటాయని తెలిపారు. 12 రోజుల్లో 12 రాష్ట్రాలను దాటుతూ 3,651 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేస్తానని తెలిపారు. ఈ రేస్‌కు సుషేనా హెల్త్ ఫౌండేషన్ అధికారిక భాగస్వామిగా ఉందన్నారు. తన రైడ్‌లో భాగంగా ‘తల్లి పాలే ఉత్తమ ఆహారం’ అనే నినాదంతో దేశంలో తల్లి పాలపై అవగాహనను పెంపొందించేందుకు ప్రచారం చేస్తానన్నారు. కార్యక్రమంలో నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్ క్రాలేటీ, నియోనాటాలజీ హెచ్ఓడీ అలిమేలు మాదిరెడ్డి, సుషేనా హెల్త్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కలవలపల్లి దుర్గాభవానీ, అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ ముర్కి తదితరులు పాల్గొన్నారు. -
నడక మంచిదే... ఫిట్నెస్ ఊరికే రాదు!
ప్రస్తుతపు ఉరుకులు పరుగుల లైఫ్‌లో మిషన్ల సాయం లేకపో తే పని నడవదు. అలాగని కదలకుండా కూర్చుంటే చేజేతులా ముప్పు తెచ్చుకున్నట్లే. మరయితే ఏం చేయాలి? మనసుంటే మార్గం ఉన్నట్లు ఈ బిజీ లైఫ్‌లో కూడా కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండొచ్చు. అవేమిటో చూద్దామా? రకరకాల కారణాల వల్ల వ్యాయామం చేయడానికి సమయం లేనివారు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండవచ్చు. అందులో నడక ఒకటి. అసలు ఎలా నడవాలి.. ఎప్పుడెప్పుడు నడిస్తే ఆరోగ్యంగా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం.. మాట్లాడుతూనే నడవండి కొంతమందికి పొద్దస్తమానం ఫోన్ మాట్లాడటం అవసరం. మరికొందరికి వృత్తిరీత్యా తప్పదు. చాలామందికి అలవాటు. అది వర్క్ కాల్ అయినా.. మీకు ఇష్టమైన వారితో చెప్పుకునే కాలక్షేపం కబుర్లే కావచ్చు... మాట్లాడండి. కానీ అలా మాట్లాడుతూనే నడవండి. ఎందుకంటే అరగంట వాకింగ్ చేస్తే వొంటికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా? ఇది మీ బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్యానికి మెట్లు ఫిట్‌గా ఉండటానికి మెట్లను ఖచ్చితంగా ఎక్కాలని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీర కదలికలు చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. మెట్లను ఎక్కుతున్నప్పుడు మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అందుకే లిఫ్ట్‌లో వెళ్లకుండా మెట్లను ఎక్కడం అలవాటు చేసుకోండి. అయితే కొన్ని రకాల శారీరక ఇబ్బందుల రీత్యా, కొన్ని శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారినీ వైద్యులు మెట్లు ఎక్కవద్దని చెబుతారు. అలాంటి వారు మాత్రం మెట్లెక్కడాన్ని మినహాయించాలి. ఎక్కువ కదలడానికి ప్రయత్నించండి మీ ఆఫీస్ దగ్గరలో ఉంటే నడిచి వెళ్లడానికి ప్రయత్నించండి. లేదా ఆఫీసుకు కనీసం 10 నుంచి 20 నిమిషాల నడక దూరంలో దిగి.. నడిచి వెళ్లండి. బస్సులో వెళ్లినా, కారులో వెళ్లినా ఇలాగే నడవండి. ఫిట్‌గా ఉండటానికి ఈ చిన్న చిన్న మార్పులు అత్యవసరం. నిలబడి పనిచేయండి మీరు పనిచేసే ప్లేస్‌లో మీకు సౌకర్యంగా ఉంటే నిలబడి పని చేయడానికి ప్రయత్నించండి. ఇలా కొద్దిసేపు నిలబడి పనిచేయడం వల్ల దీర్ఘకాలికంగా ప్రయోజనం పొందుతారు. అలా అని మరీ ఎక్కువసేపు నిలబడటం ఆరోగ్యానికి మంచిది కాదు. టీవీ చూస్తున్నప్పుడు... టీవీ లేదా సెల్ ఫోన్లో సినిమాలను చూస్తున్నప్పుడు ఒకే దగ్గర కూర్చోకుండా.. ట్రెడ్‌మిల్‌పై నడవడం లేదా సైక్లింగ్ లేదా శరీరాన్ని సాగదీయడం వంటి కొన్ని వ్యాయామాలను చేయడం వల్ల మీ శరీరం బాగా కదిలి ఆరోగ్యంగా ఉంటుంది. డ్యాన్స్ బెస్ట్ సమయం దొరికినప్పుడల్లా మీ శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించండి. అన్నింటిలో డ్యాన్స్ బెస్ట్. ఎందుకుంటే ఇది వ్యాయామంగా అనిపించదు. కొన్ని నిమిషాలపాటు డ్యాన్స్ చేస్తే మనసుకు సంతోషం, శరీరానికి ఆరోగ్యం చేకూరతాయి. వీటితోబాటు సాధ్యమైనంత వరకు ఇంట్లో మీ పనులు మీరే చేయండి. క్లీనింగ్, వాషింగ్, వంటపనుల్లో ఓ చే యి వేయండి. ఈ పనులు కూడా వ్యాయామం కిందికే వస్తాయి. మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతాయి. -
67 ఏళ్ల వయసులో అదరగొట్టిన బామ్మ.. శారీతో రోప్ సైక్లింగ్.. చూస్తే వావ్ అనాల్సిందే!
-
63 ఏళ్ల వయసులో 6,000 కిలో మీటర్ల సైక్లింగ్
ఆయన వయసు 63 సంవత్సరాలు. జెట్ స్పీడ్‌తో సైకిల్ తొక్కుతూ రయ్ రయ్ అంటూ దూసుకెళ్తున్నారు. తొక్కుతున్న సైకిల్ స్పీడ్ చూస్తే 25 ఏళ్ల వయసు ఉన్న యువకుడు అనుకుంటారు. తన ఫేస్‌కు ఉన్న మాస్క్ తీస్తే కానీ తెలియదు ఆయన 60 ఏళ్ళకి పైబడిన వ్యక్తి అని. ఆయనే హైదరాబాద్‌కు చెందిన మేజర్ జనరల్ డాక్టర్ ఆలపాటి వెంకటకృష్ణ (ఏవీకే) మోహన్. సోమవారం హైదరాబాద్ నుంచి సిద్దిపేటలోని రంగనాయకసాగర్‌కు సైక్లింగ్ చేసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా సాక్షి పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే... సాక్షి, సిద్దిపేట: మా నాన్న దేవాదాయ శాఖలో విధులు నిర్వర్తించేవారు. కాకినాడలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. 1984లో సికింద్రాబాద్‌లోని మిలటరీ హాస్పిటల్లో డాక్టర్‌గా జాబ్ వచ్చింది. 37 ఏళ్ల పాటు ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి ఆర్మీ సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పుణేలో మెడికల్ హెడ్‌గా మేజర్ జనరల్‌గా ఉద్యోగ విరమణ తీసుకున్నాను. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కౌకూర్‌లో నివాసం ఉంటున్నాను. నా కూతురు ప్రసన్న డెంటల్ స్పెషలిస్ట్ గౌహతిలో ప్రాక్టీస్ చేస్తోంది. పర్వతారోహణ...బైకింగ్: 1991లో ఇటాలియన్లతో కలిసి మౌంట్ సతోపంత్‌కు పర్వతారోహణ యాత్ర చేశా. 2000 సంవత్సరం ప్రారంభంలో కాంగోలోని మౌంట్ నైరాగాంగోలో ప్రత్యక్ష అగ్నిపర్వతం అధిరోహించిన ఆర్మీ బ్రిగేడ్‌లో మొదటి వ్యక్తి నేనే. ఈశాన్యంలోని మొత్తం ఎనిమిది రాష్ట్రాలల్లో బైకింగ్ చేసుకుంటూ తిరిగి వచ్చాను. 2019లో దే«శంలోని మూడు కార్నర్లు తూర్పు, పడమర దక్షణంలో 11,500 కిలో మీటర్లు మోటార్ బైకింగ్ చేశాను. సైక్లింగ్ అంటే ఇష్టంతో: నాకు చిన్నప్పటి నుంచి సైక్లింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. డిసెంబర్ 2014లో చెన్నైకి బదిలీపై వచ్చాను. అప్పటికే చెన్నై నగరంలో ప్రసిద్ధ సైక్లింగ్ గ్రూప్ అయిన చెన్నై జాయ్ రైడర్జ్ ఉంది. అందులో చేరాను. చెన్నై నుంచి విజయవాడ , 2015లో కర్ణాటక, కేరళ , తమిళనాడులో 900 కి.మీ, టూర్ ఆఫ్ నీలగిరీస్ సైక్లింగ్ పర్యటన చేశాను. 2016లో స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ చేశాను. జలశక్తి మిషన్ కింద 2019లో కచ్(గుజరాత్) నుంచి గౌహతి(అస్సాం) వరకు 3,200 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాను. ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు గోల్డెన్ క్వాడ్రీలెట్రల్ ఈ నెల 20వ తేదీ నుంచి నెల రోజుల పాటు గోల్డెన్ క్వాడ్రీలెట్రల్ సైక్లింగ్ చేయనున్నాను. 6 వేల కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. ఔరంగాబాద్‌లో ప్రారంభమై జార్ఖండ్, వెస్ట్‌బెంగాల్, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ మీదుగా మళ్లీ ఔరంగాబాద్‌కు చేరుకుంటాను. ఇలా నెల రోజుల పాటు సైక్లింగ్ చేస్తాను. ఫిట్నెస్ ఔత్సాహికులకు సలహాలు, మెరుగైన జీవనం వైపు అడుగులు వేసేందుకు ఇతరులకు ఆదర్శంగా ఉండాలనేదే ఆలోచన. (చదవండి: గిన్నిస్ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!) -
63 ఏళ్ల వయసులో 6,000 కి.మీ.సైక్లింగ్
ఆయన వయసు 63 సంవత్సరాలు. జెట్ స్పీడ్‌తో సైకిల్ తొక్కుతూ రయ్ రయ్ అంటూ దూసుకెళ్తున్నారు. తొక్కుతున్న సైకిల్ స్పీడ్ చూస్తే 25 ఏళ్ల వయసు ఉన్న యువకుడు అనుకుంటారు. తన ఫేస్‌కు ఉన్న మాస్క్ తీస్తే కానీ తెలియదు ఆయన 60 ఏళ్ళకి పైబడిన వ్యక్తి అని. ఆయనే హైదరాబాద్‌కు చెందిన మేజర్ జనరల్ డాక్టర్ ఆలపాటి వెంకటకృష్ణ (ఏవీకే) మోహన్. సోమవారం హైదరాబాద్ నుంచి సిద్దిపేటలోని రంగనాయకసాగర్‌కు సైక్లింగ్ చేసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా సాక్షి పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే... – సాక్షి, సిద్దిపేట 23 ఏళ్లు ఇక్కడే.. 37 ఏళ్లు దేశవ్యాప్తంగా విధులు మా నాన్న దేవాదాయ శాఖలో విధులు నిర్వర్తించేవారు. కాకినాడలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. 1984లో సికింద్రాబాద్‌లోని మిలటరీ హాస్పిటల్లో డాక్టర్‌గా జాబ్ వచ్చింది. 37 ఏళ్ల పాటు ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి ఆర్మీ సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పుణేలో మెడికల్ హెడ్‌గా మేజర్ జనరల్‌గా ఉద్యోగ విరమణ తీసుకున్నాను. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కౌకూర్‌లో నివాసం ఉంటున్నాను. నా కూతురు ప్రసన్న డెంటల్ స్పెషలిస్ట్ గౌహతిలో ప్రాక్టీస్ చేస్తోంది. పర్వతారోహణ.. బైకింగ్ 1991లో ఇటాలియన్లతో కలిసి మౌంట్ సతోపంత్‌కు పర్వతారోహణ యాత్ర చేశా. 2000 సంవత్సరం ప్రారంభంలో కాంగోలోని మౌంట్ నైరాగాంగోలో ప్రత్యక్ష అగ్నిపర్వతం అధిరోహించిన ఆర్మీ బ్రిగేడ్‌లో మొదటి వ్యక్తి నేనే. ఈశాన్యంలోని మొత్తం ఎనిమిది రాష్ట్రాలల్లో బైకింగ్ చేసుకుంటూ తిరిగి వచ్చాను. 2019లో దే«శంలోని మూడు కార్నర్లు తూర్పు, పడమర దక్షణంలో 11,500 కిలో మీటర్లు మోటార్ బైకింగ్ చేశాను. సైక్లింగ్ అంటే ఇష్టంతో నాకు చిన్నప్పటి నుంచి సైక్లింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. డిసెంబర్ 2014లో చెన్నైకి బదిలీపై వచ్చాను. అప్పటికే చెన్నై నగరంలో ప్రసిద్ధ సైక్లింగ్ గ్రూప్ అయిన చెన్నై జాయ్ రైడర్జ్ ఉంది. అందులో చేరాను. చెన్నై నుంచి విజయవాడ , 2015లో కర్ణాటక, కేరళ , తమిళనాడులో 900 కి.మీ, టూర్ ఆఫ్ నీలగిరీస్ సైక్లింగ్ పర్యటన చేశాను. 2016లో స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ చేశాను. జలశక్తి మిషన్ కింద 2019లో కచ్(గుజరాత్) నుంచి గౌహతి(అస్సాం) వరకు 3,200 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాను. ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు గోల్డెన్ క్వాడ్రీలెట్రల్ ఈ నెల 20వ తేదీ నుంచి నెల రోజుల పాటు గోల్డెన్ క్వాడ్రీలెట్రల్ సైక్లింగ్ చేయనున్నాను. 6 వేల కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. ఔరంగాబాద్‌లో ప్రారంభమై జార్ఖండ్, వెస్ట్‌బెంగాల్, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ మీదుగా మళ్లీ ఔరంగాబాద్‌కు చేరుకుంటాను. ఇలా నెల రోజుల పాటు సైక్లింగ్ చేస్తాను. ఫిట్నెస్ ఔత్సాహికులకు సలహాలు, మెరుగైన జీవనం వైపు అడుగులు వేసేందుకు ఇతరులకు ఆదర్శంగా ఉండాలనేదే ఆలోచన. -
Knee pain: మోకాళ్ల నొప్పులకు చెక్ పెట్టండిలా..
మోకాళ్ల నొప్పులు ఉన్నవారు వ్యాయామం చేస్తే... వారి మోకాలి కీళ్లు మరింతగా అరిగిపోయి, నొప్పులు పెరుగుతాయేమోనని చాలమంది అపోహ పడుతుంటారు. మరీ ఎక్కువ భారం పడకుండా, మరీ ఎక్కువగా శారీరక శ్రమ లేని వ్యాయామంతో మోకాళ్ల నొప్పులను అదుపులో పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈదే సమయంలో మోకాళ్లపైనే కాదు... అసలు శరీరంపై ఎలాంటి భారం పడదు. కాబట్టి ఈత అన్నింటికంటే మంచి వ్యాయామం. అంతేకాదు... మోకాళ్ళ నొప్పులతో, మరీ ముఖ్యంగా ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారు కాస్తంత ఎక్కువగా నడిస్తే మోకాలి కీళ్లు అరిగిపోతాయనే మరో అపోహా ఉంది. ఇది నిజం కాదు. మోకాలి కీలు ప్రాంతంలో నేరుగా రక్తప్రసరణ జరగదు. అందుకే ఆ కీలు దగ్గర కదలికలు ఎంతగా ఉంటే అక్కడంత సమర్థంగా రక్తప్రసరణ ఉంటుంది. దాంతో కీళ్లకు పోషకాలు అందడమే కాక, కండరాలు, ఎముకలూ బలపడతాయి. కొంతమంది సైక్లింగ్ వల్ల మోకాళ్ల నొప్పులు మరింత పెరుగుతాయని అనుకుంటుంటారు. సైక్లింగ్‌లో దేహం బరువు మోకాళ్లపై పడదు. కాబట్టి అది కూడా మంచి వ్యాయామమే. ఇప్పుడిప్పుడే మధ్యవయసులోకి వస్తున్న/రాబోతున్నవారు మోకాళ్ల నొప్పులు రాకముందే వాకింగ్ చేయడం మేలు. అవి మోకాలికి శ్రమ కలిగించనంత మేరకే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అప్పటికే మోకాళ్లనొప్పులు మొదలై ఉంటే స్విమ్మింగ్ మంచిది. సైక్లింగ్ కూడా చేయవచ్చు. అయితే ఇలాంటి వ్యాయామాలు మొదలుపెట్టే ముందర ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి ప్రారంభించడం వల్ల వారిలో ఉన్న అపోహలు తొలగడమే కాకుండా... వారి వారి వ్యక్తిగత ఆరోగ్యపరిస్థితి ని అనుసరించి డాక్టర్లు మరికొన్ని సూచనలూ ఇస్తారు. ఇది వాళ్లకు మరింత మేలు చేస్తుందని చెప్పడంలో సందేహమే లేదు. -
'నన్ను కొట్టేవాడు.. మరో మహిళా సైక్లిస్ట్‌తో సంబంధం అంటగట్టి'
మాజీ జాతీయ సైక్లింగ్ కోచ్ ఆర్కే శర్మపై ఇటీవలే లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. భారత టాప్ మహిళా సైక్లిస్ట్.. గదిలోకి పిలిచి తనను అత్యాచారం చేయడమే గాక అతనికి భార్యగా ఉండాలంటూ వేధింపులకు పాల్పడ్డాడంటూ సాయ్‌కి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) ఆర్కే శర్మపై వేటు వేసింది. దీనికి సంబంధించిన కేసును సాయ్ ఇటీవలే మానవ హక్కుల కమీషన్‌కు బదిలీ చేసింది. తాజాగా ఆర్కే శర్మ విషయంలో మరో టాప్ సైక్లిస్ట్.. జాతీయ చాంపియన్ డెబోరా హెరాల్డ్ విస్తుపోయే విషయాలు పేర్కొంది. ''ఆర్కే శర్మతో పాటు అతని అసిస్టెంట్ కోచ్ గౌతామని దేవి నన్ను రెండుసార్లు కొట్టారు. ప్రతీ చిన్న విషయానికి ఎగతాళి చేసేవారు. దానిని అడ్డుకోవాలని చూస్తే మరింత వేధించేవారు. అంతేకాదు మరో మహిళా సైక్లిస్ట్‌తో నేను రిలేషన్షిప్లో ఉన్నట్లు పుకార్లు కూడా పుట్టించారు. నిజం ఏంటన్నది నాకు తెలుసు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. వాళ్లు పుకార్లు పుట్టిన ఆ సైక్లిస్ట్ వ్యక్తిగతంగా నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. అయితే దీనిని కోచ్ ఆర్కే శర్మ.. అసిస్టెంట్ కోచ్ గౌతామని దేవి వేరే రకంగా ఊహించుకునేవారు. ఒక సందర్భంలో మేము ఉన్న గదిలో ఎయిర్ కండీషనర్ పని చేయకపోవడంతో కింద ఫ్లోర్లో ఉన్న అబ్బాయిల గదిలోకి వెళ్లాం. అంతకముందు వాళ్ల అనుమతి తీసుకున్నాం. ఈ విషయం తెలుసుకోకుండా కోచ్ ఆర్కే శర్మ ఆరోజు ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు.'' అంటూ పేర్కొంది. ఇక డెబోరా హెరాల్డ్ 2012 నుంచి భారత్ తరపున సైక్లింగ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. ఆర్కే శర్మ నేతృత్వంలో మరింత రాటుదేలిన హెరాల్డ్.. 2014లో జరిగిన ఆసియా కప్ ట్రాక్‌లో 500 మీటర్ల టైమ్ ట్రయల్‌లో విజేతగా నిలిచింది. 2015 అక్టోబర్‌లో జరిగిన తైవాన్ కప్ ఇంటర్నేషనల్ క్లాసిక్‌లో ఐదు మెడల్స్ సాధించిన హెరాల్డ్.. ఆ తర్వాత ట్రాక్ ఇండియా కప్‌లో మూడు మెడల్స్ సొంతం చేసుకుంది. ఇక యూసీఐ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం సంపాదించిన హెరాల్డ్.. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా సైక్లిస్ట్‌గా చరిత్ర సృష్టించింది. చదవండి: 'గదిలోకి పిలిచి తన భార్యగా ఉండాలన్నాడు'.. జాతీయ కోచ్‌పై భారత మహిళా సైక్లిస్ట్ ఆరోపణలు -
సైక్లింగ్‌లో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన టైలర్ కొడుకు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో 18 ఏళ్ల కశ్మీర్ కుర్రాడు ఆదిల్ అల్తాఫ్ అదరగొట్టాడు. జమ్మూ కశ్మీర్ తరపున ఖేలో ఇండియా యూత్ గేమ్స్ళో సైక్లింగ్ విభాగంలో తొలి స్వర్ణం సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. శనివారం ఉదయం నిర్వహించిన 70 కిమీ సైక్లింగ్ రోడ్ రేసులో ఆదిల్ అల్తాఫ్ అందరి కంటే ముందుగా గమ్యాన్ని చేరి పసిడి అందుకున్నాడు. అంతకముందు ఒక్కరోజు ముందు 28 కిమీ విభాగంలో నిర్వహించిన రేసులో రజతం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒక టైలర్ కొడుకు తమ రాష్ట్రానికి స్వర్ణం పతకం తీసుకురావడంతో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహా ఆదిల్ అల్తాఫ్‌ను ప్రత్యేకంగా అభినందించాడు.''ఈ విజయం నాకు చాలా పెద్దది. పతకం సాధిస్తాననే నమ్మకంతో ఖేలో ఇండియాకు వచ్చా. అయితే స్వర్ణ పతకం రావడం నా నమ్మకానికి మరింత బూస్టప్ ఇచ్చినట్లయింది'' అంటూ ఆదిల్ అల్తాఫ్ పేర్కొన్నాడు. 15 ఏళ్ల వయసులో ఆదిల్ అల్తాప్ కశ్మీర్ హార్వర్డ్ స్కూల్లో జరిగిన సైక్లింగ్ ఈవెంట్లో తొలిసారి పాల్గొన్నాడు. ఆ రేసులో విజేతగా నిలిచిన ఆదిల్ అల్తాఫ్ అక్కడి నుంచి సైక్లింగ్‌ను మరింత సీరియస్‌గా తీసుకున్నాడు. కొడుకు ఉత్సాహం, సైక్లింగ్‌పై ఉన్న ఇష్టం చూసి.. పగలు రాత్రి తేడా తెలియకుండా టైలరింగ్ చేసి పైసా పైసా కూడబెట్టి ఆదిల్‌కు రేసింగ్ సైకిల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు.ఆ తర్వాత లోకల్లో నిర్వహించిన పలు ఈవెంట్స్ ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాడు. ఆదిల్ అల్తాఫ్ ప్రదర్శనకు మెచ్చిన శ్రీనగర్‌లోని ఎస్బీఐ బ్యాంక్ రూ.4.5 లక్షల ఎంటిబీ బైక్‌ను గిప్ట్గా ఇవ్వడం విశేషం. ఇక ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పతకం సాధించాలనే కాంక్షతో ఆదిల్ అల్తాప్ గత ఆరు నెలలుగా పాటియాలాలోని ఎన్ఐఎస్లో శిక్షణ తీసుకున్నాడు. తాజాగా స్వర్ణం సాధించడంతో ఆదిల్ అల్తాఫ్ తన కలను నెరవేర్చుకున్నాడు. Congratulations to Adil Altaf for a historic gold and a new record at Khelo India Youth Games. Cycling team of Jammu Kashmir scripted history by winning second runner trophy. #KIYG2021 pic.twitter.com/vSHNtSAHyt — Office of LG J&K (@OfficeOfLGJandK) June 11, 2022 చదవండి: కామన్వెల్త్ క్రీడలకు నిఖత్ జరీన్ -
Arthritis: నడక, సైక్లింగ్, నీళ్లలో ఏరోబిక్స్ చేస్తున్నారా..?
ఎస్ అంటే ‘స్టార్ట్ స్లో అండ్ గో స్లో : ఆర్థరైటిస్‌తో బాధపడేవారు డాక్టర్లు సూచించిన విధంగా తమకు అనువైన తేలికపాటి వ్యాయామాల్ని ప్రారంభించాలి. అతి మెల్లిగా మొదలు పెట్టి.. క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఎమ్ అంటే మాడిఫై యువర్ యాక్టివిటీ వెన్ ఆర్థరైటిస్ సింప్టమ్స్ ఇంక్రీజ్ : ఆర్థరైటిస్ లక్షణాల్లో ప్రధానమైనది కీళ్లనొప్పి. ఇది తరచూ వస్తూ పోతూ ఉంటుంది. నొప్పి వచ్చి, అది తీవ్రమైనప్పుడు బాధితులు చేసే ఆ వ్యాయామరీతులను వారి లక్షణాలకు తగ్గట్లుగా మార్చుకోవాలి. ఉదాహరణకు తీవ్రత పెరిగినప్పుడు వ్యాయామం చేసే వ్యవధినీ, వ్యాయామ తీవ్రతనూ తగ్గించుకోవాలి. దీనివల్ల నొప్పి మరింతగా పెరగకుండా చూసుకోవచ్చు. ఏ అంటే ఏక్టివిటీస్ షుడ్ బి జాయింట్ ఫ్రెండ్లీ: బాధితుల వ్యాయామాలు వారి కీళ్లకూ, కండరాలకు మరింత మేలు చేసేలా ఉండాలి. ఉదాహరణకు వ్యాయామాల్లోని తేలికపాటివి... అంటే నడక, సైక్లింగ్, నీళ్లలో చేసేవి బాధితులకు శ్రమ ఎక్కువగా కలిగించవు. పైగా అవన్నీ చాలావరకు స్వాభావికమైనవే. నీళ్లలో వ్యాయామాలు చేయడం వల్ల కీళ్లపై పడే శరీర బరువు బాగా తగ్గుతుంది. అందువల్ల నీళ్లలో ఏరోబిక్స్ కీళ్లకు మేలు చేసేవిగా (జాయింట్ ఫ్రెండ్లీ)గా ఉంటాయన్నమాట. ఆర్ అంటే రికగ్నైజ్ సేఫ్ ప్లేసెస్ అండ్ వేస్ టు బి యాక్టివ్: ఆర్థరైటిస్ ఉన్నవారిలో ఎముకలు పెళుసుబారి ఉంటాయి. అందుకే అవి చిన్నపాటి శ్రమకు కూడా విరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే వ్యాయామం చేయడానికి సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవడం కూడా అవసరమే. ఉదాహరణకు పార్క్‌లో నడుస్తున్నప్పుడు... అక్కడి వాకింగ్ ట్రాక్ పగుళ్లు లేకుండా, స్లిప్ అవ్వడానికి అవకాశం లేకుండా సురక్షితంగా ఉండటం అవసరం. అలాగే చుట్టుపక్కల పెద్ద బండరాళ్లు ఉన్న ప్రదేశమైతే.. పొరబాటున పడిపోతే తలకు బలమైన గాయాలయ్యే అవకాశం ఎక్కువ. అలాంటివేవీ లేని సమతల ప్రదేశంలోనే వ్యాయామం చేయాలి. ఒకవేళ కాస్తంత సాయం సమయంలో చీకటిపడ్డప్పుడు వాకింగ్ చేస్తుంటే, అక్కడ తగినంత లైట్ల వెలుతురు ఉండేలా చూసుకోవాలి. టీ అంటే టాక్ టు హెల్త్ ప్రొఫెషనల్ : చిన్నవయసు ఆరోగ్యవంతులు కాకుండా... మరెవరు(అంటే కీళ్లనొప్పులు, గుండెజబ్బులు... వంటివి ఉన్నవారు) వ్యాయామాలు ప్రారంభించినా... ముందుగా ఓసారి వ్యాయామ నిపుణుడితోపాటు డాక్టర్ (లైఫ్‌స్టైల్ నిపుణులు లేదా ఆర్థో / గుండె / ఫిజీషియన్)ను సంప్రదించి, తమకు తగిన వ్యాయామాలేమిటో తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధులతో బాధపడేవారు ఎలాంటి వ్యాయామాలు చేయాలో నిపుణులు మాత్రమే సూచిస్తారు. చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. -
జాతీయ సైక్లింగ్‌లో తెలంగాణ కుర్రాడి సత్తా.. ఒకేసారి రెండు పతకాలు
జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా రెండు పతకాలతో ఆకట్టుకున్నాడు. జైపూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన ఆశీర్వాద్ రజతం, కాంస్యం సాధించాడు. అండర్–16 విభాగం 2000 మీటర్ల వ్యక్తిగత పర్సూ్యట్ ఈవెంట్లో ఆశీర్వాద్ మూడో స్థానంలో నిలిచాడు. ఆశీర్వాద్, చిరాయుష్ పట్వర్ధన్, ఎ.రామకృష్ణలతో కూడిన తెలంగాణ బృందం టీమ్ స్ప్రింట్ ఈవెంట్లో రజతం సాధించింది. భారత స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలోని ఖేలో ఇండియా శిబిరంలో ఈ ముగ్గురు శిక్షణ పొందారు. -
సైకిలింగ్ చేయండి!... రుచికరమైన జ్యూస్‌ని ఆస్వాదించండి!!
A video of a customer preparing his own juice: ఇంతవరకు వింతైన వంటకాలను సంబంధించి రకరకాల వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. అంతేందుకు పాములా అనిపించే విచిత్రమైన కేకులు, ఓరియా బిస్కెట్ పకోడిలు వంటి వెరైటీ వంటకాలను గురించి విన్నాం. అచ్చం అలానే అహ్మాదాబాద్కి జ్యూస్ షాప్ సైకిలింగ్ చేయండి జ్యూస్‌ని ఆస్వాదించండి అంటూ మంచి సైకిల్ జ్యూస మిషన్‌ని తయారు చేసింది. (చదవండి: వలసదారులను తీసుకువెళ్లుతున్న పడవ బోల్తా....11 మంది మృతి) అసలు విషయంలోకెళ్లితే... అహ్మదాబాద్ గ్రీయోబార్ జ్యూస్ షాప్ తమ షాప్‌లో కస్టమర్లు తమకు నచ్చిన జ్యూస్‌ని తామే తయారు చేసుకుని ఆస్వాదించవచ్చు అంటోంది. పైగా మీరు తగిన ఫిట్నెస్ తోపాటుగా మంచి జ్యూస్‌ని ఆస్వాదించే అవకాశం కూడా లభిస్తోంది అని చెబుతోంది. అయితే అసలు విషయం ఏమిటంటే జ్యూస్ మిక్సర్ సైకిల్‌కి అటాచ్ చేసి ఉంటుంది. దీంతో మనం ఆ సైకిల్ని తొక్కితేనే జ్యూస్ తయారవుతుంది అదే ఈ జ్యూస్ సైకిల్ ప్రత్యేకత. ఈ మేరకు మోహిత్ కేస్వానీ అనే కస్టమర్ ఈ జ్యూస్ సైకిల్ని తొక్కుతూ తనకు నచ్చిన పుచ్చకాయ జ్యూస్ చేసుకుంటాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల అవుతోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: చేతులతో నడిచే అరుదైన గులాబీ చేప..!) View this post on Instagram A post shared by Greenobar (@thegreenobar) -
బిడ్డ పుట్టాలని సైకిల్ తొక్కింది!... అంతే చివరికి!!
న్యూజిలాండ్‌లోని గ్రీన్‌కు చెందిన పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) తన బిడ్డ పుట్టడం కోసం సైకిల్‌పై ఆసుపత్రికి వెళ్లి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ మేరకు ఎంపీ జూలీ అన్నే జెంటర్ గతంలో తన మొదటి బిడ్డ, కొడుకు పుట్టిన సమయంలో కూడా ఇలాగే చేయడం గమనార్హం. ఈ మేరకు ఆమె కడుపుతో ఉండి సైక్లింగ్ చేసిన విధానాని వివరిస్తూ ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: కరోనా ఆంక్షలు ఎత్తివేయడం అసాధ్యం!..హెచ్చరిస్తున్న అధ్యయనాలు) ఈ మేరకు జెంటర్కి సైకిల్ తొక్కాలని ముందుగా ఎటువంటి ప్లాన్ చేయలేదు. అయితే జెంటర్కి తెల్లవారుఝామున 2 గంటలకు నొప్పులు రావడంతో ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకుంది. పైగా ఆ నొప్పులు అంత ఎక్కువగా ఏమి రావడం లేదుకదా అని సైక్లింగ్ చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లాలనుకుంది. ఆ తర్వాత ఆమెకు ఉదయ 3 గంటల సమయంలో సుఖ ప్రసవం అయ్యి ఆరోగ్యవంతమైన మగపిల్లాడు పుట్టాడు. అంతేకాదు జెంటర్ తాను సైక్లింగ్ చేయడం వల్ల ఎక్కువ సేపు నొప్పుల పడాల్సిన అవసరం లేకుండానే చాలా తొందరగా ప్రసవం అయిపోయిందంటూ క్యాప్షన్ పెట్లి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెను ప్రశంసించడమేకాక సైక్లింగ్ వంటి వ్యాయామాల వల్ల డెలివరీ సమయంలో మంచి ప్రయోజనం ఉంటుందంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఆ దేశంలో అట్టహాసంగా కోతుల పండగ!) -
వర్షంలో సైక్లింగ్ చేసిన సమంత.. వీడియో వైరల్
సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. వ్యక్తిగత, వృత్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా హైదారాబాద్‌లోని రైడింగ్ గ్రూప్ సభ్యులతో కలిసి సైక్లింగ్ చేసిన వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమెతోపాటు కొంతమంది పారా సైక్లిస్టులు సరాదాగా రైడింగ్ చేశారు. ‘బెస్ట్ కంపెనీతో వర్షంలో రైడింగ్’ అనే దానికి క్యాప్షన్ ఇచ్చింది. సైక్లింగ్ ప్రారంభించిన మొదటి రోజే 21 కీమీ ప్రయాణించిన సామ్, 100 కీమీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పింది. దీని గురించి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఈ నటి ‘డే1, 21 కీమీ, 100 కీమీ.. నీ కోసం వస్తున్నా’ అని రాసుకొచ్చింది. ఇది పోస్ట్ కొద్ది గంటల్లోనే 2 లక్షలకుపైగా లైక్స్‌తో వైరల్ అయ్యింది. కాగా ఇటీవల సమంత, కీర్తీ సురేష్, త్రిష, కల్యాణి ప్రియదర్శన్‌తో చిల్ అవుతున్న ఫోటోని పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అలాగే తన రెండు కుక్కల పిక్స్ షేర్ చేసి వాటిపై తనకున్న ప్రేమని వ్యక్తపరిచింది. చదవండి: ప్రియాంక చోప్రాకి థ్యాంక్స్ చెప్పిన సామ్.. వైరల్ View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) -
వరల్డ్ కార్ ఫ్రీ డే: ఈ విశేషాలేంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: రోజుకు రోజుకు కాలుష్యం పెను భూతంలా విస్తరిస్తోంది. విచ్చలవిడిగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాలు భూతాపాన్ని మరింత పెంచేస్తున్నాయి. ఫలితంగా ఈ భూ ప్రపంచంపై మానువళి మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ పెను ముప్పుపై అవగాహన కల్పించేందుకు వచ్చిందే వరల్డ్ కార్ ఫ్రీ డే. ప్రతీ ఏడాది సెప్టెంబర్ 22 న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ విశేషాలేంటో మీకోసం వరల్డ్ కార్ ఫ్రీ డే. అంటే వాహనదారులు ఈ ఒక్కరోజు కార్లను పక్కనపెట్టేసి మన కాళ్లకు పని చెప్పడన్నమాట. నడుచుకుంటూ వెళ్లడమో లేదంటే ఎంచక్కా సైకిళ్లనో, లేదా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం. తద్వారా పర్యావరణ వాయు కాలుష్యంపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశం. దీని వల్ల కలిగే ప్రయోజనాలను హైలైట్ చేసేలా ప్రతీ ఏడాది ఈ డేను పాటించడం ఆనవాయితీగా వస్తోంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యూఎన్ఈపీ) అధికారిక వెబ్సైట్ ప్రకారం ఆ ఈవెంట్ పౌరులకు కారులేకుండా వెళ్లడాన్ని పోత్సహిస్తుంది. సురక్షితమైన వాతావరణంలో నడక సైక్లింగ్‌ను ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది. ఫ్రాన్స్‌లోని పారిస్‌లో సెప్టెంబర్ 2015న ఈ డేను పాటించగా ఉద్గార ప్రభావం 40 శాతం తగ్గిందట.ముఖ్యంగా మనం రోజూ వాడే కార్లు, బైక్స్ నుంచి విడుదలయ్యే ఉద్గారాలు మొత్త కాలుష్యంలో 8శాతాన్ని ఆక్రమించాయంటేనే కాలుష్యతీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 1990ల నుండి ఐస్‌ల్యాండ్, యూకే మొదలైన దేశాలలో ఈ డేనునిర్వహిస్తుండగా, 2000లో కార్బస్టర్స్ (వరల్డ్ కార్‌ఫ్రీ నెట్వర్క్) ప్రారంభించిన వరల్డ్ కార్-ఫ్రీ డేతో ఈ ప్రచారం ప్రపంచవ్యాప్తమైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాల ద్వారా ఆయా సిటీ ప్లాన్లరు, రాజకీయ నాయకులు దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2007లో, ఇండోనేషియా రాజధాని నగరం జకార్తా, తన మొదటి కార్-ఫ్రీ డేని నిర్వహించింది. అంతేకాదు మే 2012 నుండి జకార్తాలో ప్రతి ఆదివారం కార్ రహిత దినోత్సవం నిర్వహించడం విశేషం. -
అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను: సవితారెడ్డి
‘‘జీవితంలో ఏదీ అసాధ్యం కాదు. అన్నీ సుసాధ్యమే. నూటికి నూరుపాళ్లు అనుకున్నది సాధించవచ్చు. నీ కలను నిజం చేసుకోవడానికి నీవే శ్రమించాలి. లక్ష్యాన్ని చేరే వరకు నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. అప్పుడు విజయం నీదై తీరుతుంది. అనారోగ్యం నిన్ను చూసి పారిపోతుంది. ఇందుకు అసలైన నిర్వచనం ఈ సాహసి జీవితం. ‘‘సాహసం చేయకపోతే జీవితంలో అనేక అనుభవాలకు, ఆనందాలకూ దూరంగా ఉండిపోతాం. అందుకే సాహసించాల్సిందే’’ అంటున్న ఈ సాహసి పేరు సవితారెడ్డి. ఆమె ఫ్యాషన్ డిజైనర్, అడ్వెంచరస్ టూరిస్ట్. హైదరాబాద్ కొంపల్లిలో ఉంటారు. మసాబ్ ట్యాంకు నుంచి రాజేంద్రనగర్, హెచ్‌సీయూ, నార్సింగి, రోడ్ నంబర్ 45 నుంచి ఐకియా, ఖాజాగూడల్లో ఉదయం పూట జనసంచారం తక్కువగా ఉన్న సమయంలో విశాలమైన రోడ్ల మీద సైక్లింగ్ చేస్తూ కనిపిస్తారు. ఈమె గత ఏడాది రెండు కాళ్లకు సర్జరీ చేయించుకున్నారు. ఫిట్నెస్ను తిరిగి సాధించుకోవడానికి సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తూ కశ్మీర్‌లోని ‘గ్రేట్ లేక్స్ ఆఫ్ కశ్మీర్’ట్రెకింగ్ టూర్‌కి సిద్ధమవుతున్నారు. మహిళకు సెలవేది? ఒక సామాన్యమైన కుటుంబం లో మహిళ జీవితం ఎలా ఉంటుంది? పిల్లల స్కూళ్లకు, కాలేజ్‌లకు సెలవులుంటాయి. భర్త ఆఫీస్‌కి సెలవులుంటాయి. తనకు మాత్రం సెలవు ఉండదు. తనకంటూ ఒక ఆటవిడుపు ఉండాలని కోరుకున్నా సరే సాధ్యపడదు. ఆ మహిళ గృహిణి అయినా ఉద్యోగి అయినా, ఎంటర్ప్రెన్యూర్ అయినా సరే... ఈ కుటుంబచిత్రమ్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. మహిళలు ఆ రొటీన్ నుంచి బయటకు వచ్చి కొద్దిగా రెక్కలు తగిలించుకోవాలంటారు సవిత. ఈ విషయంలో హైదరాబాద్ మహిళ ఓ అడుగు ముందుకేసిందని కూడా అన్నారామె. మహిళ తన సంతోషం కోసం ఇంకా ఇంకా గొంతు విప్పాలనేదే నా కోరిక. అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను. మరింత మందిని ప్రోత్సహిస్తున్నానని చెప్పారు సవిత. దేశమంతా పెరిగాను! సవిత తండ్రి ఎయిర్‌ఫోర్స్ అధికారి కావడంతో ఆమె బాల్యం దేశంలోని అనేక ప్రదేశాల్లో సాగింది. దాదాపుగా ముప్పై ఏళ్ల కిందట ఫ్యాషన్ డిజైనింగ్ ఒక కోర్సు రూపంలో యూనివర్సిటీ కరిక్యులమ్‌లో చేరిన తొలి రోజుల్లో, ఏ మాత్రం ఉపాధికి భరోసా కల్పించలేని ఆ కోర్సులో చేరాలనుకోవడమే పెద్ద సాహసం. అలాంటి రోజుల్లో ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారామె. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సొంతంగా తన పేరుతోనే ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్ ప్రారంభించారు. ‘‘పాతికేళ్ల పాటు చాలా సీరియెస్‌గా ఫ్యాషన్ ఇండస్ట్రీ కోసం పని చేశాను. నా యూనిట్ చూసుకుంటూ మధ్యలో కార్ ర్యాలీలు, ట్రెక్కింగులతో జీవితాన్ని సంతోషంగా గడిపాననే చెప్పాలి. 2017లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధిరోహించాను. అయితే అన్ని రోజులూ ఒకేరకంగా ఉండవు కదా! ఆ తర్వాతి ఏడాది కాళ్లు నాకు పరీక్ష పెట్టాయి. మాల్ అలైన్మెంట్ సమస్యతో బౌడ్ లెగ్స్గా మారిపోయాయి. ట్రెకింగ్ కాదు కదా మామూలుగా నడవడం కూడా కష్టమైంది. ఆ క్షణంలో నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధమయ్యాను. హై టిబియల్ ఆస్టియోటమీ సర్జరీ చేయించుకున్నాను. మోకాళ్ల నుంచి మడమల మధ్య ఉండే ఎముకను వంపు తీసి సరిచేసి ప్లేట్ అమర్చి స్క్రూలతో బిగిస్తారన్నమాట. గత ఏడాది ఆగస్టులో ఒక కాలికి, నవంబరులో మరో కాలికి సర్జరీ అయింది. కొంతకాలం వీల్ చెయిర్‌కి పరిమితమయ్యాను. తర్వాత వాకర్‌తో రోజులు గడిచాయి. ఇక ఇప్పుడు నా ఫిట్‌నెస్‌ని తిరిగి తెచ్చుకోవాలి. అందుకే ఈ సైక్లింగ్. వారంలో మూడు రోజులు సైక్లింగ్ రోజుకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు, మరో మూడు రోజులు గంటపాటు వాకింగ్... ఇదీ ఇప్పుడు నా రొటీన్. ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో కశ్మీర్లో ట్రెకింగ్‌కి సిద్ధమవుతున్నాను’’ అని చెప్పారు సవిత. ఇంత సాహసం అవసరమా? ‘‘నలభై ఎనిమిదేళ్ల వయసులో ఆ సర్జరీ అవసరమా, మందులతో రోజులు వెళ్లదీయవచ్చు కదా’ అని అడిగే వాళ్లకు నేను చెప్పే సమాధానం ‘అవసరమే’ అని. ఏ వయసులోనైనా మనిషి జీవితం తన చేతుల్లోనే ఉండాలి. అనారోగ్యం కారణంగా మరొకరి మీద ఆధారపడే పరిస్థితిలోకి జారిపోకూడదు. పైగా నలభై ఎనిమిది అంటే... అభిరుచులను కట్టిపెట్టి జీవితాన్ని నిస్సారంగా గడిపే వయసు కాదు. నాకు ఇష్టమైన కార్ ర్యాలీ, ట్రెకింగ్ వంటివేవీ చేయలేనప్పుడు, భారంగా అడుగులేసుకుంటూ రోజులు గడిపే జీవితం నాకు అవసరమా... అనేది నా ప్రశ్న. అందుకే ఈ సర్జరీలో సక్సెస్ రేట్ ఫిఫ్టీ– ఫిఫ్టీ అని తెలిసినప్పటికీ నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధపడ్డాను. మనం అనుకున్నట్లు జీవించడానికి అనారోగ్యాన్ని అధిగమించడానికి మొదట మానసికంగా సిద్ధం కావాలి. ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా, ఫిట్‌గా ఉన్నాను. నా డిజైనింగ్ స్టూడియోని నడుపుకుంటున్నాను. నా ట్రెకింగ్ ఇంటరెస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోగలను కూడా’’ అని ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వుతో చెప్పారు సవిత. – వాకా మంజులారెడ్డి -
సాహసయాత్ర: ఒంటి కాలితో సైకిల్ మీద 3,700 కిమీ
తిరువనంతపురం: మన మీద మనకు నమ్మకం.. గట్టి సంకల్పం ఉంటే చాలు.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించి పోరాడవచ్చు. సాధించాలనే తపన నీకుంటే.. విధి సైతం నీ ముందు తలవంచి తప్పుకుంటుంది అంటారు కార్య సాధకులు. ఈ మాటలను నిజం చేసి చూపాడు కేరళకు చెందిన ఓ వ్యక్తి. పక్షవాతం వచ్చి కుడి కాలు చచ్చు బడింది. దాంతో ఉద్యోగం కోల్పోయాడు. అయినా అతడు మనోధైర్యాన్ని కోల్పోలేదు. అంగ వైకల్యాన్ని పక్కకు పెట్టి.. ఒంటి కాలితో సైకిల్ తొక్కుతూ.. ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్ పాస్‌లలో ఒకటైన ఖార్డంగ్ లా చేరాలని భావించాడు. లద్ధాఖ్ నుంచి మొదలు పెట్టి 3,700 కిలోమీటర్లు ప్రయాణించాడు.. ఇంకా వెళ్తూనే ఉన్నాడు. అంగ వైకల్యం అతడికి అడ్డంకిగా మారలేదు. అతడి ప్రయాణం.. పయనం ఎందిరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ వివరాలు.. కేరళ, త్రిసూర్‌కు చెందిన మహ్మద్ అశ్రఫ్ కొన్నేళ్లుగా దుబాయ్‌లో కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేస్తూండేవాడు. సాపీగా సాగిపోతున్న అతడి జీవితంలో 2017లో పెద్ద కుదుపు చోటు చేసుకుంది. పెద్ద ప్రమాదానికి గురయ్యాడు మహ్మద్.. ఫలితంగా పక్షవాతం వచ్చి అతడి కుడి కాలు పడిపోయింది. దాంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ సందర్భంగా మహ్మద్ మాట్లాడుతూ.. ‘‘2017లో బైక్ యాక్సిడెంట్ అయ్యింది. 9 ఆపరేషన్లు చేశారు. ఏళ్ల పాటు ఆస్పత్రిలో ఉన్నాను. ఆ తర్వాత నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. వీటన్నింటిని చూసి తీవ్ర నిరాశకు గురయ్యాను. డిప్రెషన్ నుంచి బయటపడటం కోసం గతేడాది, ఏప్రిల్‌లో పర్వతాలు ఎక్కడం ప్రారంభించాను. దాంతో నాకు ఎక్కడాలేని ఉత్సాహం వచ్చింది. పర్వతారోహణతో ప్రేమలో పడ్డాను’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘ఈ ప్రయాణంలో నా లోపమే నా సామర్థ్యం అని తెలిసి వచ్చింది. దాంతో మనిషి తల్చుకుంటే ఈ లోకంలో సాధ్యం కానిది ఏది ఉండదని నిరూపించాలనుకున్నాను. నేను కుంగిపోయి ఉంటే.. మంచానికే పరిమితం అయి ఉండేవాడిని. కానీ నేను అలా ఉండాలని కోరుకోలేదు. సాధ్యం కానిది ఏది లేదని నిరూపించాలనుకున్నాను. అందుకే ఈ సాహసం చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని తెలిపాడు. ‘‘17,582 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్ పాస్‌లలో ఒకటైన ఖార్డంగ్ లాను సైకిల్ మీద చేరుకోవడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇప్పటికి 11 రాష్ట్రాలు దాటాను. రోజుకు 100-150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాను. నాతో పాటు ఓ మడతపెట్టగలిగే ఓ టెంట్, నిద్ర పోవడానికి ఉపయోగించే ఓ బ్యాగ్ తీసుకుని జర్నీ ప్రారంభించాను. రాత్రి పూట పెట్రోల్ బంకుల్లో నిద్రపోయేవాడిని’’ అని తెలిపారు. ‘‘ఈ ప్రయాణంలో నాకు ఎందరో మద్దతుగా నిలుస్తున్నారు. 1000 కిలోమీటర్లు ప్రయాణించి త్రిసూర్ నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ చేరుకున్నాను. నా ప్రయాణం గురించి తెలిసి నాకు ఆహారం, బస ఏర్పాటు చేశారు. డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇందుకు వారికి రుణపడి ఉంటాను’’ అన్నాడు. కృత్రిమ కాలు అమర్చుకోవచ్చు కదా అంటే.. ‘‘మూడేళ్లు ఆస్పత్రిలో ఉండే సరికి నా కుటుంబం పొదుపు చేసిన మొత్తం ఖర్చయ్యింది. ఈ టూర్ పూర్తయ్యాక డబ్బులు పోగేసి.. సర్జరీ చేయించుకుని.. కృత్రిమ కాలు పెట్టించుకుంటాను’’ అని తెలిపాడు మహ్మద్. -
పెట్రో నిరసన; 38 కి.మీ సైకిల్ తొక్కిన మంత్రి
కోల్‌కతా: పెట్రోల్ ధర కోల్‌కతాలో రూ.100 మార్కును చేరినందుకు నిరసనగా పశ్చిమబెంగాల్ రాష్ట్ర మంత్రి ఒకరు 38 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కారు. కార్మిక శాఖ మంత్రి బేచారాం మన్నా హుగ్లీలోని తన నివాసం నుంచి బుధవారం ఉదయం 8 గంటలకు సైకిల్‌పై బయలు దేరి, మధ్యాహ్నం 12.30గంటలకు కోల్‌కతాలోని అసెంబ్లీ భవనం వద్దకు చేరుకున్నారు. ఆయన వెంట కొందరు పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఫల్యాల్లో పెట్రో ధరలు పెరగడం కూడా ఒకటి. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.100కు చేరుకుంది. దీనిపై మేం నిరసన తెలిపాం’ అని తెలిపారు. సింగూర్ నుంచి టీఎంసీ తరఫున ఎమ్మెల్యే అయిన మన్నా..టాటా నానో ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 2000వ సంవత్సరం లో చేపట్టిన నిరసనలతో వార్తల్లోకెక్కారు. -
హిమాలయాలకు పెడల్ తొక్కారు...
24 ఏళ్ల సబిత మహతో, 21 ఏళ్ల శ్రుతి రావత్ ఇప్పుడు హిమాలయాలతో సంభాషిస్తున్నారు. ధ్వని లేదు. కాలుష్యం లేదు. నాలుగు కాళ్లు, నాలుగు పెడల్స్... అంతే. కశ్మీరులోని పీర్ పంజిల్ శ్రేణి నుంచి నేపాల్‌లోని మహాభారత శ్రేణి వరకు 5,600 కిలోమీటర్ల ‘ట్రాన్స్ హిమాలయా’ను వారు 85 రోజుల్లో సైకిళ్ల మీద చుట్టేయనున్నారు. స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా ‘ఒన్ బిలియన్ రైజింగ్’ కాంపెయిన్లో భాగంగా వారు ఈ సాహసకార్యం చేస్తున్నారు. ఫిబ్రవరి 2న మొదలైన వీరి యాత్ర ప్రస్తుతం సిక్కింలో కొనసాగుతోంది. వీరి పరిచయం... వన్ బిలియన్ అంటే 100 కోట్లు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ఫ్రపంచ జనాభాలోని ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు లేదా సగటున 100 కోట్ల మంది స్త్రీలు తమ జీవితకాలంలో ఒక్కసారైనా హింసకు లేదా అత్యాచారానికి లోనవుతున్నారు. ఆ 100 కోట్ల మంది స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకం గా చైతన్యం, ప్రచారం కలిగించాలని అమెరికన్ ఫెమినిస్ట్ ‘ఈవ్ ఎన్స్లర్’ మొదలెట్టిన కార్యక్రమమే ‘వన్ బిలియన్ రైజింగ్’. ఈ కార్యక్రమం లో భాగంగా పర్వతారోహకులు సబితా మహతో, శ్రుతి రావత్‌లు చేస్తున్న సైకిల్ యాత్రే ‘రైడ్ టు రైజ్’. హిమాలయ పర్వత శ్రేణులలో సైకిల్ తొక్కుతూ స్త్రీ హింసకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ దాదాపు 85 రోజుల పాటు వీరు యాత్ర చేస్తారు. ఫిబ్రవరి 2న నాటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఈ యాత్రను ప్రారంభించారు. అంతేకాదు తమ రాష్ట్రానికి చెందిన శ్రుతి రావత్ ఈ యాత్ర చేస్తున్నందున లక్షన్నర రూపాయల ఆర్థికసాయం కూడా చేశారు. ఇద్దరు అమ్మాయిలు బిహార్‌కు చెందిన సబిత మహతో, ఉత్తరాఖండ్‌కు చెందిన శ్రుతి రావత్ ఈ యాత్ర చేస్తున్నారు. అట్టారి సరిహద్దు దగ్గర మొదలెట్టిన ఈ యాత్ర ‘ట్రాన్స్ హిమాలయ’గా పేరు పొందిన ఆరు హిమాలయ శ్రేణులను కవర్ చేయనుంది. పంజాబ్, జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, నేపాల్‌ల గుండా హిమాలయాల అంచులను తాకుతూ వీరిరువురూ సైకిళ్ల మీద కొనసాగుతారు. 5 వేల కిలోమీటర్లకు పైగా ఉండే ఈ దూరం వీరు పూర్తి చేసేందుకు మూడునెలలు పట్టొచ్చు. అయినా మాకు ఇలాంటి సాహసాలు అలవాటే అని వీరు అంటున్నారు. అనడమే కాదు ఇప్పటివరకూ విజయవంతంగా యాత్ర చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. చేపలు అమ్మే వ్యక్తి కుమార్తె సబితా మహతో ఒక చేపలు పట్టే వ్యక్తి కుమార్తె. వీళ్లది బిహార్ అయినా తండ్రి కోల్‌కతా వెళ్లి చేపల పని చూసుకొని వస్తుంటాడు. ‘మా నాన్న నేను పర్వతారోహణ స్కూల్లో చేరతానంటే మనకెందుకమ్మా అన్నాడు. కాని డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్లో నేను 2014లో చేరి పర్వతాలు ఎక్కడం మొదలెట్టాక ఎంతో సంతోషపడ్డాడు. ఇప్పుడు మా నాన్న నేను ఏ పని చేసినా మెచ్చుకుంటాడు’ అంటుంది సబితా. ఈమె ఇప్పటికే హిమాలయాల్లోని అనేక ముఖ్య శిఖరాలను అధిరోహించింది. ఎవరెస్ట్ అధిరోహించాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ‘ఎవరెస్ట్‌ను ఎక్కిన దారిలోనే ఎవరూ దిగరు. నేను మాత్రం ఎక్కినదారిలోనే దిగి రికార్డు సృష్టించాలనుకుంటున్నాను’ అంటుంది. ప్రస్తుతం ఆమె స్పాన్సర్ల అన్వేషణలో ఉంది. స్త్రీల కోసం భూమి కోసం ‘స్త్రీల హింస అంటే జన్మనిచ్చిన తల్లి మీద హింస చేయడం. అది పురుషుడు కొనసాగిస్తున్నాడు. అలాగే నేల తల్లి మీద కూడా కాలుష్యం, విధ్వంసంతో పీడన కొనసాగిస్తున్నాడు. మేమిద్దరం చేస్తున్న యాత్ర స్త్రీలపై హింసను మానుకోమని చెప్పడమే కాదు అందమైన ప్రకృతి స్త్రీ మీద కూడా హింస నివారించమని అందరినీ అభ్యర్థిస్తుంది. మా సైకిల్ యాత్రలో ఆంతర్యం సైకిల్ కాలుష్యం కలిగించదు. ఇలాంటి ఎరుకతో ఈ భూమి తల్లిని కాపాడుకొని భావితరాలకు అందజేయమని కోరుతున్నాం’ అన్నారు సబిత, శ్రుతి. యాత్ర ఇలా సాగుతోంది ‘మేమిద్దరం రోజూ ఉదయం 7 నుంచి సాయంత్రం 7.30 వరకూ యాత్ర కొనసాగిస్తాం. ఆ తర్వాత ఆ గమ్యంలోని హోటల్లో బస చేస్తాం. ఇప్పటివరకూ మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఘటనలు జరగలేదు. దారి పొడవునా జనం మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు చెడ్డవాళ్లను చూసి మనుషులందరూ చెడ్డవాళ్లనుకోకూడదు. ఇంట్లోనే ఉంటే లోకం చాలా ప్రమాదం అనిపిస్తుంది. లోకాన్ని చూడటం మొదలెడితే ఇది కూడా ఎంతో ఆదరణీయమని అర్థమవుతుంది’ అన్నారు వారిద్దరూ. వారి యాత్ర విజయవంతం అవ్వాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
ఆచార్య: సైకిల్ మీద సెట్స్‌కు వెళ్లిన సోనూసూద్
లాక్డౌన్లో వలస కార్మికులను స్వస్థలాలకు చేరవేసి ఎందరో పాలిట దేవుడిగా మారాడు నటుడు సోనూసూద్. కష్టాల్లో ఉన్న చాలామందికి ఆర్థిక సాయం చేస్తూ రియల్ హీరోగా పేరు గాంచాడు. ఇటీవల అల్లుడు అదుర్స్‌లో కనిపించిన సోనూసూద్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా అతడు సినిమా సెట్స్‌కు సైకిల్ మీద వెళ్లాడు. హైదరాబాద్ రోడ్ల మీద సైకిల్ తొక్కుకుంటూ షూటింగ్‌కు వెళ్లిన సోనూసూద్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాలుష్యాన్ని తగ్గించాలన్న సందేశంతో పాటు ఇలా సైక్లింగ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండొచ్చని చెప్పకనే చెప్తున్నారు హీరో సోనూసూద్. అతడి సింప్లిసిటీకి, ఫిట్నెస్ మీద ఉన్న శ్రద్దకు హ్యాట్సాఫ్ చెప్తున్నారు నెటిజన్లు. ఇక 'ఆచార్య' సినిమా విషయానికి వస్తే దీన్ని మే 13న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు సినీపండితులు. చదవండి: కరోనా ప్రమాద ఘంటికలు: సోనూసూద్ స్పెషల్ డ్రైవ్ -
మంచు లక్ష్మి @100 కి.మీ రైడ్
-
పెట్రో బేజారు..సైకిల్ షి‘కారు’
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఆరోగ్యార్థులకు సైక్లింగ్ ఒక మంచి హాబీగా మారిపోయింది. ముఖ్యంగా ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు చాలా మంది నిర్ణీత దూరం నుంచి ఆఫీసులకు సైక్లింగ్ ద్వారానే చేరుకుంటున్నారు కూడా. మరోవైపు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సైక్లిస్టులు మరింత పెరిగారు. ఈ నేపథ్యంలో కార్యాలయాలకు రాకపోకల్లో భాగంగా కొంత దరాలకు సైక్లింగ్ మేలని భావిస్తున్నవారు... తమ కార్లకు సైకిల్‌ను ఇలా తగిలించుకుని మరీ తీసుకుపోతున్నారు. చదవండి: వయసును వెనుకే వదిలి పెట్టెయ్ -
వయసును వెనుకే వదిలి పెట్టెయ్
60 ఏళ్ల శోభనా కామినేని 600 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై వరకు తన భర్త, కుమార్తెతో కలిసి సైకిల్ మీద ప్రయాణించారు. స్త్రీలు ఏ వయసులోనైనా ఏదైనా సాధించగలరు... ఆరోగ్యాన్ని కాపాడుకుంటే విజయాన్ని అందుకోగలరు అనే సందేశం ఇవ్వడానికే ఈ యాత్ర చేశానని శోభన అన్నారు. శోభనా కామినేని నటుడు చిరంజీవికి వియ్యపురాలు. ఉపాసన తల్లి. రోజుకు వంద కిలోమీటర్ల చొప్పున సైకిల్ తొక్కుతూ ఆరు రోజుల్లో పూర్తయిన ఈ స్ఫూర్తివంతమైన యాత్రా విశేషాలు... జీవితాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా ప్రారంభించాలి. ఉత్సాహపరుచుకోవాలి. ఉరకలెత్తించాలి. జీవితాన్ని ప్రతి క్షణం పరిపూర్ణంగా అనుభవించాలి. మన దేశంలో ఒకటి రెండు దశాబ్దాల కింద వరకూ 60 ఏళ్లు అనేది చాలా పెద్ద వయసుగా భావన ఉండేది. 60 రాగానే వయసైపోయింది కదా అనే మాట వినిపించేది. కాని ఇప్పుడు 60 అనేది దాదాపుగా ఒక మధ్యవయసు అనే పునరుత్సాహం చాలామందిలో కనిపిస్తోంది. ముఖ్యంగా స్త్రీలు 60 అనే అంకెను ఒక భారంగా ఎంచి తద్వారా శారీరకంగా మానసికంగా అలసటను దరి చేరనివ్వరాదని, నిర్లిప్తతను కలిగి ఉండరాదని స్ఫూర్తి నింపేవారు చాలామంది ఉన్నారు. అలాంటివారిలో అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని ఒకరు. ఛాలెంజ్‌ను స్వీకరించు... ఆరోగ్యరంగ దిగ్గజం ప్రతాప్ రెడ్డి కుమార్తె శోభనా కామినేని అపోలో హాస్పిటల్స్ విజయానికి కారణకర్తగా మాత్రమే కాక నటుడు చిరంజీవికి వియ్యపురాలుగా కూడా అందరికీ తెలుసు. ఉపాసన తల్లిగా రామ్ చరణ్ అత్తగారిగా అమె తరచూ వార్తల్లో ఉంటారు. ఇటీవల ఆమె తన 60వ పుట్టినరోజును భిన్నంగా... సందేశాత్మకంగా చేసుకోదలిచారు. ‘ఛాలెంజ్‌ను స్వీకరించు.. నెరవేర్చు’ నినాదం తో ఆమె హైదరాబాద్ నుంచి చెన్నై వరకూ ఏకంగా 642 కిలోమీటర్ల సైకిల్ యాత్ర పెట్టుకున్నారు. 60 ఏళ్ల వయసులో చాలా ఎనర్జీని డిమాండ్ చేసే ఈ పనిని చేసి చూపించాలనుకున్నారు. ఇంకేముంది.. రంగంలో దిగారు. భర్త, కుమార్తెతో కలిసి... శోభనా కామినేని సైకిల్ యాత్ర సంకల్పాన్ని విని ఆమె భర్త అనిల్ కామినేని, కుమార్తె అనుష్పలా కామినేని తాము కూడా పాల్గొంటాం అని ఉత్సాహ పడ్డారు. ముగ్గురు హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ నుంచి యాత్రను మొదలుపెట్టారు. ‘దారిలో చాలామంది నన్ను ఈ యాత్ర ఎందుకు చేస్తున్నారని అడిగారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఏ పనైనా చేయొచ్చని వయసును కేవలం ఒక అంకెగా మాత్రమే చూడాలని చెప్పడానికే చేశాను అని జవాబిచ్చాను.’ అని చెప్పారు శోభనా కామినేని. ఆమె సైకిల్ యాత్ర 6 రోజుల పాటు సాగింది. రోజుకు వంద కిలోమీటర్ల లెక్కన సైకిల్ తొక్కారు. ఇది చిన్న విషయం కాదు. ‘తెల్లవారుజామున మూడున్నరకంతా నిద్ర లేవడం కొంచెం కష్టమనిపించినా లేచి ప్రయాణం కట్టాను. ఒకటి రెండుసార్లు డీహైడ్రేషన్‌గా అనిపించింది. తగిన ఆహారం తీసుకుంటూ యాత్ర సాగించాను. దారిలో పంట పొలాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించాయి. మా తాతగారు రైతు. మా నాన్నను మెడిసిన్ చదివించారు. ఆ జ్ఞాపకాలు చుట్టుముట్టాయి’ అన్నారామె. మాత్రోత్సాహం కూతురు ఏదైనా మంచి పని చేస్తే పుత్రికోత్సాహం అనొచ్చు. తల్లి ఏదైనా మంచి పని చేస్తే ఆ కూతురికి కలిగేది మాత్రోత్సాహం అనాలేమో. తన తల్లి శోభన చేసిన యాత్రను చూసి కుమార్తె ఉపాసన చాలా సంతోష పడ్డారు. ‘మా అమ్మను చూసి నేనెప్పుడూ గర్వపడుతుంటాను’ అని ట్వీట్ చేశారామె. తల్లి తన తాతను కలవడానికి చేసిన ప్రయాణంగా, పిల్లలకు ఒక తార్కాణంగా నిలవడానికి చేసిన ప్రయత్నంగా కూడా ఉపాసన ఈ సైకిల్ యాత్రను చూశారు. కొత్త సంవత్సరం ఇలాంటి ఉత్సాహకరమైన పనులను వినడం బాగుంది కదూ. – సాక్షి ఫ్యామిలీ -
సైకిల్ తొక్కిన సోనియా గాంధీ
పణజి: వాయు కాలుష్యం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో పాటు, కరోనా సెకండ్ వేవ్ విజృంభన సైతం మొదలవడంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తాత్కాలికంగా తన నివాసాన్ని దేశ రాజధాని ఢిల్లీ నుంచి గోవాకి మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆవిడ తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా సోనియా గోవా వీధుల్లో, బాడీగార్డుల నడుమ సైకిల్ తొక్కుతూ, జాగింగ్ చేస్తూ శారీరక కసరత్తులు మొదలుపెట్టారు. ఆవిడను గుర్తుపట్టిన పర్యాటకులు, అభిమానులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు. కొందరు స్థానికులు సోనియా సైకిల్ తొక్కుతున్న ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో ప్రస్తుతం అవి దేశవ్యాప్తంగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. (అహ్మద్ పటేల్ మృతి.. సోనియా భావోద్వేగం) -
ఉసురు తీసిన నాలా
నేరేడ్మెట్ (హైదరాబాద్): అమ్మా... కాసేపు ఆడుకొని వస్తానని తల్లికి చెప్పిందా చిన్నారి. సరదాగా సైకిల్ తొక్కుదామని బయటికి వెళ్లింది. ఇక ఎప్పటికీ కనిపించనంత దూరానికి వెళ్లిపోయింది. నోరు తెరిచిన ఓపెన్ నాలా ఆ పన్నెండేళ్ల బాలికను మింగేసింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యా నికి అభంశుభం తెలియని చిన్నారి బలైపోయింది. సైకిల్ తొక్కడానికి వెళ్లి అదృశ్యమైన బాలిక చివరకు చెరువులో శవమై తేలింది. కనిపించ కుండా పోయిన దాదాపు పన్నెండు గంటల తరువాత నాలా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని బండచెరువులో బాలిక విగతజీవిగా లభించింది. ఆడుతూ పాడుతూ ఇంట్లో తిరిగిన తమ గారాలపట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద సంఘ టన హైదరాబాద్‌లోని నేరేడ్మెట్ ఠాణా పరిధిలో... ఈస్ట్ దీనదయాళ్‌నగర్‌లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈస్ట్ దీనదయాళ్నగర్ రోడ్ నం.2లోని అద్దె ఇంట్లో ప్రైవేట్ ఉద్యోగి అభిజిత్ కపూరియా, సుకన్య దంపతులు నివసిస్తున్నారు. రెండు నెలల కిందటే వీరు కాకతీయనగర్ నుంచి దీనదయాళ్‌నగర్‌కు మారారు. వీరికి కూతురు సుమేధ కపూరియా (12), ఒక కుమారుడు ఉన్నారు. కూతురు సుమేధ స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. గురు వారం సాయంత్రం సుమారు 6.15 గంటల ప్రాంతంలో సుమేధ సైకిల్ తొక్కడానికి ఇంట్లోంచి బయటకు వెళ్లింది. అంతర్గత రోడ్లపై 6.26 వరకు సైకిల్ తొక్కుతున్నట్టు కాలనీలోని సీసీ టీవీలో రికార్డయింది. ఆ తరువాత బాలిక అదృశ్యమైంది. రాత్రి 7 గంటలు కావస్తున్నా కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కాలనీలో వెతికారు. ఎక్కడా కనిపించలేదు. తెలిసిన వారిని అడిగినా జాడ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి కాలనీలోని నాలాలు పొంగిపోర్లుతున్నాయి. ప్రమాదవశాత్తు కూతురు నాలాలో పడిపోయిందా? అనే అనుమానం కలిగింది. బాలిక అదృశ్యమైన విషయం స్థానికులకు తెలియడంతో వారూ తల్లిదండ్రులతో కలిసి వెతకడం ప్రారంభించారు. మూడు గంటల పాటు గాలించినా జాడ తెలియలేదు. గురువారం సాయంత్రం కాలనీలో సైకిల్‌పై వెళుతున్న బాలిక సుమేధ (సీసీ టీవీ దృశ్యం) పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాత్రి 10 గంటలకు కాలనీకి చేరుకొని అర్థరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం 8 గంటలకు రెస్క్యూ బృందం వచ్చి గాలింపు మొదలుపెట్టింది. కాలనీలోని మురుగునీరు వెళ్లే బండచెరువు నాలాలో రెస్క్యూ బృందం వెతుకుతుండగా సుమేధ తొక్కిన సైకిల్ లభించింది. అదే నాలా వెంట గాలిస్తూ సుమారు రెండు కి.మీ.దూరంలో ఉన్న బండచెరువు వద్దకు వెళ్లిన రెస్క్యూ బృందానికి బాలిక సుమేధ విగతజీవిగా లభించింది. మృతదేహాన్ని బయటకు తీసిన అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. కాసేపు ఆడుకొని వస్తానని చెప్పి వెళ్లిన కూతురు...చెరువులో శవంగా కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించడం చూసి కాలనీ వాసులు కంటతడిపెట్టారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నేరేడ్మెట్ సీఐ నర్సింహ్మాస్వామి చెప్పారు. ఎవరు తెచ్చిస్తారు? తన కూతురు మరణానికి కారణం ఎవరని సుమేధ తండ్రి అభిజిత్ కపూరియా ప్రశ్నించారు. నాలాను నిర్లక్ష్యంగా వదిలేయడం కారణంగానే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నామని, సుమేధ ప్రాణాలను ఎవరు తీసుకొస్తారంటూ కన్నీరు మున్నీరయ్యారు. జీహెచ్ఎంసీ తీరుపై ఆగ్రహం ఓపెన్‌నాలా వల్ల వద్ద రక్షణ చర్యలు చేపట్టకపోవడం మూలంగానే బాలిక సుమేధ ప్రమాదానికి గురై మరణించిందని స్థానికులు తీవ్రంగా విమర్శించారు. బాలిక అదృశ్యమైన విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులకు తెలియజేసినా స్పందించలేదని, సకాలంలో గాలింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహారించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు బాలిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఈస్ట్ దీనదయాళ్నగర్ను సందర్శించి నాలా పరిస్థితి, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. బాలిక మృతిపై విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. కలివిడిగా ఉండేది చిన్నారి సుమేధ మా దగ్గర భరత నాట్యం నేర్చుకుంటోంది. రోజూ మధ్యాహ్నాం వేళ ఒక గంట భరత నాట్యం నేర్చుకునేది. మా కాలనీకి వచ్చి రెండు నెలలే అవుతున్నా...గడిచిన నెలన్నర రోజులుగా భరతం నాట్యం నేర్చుకోవడానికి వచ్చేది. నాట్యంలో మెళకువలను ఇట్టే గ్రహించేది. స్నేహితులతోనూ కలివిడిగా ఉండేది. షీ ఈజ్ వెరీ షార్ప్. నాట్యం నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మా ఇంట్లోని కుక్కపిల్లతో చాలాసేపు ఆడుకునేది. పెట్స్ అంటే ఇష్టమని సుమేధ చెబుతుండేది. మాతో కలిసిపోయి ఆడుతూపాడుతూ ఉండే చిన్నారి నాలాలో పడి మృతి చెందటం బాధ కలిగించింది. –అర్షిత, నాట్య శిక్షకురాలు ప్రమాదమేనా? బాలిక సుమేధ అదృశ్యం, మృతి సంఘటన ప్రమాదమా? లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు నాలాలో పడి.. అందులో కొట్టుకుపోయి చనిపోయిందా? ఎవరైనా పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైకిల్ తొక్కుతుండగా బాలికతో ఎవరైనా మాట్లాడారా? నాలాలో పడితే రెండు కి.మీ. దూరంలోని చెరువు వరకు కొట్టుకుపోయినా.. బాలిక ముక్కు నుంచి రక్తం రావ డం మినహా ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవ డంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. ‘సైకిల్‌పై తిరుగుతూ కనిపించిన సుమేధ నాలా వద్ద నుంచి వెళుతుండగా చూశాను. తరువాత ఆమె కోసం వెతుకుతున్నారని తెలిసి నాలా ప్రాంతంలో గాలించాం’ అని కాలనీవాసి జ్ఞానకుమార్ తెలిపారు. -
విషాదం: చెరువులో శవమై తేలిన సుమేధ
సాక్షి, మేడ్చల్: నేరెడ్‌మెట్‌లో అదృశ్యమైన సుమేధ కపూరియా (12) కేసు విషాదంతమైంది. బాలిక మృత దేహం శుక్రవారం మధ్యాహ్నం బండచెరువులో లభ్యమైంది. కాగా, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోషిమాత నగర్ కాలనీలో నివాసముండే సుమేధ గురువారం సాయంత్రం సైకిల్ తొక్కుతూ బయటకు వెళ్లి అదృశ్యమైంది. ఆమె ఎంతకూ తిరిగి ఇంటికి రాకపోడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ప్రమాదవశాత్తూ నాలాలో పడిపోయి ఉండొచ్చనే అనుమానంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందితో ముమ్మర తనిఖీలు చేయించగా.. బండ చెరువులో బాలిక విగత జీవిగా కనిపించింది. (చదవండి: ఇంటి నుంచి బయటికెళ్లిన బాలిక అదృశ్యం) -
బాలిక అదృశ్యం: నాలా వద్ద సైకిల్
-
బాలిక అదృశ్యం: కిడ్నాప్ చేశారేమో!
సాక్షి, మేడ్చల్: సైకిల్ తొక్కుకుంటూ ఇంటినుంచి బయటికెళ్లిన ఓ బాలిక అదృశ్యం కావడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. జిల్లాలోని నేరెడ్మేట్ కాకతీయ నగర్లో గురవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగుచూసింది. కాకతీయ నగర్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నసుమేధ కపురియా (12) నిన్న సాయంత్రం సైకిల్ తీసుకొని బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తిగిరి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా బాలిక ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, నిన్న కురిసిన భారీ వర్షానికి దీన్ దయాళ్ నగర్లో నాళాలు పొంగిపొర్లాయని స్థానికులు పోలీసులకు చెప్పారు. దీంతో నాలా వద్ద జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీంలతో గాలింపు చేపట్టగా బాలిక సైకిల్ కనిపించింది. సుమేధ నాలాలో పడిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖైరాలీ పబ్లిక్ స్కూల్లో సుమేధ 5 వ తరగతి చదుతున్నట్టు తెలిసింది. (చదవండి: ప్రగతి భవన్: ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం) కిడ్నాప్ చేశారు..! బాలిక గల్లీలో ఉన్నపెద్ద నాలాలో పడి ఉండొచ్చనే అనుమానంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సహాయంతో పోలీసులు బాలిక ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అక్కడ ఉన్న ఓపెన్ నాలాలో బాలిక సైకిల్ లభించడంతో మోరీపై ఇళ్ల ముందున్న పైకప్పును తొలగంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తమ పాప నాలాలో పడి తప్పిపోయిందని అనుకోవడం లేదని బాలిక తల్లి సుకన్య చెప్తున్నారు. ఎవరైనా తమ బిడ్డను కిడ్నాప్ చేశారేమోనని భావిస్తున్నట్టు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతారావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాలిక ఆచూకీ కోసం అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. (చదవండి: కరోనాతో మాదాపూర్ ఎస్ఐ మృతి) -
సైకిల్‌వాలా జిందాబాద్!
సాక్షి, హైదరాబాద్: త్వరలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఖైరతాబాద్ జోన్లో ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయి. స్మార్ట్ సిటీస్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం చేపట్టిన ‘ఇండియా సైకిల్ 4 చేంజ్ చాలెంజ్ (సీ4సీ చాలెంజ్)’ అమలు చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. సైకిల్ ఫ్రెండ్లీ సిటీస్‌గా సీ4సీ చాలెంజ్‌కు నమోదైన 95 నగరాల్లో రాష్ట్రం నుంచి హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్‌లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్రజల్లో సైకిల్ వినియోగాన్ని పెంచేందుకు కూడా ఈ కార్యక్రమాన్ని అనువుగా మలచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(హుమ్టా) పూర్తి స్థాయిలో తగిన సాంకేతిక సహకారం, సలహాలు అందిస్తాయి. పైలట్ ప్రాజెక్ట్‌గా తొలుత ఖైరతాబాద్ జోన్లో అమలు చేసేందుకు హెచ్ఎండీఏ, హుమ్టా, జీహెచ్ఎంసీలు నిర్ణయించాయి. అందుకుగాను ఆ విభాగాల అధికారులతోపాటు ట్రాఫిక్ పోలీసులు సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటు తదితర అంశాలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. జోన్‌లోని 23 కి.మీ.ల పొడవునా(రెండు వైపులా వెరసి 46 కి.మీ.) ఏడు సైకిల్ ట్రాక్‌ల మార్గాల్ని గుర్తించారు. తొలిదశలో పది కి.మీ.ల మేర అమలు చేస్తారు. ఎదురయ్యే సాధకబాధకాలు, ప్రజల స్పందన, ఫలితాన్ని బట్టి మిగతా మార్గాల్లో ఏర్పాటు చేస్తారు. సైకిల్‌ట్రాక్‌లు అందుబాటులోకి తెచ్చే ప్రాంతాల్లో తగిన సైనేజీలు, రోడ్మార్కింగ్లు, బారికేడింగ్, ప్లగ్ ప్లే బొల్లార్డ్ వంటివి ఏర్పాటు చేస్తారు. సైక్లిస్టుల భద్రతకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు పూర్తి సహకారం అందజేస్తారు. దశలవారీగా 450 కి.మీ.ల మేర.. ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం మెట్రో రైలు స్టేషన్లు, ఆర్టీసీ బస్ టెర్మినళ్లు, డిపోలు,ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్ద అందుబాటులో ఉన్న స్థలాల్లో పబ్లిక్ బైసికిల్ షేరింగ్ డాక్స్ (పీబీఎస్) ఏర్పాటు చేస్తారు. భవిష్యత్‌లో దశలవారీగా సైబరాబాద్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, చార్మినార్, మెహదీపట్నం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్, కోకాపేట ప్రాంతాల్లో 450 కి.మీ.ల మేర సైకిల్మార్గాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ దూర ప్రయాణాలకు సైకిల్ ప్రయాణం మేలని, అందుకు తగిన మార్గాలు అవసరమని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. చాలెంజ్.. రెండు దశల్లో.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు సీ4సీ కార్యక్రమాన్ని రెండు దశల్లో అమలు చేస్తారు. తొలి దశలో పైలట్‌గా సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటు ప్రణాళిక, ప్రజల్లో అవగాహన కల్పించడం, వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం వంటివి ఉంటాయి. మొదటి దశకు అక్టోబర్ 14 చివరి తేదీ. దీనికి సంబంధించి 95 నగరాల నుంచి అందిన ప్రణాళికలు, అమలు, వ్యూహాలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని రెండో దశకు 11 నగరాలను ఎంపిక చేస్తారు. అక్టోబర్ 28 వరకు ఈ ఎంపిక పూర్తిచేస్తారు. ఎంపికైన నగరాలకు కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ కోటి రూపాయలు చొప్పున అవార్డుగా అందజేస్తుంది. ఎంపికైన నగరాలకు జాతీయ, అంతర్జాతీయ నిపుణులు తగిన సలహాలిస్తారు. రెండో దశ సైకిల్నెట్వర్క్ కార్యక్రమం వచ్చే సంవత్సరం మే నెలాఖరు వరకు పూర్తికాగలదని భావిస్తున్నారు. -
రకుల్ ప్రీత్, మంచు లక్ష్మి సైక్లింగ్ ఫోటోలు
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తున్న ఫోటోలను, వీడియోలను ఎప్పుడూ తన సోషల్‌మీడియా అకౌంట్లలలో షేర్ చేస్తూ తన అభిమానుల్లో స్ఫూర్తి నింపుతూ ఉంటుంది. మొన్న జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను షేర్ చేసిన రకుల్ తాజాగా వర్షంలో తన స్నేహితులలో కలిసి సైక్లింగ్ చేసిన వీడియోను షేర్ చేసింది. వీడియోతో పాటు కొన్ని ఫోటోలను కూడా రకుల్ షేర్ చేసింది. దీనిలో మంచు లక్ష్మి కూడా పాల్గొన్నారు. సైక్లిస్ట్ ఆదిత్యా మెహతా బృందంతో కలిసి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి కలిసి 30 కిలోమీటర్లు సైక్లింగ్ చేసినట్లు రకుల్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హైదరాబాద్‌లోని సుచిత్ర ఎక్స్ రోడ్ నుంచి తూప్రాన్ రోడ్డు మీదుగా వాళ్లిద్దరూ సైక్లింగ్ చేసినట్లు రకుల్ తెలిపింది. 'థ్యాంక్యు.. చాలా ఇష్టపడి చేశాం. త్వరలో 100 కిలోమీటర్ల సైక్లింగ్ కూడా చేస్తాం' అంటూ రకుల్ ప్రీత్ ట్వీట్ చేస్తూ నవ్వుతూ ఉన్న ఎమోజీని కూడా తన పోస్ట్‌కు జోడించింది. Thankuuuu we loved it .. here is to doing a 100km soon hopefully 😝 https://t.co/MidRxabAad — Rakul Singh (@Rakulpreet) August 19, 2020 చదవండి: కరణం మల్లేశ్వరి పాత్రలో రకుల్ -
చిన్నోడి సాయం ఘనం..
నెల్లూరు(పొగతోట): ఎదుటివారు కష్టాల్లో ఉంటే కొందరు తట్టుకోలేరు. ఏదో రకంగా వెంటనే సాయం చేస్తారు. తలపెట్టిన కార్యాన్ని నెరవేరుస్తారు. దీనికి వయసుతో సంబంధం లేదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాడు ఐదేళ్ల బాలుడు అనీశ్వర్. కోవిడ్ –19 రిలీఫ్ ఫండ్ సేకరణ కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. సైక్లింగ్ చేసి నిధులు సేకరించారు. బాలుడి తల్లి నెల్లూరు జిల్లా వాసి కావడం విశేషం. ♦కోవూరు మండలం యల్లాయపాళేనికి చెందిన వాల్మేటి శేషారెడ్డి, సుజాతమ్మ దంపతుల కూతురు వి.స్నేహ. శేషారెడ్డి ఆర్మీలో 24 ఏళ్లకుపైగా సేవలందించాడు. ఆయన రెండు సంవత్సరాల క్రితం మరణించారు. ♦స్నేహను చిత్తూరు నగరంలోని గిరింపేటకు చెందిన కుంచాల అనిల్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. బ్రిటన్‌లోని వారింగటన్ సిటీలో ఉంటున్నారు. వారి కుమారుడే అనీశ్వర్. ఏం చేశాడంటే.. ♦తొలుత అనీశ్వర్ క్రికెట్ ఛాలెంజ్‌ను స్వీకరించాడు. హల్ట న్ టీచింగ్ హాస్పిటల్ ఫౌండేషన్ తరఫున క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు. ♦వెయ్యి హిట్లు కొట్టి రూ.3 లక్షలు సేకరించి ట్రస్ట్‌కు అందజేశాడు. ♦తర్వాత సైక్లింగ్‌పై దృష్టి పెట్టాడు. మే 27వ తేదీన ఐదురుగు స్నేహితులతో కలిసి బృందంగా ఏర్పడి ఇంటి పరిసరాలు, పార్కుల చుట్టూ సైక్లింగ్ చేయడం ప్రారంభించాడు. ♦దీనికి లిటిల్ ఫెడరల్స్ అనీష్ అండ్ ఫ్రెండ్స్ అని పేరు పెట్టారు. ♦నెలరోజులపాటు సాగిన ఈ ఛాలెంజ్‌లో 4,700 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. దీనిని గివ్ ఇండియా వెబ్సైట్ ద్వారా విరాళాల కోసం ప్రచారం చేశారు. ♦ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. రూ.7 లక్షల వరకు సేకరించారు. ♦రూ.3 లక్షలను యూకే ప్రభుత్వానికి, రూ.3.70 లక్షలను గివ్ ఇండియా వెబ్సైట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థకు అందజేశామని అనీశ్వర్ తల్లిదండ్రులు సాక్షికి తెలిపారు. నిధులను వైద్యుల రక్షణ కోసం వినియోగించాలని కోరామన్నారు. వీడియో చూసి.. ♦అనీశ్వర్ యూకేజీ చదువుతున్నాడు. ఓ రోజు టీవీలో సర్ థామస్ మూర్ (100) అనే వృద్ధుడి వీడియో చూశాడు. ♦కోవిడ్ బాధితులకు సాయం చేసేందుకు విరాళాలు సేకరించాలని మూర్ తన గార్డెన్ చుట్టూ సహాయకుడి సాయంతో వంద రౌండ్లు నడవడం చూశాడు. అనీశ్వర్ ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్నాడు. ♦తాను కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం క్రికెట్, సైక్లింగ్‌లో పాల్గొంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు ప్రోత్సహించారు. -
చిత్తూరి చిన్నోడి కోసం యూకే ఎంపీలు క్యూ
లండన్: సాయం చేయాలనుకునే వారికి ఎదుటి వారి కష్టాలు చూసి స్పందించే మనసు ముఖ్యం. ఇతరులకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే చాలు.. ఏదో ఓ రకంగా మనం తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. దీనికి వయసుతో పని లేదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాడు ఓ ఐదేళ్ల చిన్నారి. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో ఎందరో రోడ్డున పడ్డారు. తినడానికి తిండి లేక నానా తిప్పలు పడ్డారు. ఇలాంటి కష్టకాలంలో అన్నార్తులను ఆదుకునేందుకు ఎందరో ముందుకు వచ్చారు. తోచిన సాయం చేశారు. మాంచెస్టర్‌లో ఉంటున్న చిత్తూరు జిల్లాకు చెందిన అనీశ్వర్ కుంచాలా అనే ఐదేళ్ల చిన్నారికి కూడా సాయం చేయాలనే కోరిక కలిగింది. తనేమో ఇంకా చిన్న పిల్లాడే. సాయం చేయాలనుకుంటే తన పిగ్గి బ్యాంక్‌లో ఉన్న డబ్బును ఇచ్చేసి ఊరుకోవచ్చు. కానీ అనీశ్వర్ భారీ మొత్తంలో సాయం చేయాలనుకున్నాడు. (ఇవి ఎవరికి ఇవ్వాలో సలహా ఇవ్వండి: ఉపాసన) ఈ క్రమంలో సర్ థామస్ మూర్ అనే 100 ఏళ్ల వృద్ధుడు అనీశ్వర్‌కు ఓ మార్గం చూపించాడు. యూకేలో కరోనాతో బాధపడేవారికి వైద్యం అందించడం కోసం 100 ఏళ్ల వయసులో థామస్ మూర్ ఓ సర్కిల్ చుట్టు 100 రౌండ్లు నడిచి విరాళాలు సేకరించాడు. ఈ సంఘటనతో స్ఫూర్తి పొందిన అనీశ్వర్.. మరో 60 మంది పిల్లలతో కలిసి ‘లిటిల్ పెడలర్స్ అనీశ్వర్ అండ్ ఫ్రెండ్స్’ పేరుతో మేలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. వీరంతా కలిసి దాదాపు 3200 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి కరోనా బాధితుల కోసం విరాళాలు సేకరించాడు. ఇలా మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు సాధించాడు. ఈ మొత్తాన్ని కరోనాపై పోరు సాగిస్తున్న భారత్‌కు అందించాడు. ప్రస్తుతం యూకేకు సాయం చేయడం కోసం క్రికెట్ చాంపియన్‌షిప్ ప్రారంభించాడు అనీశ్వర్. (అందం.. సేవానందం..) ప్రస్తుతం ఈ చిన్నారి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ బ్రిటీష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అనీశ్వర్ ఆశయాన్ని తెగ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిన్నారి యూకేలో సెలబ్రిటీ అయ్యాడు. బ్రిటీష్ రాజకీయ నాయకులు అనీశ్వర్‌ను కలిసి.. ప్రశంసిస్తున్నారు. వారింగ్టన్ సౌత్ ఎంపీ ఆండీ కార్టర్ అనీశ్వర్ ఆశయాన్ని మెచ్చుకున్నారు. మరో ఎంపీ షార్లెట్ మేనేజర్ ఆగస్టు 6న అనీశ్వర్‌ను కలవనున్నారు. Ever since @UttaraVarmaTOI's article about 5 year old #Telugu boy Aneeshwar's fundraising for COVID I've talked about him. My friend @poonamkaurlal asked to say Namaste so Telugu diaspora contact, @uday_nagaraju, fixed a wonderful chat. Bike ✔ Now on to 🏏 4 Lakhs & counting 🙏 pic.twitter.com/mJ0Nt3ZIOo — Dr Andrew Fleming (@Andrew007Uk) June 28, 2020 -
వయసు ఐదేళ్లు... కానీ మనసు ఎంత గొప్పదో!
లండన్: మీ అందరికి శ్రీమంతుడు సినిమాలో శృతి హాసన్ చెప్పే డైలాగ్ గుర్తుంది కదా... చాలా ఇచ్చింది మా ఊరు తిరిగివ్వక పోతే లావైపోతానంటూ ఆమె చెప్పిన డైలాగ్‌ను ఐదేళ్ల వయసులోనే ఓ బుడతడు ఆచరించి చూపిస్తున్నాడు. లిటిల్ పెడ్లర్స్ అనీష్ అండ్ హిస్ ఫ్రెండ్స్.. 30 డేస్ సైక్లింగ్ ఛాలెంజ్ పేరుతో ఒక ఫండ్ రైసింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. తన మాతృభూమి భారతదేశం కోసం ఈ చిన్నారి నిధులను సేకరిస్తున్నాడు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు సాయం అందించడానికి ఈ నిధులను సేకరిస్తున్నారు. తల్లిదండ్రుల సహకారంతో ఈ బుడతడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ బాలుడి పేరు కుంచల ఆశిన్వర్. చిత్తురు జిల్లాకు చెందిన స్నేహ, అనిల్ దంపతుల కుమారుడు. వీరి కుటుంబం ఇంగ్లండ్‌లోని వర్రింగ్టన్లో స్థిరపడింది. క్రికెట్ అంటే ప్రాణం పెట్టే అనీశ్వర్, గతంలో అదే ఆటతో వైద్యుల కోసం ముందడగు వేసి నిధులను సేకరించాడు. ఏకంగా 400 ఓవర్లు క్రీజులో నిలిచి తనకి ఏడాది వయసులో ఎదురైన అనారోగ్యానికి చికిత్స అందించిన వైద్యుల సహాయ నిధికి విరాళాలు అందించాడు. ఇప్పుడు తన స్నేహితులతో కలిసి గివ్ ఇండియా పేరుతో సైక్లింగ్ చాలెంజ్‌ను మొదలుపెట్టి, "లిటిల్ పెడ్లర్స్ అనీష్ అండ్ హిస్ ఫ్రెండ్స్.. 30 డేస్ సైక్లింగ్ ఛాలెంజ్" అంటూ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు ఆరుగురు చిన్నారులతో మొదలైన ఈ ఛాలెంజ్.. పదిరోజుల్లో లక్షా ఎనిమిదివేల రూపాయాలు సేకరించినట్లు అనీష్ తల్లిదండ్రులు తెలిపారు. ఇంకా 20 రోజులు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. చిన్నారులందరితో కలిసి సైక్లింగ్ చేస్తూ ఈ మాతృభూమి కోసం ఈ నిధులను సేకరిస్తున్నారు. మాతృ దేశానికి కష్ట కాలంలో అండగా నిలుస్తామన్న సంతృప్తి అనీశ్వర్తో పాటు తమకూ కలుగుతుందని చిన్నారులు, వారి తల్లి దండ్రులు చెబుతున్నారు. సైక్లింగ్ తో భారత్‌కు అండగా నిలబడుతున్న ఈ బుడ్డోడిని పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే బాధ్యత పిల్లల్లో పెరుగుతుందని అశీష్ తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. -
జ్యోతి కుమారి నిజంగా అద్భుతం : ఇవాంక
న్యూయార్క్ : లాక్డౌన్ నేపథ్యంలో హర్యానాలోని గుర్గ్రాం నుంచి బిహార్‌లోని దర్భంగా జిల్లాకు సైకిల్‌పై తండ్రిని కూర్చోపెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించిన బాలిక జ్యోతి కుమారిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కూతురు ఇవాంక ట్రంప్ జ్యోతిని మెచ్చుకున్నారు. 15 ఏళ్ల జ్యోతి కుమారి చేసిన సాహసం అద్భుతమని ట్విటర్ వేదికగా కొనియాడారు. (లాక్డౌన్ : 1200 కి.మీ దాటి సైకిల్‌పై స్వగ్రామానికి..) ఈ మేరకు ఇవాంక ట్రంప్ ట్విటర్లో స్పందిస్తూ.. ' 15 ఏళ్ల జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని ఏడు రోజుల పాటు 1200 వందల కిలోమీటర్ల ప్రయాణం చేయడం అత్యంత అద్భుతమనే చెప్పాలి. భారతీయ ప్రజలో ఇంత ఓర్పు, సహనం, ప్రేమ ఉంటాయనేది ఈమె ద్వారా నాకు తెలిసింది. ఇది కేవలం నన్ను మాత్రమే గాక సైక్లింగ్ ఫెడరేషన్‌ను ఆకర్షించిందంటూ' ట్వీట్ చేశారు. ఇవాంక చేసిన ట్వీట్‌పై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. లాక్డౌన్ వేళ ప్రభుత్వం విఫలమైన వేళ ఆమె పేదరికం, తండ్రిని కాపాడుకోవాలనే తాపత్రయం జ్యోతిని 1200 కి.మీ సైకిల్ తొక్కేలా చేసిందంటూ పేర్కొన్నారు. మే 10న గురుగ్రామ్ నుంచి ప్రారంభమైన జ్యోతి ప్రయాణం మే 16న తన సొంతూరైన దర్భంగాకు చేరుకోవడంతో ముగిసింది. ప్రస్తుతం వీరిద్దరు క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు. అయితే దేశ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దృష్టిలో పడింది. ఏకంగా జ్యోతి కుమారికి సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ట్రయల్స్‌కు రమ్మని పిలుపువచ్చింది. '1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆమెలో అసాధ్యమైన ప్రతిభ ఉంది. ఏడు లేదా ఎనిమిది ప్రమాణాలను తాను దాటితే.. తను జాతీయ జట్టులోకి ఎంపిక అవుతుంది. అంతేకాక.. ట్రైనింగ్ సమయంలో తను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు' అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. -
1200 కి.మీ దాటి సైకిల్‌పై స్వగ్రామానికి..
-
అది అథ్లెట్లకూ సాధ్యం కాని ఫీట్..
పట్నా : ప్రొఫెషనల్ అథ్లెట్లూ సాహసించని కార్యాన్ని 15 ఏళ్ల బాలిక తలకెత్తుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో హర్యానాలోని గుర్గ్రాం నుంచి బిహార్‌లోని దర్భంగా జిల్లాకు సైకిల్‌పై తండ్రిని కూర్చోపెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించిన బాలిక జ్యోతి కుమారిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సుదీర్ఘ సైకిల్ ప్రయాణంతో తమ ఊరు సింగ్వారాకు చేరుకున్న తండ్రీకూతుళ్లు ప్రస్తుతం గ్రామ శివార్లోని క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు. ఈ-రిక్షాను నడిపే కుమారి తండ్రి పాశ్వాన్ కొద్దిరోజుల కిందట ప్రమాదానికి గురవడంతో పని చేసే సత్తువ కోల్పోయాడు. ఈ-రిక్షాను కిరాయికి ఇచ్చిన యజమాని కొద్దినెలలుగా బకాయిపడిన అద్దెను చెల్లించాలని లేకుంటే ఇక్కడనుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడని పాశ్వాన్ చెప్పుకొచ్చాడు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత తాను ఏదో ఒక పని చేసి అద్దె చెల్లిస్తానని పలుమార్లు చెప్పానని, ఇప్పుడు తాను వేసుకోవాల్సిన మందులను విరమించుకుంటే ఒక పూట తినగలుగుతున్నామని, ఈ పరిస్ధితిలో రెంట్‌కు డబ్బు ఎక్కడనుంచి తేగలమని ప్రశ్నించాడు. లాక్డౌన్ మరింత పొడిగించడంతో యజమాని నుంచి ఇబ్బందులు తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కూతురు జ్యోతి గ్రామానికి తిరిగి వెళదామని పట్టుపట్టిందని చెప్పాడు. సైకిల్‌పై అంత దూరం వెళ్లడం కష్టమని చెప్పినా జ్యోతి పట్టువిడవలేదని తెలిపాడు. తాము రోజుకు 30 నుంచి 40 కిమీ సైకిల్‌పై ప్రయాణించామని, కొన్ని ప్రాంతాల్లో ట్రక్ డ్రైవర్లు తమకు లిఫ్ట్ ఇచ్చారని జ్యోతి గుర్తుచేసుకుంది. ఎనిమిది రోజుల ప్రయాణం తర్వాత ఇల్లు చేరామని సంతోషపడింది. సైకిల్‌పై తండ్రిని ఎక్కించుకుని సుదీర్ఘ ప్రయాణంతో స్వగ్రామానికి చేరుకున్న జ్యోతి కుమారి ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. చదవండి : లాక్డౌన్ ఎత్తివేత; నా ఆనందం ఇలాగే ఉంటుంది -
సైక్లింగ్ కోచ్‌గా పాండు జాదవ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ కోచ్‌గా వ్యాయామ విద్య (ఫిజికల్ ఎడ్యుకేషన్) విద్యార్థి పాండు జాదవ్ ఎంపికయ్యాడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పాండు జాదవ్ ఓయూ పరిధిలోని వ్యాయామ విద్య కాలేజీలో ఎంపీఈడీ కోర్సు చదువుతున్నాడు. నేటి నుంచి శనివారం వరకు ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయ సైక్లింగ్ పోటీల్లో రాష్ట్ర సీనియర్, జూనియర్ జట్లకు పాండు జాదవ్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అధ్యక్షులు మల్లారెడ్డి, కార్యదర్శి దత్తాత్రేయ తెలిపారు. -
సైక్లింగ్ వల్ల మోకాళ్లు మరింత దెబ్బతింటాయా?
అపోహ : మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు సైక్లింగ్ చేయడం వల్ల ఆ నొప్పులు మరింత పెరుగుతాయి. వాస్తవం : సైక్లింగ్ ఎక్సర్సైజ్ వల్ల లేదా సైకిల్ తొక్కడం వల్ల మోకళ్లు మరింత దెబ్బతింటాయని చాలా మంది అపోహ పడుతుంటారు. కాని మోకాళ్ల నొప్పుల నివారణకు అది మంచి వ్యాయామం. మామూలు సైకిల్ తొక్కినా, లేక ఒకేచోట స్థిరంగా ఉండే ఎక్సర్సైజ్ సైకిల్ తొక్కినా మీ బరువు మీ శరీరంపై పడదు. కాబట్టి మోకాళ్లపై శరీరం బరువు చాలా తగ్గిపోతుంది. సైక్లింగ్‌లో పెడల్ తొక్కడం వల్ల మోకాళ్లు బాగా కదిలి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇక ఈత (స్విమ్మింగ్)లో కూడా శరీరం బరువు మోకాళ్లపై ఏమాత్రం పడదు కాబట్టి అది కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. -
అడవుల సంరక్షణకు కృషి
మహేశ్వరం: అడవుల సంరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోం దని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని హర్షగూడ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర మజీద్‌గడ్డ రిజర్వ్ ఫారెస్టులో ఏర్పాటు చేసిన ‘జంగల్ క్యాంపు’ను మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలసి ప్రారంభించారు. నగరానికి సమీపంలో నిరుపయోగంగా ఉన్న రిజర్వ్ ఫారెస్టు బ్లాకులను ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో అర్బన్ ఫారెస్టు పార్కును ఒక్కో థీమ్‌తో మొత్తం 94 పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. హెచ్ఎండీఏ పరిధిలో 60 పార్కులు, ఇతర పట్టణాల్లో 34 పార్కులను రూపొందిస్తామన్నారు. హైదరాబాద్‌ను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇక్కడ అడ్వెంచర్ క్యాంపు థీమ్‌తో సుందరంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. -
సైక్లింగ్‌తో బ్రెస్ట్ క్యాన్సర్‌కు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ : నేడు బ్రెస్ట్ క్యాన్సర్‌తో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మహిళలు బాధ పడుతున్న విషయం తెల్సిందే. వారు వారానికి 150 నిమిషాలపాటు సైకిల్ తొక్కడం లేదా వడి వడిగా నడవడం చేస్తే కచ్చితంగా 30 శాతం మందికి క్యాన్సర్ తగ్గిపోతుందని పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో తేలించి అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ రానివారు కూడా ఈ వ్యాయామాలు చేస్తే వారిలో కూడా 30 శాతం మందికి ఈ జబ్బు రాదని వారు తెలిపారు. హైడెల్‌బెర్గ్‌లోని ‘జర్మనీ క్యాన్సర్ రీసర్చ్ సెంటర్’కు చెందిన పరిశోధకులు 2000 మందిపై గత పదేళ్ళుగా అధ్యయనం జరిపి ఈ విషయాన్ని కనుగొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు వ్యాయామానికి ఏమైన సంబంధం ఉందా ? అన్న అంశంపై తొలిసారిగా ఈ అధ్యయనం జరిపినట్లు పరిశోధకులు తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన మహిళల్లో వ్యాయామం చేస్తున్న వారు చనిపోవడం చాలా అరుదుగా జరుగుతుండడంతో ఈ దిశగా అధ్యయనం జరపాలనే ఆలోచన వచ్చినట్లు వారు తెలిపారు. -
కశ్మీర్ టు కన్యాకుమారికి సైకిల్‌యాత్ర
సాక్షి, అడ్డాకుల (దేవరకద్ర): యువజన కాంగ్రెస్ జాతీ య కార్యదర్శి కోల్‌కుందా సంతోష్‌కుమార్ చేపట్టిన సైకిల్‌యాత్ర బుధవారం మండలానికి చేరుకుంది. వికారాబాద్ ప్రాంతానికి చెందిన సం తోష్కుమార్ ఆగస్టు 15న కశ్మీర్లో సైకిల్‌యాత్రను చేపట్టాడు. 28 రోజులుగా సాగుతున్న యాత్ర మండలంలోని హైవేపై కొనసాగింది. అడ్డాకుల వద్ద సంతోష్‌కుమార్‌కు స్థానిక కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండా జగదీశ్వర్, నాయకులు గంగుల విజయమోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శేఖ ర్‌రెడ్డి, సయ్యద్‌షఫి, సాయిలు, రాములు తదితరులు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. మనది భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశమన్నారు. దీన్ని ప్రచారం చేయాలన్న సంకల్పం తోనే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర చేపట్టినట్లు తెలిపారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రచారం కూడా చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా యువత ఆలోచన విధానం గురించి తెలుసుకుంటున్నట్లు తెలిపా రు. ప్రతి రోజు 100కిలోమీటర్ల దూరం సైకిల్‌యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. గాంధీ జయంతి నాటికి కన్యాకుమారి చేరుకుంటానని పేర్కొన్నారు. -
సైకిల్ తొక్కితే.. కి.మీ.కు రూ.16!
శారీరక వ్యాయామం కోసం తప్ప మామూలుగా సైకిల్ తొక్కేవాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. అప్పుడెప్పుడో స్కూల్ డేస్‌లో తొక్కేవాళ్లం. ఆ తరువాత ఎప్పుడు తొక్కామో గుర్తులేదు అనేవాళ్లు లేకపోలేదు. ఇప్పుడైతే జిమ్‌లో ఉన్న సైకిల్ తొక్కడమే. బయటకు వెళ్లాలంటే బైక్ లేదా కారులో వెళ్తామని నూటికి 98 మంది చెబుతారు. గ్రామాల్లోనూ సైకిల్ తొక్కే సంస్కృతి క్రమంగా దూరమైపోతోంది. స్కూల్ విద్యార్థులకే పరిమితమైపోతోంది. కానీ.. విదేశాల్లో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. చాలా దేశాల్లోని ప్రజలు సైక్లింగ్‌ను ఒక అలవాటుగా మార్చుకున్నారు. దీనికి తగ్గట్టే ప్రభుత్వాలు సైకిల్ తొక్కడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. నెదర్లాండ్స్‌లో అయితే సైకిల్ తొక్కేవారికి డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇది కాస్త విచిత్రంగా ఉన్నప్పటికి సైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. జనాభా కంటే సైకిళ్లే ఎక్కువ.... సైకిల్ వినియోగం విషయంలో ప్రపంచంలో ఎవరైనా నెదర్లాండ్స్ ప్రజలకన్నా వెనుకే ఉంటారు. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న జనాభా కంటే సైకిళ్లే ఎక్కువ. అక్కడి ప్రజలకు సైకిల్ తొక్కడమంటే మహా సరదా. ఆఫీస్‌కు, పక్క ఊర్లో ఉన్న చుట్టాల ఇళ్లకు.. ఇలా సమీప ప్రాంతాలకు సైకిల్‌పై రయ్యిన వెళ్లిపోతుంటారు. కార్లు, బైక్‌ల కన్నా సైకిల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రభుత్వం కూడా సైకిల్ తొక్కడాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తుంది. సైకిలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. మన దగ్గర రోడ్లపై బస్సుల కోసం బస్‌బేలు ఉన్నట్టు.. నెదర్లాండ్స్‌లో రోడ్లపై సైకిళ్ల కోసం ప్రత్యేకంగా దారులు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే కేవలం సైకిళ్లనే అనుమతి ఇస్తారు. వేరే వాహనాలకు అనుమతి ఉండదు. సైకిళ్లకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. నెదర్లాండ్స్ రాజధాని అమ్‌స్టర్ డ్యామ్‌లో పనిచేసే ఉద్యోగులు సైకిల్‌పై ఆఫీస్‌కు వెళ్లడానికే ఇష్టపడతారు. స్థానికంగా నివాసం ఉండేవారిలో అత్యధికశాతం మంది సైకిల్‌పై సవారీ చేస్తారు. రాజధాని చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేవారు కూడా తమ ప్రయాణాల్లో సగంపైన సైకిల్ పైనే చేస్తారట. అందుకే నెదర్లాండ్స్‌ను నంబర్‌వన్ బైస్కిలింగ్ నేషన్ అని పిలుస్తుంటారు. కిలోమీటరుకు రూ.16... సైకిల్ తొక్కడాన్ని మరింత ప్రోత్సహించే చర్యల్లో భాగంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులు ఒక కిలోమీటర్ సైకిల్ తొక్కితే రూ.16 (0.22 డాలర్లు) చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఈ మొత్తం ఆదాయపన్ను నుంచి మినహాయింపు రూపంలో అందుతుంది. అంటే ఏడాదికి ఒక వంద కిలోమీటర్లు సైకిల్ తొక్కితే రూ.1600 మేర ఆదాయపన్ను తగ్గుతుందన్నమాట. ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లే సమయంలో సైకిల్ ఉపయోగిస్తేనే ఈ వెసులుబాటు కలుగుతుంది. వ్యక్తిగత అవసరాలకు సైకిల్ తొక్కితే ఇవ్వరు. ఒక ఉద్యోగి ఎన్ని కిలోమీటర్లు తొక్కారో కంపెనీ గుర్తించి.. ఆ మొత్తాన్ని కంపెనీయే చెల్లిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి క్లెయిమ్ చేసుకుంటుంది. ఈ విషయంలో ఉద్యోగులను ప్రోత్సహించాలని, వారు ఎంతమేర సైకిల్ ప్రయాణం చేస్తున్నారో గుర్తించి పన్ను మినహాయింపు ఇప్పించాలని ప్రభుత్వం దేశంలోని కంపెనీలన్నింటికీ విజ్ఞప్తి చేయడం విశేషం. ప్రత్యేక రాయితీలు... సైకిల్ తొక్కడాన్ని ప్రోత్సహించే సంప్రదాయం ఇతర దేశాల్లోనూ ఉంది. బ్రిటన్‌లో ఆఫీస్‌కు సైకిల్‌పై వచ్చే ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలుంటాయి. కంపెనీలు డిస్కౌంట్లతో సైకిళ్లు అందిస్తాయి. బెల్జియంలో కూడా నెదర్లాండ్స్ తరహాలో ఆదాయపన్ను తగ్గింపు స్కీమ్ అమల్లో ఉంది. యూరప్‌లోని పలు దేశాలు సైతం టాక్స్ తగ్గింపు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. – పోకల విజయ దిలీప్, సాక్షి స్టూడెంట్ ఎడిషన్ -
సిటీ సైక్లిస్ట్స్ @ ప్యారిస్
ఆఫీసులో గంటల కొద్దీ కూర్చుని కూర్చుని అలవాటైపోయింది. నాలుగు మెట్లు ఎక్కితే చాలు మోకాళ్లు పట్టేస్తున్నాయి ఇక డాక్టర్ సలహా మేరకు సైక్లింగ్ ఎక్కడ చేస్తాం? అంటూ నిరుత్సాహపడిపోయే ఎందరో సిటీజనుల మధ్యలో కొందరుంటారు. రోజూ పది, ఇరవై...కిలోమీటర్లు అలవోకగా సైక్లింగ్ చేసేస్తూంటారు. మరికొందరు మరింత ముందుకెళ్లి వంద, వేయి కిలోమీటర్లకూ సై అంటారు. అలా సై రా అన్న సిటీ యువత ప్యారిస్ వేదికగా తమ సైక్లింగ్ సత్తా ప్రదర్శించారు. ప్రపంచపు అత్యంత లాంగెస్ట్ సైక్లింగ్ రైడ్... ప్యారిస్–బ్రెస్ట్–ప్యారిస్ (పి.బి.పి)ఈవెంట్లో సిటీ దమ్ము చూపి దుమ్ము లేపారు. సాక్షి, సిటీబ్యూరో: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనగానే ఏసీ గదుల్లో... సిస్టమ్‌ని వదలని వేళ్లూ, సీటు నుంచి కదలని కాళ్లూ, ఐదారంకెల జీతాలూ వారాంతాపు పబ్బుల్లో నృత్య గీతాలూ..అంతేనా..అంటే కాదు ఇంకా ఎంతో ఉంది అంటున్నారు సిటీ ఐటీ పీపుల్. తమలోని క్రీడా‘సక్తి’కి సానబెడుతున్నారు. హాబీగా మొదలుపెట్టిన ఆటల్లో రాణిస్తూ క్రీడాకారులకు మాత్రమే సాధ్యమయే విజయాలను స్వంతం చేసుకుంటున్నారు. నగరం నుంచి ప్యారిస్ వెళ్లి పీబీపీ ఈవెంట్లో పాల్గొన్న యువబృందం అందుకో ఉదాహరణ. ఏమిటీ పీబీపీ? ఫ్రాన్స్ రాజధాని నగరం, ఫ్యాషన్/ఆర్ట్ క్యాపిటల్ ప్యారిస్ గురించి తెలియనివాళ్లు ఉండరు. అలాంటి గ్లామరస్ సిటీలో జరిగే ప్రపంచ ప్రసిద్ధ ఈవెంట్ ప్యారిస్–బ్రెస్ట్–ప్యారిస్ (పీబీపీ). సైక్లిస్టుల కోసం 1891లో ఈ ఈవెంట్ రూపుదిద్దుకుంది. ప్యారిస్ నుంచి బ్రెస్ట్కి వెళ్లి తిరిగి పారిస్‌కి వచ్చే ప్యారిస్–బ్రెస్ట్–ప్యారిస్ లేదా పీబీపీ అంటారు. నాలుగేళ్లకి ఓసారి నిర్వహించే ఈ ఈవెంట్లో పాల్గొనడాన్ని సైక్లిస్టులు చాలా ప్రిస్టేజియస్‌గా భావిస్తారు. ఈ ర్యాండనీరింగ్ ఈవెంట్లో సైక్లిస్టులు కేవలం 90 గంటల్లో 1230 కి.మీ. దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీనిలో పాల్గొనడం అంత సులభమేమీ కాదు. పాల్గొనడానికి ముందు ఏడాది 100 కిలో మీటర్ల సైక్లింగ్ నుంచి 200, 300, 400, 600 కి.మీ దాకా క్రమం తప్పకుండా సాధించి ఆ వివరాలను అందజేసిన తర్వాతే పీబీపీలో పాల్గొనేందుకు అర్హత వస్తుంది. మన నగరంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సైక్లిస్టులు ఎక్కువ సంఖ్యలో ఉన్న నగరాల్లో పీబీపీ తరపున ఈ ప్రక్రియను ఆడెక్స్ క్లబ్ ఆఫ్ ప్యారిస్ నిర్వహిస్తుంది. పీబీపీ తరపున ఆడెక్స్ ఇక్కడ రైడ్స్ నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈవెంట్లో 75 దేశాలకు చెందిన 7 వేల మంది సైక్లిస్టులు పాల్గొన్నారు. సై అన్న సిటీ... నగరం నుంచి దాదాపుగా 50 మంది ఈ ఈవెంట్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తే...26 మంది అవసరమైన అర్హత సాధించగలిగారు. వీరంతా గత ఆగస్టు 18 నుంచి 22 వరకు ప్యారిస్‌లో జరిగిన ఈవెంట్‌కి హాజరయ్యారు. అయితే అక్కడి అత్యంత చలి వాతావరణం, ఫుడ్...వంటి వాటిని తట్టుకోలేక వెళ్లిన 26 మందిలో 19 మంది ఈవెంట్‌కి ముందే గుడ్‌బై చెప్పేశారు. మిగిలిన ఏడుగురిలో ముగ్గురు విజయవంతంగా లక్ష్యాన్ని చేధించగలిగారు. మిగిలిన నలుగురు (రాజా శబరీష్, నవీన్, ప్రసాద్ రాజు, గౌతమ్‌రెడ్డి)విజయవంతంగా పూర్తి చేసి ఫినిషర్స్ మెడల్స్ అందుకున్నారు. విజేతలైన గచ్చిబౌలి నివాసితులు సంజయ్ యాదవ్, సిద్ధార్ధ, చైతన్య ముగ్గురూ పాతికేళ్ల లోపు వాళ్లే కావడం, ఐటి ఉద్యోగులే కావడం విశేషం. కఠినమే..కాని కంప్లీట్ చేశా ఇది అత్యంత సంక్లిష్టమైన రైడ్. అయితే సైక్లింగ్‌లో కొన్నేళ్లుగా అలవాటు ఉండబట్టి ఎలాగైతేనేం ఈ ఈవెంట్లో విజయం సాధించా. అమెరికాలో ఉండబట్టి నాకు ఇక్కడి చలి వాతావరణం అంతగా ఇబ్బంది పెట్టలేదు. నేను రోజులో ఎక్కువ టైమ్ సైక్లింగ్ చేస్తుంటాను. అది బాగా యూజ్ అయింది. –చైతన్య బర్త్ డే గిఫ్ట్... టఫెస్ట్ రైడ్ ఇది. ఇంత సుదూరపు సైక్లింగ్ ఎప్పుడూ చేయలేదు. కాని అందుకేనేమో ఇది చాలా సంతృప్తిని అందించింది. నిద్రను బాగా మేనేజ్ చేయగలగడం నాకు బాగా హెల్ప్ అయింది. నెక్టŠస్ వీక్ నా బర్త్‌డే సో.. ఈ విజయం నాకు నేను ఇచ్చుకున్న బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అనుకుంటున్నా. –సిద్ధార్ద్ 92 గంటలు పట్టింది... ఈ ఈవెంట్లో పాల్గొనడం దగ్గర్నుంచి అన్నీ కష్ట సాధ్యాలే. అయినా పట్టుదలగా ప్రయత్నించాం. పూర్తి స్థాయి లక్ష్యంతో పాటు సైక్లింగ్ చేస్తూ ప్రతి 100 కి.మీకి కాస్త అటూ ఇటూగా ఉండే ఉండే 12 చెక్పాయింట్స్ని కూడా టైమ్ ప్రకారం రీచ్ కావాలి. రోడ్లు చాలా ఎత్తు పల్లాలతో ఉంటాయి. మనం నగరంలో చేసే ప్రాక్టీస్‌ని పూర్తిగా నమ్ముకుంటే దీన్ని పూర్తిచేయలేం. రాత్రి ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. నేను 92 గంటల్లో గమ్యాన్ని చేరుకుని ఫినిషింగ్ మెడల్ అందుకున్నా. –గౌతమ్‌రెడ్డి ఇంకో 5 గంటలు ఉండగానే... సైక్లింగ్ గత ఏడాది స్టార్ట్ చేశాను. ఈ ఈవెంట్‌కు ముందు చాలా లాంగ్ రైడ్స్ చేయడం అలవాటైంది. ముఖ్యంగా శంషాబాద్ టు లేపాక్షి (బెంగళూర్ దగ్గర) తిరిగి శంషాబాద్...1000 కి.మీ రైడ్ పూర్తి చేశాక ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయగలమని మరింత నమ్మకం వచ్చింది. ఫ్రెంచ్ పీపుల్, వారి ఆత్మీయత మమ్మల్ని ఆదరించిన తీరు చాలా తృప్తిని అందించింది. ఈరైడ్ని నేను వాళ్లిచ్చిన టైమ్ కంటే చాలా ముందుగానే అంటే 85 గంటల 10 నిమిషాల్లోనే పూర్తి చేయగలిగా. భవిష్యత్తులో లండన్‌లోని ఎడిన్బర్గ్లో జరిగే ఎల్ఇఎల్ రైడ్‌లో పాల్గొనాలి అనుకుంటున్నా. –సంజయ్ యాదవ్ -
ఫోన్ లాక్కున్నాడని సల్మాన్‌పై ఫిర్యాదు
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ ఫోన్ లాక్కున్నారని ముంబైకు చెందిన ఓ జర్నలిస్ట్ పోలీసులను ఆశ్రయించారు. సల్మాన్ సైకిలింగ్ చేస్తున్న సమయంలో వీడియో తీస్తున్నందుకు తమ ఫోన్ లాక్కున్నారని డీఎన్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘బుధవారం సాయంత్రం మేము జుహు నుంచి కండివిలి వెళ్తుండగా డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో సల్మాన్‌ను చూశాం. అతను తన ఇద్దరు బాడీగార్డులతో కలసి సైకిలింగ్ చేస్తున్నారు. దీంతో మేము సల్మాన్ వీడియో తీసుకునేందుకు బాడీగార్డుల అనుమతి కోరాం. దీనికి వారు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా అంగీకరించారు. దీంతో సల్మాన్ సైకిలింగ్ చేస్తుండగా వీడియో తీయడం మొదలుపెట్టాం. ఇంతలో సల్మాన్ తన బాడీగార్డులకు సైగ చేయడంతో.. వారు మా వాహనం దగ్గరకు వచ్చి వీడియో తీస్తున్న నా సహోద్యోగిని వెనక్కి నెట్టివేశారు. వెంటనే సల్మాన్ కూడా అక్కడికి వచ్చి తమ సెల్ఫోన్లను లాక్కుని వెళ్లారు. నేను జర్నలిస్టు అని చెప్పిన సల్మాన్ వినిపించుకోలేద’ని సదురు జర్నలిస్టు తన రెండు పేజీల ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, జర్నలిస్టు ఫిర్యాదుకు వ్యతిరేకంగా సల్మాన్ బాడిగార్డు కూడా పోలీసులకు క్రాస్ అప్లికేషన్ సమర్పించారు. ఆ జర్నలిస్టు, సల్మాన్ ఖాన్‌ను ఫాలో అవుతూ.. ఆయన అనుమతి లేకుండా వీడియో చిత్రీకరించారని తెలిపారు. -
కల్యాణ్... ఐరన్‌మ్యాన్
ఆయనో మాజీ ఎస్సై... తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని, ఏదైనా సాధించాలనే తపనతో ఉద్యోగాన్ని వదిలేశారు. మారథాన్లు, 10కె రన్లు ఎన్ని గెలిచినా సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో జరిగే ‘ఐరన్‌మ్యాన్’ చాంపియన్‌షిప్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఏడాది జులై 29న జర్మనీలోని హ్యాంబర్గ్లోజరిగిన ఈవెంట్లో ‘ఐరన్‌మ్యాన్’ చాంపియన్‌షిప్‌లో జయకేతనం ఎగరేశారు. ఇది సాధించిన తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించారు. సాక్షి, సిటీబ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఎం.కల్యాణ్‌కృష్ణ ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం సిటీలో స్థిరపడిన ఈయనకు... చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌లో ప్రావీణ్యం ఉంది. స్నేహితుల ద్వారా స్ఫూర్తి పొందిన కల్యాణ్ 2002లో ఎస్సై కొలువు కొట్టారు. కర్నూలు జిల్లాలో పోస్టింగ్ వచ్చింది. బండి ఆత్మకూరు సహా మరికొన్ని చోట్ల పని చేశారు. అయితే ఆయనకు ఏదో అసంతృప్తి... ఏదైనా సాధించాలనే తపన ఉండేది. తాను కోరుకున్న శిఖరాలను అధిరోహించాలంటే పోలీస్ ఉద్యోగంతో ఉండి సమయం వెచ్చించలేమని భావించారు. దీంతో 2009లో ఉద్యోగాన్ని వదిలేసినా డిపార్ట్మెంట్ నేర్పిన క్రమశిక్షణతో పాటు ఫిట్నెస్ను కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సంస్థలో ఏపీ, తెలంగాణ హెచ్ఆర్ విభాగాధిపతిగా పని చేస్తున్నారు. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్‌పై మక్కువతో వాటిని నిత్యం ప్రాక్టీస్ చేసే కల్యాణ్... ఓవైపు ఉద్యోగం చేస్తూనే, వారంలో ఒక్కో దానికి మూడు రోజులు కేటాయిస్తారు. ఈ నేపథ్యంలోనే నగరంతో పాటు ముంబై, ఢిల్లీ, బెంగళూర్లలో జరిగిన అనేక మారథాన్లు, 10కె రన్లలో పతకాలు సొంతం చేసుకున్నారు. వాటితో సంతృప్తి పడని కల్యాణ్ ‘ఐరన్‌మ్యాన్’ చాంపియన్‌షిప్ లక్ష్యంగా ఏడాది శ్రమించి విజయం సాధించారు. నా సతీమణి సహకారం మరువలేను... నేను ప్రాక్టీస్ కోసం కుటుంబానికి దూరమవుతుంటాను. సెలవు దినాల్లో ఉదయం 6గంటలకు సైక్లింగ్ మొదలుపెట్టి దాదాపు 50–70 కి.మీ వెళ్లొస్తాను. తిరిగి వచ్చేసరికి పూర్తిగా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటాను. అలాంటి పరిస్థితుల్లో నిత్యం నాకు మద్దతు తెలుపుతూ ఈ విజయాలకు కారణమైన నా భార్య సహకారం మరువలేను. ఇలాంటి పోటీల్లో పాల్గొనడం మనపై మనకున్న నమ్మకాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సత్తా ఇస్తుంది. ఈ ఫీట్స్‌లో కొన్ని రిస్కీ అయినప్పటికీ గెలిచిన తర్వాత ఎంతో సంతృప్తి ఉంటుంది. గెలుపోటములు పక్కన ఉంచితే ఇలాంటి చాంపియన్‌షిప్స్ జీవితంలో ఏదైనా సాధించగలమనే మనోధైర్యాన్నిస్తాయి. – కల్యాణ్‌కృష్ణ సంస్థ స్పాన్సర్షిప్.. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తన లక్ష్యం సాధించేందుకు కల్యాణ్ ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కొన్నారు. ఫిట్నెస్ కాపాడుకునేందుకు నిత్యం ప్రాక్టీస్ చేయడంతో పాటు ప్రత్యేక డైట్ తీసుకుంటారు. ఇక ఇలాంటి అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు అవసరమైన సైకిల్‌ను రూ.లక్ష వెచ్చించి కొనుగోలు చేశారు. కేవలం ఇదొక్కటేనా అవసరమైన ప్రతిదీ సొంత డబ్బుతోనే కొంటుంటారు. అంతేకాకుండా ఆయా దేశాలకు వెళ్లిరావడానికీ కల్యాణ్ భారీ మొత్తం వెచ్చిస్తుంటారు. ఏళ్లుగా మారథాన్లు, రన్లలో పాల్గొంటున్న ఈయనకు... ‘ఐరన్‌మ్యాన్’కు తొలిసారి ఫ్లిప్‌కార్ట్ స్పాన్సర్షిప్ లభించింది. తాను పని చేస్తున్న సంస్థ రూ.3లక్షల ఆర్థిక సాయం చేయడం విశేషం. కల్యాణ్ విమానంలో జర్మనీకి తన సైకిల్ కూడా తీసుకెళ్లారు. ఇదీ ‘ఐరన్‌మ్యాన్’.. ప్రొఫెషనల్స్ కాకుండా నిరంతరం ప్రాక్టీస్ చేసే, సాధారణ వ్యక్తులు పాల్గొనే చాంపియన్‌షిప్ ఐరన్‌మ్యాన్. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ ఈవెంట్లో దాదాపు అన్ని దేశాల అభ్యర్థులు పాల్గొంటారు. ఇంటర్నేషనల్ ట్రైథ్లాన్ అసోసియేషన్ రెండు రకాలుగా ఈ పోటీలు నిర్వహిస్తుంది. హాఫ్ ఐరన్‌మ్యాన్ పోటీలో 1.9 కి.మీ ఈత, 90 కి.మీ సైక్లింగ్, 21 కి.మీ పరుగును 8గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐరన్మ్యాన్లో 3.8 కి.మీ ఈత, 180 కి.మీ సైక్లింగ్, 42 కి.మీ పరుగును 16గంటల్లో పూర్తి చేయాలి. ప్రతి పోటీలో మూడు ఈవెంట్స్‌కు మధ్యలో ఆగేందుకు, విశ్రాంతి తీసుకోవడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. రేస్‌లో ఉన్నంతసేపూ కేవలం ద్రవపదార్థాలే తీసుకుంటారు. అదీ సైక్లింగ్ చేస్తూనో, పరుగెడుతూనో సహాయకులు అందించేవి మాత్రమే తాగే అవకాశం ఉంటుంది. గతేడాది మలేసియాలోని లంకావి దీవిలో జరిగిన హాఫ్ ఐరన్మ్యాన్ను, ఈ ఏడాది హ్యంబర్గ్లో జరిగిన ఐరన్‌మ్యాన్ చాంపియన్‌షిప్‌ను కల్యాణ్ కృష్ణ గెలుచుకున్నారు. ఈ ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 1600 మంది పాల్గొన్నారు. -
డెలివరీ కోసం సైకిల్‌పై వెళ్లిన మంత్రి!
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ మహిళా మంత్రి జూలీ అన్నే జెంటేర్ పెద్ద సాహసమే చేశారు. 42 వారాల గర్భవతి అయిన ఆమె సైకిల్ మీద డెలివరీ వార్డ్‌కు వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గ్రీన్ ఎంపీ అయిన జెంటర్ సైక్లిస్ట్. దీంతో ఆదివారం డెలివరీ కోసం ఆసుపత్రికి స్వయంగా సైకిల్ తొక్కుతూ వెళ్లారు. తన నివాసం నుంచి సుమారు కిలోమీటర్ దూరంలోని అక్లాండ్ సిటీ హస్పిటల్‌కు సైకిల్‌తోనే చేరుకున్నారు. దీనికి సంబంధించి ఫొటోను ఆమెనే స్వయంగా ‘ నేను, నా భాగస్వామి సైకిల్ తొక్కాం. ఎందుకంటే కారు సిబ్బంది పట్టే స్థలం అందులో లేదు. ఇది నాకు మంచి ఉత్తేజాన్ని ఇచ్చింది’ అనే క్యాప్షన్‌తో సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. న్యూజిలాండ్ రవాణశాఖ మంత్రి కూడా జెంటరే. ఇక ఆమె చేసిన పనిని సహచర ఎంపీలు కూడా అభినందిస్తున్నారు. ఇంకా బిడ్డకు జన్మనివ్వలేదని ఆమె పార్టీ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. ఇటీవలే ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెన్ కూడా ఓ పాపకు జన్మనిచ్చిచ్చారు. ప్రధాని హోదాలో బిడ్డకు జన్మనిచ్చిన పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనర్జీ బుట్టో తర్వాత రెండో వ్యక్తిగా జెసిండా నిలిచిన విషయం తెలిసిందే. -
రోజుకు అరగంట వ్యాయామం మేలు!
రోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది. బాగానే ఉందిగాని.. ఎన్ని గంటలు చేయాలి? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకే సమాధానం కనుక్కునేందుకు అమెరికా సంస్థ ఒక అధ్యయనం చేసింది. దీని ప్రకారం.. 18 – 64 ఏళ్ల మధ్య వయస్కులు వారానికి కనీసం 150 నిమిషాల పాటు ఓ మోస్తరు తీవ్రత ఉండే గుండె సంబంధిత వ్యాయామాలు చేస్తే పూర్తిస్థాయి ఫలితాలు అందుకోవచ్చునని తేల్చింది. వైద్య పరమైన సమస్యలేని వారికి ఈ మాత్రం వ్యాయామం సరిపోతుందని, ఇందులో సగం కాలం అంటే వారానికి 75 నిమిషాలపాటు కొంచెం శ్రమతో కూడిన వ్యాయామం చేసినా ఓకే అని ఆ సంస్థ చెబుతోంది. ఓ మోస్తరు వ్యాయామం జాబితాలో వేగంగా నడవడం, ఎత్తుపల్లాలు పెద్దగా లేని చోట సైక్లింగ్, ఇంకొకరితో కలిసి టెన్నిస్ ఆడటం వంటివి ఉంటే.. శ్రమతో కూడిన వ్యాయామం జాబితాలో జాగింగ్, పరుగులు, ఈత, ఎత్తుపల్లాలను అధిగమిస్తూ సైక్లింగ్ చేయడం, బాస్కెట్ బాల్, సింగిల్‌గా టెన్నిస్ ఆడటం వంటివి ఉన్నాయి. వీటితోపాటు శక్తిని పెంచే వ్యాయామాలు ఒకటిరెండు చేయాల్సి ఉంటుంది. అరవై ఏళ్లు పైబడినవారు మరింత ఎక్కువకాలం ఎక్సర్సైజులు చేయడం మేలని సూచిస్తున్నారు. -
లవ్ జర్నీ
‘చేతిలోన చెయ్యేసి చెప్పేయవా....’ అంటూ న్యూయార్క్ వీధుల్లో పాడుకుంటున్నారు లవ్ బర్డ్స్ ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వీలు కుదిరినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారీ జోడీ. ఇటీవలే ఇండియాకు వచ్చిన నిక్, ప్రియాంక, పరిణీతీ చోప్రాతో కలసి గోవా వెకేషన్ ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత నిక్‌తో కలసి ప్రియాంక న్యూయార్క్ రిటర్న్ అయ్యారు. ఇప్పుడు అక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. చేతులు కలుపుకుంటూ న్యూయార్క్ స్ట్రీట్స్‌లో షికారు చేస్తున్నారు, సైక్లింగ్ చేస్తూ వీధులన్నీ చుట్టేస్తున్నారు. ఇలా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట కలసి ఏడడుగులు ఎప్పుడేస్తారని ఎదురు చూస్తున్నారు ప్రియాంక అభిమానులు. 25 దాటేశారు కేవలం ఒక్కరోజు గ్యాప్‌లోనే 25 క్రాస్ చేశారు దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా. మూడు పదుల వయసు దాటిన వీళ్లు ఇప్పుడు 25 క్రాస్ చేయడమేంటంటే అది ఏజ్‌లో కాదండీ.. ఫాలోయింగ్‌లో. ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇద్దరు భామలు 25 మిలియన్ (రెండున్నర కోట్లు) ఫ్యాన్స్‌ను సాధించారు. ఈ ఫీట్‌ను ప్రియాంకా గురువారం చేరుకోగా, ఆ మరుసటి రోజే దీపికా పదుకోన్ 25 మిలియన్స్‌ను చేరుకోవడం విశేషం. -
మెడికల్ సీట్లు అమ్ముకున్నారనే..
సాక్షి, హైదరాబాద్ : గతేడాది స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారుల ఇళ్లపై ఒకేసారి మెరుపు దాడులు నిర్వహించింది. ఎల్బీనగర్, సరస్వతి నగర్ కాలనీలోని స్పోర్ట్స్ అథారిటీ సైక్లింగ్ కోచ్ గుర్రం చంద్రారెడ్డి నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించి విలువైన డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే శాప్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణ, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ విమలాకర్ రావు, స్పోర్ట్స్ కమిటీ సభ్యురాలు శోభ ఇళ్లల్లో సైతం సోదాలు నిర్వహించారు. గతేడాది తెలంగాణ స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు రావడంతో సీఎం ఆదేశాలతోనే శాప్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణ ఇంట్లో దాడులు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తొమ్మిది సభ్యులతో కూడిన కమిటీ అర్హులైన వారికి అన్యాయం చేసి, నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ఇలా ఎంతమందికి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారన్న విషయంపై విచారణ జరుపుతున్నామని, దర్యాప్తు పూర్తైన వెంటనే ఉన్నతాధికారికి నివేదిక సమర్పిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. -
50 లక్షల డాలర్లు చెల్లిస్తా
లాస్ఏంజెల్స్: సైక్లింగ్ రేస్ టూర్ డి ఫ్రాన్స్ దిగ్గజం లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిన కేసులో 50 లక్షల డాలర్ల (రూ. 33 కోట్లు) జరిమానా చెల్లించేందుకు కోర్టులో అంగీకరించాడు. అమెరికా పోస్టల్ సర్వీస్ తరఫున రేసుల్లో పాల్గొంటున్న సమయంలో ఆర్మ్‌స్ట్రాంగ్ డోప్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. దీంతో ఆర్మ్‌స్ట్రాంగ్ తమను ఉద్దేశపూర్వకంగా మోసం చేశాడని ఆరోపిస్తూ పోస్టల్ సర్వీస్ సంస్థ, మాజీ సహచరుడు ఫ్లాయిడ్ ల్యాండిస్లు అతడిపై 10 కోట్ల డాలర్లకు (రూ. 661 కోట్లు) కేసు వేశారు. దీనికి సంబంధించి వచ్చే నెల 7న విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే... ఆర్మ్‌స్ట్రాంగ్ లాయర్ల అభ్యర్థన మేరకు పరిహారంపై ఒప్పందానికి రావాల్సిందిగా యూఎస్ న్యాయ విభాగం సూచించింది. దీంతో ఈ దిగ్గజ సైక్లిస్ట్ ఉపశమనం పొందినప్పటికీ... ఈ కేసు వెలుగులోకి రావడానికి కారణమైన ల్యాండిస్ న్యాయ ఖర్చులకు మరో 10 లక్షల 65 వేల డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. డోపింగ్‌తో కెరీర్ కోల్పోయిన ఆర్మ్‌స్ట్రాంగ్... కేసుల కారణంగా మరింత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్లోని తన ఇంటిని 75 లక్షల డాలర్లకు అమ్మకానికి పెట్టడమే దీనికి ఉదాహరణ. -
ఇలా చేయండి.. యవ్వనంతో మెరిసిపోండి
సాధారణంగా పెరుగుతున్న వయసుకు తగ్గట్టుగా ఓ మనిషి బలంగా ఉండటం అంత తేలిక కాదు.. ముఖ్యంగా యవ్వన దశ దాటి పోయిన తర్వాత ఓ స్థాయి వరకు స్థిరంగా ఉండి ఆ వెంటనే తిరోగమన దశ మొదలవుతుంది. అయితే, కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రం ఓ మనిషి బలంగా, మంచి రోగ నిరోధక శక్తిని కలిగి ఎలాంటి జబ్బులకు లోను కాకుండా ఉంటాడట. ఇంతకి ఆ జాగ్రత్త ఏమిటంటే సైక్లింగ్. అవును.. నిత్యం సైక్లింగ్ చేసే అలవాటు ఉండేవారు ఎప్పటికీ యంగ్‌గా ఉంటారని, వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని ఓ ఆధ్యయనం పేర్కొంది. ఏజింగ్ సెల్ అనే జర్నల్‌లో ఈ అంశాన్ని తాజాగా వెల్లడించారు. సాధారణంగా మధ్యవయసులో, వృద్ధాప్యంలో రోగాలు అలుముకుంటుంటాయి. రోగ నిరోధక శక్తి కుంటుబడుతుంది. అయితే, సైక్లింగ్ చేసే అలవాటు ఉన్నవారికి మాత్రం పైన పేర్కొన్న వయసులో ఇలాంటి పరిస్థితి ఉండదట. 55 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న వారిని మొత్తం 125మందిని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ నిజాలు గుర్తించారు. ప్రతి వ్యక్తిలో ఉండే థైమస్ గ్రంధి (హృదయానికి సమీపంలో ఉంటుంది) సాధారణంగా రోగ నిరోధక శక్తి కణాలను (వీటినే టీ సెల్స్ అంటారు) ఉత్పత్తి చేస్తుంది. ఇవి సాధారణంగా 20 ఏళ్ల తర్వాత కాస్త మందగించినట్లుగా మారిపోతుంటాయి. అయితే, సైక్లిస్టుల్లో మాత్రం ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అయ్యి, రోగ నిరోధక శక్తిని మరింత విస్తృతం చేస్తాయని, దాంతో మరింత యవ్వనంగా ఉండేలా చేస్తుందని, పురుషుల్లో ఇది టెస్టోస్టెరాయిన్ లెవల్స్‌కు మరింత బూస్ట్‌ను ఇచ్చినట్లుగా పనిచేస్తుందని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. అంతేకాదు, నిత్యం సైక్లింగ్ చేసేవారిలో పురుషులు అయితే, 6.5గంటల్లో 100 కిలోమీటర్లు, 5.5 గంటల్లో స్త్రీలు 60 కిలోమీటర్లు ప్రయాణించగలరని కూడా గుర్తించారు. -
టూరిస్ట్ స్పాట్స్‌లో ‘ఈ–సైకిల్’ పెట్రోలింగ్
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం నగర పోలీసు విభాగం గస్తీ కోసం ద్విచక్ర వాహనాలు, ఇన్నోవాలు వినియోగిస్తోంది. వీటికి తోడు ఒక్కో సబ్ డివిజన్లో ఒకటి చొప్పున ఇంటర్‌సెప్టర్ వాహనాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంగా పని చేస్తూ అత్యంత వేగంగా దూసుకుపోయేవి. వీటివల్ల కాలుష్యంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అశ్వక దళాన్ని వాడుతున్నా.. అన్ని సందర్భాల్లోనూ ఇది అనువైంది కాదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు ఈ–సైకిల్స్ సమీకరించుకోవాలని నిర్ణయించారు. బ్యాటరీ సాయంతో పని చేసే ఈ బై సైకిల్స్‌ను తొలి దశలో టూరిస్ట్ స్పాట్స్‌లో పోలీసింగ్, పెట్రోలింగ్ కోసం వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. ఐఐటీ విద్యార్థులు టీ–హబ్‌లో ఏర్పాటు చేసిన స్టార్టప్ కంపెనీ ఓ తరహాకు చెందిన ఈ–సైకిల్‌ను రూపొందించింది. దీని పనితీరును కొత్వాల్ శుక్రవారం తన కార్యాలయంలో పరిశీలించారు. ఇవే మోడల్స్ లేదా ఇదే తరహాకు చెందిన ఈ–సైకిల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తొలి దశలో ట్యాంక్‌బండ్ చుట్టూ సంచరించే లేక్ పోలీసులతో పాటు కేబీఆర్ పార్క్, చార్మినార్, కుతుబ్‌షాహీ టూంబ్స్, గోల్కొండ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించే బృందాలకు కేటాయిస్తామని పేర్కొన్నారు. బ్యాటరీ ఆధారంగా పని చేసే ఈ సైకిల్ ఒక్కసారి చార్జ్ చేస్తే 50 కి.మీ. నడుస్తుంది. ఒక్కసారి ఫెడల్ చేస్తే సార్టయ్యే ఈ బై సైకిల్ ఆగకుండా ముందుకు వెళ్తుంది. ఈ బై సైకిల్‌ను టూరిజం పోలీసింగ్‌తోపాటు బందోబస్తులు, ఊరేగింపుల సమయంలోనూ వినియోగించనున్నారు. గరిష్టంగా మూడు నెలల్లో వీటిని పోలీసు విభాగంలోకి తీసుకురావాలని భావిస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. -
రాష్ట్ర సైక్లింగ్ జట్టు కెప్టెన్ ఆకాశ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బృందాన్ని శనివారం ప్రకటించారు. 25 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు కె. ఆకాశ్ సారథ్యం వహించనున్నాడు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జనవరి 2 నుంచి 6 వరకు ఈ టోర్నమెంట్ జరుగనుంది. రాష్ట్ర సైక్లింగ్ బృందం: కె. ఆకాశ్, సోను గుప్తా, ఎ. రాజ్‌కుమార్, బి. ముగేశ్, కె. అనిరుధ్, ఎం. తనిష్క్ (హైదరాబాద్), వి. శైలేంద్రనాథ్, టి. అఖిల్, కౌషిక్ (కరీంనగర్), కె. ప్రణయ్, ఎ. అరుణ్, బి. మహేశ్, కె. శ్రీరామ్, శ్రీనివాస్ (జనగాం), జె. రాకేశ్, టి. సాయి తరుణ్, వి. ఉదయ్ కుమార్ (సిద్దిపేట్), సీహెచ్. రణధీర్, జె. ప్రణయ్, మొహమ్మద్ సమీర్, కె. శ్రీరామ్ నాయక్ (వరంగల్), పాండు (ఆదిలాబాద్), ఎన్. రమేశ్‌బాబు (సీనియర్ మేనేజర్), విజయ్ భాస్కర్‌రెడ్డి (సీనియర్ కోచ్). -
'పాలపిట్ట పార్క్ దేశానికే ఆదర్శం'
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా నగరంలో సైక్లింగ్ పార్క్‌ను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్తగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏర్పాటు చేసిన పాలపిట్ట సైక్లింగ్ పార్క్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ కాంక్రీటు జంగల్‌గా మారిపోతున్న సందర్భంలో హరిత వనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బొటానికల్ గార్డెన్ భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుంటే టీఆర్ఎస్ ఆడ్డుకున్నదని గుర్తు చేశారు. చెట్లను పెంచాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారన్నారు. బొటానికల్ గార్డెన్లో మొత్తం 7500 మొక్కలు నాటామన్నారు. హరితహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదన్నారు. సైక్లింగ్ పార్క్‌లో చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్‌కు ప్రకృతి, పచ్చదనంపై ప్రేమ ఉండటం వల్లే బొటానికల్ గార్డెన్‌ను కాపాడుకోగలిగామని మంత్రి ఈసందర్భంగా స్పష్టం చేశారు. సైక్లింగ్ పార్క్‌లోకి కార్లకు ఎంట్రీ ఇవ్వొదని అధికారులను మంత్రి ఆదేశించారు. -
ఇలాంటి డాక్టర్ కూడా ఉన్నారంటే...
బెంగళూరు: కాసుల కక్కుర్తి కోసం శవాలకు చికిత్సలు చేసే కార్పొరేట్ ఆస్పత్రులున్న నేటి సమాజంలో డాక్టర్ అరవింద్ భటేజా లాంటి డాక్టర్లను చూడలేం, కనీసం ఉంటారని ఊహించలేం. దేశంలో అత్యంత ప్రతిభావంతులైన న్యూరోసర్జన్లలో ఒకరైన భటేజా 2013 నుంచి 2016 డిసెంబర్ వరకు దాదాపు మూడువేల వెన్నముక సర్జరీలు చేయగా, వాటిలో 97 ఉచితంగా లేదా నామ మాత్రపు ఛార్జీలపై చేశారు. పేదప్రజలకు ఉచితంగా ఆపరేషన్ చేయడం కోసం ఆయన వందల కిలోమీటర్లు సైకిల్ ట్రెక్కింగ్ చేసి మరీ విరాళాలు సేకరిస్తున్నారు. చిన్నప్పటి నుంచి రెండింటిలోనే ఆయనకు అమితాసక్తి. ఒకటి సైక్లింగ్‌లో ఛాంపియన్ కావాలన్నది. మరోటి డాక్టరు కావాలన్నది. డాక్టర్ డిగ్రీ కోసం కొంతకాలం సైకిల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. న్యూరోసర్జన్ కోర్స్ పూర్తయ్యాక ఆయన చనిపోయిన తన తల్లి సీతా భటేజా (ఆమె కూడా డాక్టరే) పేరిట స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. సైక్లింగ్‌పై ఉన్న ఆసక్తితో ప్రతి ఏటా కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ 800 కిలోమీటర్లు సాగే 'వెటరన్ నీలగిరి టూర్'లో 2009 నుంచి ఆయన పాల్గొంటున్నారు. దాదాపు ప్రతి ఏటా ఆయనకే ఛాంపియన్ షిప్ వస్తోంది. 2013 నుంచి టూర్‌కు స్పాన్సర్షిప్ పార్టనర్‌గా ఆయన ఆస్పత్రి ఉండడంతో ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు ఆయనకు ఉచిత స్లాట్ లభించింది. ఈ టూర్ ద్వారా విరాళాలు సేకరించి పేదల వైద్యానికి ఎందుకు ఖర్చు పెట్టకూడదన్న ఆలోచన రావడంతో ఆయన 2013 నుంచి నీలగిరి టూర్లో ఆస్పత్రి తరఫున విరాళాలు సేకరిస్తున్నారు. 2013లో లక్షన్నర రూపాయలు విరాళాలు రాగా, 2014లో ఆయన తరఫున ఆయన సోదరుడు వివేక్ ఈ టూర్లో పాల్గొని మూడున్నర లక్షల రూపాయలు సేకరించారు. 2015లో టూర్లో మళ్లీ అరవింద్ భటేజానే పాల్గొని ఛాంపియన్‌షిప్‌తోపాటు పది లక్షల రూపాయల విరాళాలను సాధించారు. 2016లోనూ నీలగిరి టూర్లో ఆయన ఛాంపియన్షిప్ సాధించడమే కాకుండా పదిలక్షల రూపాయల కన్నా ఎక్కువగా విరాళాలు సేకరించారు. ఈసారి ఛాంపియన్షిప్ సాధించిన తన సైకిల్ని కూడా వేలంవేసి వచ్చిన సొమ్మును ఆస్పత్రికి ఇవ్వాలనుకున్నట్లు ఆయన చెప్పారు. వారానికి ఎనిమిది నుంచి పది గంటలు యువతకు సైక్లింగ్‌లో శిక్షణ ఇస్తానని, ఎక్కువగా వారాంతంలోనే ఆ శిక్షణ ఉంటుందని చెప్పారు. సైక్లింగ్ చేసినా తన ప్రధాన వృత్తి ఎప్పటికీ వైద్యమేనని ఆయన అన్నారు. ఉచితంగా లేదా సబ్సిడీపై పేదలకు చికిత్స చేసిన వారికి, డబ్బు చెల్లించే వారికి ఇచ్చే వైద్యంలో ఎలాంటి తేడా ఉండదని చెప్పారు. జీవితంలో రెండింటి పట్ల ప్రేమతో వ్యక్తిగత జీవితం పూర్తిగా కరవైందని, అయినా ఇదిచ్చే తృప్తికన్నా జీవితంలో మరింకేమీ కావాలంటూ అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. -
నీటియానం
ఆరోగ్యం, పర్యావరణం బాగుండాలంటే కార్లు, మోటర్‌బైక్‌లు వదిలేసి సైకిలెక్కడం మేలని చాలామంది చెబుతారు. కానీ... రయ్యి రయ్యి మని కార్లు దూసుకెళుతూంటే... వాటి మధ్యలో బిక్కుబిక్కుమంటూ సైకిలెలా తొక్కాలి? అనేదేనా మీ డౌట్! నో ప్రాబ్లెమ్ అంటోంది సెకెండ్ షోర్! షికాగో పట్టణంలో ఈ కంపెనీ కేవలం సైక్లిస్టుల కోసం ఓ నదిపై తేలియాడే బ్రిడ్జీని ఏర్పాటు చేసింది మరి. పక్క ఫొటోలో కనిస్తున్నది ఆ బ్రిడ్జీ డిజైనే. మంచు కురిసే షికాగో వాతావరణాన్ని తట్టుకునేందుకు ఈ బ్రిడ్జీపై సోలార్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తుతో బ్రిడ్జీపైనున్న మంచును తొలగిస్తారన్నమాట. మూసీ నది వెంబడి.. లేదంటే కృష్ణా, గోదావరి తీరాల వెంబడి అక్కడక్కడా ఇలాంటివేస్తే పోలా? సేఫ్టీకి సేఫ్టీ... నాలుగు రూకలు ఆదా అవుతాయి కూడా! -
రహదారిపై రాకెట్లలా..
విశాఖ టు టీపీ గూడెం టు విశాఖ సైకిళ్లపై 40 గంటల్లో 600 కిలోమీటర్ల పయనం పారిస్‌లో 12 ఏళ్లకోసారి జరిగే సైకిలింగ్‌లో అవకాశానికి రాండోనియాస్ బృందం యత్నం గండేపల్లి : వారి కాళ్లు పెడళ్లపై చకచకా కదులుతుంటే..చక్రాలు రెండూ విమానాల ప్రొపెల్లర్లతో పోటీ పడుతున్నాయి. వారి సైకిళ్లు సంధించిన బాణాల్లా దూసుకుపోతున్నాయి. చూస్తుండగానే కిలోమీటర్లకు కిలోమీటర్లు తరిగిపోతున్నాయి. పిక్కబలంతోనే అనేక మోటారు వాహనాలను సైతం వెనక్కి నెడుతూ ముందుకు సాగుతున్న ఆ 10 మంది గమ్యం విశాఖపట్నం. స్పోరŠట్స్ మోడల్ సైకిళ్లపై సాగుతున్న వారి యాత్ర విశాఖ నుంచి మొదలైంది. ‘ఇదేమిటి.. వారి గమ్యం విశాఖ అంటూనే విశాఖ నుంచి బయలులేరినట్టు చెపుతున్నారు’ అనుకోకండి.. నిజంగానే విశాఖలో బయలుదేరిన వారి గమ్యం విశాఖే. పారిస్‌లో జరిగే సైకిలింగ్‌లో పాల్గొనే అవకాశం కోసం 600 కిలోమీటర్ల దూరాన్ని సైకిలింగ్‌తో 40 గంటల్లో పూర్తి చేయాలన్నది వారి లక్ష్యం. గండేపల్లి మండలంలోని తాళ్లూరు వద్ద జాతీయ రహదారిపై తారసపడిన వారిలో కొందరిని ‘సాక్షి’ పలకరించింది. విశాఖ నుంచి గురువారం ఉదయం ఐదు గంటలకు బయలుదేరి తాడేపల్లిగూడెం టోల్‌గేట్‌కు చేరుకున్నామని, అక్కడి నుంచి తిరిగి విశాఖకు బయలుదేరామని ఆడిక్ ఇండియా రాండోనియాస్ క్లబ్ ఆర్గనైజర్ శ్రీధర్ తెలిపారు. ఈ సైకిలింగ్ ద్వారా పారిస్‌లో 12 సంవత్సరాలకొకసారి జరిగే అరుదైన సైకిలింగ్‌లో పాల్గొనే అవకాశం వస్తుందని చెప్పారు. విశాఖలో ఏడాదికొకసారి 200, 300, 400, 600 కిలోమీటర్ల దూరాలకు సైకిలింగ్ నిర్వహిస్తామన్నారు. సైకిల్‌ను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుందని పలువురికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఫిఫ్టీ ఫోర్‌లోనూ తగ్గని జోరు సైకిలింగ్ బృందంలో 54 సంవత్సరాల వయసున్న ఉన్న రథ్ కూడా ఉన్నారు. ఆ వయసులోనూ ఆయన కుర్‌ారళ్లతో పోటీ పడుతూ వారిని మించిన జోరుతో సైకిల్ తొక్కుతున్నారు. వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కినా తనకు ఎటువంటి అలసట, నీరసం లేవని, చాలా హేపీగా ఉందని ఆయన చెప్పారు. -
ఓవరాల్ చాంప్ హైదరాబాద్
సాక్షి, హైదరబాద్: స్టేట్ మీట్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలబాలికల జట్లు సత్తా చాటాయి. ఉస్మానియాలోని సైక్లింగ్ ట్రాక్‌పై అండర్-17 బాలబాలికల విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో హైదరాబాద్ జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. టైమ్ ట్రయల్ బాలుర విభాగంలో అజయ్ కుమార్ (హైదరాబాద్)... బాలికల విభాగంలో స్వర్ణ కుమారి (హైదరాబాద్) విజేతలుగా నిలిచారు. మాస్ స్టార్ట్ విభాగంలోనూ నగరానికి చెందిన తనిష్క్ అగ్రస్థానంలో నిలవగా... బాలికల విభాగంలో చైతన్య (వరంగల్) మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇతర విజేతల వివరాలు టైమ్ ట్రయల్ బాలురు: 1. అజయ్ కుమార్ (హైదరాబాద్), 2. రిషింద్ర (రంగారెడ్డి), 3. ఆదిత్య (హైదరాబాద్), 4. బి.జయ సూర్య (కరీంనగర్). బాలికలు: 1. స్వర్ణ కుమారి (హైదరాబాద్), 2. వైష్ణవి (హైదరాబాద్), 3. శిరీష (కరీంనగర్), 4. స్రవంతి (వరంగల్). మాస్ స్టార్ట్ బాలురు: 1. తనిష్క్ (హైదరాబాద్), 2. రాజ్ కుమార్ (హైదరాబాద్), 3. శశిధర్ (వరంగల్), 4. సారుు కిరణ్ (కరీంనగర్). బాలికలు: 1. చైతన్య (వరంగల్), 2. వన్షిక (హైదరాబాద్), 3. మమత (కరీంనగర్), 4.అర్చన (వరంగల్).