సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. వ్యక్తిగత, వృత్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా హైదారాబాద్‌లోని రైడింగ్ గ్రూప్ సభ్యులతో కలిసి సైక్లింగ్ చేసిన వీడియోని షేర్ చేసింది.
ఈ వీడియోలో ఆమెతోపాటు కొంతమంది పారా సైక్లిస్టులు సరాదాగా రైడింగ్ చేశారు. ‘బెస్ట్ కంపెనీతో వర్షంలో రైడింగ్’ అనే దానికి క్యాప్షన్ ఇచ్చింది. సైక్లింగ్ ప్రారంభించిన మొదటి రోజే 21 కీమీ ప్రయాణించిన సామ్, 100 కీమీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పింది. దీని గురించి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఈ నటి ‘డే1, 21 కీమీ, 100 కీమీ.. నీ కోసం వస్తున్నా’ అని రాసుకొచ్చింది. ఇది పోస్ట్ కొద్ది గంటల్లోనే 2 లక్షలకుపైగా లైక్స్‌తో వైరల్ అయ్యింది.
కాగా ఇటీవల సమంత, కీర్తీ సురేష్, త్రిష, కల్యాణి ప్రియదర్శన్‌తో చిల్ అవుతున్న ఫోటోని పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అలాగే తన రెండు కుక్కల పిక్స్ షేర్ చేసి వాటిపై తనకున్న ప్రేమని వ్యక్తపరిచింది.
చదవండి: ప్రియాంక చోప్రాకి థ్యాంక్స్ చెప్పిన సామ్.. వైరల్
Comments
Please login to add a commentAdd a comment